Friday, June 23, 2017

దీపావళి-4

ముసి ముసి నవ్వుల మనవళ్ళ,మనవరాళ్ళతో,
కథ అంటే చెవికోసుకునే చంద్రకళ అత్తయ్య
పరుగున వస్తుంటే పని పురమాయించాడు మామయ్య
పనివిడుపుకు ఎదురుచూస్తు పరిహాసముగ అత్త
పండుగరోజున నాకు పాత మొగుడేనా అంది
బుడుగు గడుగ్గాయులకు ఏమి అర్థమయ్యిందో
పండుగరోజున మాకు పాత దీపావళి కథ వద్దంటూ
అమ్మమ్మను బతిమలాడ సాగారు కొత్తకథకై ముద్దు ముద్దుగా
అవకాశము వదులుకోని అమ్మమ్మ గౌరమ్మ
అందించసాగింది అందాల దీపాల కథ.
.............. తమసోమా జ్యోతిర్గమయా.
...................
...................
కుమ్మరి చేతుల్లోనే కులుకులు నేర్చినవి
కమ్మని సరదాలన్నీ పలుకులుగా మార్చినవి
వత్తులన్ని తెలివిగా వత్తాసు పలికినవి
మేలమాడుతున్నాయి తైలలక్ష్మి దీపములు
.........
కొత్త జీవితపు శ్రీకారము ఐనది ఒక దీపము
కొత్త కోడలిచే వెలిగింప బడుటయే అపురూపము
పుట్టినింటికి పిలిచినది చుట్టమైన ఒక దీపము
వస్తున్నారనగానే ముస్తాబైనది ఇంటిరూపము
మంగళహారితి తానుగ మారినది ఒక దీపము
ఆడపడుచు కట్నమదిగో అంటెను ఇంద్రచాపము
అభ్యంగన స్నానాలకు అగ్గి ఐనది ఒక దీపము
అదిరె సాంబ్రాణిపొగగ గుగ్గిలపు రూపము
ఘుమఘుమ రుచులకై వెలిగింది ఒక దీపము
.......... ఇంతలోనే
చింతాక్రాంతమైనది ఆ గృహము
అలకపానుపు పై అల్లుని చూపించినది ఒక దీపము
బతిమలాడుచున్నారు బంధువులంతా పాపము
రాధ చిలిపిచూపు వలె చురుకుమంది ఒక దీపము
అలుక చిలుక ఎగిరిపొయె అల్లుడు కాదు శాపము
.............
అతిథి మర్యదగా కదిలింది ఒక దీపము
తాత కోరమీస వీరత ప్రతిరూపము
లక్ష్మీపూజ దగ్గర లక్షణమగు ఒక దీపము
తెస్తున్న లాభాల దస్త్రాల మురిపెము
బొగ్గుపొడిని కలిసింది బుగ్గ చిదిమిన దీపము
సిగ్గులే కురిపించెను చూపకుండ ప్రతాపము
చీకట్లను చీల్చినది చిరుత వంటి దీపము
.............
పనితనమును చూపించిన ప్రకాశించు దీపములు
"విడి"గా పనిచేస్తూనే "కలివిడి"ని చాటుతున్నాయి,మనలను
"విజయ పథము"వైపు "వడివడి" సాగమంటున్నాయి.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...