Friday, June 23, 2017

hoLi-2

ఏ రంగులేని నీరు ఏరుగా పారుతోంది
నల్లరేగడినేల తల్లదిల్లనీయనని
కడుపునింప రంగులను సింగారించుకుంది
మొలకెత్తే విత్తనం తెల్లగా నవ్వింది
పరుగెత్తే రవికిరణం హరితంగా మారుతోంది
చెడు నామరహితమును కామదహనము అనుకుని
హోళికను తరిమేసి రంగోలి ఆడుదాము
మలయాళ మంజర్ నేపాల్లో టోలా
బెంగాలీ డోల్యాత్రా,కొంకణి ఉక్కిలి
ప్రాంతాల భేదాలను ఛ్,చేదించేద్దాము
పూరల్బూరెల విందులు,పిచ్కారీ చిందులు
గుబాళించు గులాల్,సన్నిహితుల సలాం
భళారే భగ్లు,హోళీలో హంగులు
రంగుల కలగలపులే రమ్యమైన సిత్రాలుగ
చెన్నుగ ఆడగరండి చెన్నకేశవ హోళి.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...