Friday, June 23, 2017

పలుకు పలుకు తేనెలొలుకు.

పలుకు పలుకు తేనెలొలుకు పండితారాధ్యా-
శకుంతములు నేర్పాయి సుస్వరములు శుభాంగికి
మీ ఆలాపన ప్రారంభం ఆ గర్భ గుడిలో
హరికథలు అందించాయి సుధలను ఆ సాంబునికి
మీ సాధన సాకారం ఆ ఆదర్శపు ఒడిలో
సీమంతపు ఆశీస్సులు మంత్రించినవో శిశువుని
మీ గానపు సొబగులు ఆ నాడుల సవరింపులో
పుడమితల్లి పులకింతలు పుట్టిన బాలుని చూసి
మీ స్వరముల సరిగమలు ఆ ఆమని రాకలో
నేరుగా భారతి చేసినదో బాలసారె వేడుకని
"బాల సుబ్రహ్మణ్యం" అనుచు ఆ నామకరణోత్సవములో
సామగానమే సన్నిహితముగా చూసినదో తన వారసుని
సరసనుండి తినిపించెనో ఆ అన్నప్రాసనలో
ఆనవాలుగా డమరుకమే పట్తుకొనినదో చేతిని
ఓనమాలు దిద్దించగ ఆ అక్షరాభ్యాసములో
పట్టుదల పక్కనే భుజము తట్టు చుట్టమునని
పట్ట భద్రునిగా చేసినదో వివిధ స్నాతకోత్సవములలో
అన్యోన్యానురాగము ధన్యతనొందాలనుకొని
ఆహ్వానించినది ఆ గృహస్తాశ్రమము లో
అల్లరి తాతయ్యపై ఆశీస్సులు వర్షించమని
అర్థనారీశ్వరమన్నది ఈ ఆనందపు వెల్లువలో.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...