holi-1

హోళి శుభాకాంక్షలు
రంగులెన్నైనా వాని అంతరంగమొక్కటే
ఏకమవుతు చాటాలని ఐకమత్యాన్ని
ఆకుతో,సున్నంతో,వక్కతో,మక్కువతో
తాంబూలం ఆడుతుంది తనదైన హోళి
పసుపుతో,సున్నంతో పసందైన వేళలలో
పారాణి ఆడుతుంది పాదాలతో హోళి
ఆకులోని గోరింట అంగరంగ వైభవముగ
అనవరతము ఆడుతుంది అరచేతులతో హోళి
నేలతో,నీటితో,నింగితో,పొంగుతూ
పైరుతల్లి ఆడుతుంది పైడిపంట హోళి
పూతతో,పిందెతో,కాయతో,పండుతో
చెట్టుకొమ్మ ఆడుతుంది కొంకణి ఉక్కిలి
గుడ్డుగా,బిడ్డగా రంగులెన్నో మారుతూ
పిట్టలెన్నో ఆడుతాయి ఇష్టముతో హోళి
జగతిలోని ప్రతిజీవి రంగుల సంగమమే
భళారే భంగులు హోళిలో హంగులు
పూరల్బూరెల విందులు పిచికారీచిందులు
హరివిల్లు రంగులు అవని సిరుల జల్లులు.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI