Friday, June 23, 2017


విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది
విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది
"విష్ణు పాద లక్ష్మీ సంకేతముగ" ఊర్థ్వ పుండ్రమైన
ఫాలభాగ ప్రకాశిత "తిరుమాన్ శ్రీ చరణములో"
" ధారకము-పోషకము భోగము" తానేయైన
మందస్మిత వదనుని " బృందావనములో"
"కోదై" అను నామముతో " కొంగు బంగారమైన"
పెరియాళ్వార కూతురు " పెద్ద ముత్తైదువలో"
"'క్రిష్' అపరిమితమైన "ణ" ఆనందము" నామరూపములైన
భక్తజన రంజనుడు " ఆ నిత్య నిరంజనునిలో"
అతి" పవిత్రమైన వ్రతము" ఆచరింప రారె
" ఆముక్త మాల్యద" ఆండాళ్ అమ్మ వెంట నేడె.
భావము
విష్ణుపాదములను,లక్ష్మీ ముద్రగా భావించే స్వామివారి తిరునామమును,కర్త-కర్మ-క్రియ మూడు తానేయైన శ్రీకృష్ణుని బృందావనమును,పెద్ద ముత్తైదువును గోదాదేవిని మన గోపిక చూచినది.
తిరునామ పవిత్ర విశేషములను చతుర్ముఖుడైన బ్రహ్మకు,వేయి పడగల ఆదిశేషునకు శక్యముకాదు.యథాశక్తి ప్రయత్నిస్తాను.మథ్వాచార్యులవారు ఈ పవిత్ర సంప్రదాయమును పరిచయము చేసిరి.పరాశర స్మృతి దీని విశేషతను వివరిస్తుంది.వాసుదేవ ఉపనిషత్తు త్రిమూర్తి స్వరూపముగా భావిస్తుంది.యజుర్వేద-సామవేదములు గాయత్రీమంత్రముగ (భు: భువ స్వర) కీర్తిస్తాయి.శివ కేశవ తత్వములే త్రిపుండ్రములు.ఒకటి నిలువు మరొకటి అడ్డము,నిద్ర.సుషుప్తి,జాగ్రదావస్థలుగాను,స్థూల,సూక్ష్మ,కారణ శరీరములుగాను భావించబడినవి.శ్రీ కృష్ణుని పాద పద్మములు ముద్రింపబడిన 12 స్థానములలో పూజనీయ ద్వాదశ పుండ్రములకు నమస్కారములు.
ధారకము అనగా ఆధారము,పోషకము ఆధేయము,భోగ్యము ఆత్మారామము అయిన పరమాత్మను గోపిక గుర్తించుచున్నది
.
ఒక్కరే భగవదారాథన చేస్తే అది భక్తి.పదిమందితో కలిసి తను చేయించి వారిని కృతార్థులను చేస్తున్న గోపికా రూపమున నున్న గోదాదేవిని గుర్తించగలుగుతున్నది.( ఇది జ్ఞానము)
.
శ్రీకృష్ణుని మనోహర నామరూపములు గొల్లెతల తాదాత్మ్యము కొరకు,రంగు రూపులేని శాశ్వతునిచే," ప్రకటించబడినదని "గ్రహించుచు,మరొక మెట్టు ఎక్కుతున్న గోపిక గురించి ఆలోచిస్తు,నా మనసు అమ్మవెంట వ్రతము చేయుటకు నడచుచున్న గోపికలతో తన అడుగులను కదుపుతోంది.
( ఆండాళ్ అమ్మ తిరువడిగళే శరణm)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...