Friday, June 23, 2017

ఓం నమో నారాయణాయ-21

" శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం
శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం
సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం
గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే".
ఓం నమో నారాయణాయ-22
విచిత్రముగ నామది శ్రీ విల్లిపుత్తూరుగా మారినది
విష్ణు చిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది.
" అభిమాన వఙ మాయ్ వందు" అన్నీ తమవల్లే అనుకొన్నవారైన
^
అంతరించిపోయిన అహంకార రాజులలో
మనో సామ్రాజ్యమును అప్పగించి వింతగ సామంతులైన
స్వామి సిం హాసనము క్రిందనున్న నిరహంకార గోపికలలో
సూర్య-చంద్రులిద్దరు చిత్రముగ సడిసేయని మువ్వలైన
కరుణకిరణ నయనములను విచ్చుకుంటున్న పువ్వులలో
స్థిరముగ చింతించినంతనే ఆగామి సంచితములైన
అంతము చేయ గలుగు ఆ అనంత పద్మనాభ స్వామిలో
అతి పవిత్ర వ్రతము చేయ అతివలార రారె
ఆముక్త మాల్యద ఆండాళ్ అమ్మ వెంట నేడె.
భావము
అహంకరించిన అజ్ఞానులగు రాజులను నిరహంకార నిశ్చలభక్తి గోపికలను,విచ్చుతున్న మువ్వలవంటి స్వామి కన్నులను,అనంత పద్మనాభ స్వామిని మన గోపిక చూసినది.
( ఇక్కడ అభిమానము రెండువిధములుగా మనము అన్వయించుకోవచ్చును.మొదటిది రాజుల స్వాభిమానమనే దురభిమానము.రెండవది గోపికల భగవదభిమానమనే భక్తి అనుభవము.)
"కారే రాజులు-రాజ్యముల్ కల్గవే" వారేరి? "సిరి మూటన్ కట్టుకొని పోయిరే" అని ప్రశ్నించిన ధూర్జటిని,నిరహంకార నిశ్చల భక్తి రూపమైన గోపికలను,అహంకార-నిరహంకారములను వాని గమ్యములను ఒక్కసారే దర్శించుకుంటు మన గోపిక పునీతురాలవుతోంది.
స్వామి కన్నులు సడిసేయని మువ్వలట.శబ్దముచేయుట మువ్వల సహజ సం స్కారము.కాని అవి నిశ్సబ్దముగా స్వామి నయనములుగా ఒదిగినవి.అవ్యక్తానుభూతి.ధ్యాన సమాధిని పొందినవేమో! అమ్మకు తప్ప ఇంత మధురముగ రచించుట ఎవరికి సాధ్యము.పరమాత్మకు తమకు అభేదమును సూచించుటకు మౌనముద్రను దాల్చినవేమో!ఇక్కడ నిశ్సబ్దత నిరాడంబరతను సూచిస్తోంది.జగత్పరిపాలకుడైన స్వామి కూడా ఎవరితో,ఎప్పుడు,ఏమాత్రము తన ప్రతిభను చెప్పుకోడు కదా!
"ఇదం శరీరం కౌంతేయ!" వికారము మలినముతో కూడినది శరీరము (క్షేత్రము)
వికార రహితుడు,అన్నీ తెలిసిన వాడు ఆత్మ (క్షేత్రజ్ఞుడు).ఈ శరీరము అనుభవించుటకు తనతో పాటు తీసుకు వచ్చినవి సంచితములు.ప్రస్తుతము చేయుచున్నవి ప్రారబ్ధములు.రాబోవునవి ఆగామి.మన దగ్గర నిలువ ఉన్నవి,వర్తమానములో వచ్చుచున్నవి,రాబోవు పాపములను నాశనము చేయు అనంత పద్మనాభ స్వామి అనుగ్రహమును పొందుచున్న మన గోపికతో పాటు,అమ్మ వెంట నడచుచున్న గోపికలతో,నా మనసు అడుగులు వేస్తున్నది.
( ఆండాళ్ తిరు వడిగళే శరణం )

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...