Saturday, September 26, 2020
PRAPASYAMTEE MAATAA-10
ప్రపశ్యంతీ మాత-10
****************
" కమలాంబ నా చింత తీర్చవమ్మా "అంటు ఆర్తితో ఆలపించాడు ముత్తుస్వామిదీక్షితారు ముక్తిని పొందగలిగారు.ఆ కీర్తనను నవావర
ణ కీర్తన అంటారు.కాళి సక్తితో ప్రారంభమైన మన శక్తి దర్సన ప్రయానము తార-షోడసి-భువనేశ్వరి-భైరవి-ఛిన్నమస్తక-ధూమవతి-బగళముఖి-మాతంగి అను తొమ్మిది విధములైన శక్తుల స్థూల తత్త్వము-సూక్ష్మ తత్త్వమును పరిచయము చేసుకొని,బహిర్దర్శనముతో బాహ్య ప్రవృత్తులను సాధనములు చేసుకొని వాటికి మూలమైన అంతర్డర్శనమునకు తల్లి కమలాంబిక అనుగ్రహముతో ఉద్యుక్తులమగుచున్నాము.చీకతి తొలగి కాంతి-శబ్దము మనకు పరిచయమైనవి.సుందరము-సుభిక్షము అను బాహ్య-అంతర విషయములు బయటపడినవి.వాటిని వరుచేసుకొనుట-పనికి రాని వాటిని పరిత్యజించుట అవసరమని తెలుసుకున్నాము.క్రమక్రమముగా నలుపు-తెలుపు రంగులలో నున్న శక్తి తత్త్వము తన నలుపును చీకటిని తొలగించుకొని,శుధ్ధ సత్వ ప్రకాశముగా శుభపరిణామముగా ద్యోతకమగుచున్నది.అంటే సూర్యోదయమగుచున్నది స్థూలములో.శక్తి తత్త్వము అవగతమగుచున్నది
సూక్ష్మములో.ఆ విధముగా లోపల -బయట వెలుగులు విరజిమ్ముతు సూర్యోదయమున ప్రకాశించుచున్న జ్ఞానమే కమలాంబిక.తొలగి పోయిన తమస్సు,ఉషస్సు అనే జ్ఞానధారలను నాలుగు దిక్కుల నుండి వర్షించుచున్నది.అదియే నాలుగు ఏనుగులు అమ్మపై కురిపిస్తున్న అమృత వర్షము.
జగత్సముద్రమునుండి ఆవిర్భవించిన కమలమే కమలాంబిక.ఏ విధముగా కమలము బురదనుండి పుట్టినను,ఆ బురదను ఇసుమంతయు తాకనీయక స్వచ్ఛముగా నిర్మలముగా ఉంటుందో ,అదే విధముగా ఇంద్రియవాసనలనే సముద్రము నుండి జనించిన సాధకుడు శుధ్ధ సత్వమూర్తియై,ఎటువంటి ప్రాపంచిక మలినములు అంటనీయక,ఆత్మదర్శనముకై అన్వేషణను ప్రారంభిస్తాడు.నశ్వరమైన శరీరమును ఆధారముచేసుకొని సచ్చిదానందస్థితిని చేరుకుంటాడు.అంటే మూలాధరములో నిద్రాణమై యున్న కుండలినీశక్తి, తల్లి దయతో చిఛ్చక్తిగా చైతన్యవంతమై దారిలోనున్న ముడులను విప్పుకుంటూ,ఉర్ధ్వ ప్రయాణమును చేస్తూ సహస్రార చక్రస్థిత శివశక్తైముర్తిని చేరుకుంటుంది.ద్వంద్వము తల్లి దయతో నిర్గుణ- నిరంజన -నిరాకార నిశ్చలస్థితిలో లీనమయి సూక్ష్మ-స్థూల భేదములను రూపుమాపి "ఏకం న ద్వితీయము"ను నొక్కివక్కాణిస్తుంది.
అంతెందుకు పదిశక్తులు ఒకేఒక మహాశక్తిగా మళ్ళీ మారిపోతాయి.మహా శక్తి ఒక్కొక్కసారి తనశక్తిని వివిధ నామ-రూప-స్వభావములుగా విస్తరింపచేస్తూ,తిరిగి తనలో విలీనము చేసుకొని ఏకమాతృకై, సాకార-నిరాకారములను క్రీడలతో క్షేమంకరిగా కీర్తింపబడుతుంది.దీనికి ఒక చిన్న ఉదాహరణమును మనము పరిశీలిద్దాము.మనము మనస్కరిస్తున్నప్పుడు మన పదివేళ్ళు కలిసి పనిచేస్తున్నాయి.అట్లా అని అవి అన్ని పనుల సమయములలో కలిసి ఉండవు.దారి చూసిస్తున్నప్పుడు చూపుడు వేలు చైతన్యవంతమైతే,మిగిలిన తొమ్మిది తటస్థస్థిలో ఉంటాయి.వస్తువును పట్టుకునేటప్పుడు రెండు వేళ్ళు-వ్రాస్తున్నప్పుడు మూడు వేళ్ళు,పూలమాలను అల్లుతున్నప్పుడు నాలుగు వేళ్ళు,ఇక ఐదు వేళ్ళు కలిస్తే అద్భుతాలే.వేటికవి
శక్తివంతమైనప్పటికి,అవసరమైనపుడు మాత్రమే తన శక్తిని చైతన్యవంతము చేస్తూ,మిగిలిన సందర్భములలో తటస్థస్థిలో ఉంటాయి ఇదే అమ్మ లీలా లాలిత్యము.
ప్రియ మిత్రులారా,విశేష శరన్నవరాత్రుల శుభసమయమున అమ్మ అనుగ్రహముతో పలికించిన విషయములను మీతో పంచుకున్నాను.నిజమునకు ఆదిశేషునకు అసాధ్యమైన (వేయి నాలుకలుండియు) తల్లిని, తామసి యైన నేనేమని చెప్పగలను.మీ ఉన్నత సంస్కారము దానిని దరిచేరనిచ్చినది సర్వదా అనుమతించిన నిర్వాహకులను-ప్రోత్సహించిన మీకు ధన్యవాదములు.
ధన్యోస్మి మాతా ధన్యోస్మి.
Thursday, September 24, 2020
PRAPASYANTEE MAATAA-09
" మాణిక్యవీణాం ఉపలాలయంతీం
మదాలసాం మంజుల వాగ్విలాసాం
మాహేంద్ర నీలద్యుతి కోమలాంగీం
మాతంగ కన్యాం మనసా స్మరామి.
చతుర్భుజే చంద్రకళా వతంసే
కుచోన్నతే కుంకుమరాగ శోణే
పుండ్రేక్షు పాశాంకుశ పుష్ప బాణ హస్తే
నమస్తే ! జగదేక మాతః."
అని మహాకవి కాళిదాసుచే ప్రస్తుతింపబడిన తల్లిని,అశుభములలో-అశుభ్రతతో మిళితమైన కాలుష్యశక్తిగా భావించి,చండాలిక నామముతో గుర్తించుట అలుముకున్న మన అజ్ఞానమునకు ప్రతీకయే కాని మరొకటి కాదు.చీకటి-వెలుగులు తల్లి కనుసన్నల కదలికలు కనుకనే ఒక్కొక్కసారి నీలశ్యామలగా-మరొక్కసారి సరస్వతిగా ప్రకటింపబడుతూ,అంతర్-బహిర్ తత్త్వములకు అద్దముపట్టుతుంది అమ్మ.
స్థూలజగతిలో మతంగ ముని కన్యగా ప్రస్తుతింపబడు తల్లి సంగీత-సాహిత్య సమలంకృత.సంపూర్ణ శబ్దస్వరూపము అయిన మాతంగి మనలను ఏ విధముగా శబ్దస్వరూపమై శాసిస్తుందో-మనలో శ్వాసిస్తుందో తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.
స్పందన గుణము కలది శబ్దము.స్పందనశక్తి శబ్దమును వివిధస్థితులలోనికి పయనింపచేస్తుంది.ప్రయాణములో వచ్చిన మజిలీలలో,శబ్దము తన సహజగుణమును కొంత విడిచిపెట్టి,కొత్తదనమును మరికొంత పుణికిపుచ్చుకొని,సరికొత్తరూపుతో సాగుతుంటుంది.సంపూర్ణ జ్ఞానస్వరూపిణి అయిన మాతంగి మాత అనుగ్రహమే ఈ శబ్ద పరిణామము మరియు ప్రయాణము.పరిణామము చెందుతూ ప్రయాణము చేస్తున్న శబ్దము తనలో కొంత దార్శనికతను-మరికొంత ధారణశక్తిని కలుపుకొను "విద్వాన్ సర్వత్ర పూజ్యతే" అను నానుడిని నిజం చేస్తుంది.
"అస్తి కశ్చిత్ వాగ్విశేషా? అని నన్నెవరైన ప్రశ్నిస్తే నా స్వాధిష్ఠాన వాసిని మాతంగి మాత,మేరుదండంలా ఉన్న వెన్నెముకలో తిరగబడిన ఆడఏనుగు తొండము వలె ప్రకాశిస్తూ,సరస్వతీ నాడియై నా తృతీయనేత్ర స్థానము నుండి బయలుదేరిన వాక్శక్తిని జిహ్వాగ్రమునకు చేరుస్తూ,నన్ను చేరదీస్తున్నదని నిస్సందేహముగా సమాధానమిస్తాను.ఈ వాక్సుధారసమంతా నీ ప్రకాశమే తల్లీ.
నిన్ను నేనేమని ప్రస్తుతించగలను?నీ దివ్యచరణారవింద సంస్మరణము తక్క.
ధన్యోస్మి మాతా ధన్యోస్మి.
Wednesday, September 23, 2020
PRAPASYANTEE MAATAA-08
ప్రపశ్యంతీ మాతా-08
********************
యాదేవి సర్వభూతేషు బగలముఖి రూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః
సమ్మోహనము-సంస్తంభనము అను విరుధ్ధకార్యముల విశేష అనుగ్రహమే బగలముఖి మాత.బగల అను పదమునకు వధువు,తాడు అను అర్థములను పెద్దలు చెబుతారు.ఏ విధముగా పాశముతో తన భక్తులను రక్షిస్తూ,పశుపతిగా పరమాత్మ కీర్తింపబడుతున్నాడో.అదేవిధముగా తల్లి సమ్మోహనపరచి తన పిల్లలను నొచ్చుకొనునట్లుచేయువారి వాక్కును స్తంభింపచేస్తుంది.విజ్ఞానశాస్త్ర పరముగా ఆలోచిస్తే,ఈ దేవి శబ్ద-కాంతుల సమన్వయమును చేస్తూ,
శిష్ట రక్షణ-దుష్ట శిక్షణ గావిస్తూ,ధర్మసంస్థాపనను చేస్తుంది.
స్థూలముగా ఆలోచిస్తే పరాశక్తి విశ్వపాలనకై ఉత్కృష్ట స్థూల రూపముగా ఉర్వి నిండి ఉండగలగు.
జ్ఞానుల కొరకు నిరాకారముగా,అజ్ఞానులమీద కరుణతో సాకారముగా ప్రకటింబడుతూ హద్దులు మీరిన అరాచకములను అణచివేస్తూ,వాటిని సత్కర్మలుగా మలుస్తూ,ప్రకృతిని సస్యశ్యామలము చేస్తుంది.ఉదాహరణకు పంచభూతములలోని జలము ఉదృతమై చెలియలి కట్తను తెంచుకొని వరదలై పంటభూములను ధ్వంసముచేస్తుంటే,తల్లి తన తాడుతో ఆ నీటిఉద్రిక్తతను ఆనకట్తలవైపునకు మళ్ళించి పంటభూములకు మరింత సాయపడుతుంది.దుర్గమములను సుగమములుగా మలచుటయే తల్లి శక్తి.పంటభూమి శాంతముగానే ఉన్నను జలము తన ఉద్రిక్తతతో తన హద్దులు మరచి అహంకరించింది.అరిష్టములు ఏర్పడుటకు అవకాశమును ఇచ్చింది.నిశితముగా పరిశీలిస్తే ఈ విపత్తుకును ప్రేరేపించినది జలముకాదు.దాని ఉద్రిక్తతను ఉపసంహరించుకోలేని అసహాయతాసమర్థత.కనుక తల్లి దాని ఉద్రిక్తతను ఉపయోగకరముగా మలచినది
.
సూక్ష్మరూప చింతనను చేస్తే మన కొండనాలుక తల్లి నివాసస్థానము.ఇంద్రియములకు శక్తిని అందించేది కనుక దీనిని ఇంద్రయోని అని(యోని-కారణము) అనికూడ అంటారు.తల్లి మనలోని శబ్ద ప్రకటనను సవ్యమార్గములో పయనింపచేస్తుంది.సమ్మోహన పరుస్తుంది.మాటే మంత్రము అన్నట్లుగా కొందరు మాట్లాడుతుంటే శ్రోతలు మంత్రముగ్ధులవుతారు.
అదేమాట హద్దులు దాటి విజృంభించినపుడు విదురనీతిలో చెప్పినట్లుగా" మనమున నాటిన మాటలు వినుమెన్ని ఉపాయముల వెడలునె అధిపా" అన్నట్లుగా ,అటువంటి సమయములలో శబ్ద కాంతులను విలోమ పరచి(విపరీతమైన కాంతి ప్రసరించినపుడు శబ్దము చిన్నబోతుంది) వాక్వైభవమును సంస్కారవంతము చేస్తుంది.
తల్లి వేస్తున్నది తాడుతో బంధము.తత్ఫలితముగా జరుగుచున్నది జీవులకు భవబంధ విమోచనము.
సిధ్ధిధాత్రిగా నన్ను సంస్కరించుటకు,నా పలుకులకు పగ్గమువేసి,నన్ను నెగ్గిస్తున్న హఠయోగ స్వరూపిణి
,నా అహమునకు పగ్గము వేయవమ్మా.
ధన్యోస్మి మాతా ధన్యోస్మి.
Tuesday, September 22, 2020
PRAPASYANTEE MAATAA-07
. ప్రపశ్యనీ మాతా-07
***********************
యాదేవి సర్వభూతేషు ధూమావతి రూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.
" ఏకానేక రూపములు దేవి క్రీడలు"
ఏకం సత్ విప్రా బహుదా వదంతి.ఒకే ఒక మూలమును విశేషప్రజ్ఞకలవారైన వారు బహువిధములుగా దర్శించి-తాదాత్మ్యమును పొందుతారు.
పొగనుండి పుట్టినదని కొందరు-పొగచే కప్పబడినదని కొందరు తల్లిని ధూమావతి అని సంబోధిస్తూ-సంకీర్తిస్తుంటారు.
పొగ-నిప్పు అను ద్వంద్వములుగా ప్రకటింపబడుతు క్రమేణా నిర్ద్వంద్వతను మనకు పరిచయము చేస్తుంది తల్లి.నామరూపాతీతమైన నెనరును చూపిస్తుంది.
తల్లి క్రీడాసక్త కనుక మనతో దాగుడుమూతలు అను ఆటను తన ఆవరణ-నిక్షేపక గుణముల ద్వారా ఆడుతుంది.మనకు అర్థము చేయిస్తుంది.ఉదాహరణకు
మన చర్మచక్షువులు ఒక మఱ్ఱి విత్తనమును చూశాయనుకోండి.అవి దాని కొమ్మలను ఊడలను మిగిలిన శాఖలను చూడలేవు.ఎందుకంటే అమ్మ విత్తులో వాటన్నిటిని దాచివేసి,పైకి కనపడకుండా చేస్తుంది.అదియే మాయ ఆవరణ.అదే విత్తనము పంచభూతాత్మక సమ్మిశ్రితమై మహావృక్షమై మన కనులకు మనసుకు విందులు చేస్తుంది.అదే ప్రకటనమనే నిక్షేపకము.అదే విధముగా జగద్వ్యవహారములను నడిపిస్తుంది తల్లి.
దేవి వేడివేలుగులో ఏవిధముగా బింబము తో పాటుగాప్రతిబింబముగా నల్లని నీడగా అనుసరిస్తుందో అదియే ధూమావతి.చీకటితో పోల్చినప్పటికిని,తల్లిని నిద్ర-మరపు-దుఃఖము తో పోల్చినప్పటికిని తల్లి, మనసనే పరుగులుతీసే గుర్రములు లేని రథము పైన కూర్చునుట,పచ్చిమాంస భక్షణమను విషయ వాసనలను మొగ్గలోనే తుంచివేయు చతుర యని,వ్యాకులతను ధూమముగా భావిస్తే దానిని తీసివేసే చిదగ్నికుండ సంభూత అని అనకుండా ఉందగలమా? అమ్మ కారణమును-కార్యమును-దాని ఫలితమును మూడును తానై ముముక్షుత్వమును ప్రసాదిస్తుంది.
అంతే కాదు ఛిన్నమస్తక వర్గీకరించిన సత్తు-అసత్తులను చేటలో
వేసి చెరిగి,అసత్తు (విషయవాసనలను) చెరిగివేసి,శాశ్వత సత్యమును చాటలో (జగతి) చూపించినది తల్లి.మాయ యను పొగను తోసివేసిన చిత్ప్రకాశమును చూడగలము అన్న విషయమును తెలిపినది.
సూక్షముగా పరిశీలిస్తే నా హృదయ వాసియై నన్ను ఆవరించిన మాయ అను పొగను పోగొట్టుకొనుటకు
నాకు నిశ్చల చిత్తమను పొగ గొట్టమును అందించి,నిరంతర సాధన అను గాలిని దాని ద్వారా ఊదుతుంటే,మాయామోహములనే పొగలు తొలగి,ఆత్మతత్త్వమను జ్యోతి ప్రకాశమును దర్శనము చేసుకొనగలవని నన్ను ఉధ్ధరించుచున్న తల్లీ.
ధన్యోస్మి మాతా ధన్యోస్మి.
Monday, September 21, 2020
PRAPASYANTEE MAATAA-06
ప్రపశ్యంతీ మాతా-06
*******************
యాదేవి సర్వ భూతేషు ఛిన్నమస్తక రూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః.
పనసపండు ముళ్ళతో మనకు దర్శనమిస్తుంది.తొనలు చూస్తే మధురమే.సీతాఫలము కళ్ళతో కనిపిస్తుంది కాని లోపల మధురమే.రూపము కొంచము ఇబ్బంది కరముగా నున్నప్పటికి అర్థము చేసుకోగలిగితే ఇష్టమైనదే అవుతుంది.తేజస్సును రేణువులుగా విభజించి కాంతిసంవత్సరమును (మిల్కి వే)
సృష్టించి,అది అథోముఖముగా పయనించుటకు
మార్గమును ఏర్పరచి,స్థూల విశ్వము దానిని గ్రహించుటకు తన కట్లను విప్పుకుని పైపైకి ఎగబాకి అమృతధారలను తాను ఆస్వాదించుటయే కాక అఖిలజగమును అమృతమయము చేయించగల శక్తి ఛిన్నమస్తక దేవి.తల్లి వర్గీకరణను నాడీవ్యవస్థ ద్వారా మనకు పరిచయము చేయుచున్నది.యుక్తాయుక్తముతో కూడినది ఈ వర్గీకరణ.పైనుండి
కురియుచున్న అమృతధారలను అందుకోవాలన్న-ఆస్వాదించాలన్న పైకెగిరి పట్టుకోగలగాలి.విశ్వము అమృతమయము కావాలంటే నిరోధములు లేని నిచ్చెన వంటి ఊర్థ్వ మార్గము కావాలి.పట్టు తప్పకుండా ఉండాలి లేకుంటే పడిపోవుటయే కదా.అందులకు విశ్వ మార్గము వజ్రాయుధము వంటి గట్టితనమును కలిగియుండాలి.పైన పట్టుకోగలవారుండాలి అందుకే తల్లి తేజోశక్తిని రశ్ములుగా కిందకు జారుటకు వీలుగా చేసి తద్వారా పైకి ఎగిరి పట్టుకునే ప్రయత్నము చేయుచున్న వాటికి ఫలితమునందించుచున్నది
.నింగి-నేలల రాకపోకలకు నిచ్చెనగా తన శక్తినుంచినది.అంతేకాదు భూసారములను సౌరశక్తులు గ్రహించునట్లు మార్గమునేర్పరచినది.మాయ చుట్టుముట్టిన సమయమున తల్లి దానిని వేరుచేసిచూపుతుంది.దానివలన సత్యము నిత్యమై నిండుదనమును సంతరించుకుంటుంది.అమృతపానము చేసి,అమ్మ శక్తిని చాటుతుంది.ఆ మాయను తొలగించుకొనుటయే శిరము నుండి కపాలమును వేరుచేసుకొనుట.అట్లు విడివడిన సమయమునందును తల్లి స్వయం సమృధ్ధయై తన మీదనే కాక డాకిని-వర్ణిని)తన పక్కన ఉన్న రెండు శక్తులమీదను అమృత ధారలను అందించగలదు.దీనిని "మధు విద్య" అంటారు.మధువిద్య యైన తల్లి స్థూల ప్రపంచ కుండలిని ద్వారా శీర్షము నుండి కపాలమును ఛేదించుకొని,బ్రహ్మాందమంతా వ్యాపించియున్న దేవయాన మార్గము ద్వారా ఏకత్వము చెందుతుంది.అప్పుడు విశ్వము-విశ్వేశ్వరి అను రెండు నామరూపములుండవు.విశ్వమే విశ్వేశ్వరి.విశ్వేశ్వరియే విశ్వము.ఏకం అద్వితీయం బ్రహ్మం గా మారుతుంది.సత్వగుణ సంపన్న శుష్మ్న నాడిగా తల్లిని కనుక భావించినట్లయితే పక్కనున్న రెండు శక్తులు రజో-తమోగుణముల ప్రతీకలనుకోవచ్చును.
సూక్ష్మ పరిశీలనకు వస్తే తల్లి మన నాడీమండలము లోని వెన్నెముక.సుషుమ్న నాడి
తన పక్కన ఇడ-పింగళ అను రెండు నాడులను కలుపుకొని,మార్గములో వచ్చే చక్రాలలో ఉన్న బ్రహ్మ-విష్ణు-రుద్ర గ్రంధుల ముడులను విప్పుకుంటూ పైపైకి పాకి అసత్యమైన ఐహికమును-సత్యమైన ఆధ్యాత్మికత నుండి వేరు చేసుకొని,మాయ అను పొరతో కప్పుకొని యుండిన శిరము లోని నిత్యసత్యమను ఆత్మను తెరచి,అమృతపానము చేస్తూ ,అనిర్వచనీయానందములో మునిగి ఉంటుంది.సత్తు-అసత్తులను వేరుచేసి,స్వస్వరూపమును సందర్శింపచేయుచున్న చిద్విలాసిని ఛిన్నమస్తాదేవి.శరణు-శరణు.
ధన్యోస్మి మాతా ధన్యోస్మి.
PRAPASYAMTEE MAATA-5
ప్రపశ్యంతీ మాతా-05
*******************
భగత్వ-రమణత్వ-వమనత్వముల మేలు కలయికయే భైరవీమాత.కాంటి భగత్వము-సౌందర్యము రమణత్వము-శక్తివంత చలనము వమనత్వము.ఉదయిస్తున్న అనంత సూర్యుల కాంతి సమూహమును భైరవిగా కీర్తించవచ్చును.భ అనగా కాంతి,ర అనగా శబ్దము.తేజోపూరిత శబ్దమే భైరవి శక్తి.అఖండ మేధా శక్తి.అనంత ప్రాణ శక్తి.విశ్వ పరిణామములను నిర్దేశించే విశేష శక్తి యైన తల్లిని జాగృత కుండలిని అని కూడా అంటారు.కుండలినీ శక్తి తటస్థ స్వభావముతో మూలాధార చక్రములో నిదురిస్తుంటుందంతారు.ఆ నిద్ర మన నిద్ర వంటిది కాదు.పరిసర జ్ఞానమును విస్మరించిన అపరిణత దశ.సస్వరూపమును స్వశక్తిని గుర్తించలేని మందత్వము.ఆ మందత్వమును తోసివేసి తన వేడిచే-వెలుగుచే కుండలిని తన చుట్లు విప్పుకుని,పైపైకి ఎగబాకి పరమాత్మ తో పరిచయము చేసే శక్తి.అంతే కాదు తల్లి దుర్గ అను నామముతో రెండు విధములైన దుర్గములను మనకు చూపిస్తూ,దేనిని మనముండుటకు ఎంచుకోవాలో తెలియచేసే శక్తి.అరిషడ్వర్గమనే ఎత్తైన గోడలు గలిగి మనలను బంధించు దుర్గమునకు దూరముగా ఉండి అవ్యాజ కరుణ-ఆశ్రిత వాత్సల్యము-ఆనందాబ్ధి మొదలగు ఎత్తైన గోడలతో కట్టబడిన అమ్మ దయ అనే దుర్గమును ఆశ్రయించవలెనను విషయమును వివరించు మేథాశక్తి.
స్థూలగా గమనిస్తే తల్లి తన తన సక్తిని చలింపచేస్తూ దారులలోని ముళ్ళను-కుళ్ళును తొలగిస్తూ తొలగిస్తూ పంచ తన్మాత్రలను సూక్ష్మ స్థితిలో-పంచభూతములను స్థూల స్థితిలో పరిచయము చేస్తూ,వాటిని కలిపే వంతెనయై ప్రకాశిస్తుంటుంది.
నింగి నేలకు నెయ్యమును కలిగించి,మధ్యలో తారసపడు శత్రువులను ఏ ఆయుధములను ఉపయోగించక,తన వెలుగు అనే ఖడ్గము ద్వారా తొలగించివేస్తుంది.
సూక్ష్మముగా పరిశీలిస్తే నేను నిదురిస్తున్నప్పుడు తైజసాత్మికగా,మెలకువగా నున్నప్పుడు జాగరిణిగా,స్వప్నావస్థలో నున్నప్పుడు స్వపంతీగా నున్న ప్రాణశక్తివి నీవేకదా తల్లి.నీ శక్తి అందించే వేడివెలుగులతో నా తటస్థతను తోసివేసి,పంచేంద్రియ పాటవమును పెంపొందించి సహస్రా ప్రయానమునకు సన్నద్ధుని చేస్తున్నావు.అంతే కాదు అంతర్-బహిర్ శత్రు నిర్మూలనకు బాహ్యములో నున్న ఆయుధముల అవసరము లేదని,వాక్చాతుర్యము-సమయస్పూర్తి-సాత్త్విక సాధన-సత్ప్రవర్తన అను వివిధ జ్ఞాన ఖడ్గములను మాకొసగి,ఉపాయములనందించుచు,నా ఉపాధిలో నున్న నిన్ను
కనుగొని-అనుక్షణము ఆరాధించనీ.
ధన్యోస్మి మాతా ధన్యోస్మి.
Friday, September 18, 2020
PRAPASYANTEE MAATAA-04
ప్రపశ్యంతీ మాతా-04
******************
యాదేవి సర్వభూతేషు భువనేశి రూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః
వేదములచే అదితి ( అఖండము) గా కీర్తింపబడుచున్న భువనేశ్వరి మాత,ఇచ్ఛా-క్రియా శక్తుల సంగమమై,తన బిడ్డల కోసం ఆకాశాన్ని సృష్టిస్తుంది.అవసరమైతే తానే ఆకాశముగా
మారుతుంది.అందులో ఎన్నో మనకు ఉపయోగపడే
వాటిని నియమిస్తుంది.మన ఆరోగ్యము కోసము కాలమును వికసింపచేసి దిక్కులను స్పష్టపరుస్తుంది.సూర్య మండల మధ్యస్థయై సూర్య కిరణములను తన కరములతో సస్యములుగా-శాకములుగా-పండ్లగా-కలి (ఆహారము) రూపమును దాల్చి,సారవంతమై,మన ఆకలిని పోగొడుతుంది.మాతృవాత్సల్య పూరిత ఇచ్ఛాశక్తి కనుక అమ్మ "ఈక్ష" అని కీర్తింపబడుతు,తన సూచనలతో,స్థూలజగతిని సుభిక్షము చేస్తుంది.
తల్లి సూక్ష్మ స్థితి-గతులను పరిశీలిస్తే,బయటి ఆకాశము వలె,మన లోపల నున్న దహరాకాశము (హృదయము)
తల్లి నివాసస్థానము.నిజమునకు మన అన్నకోశము-ప్రాణ కోశము-మనోమయ కోశము-విజ్ఞాన కోశము-ఆనంద కోశము జడములై ప్రేతస్థితిలో పడియున్నవేళ,భువనేశి,నిద్రాణమై యున్న కుండలినిని జాగృత పరచి వాటిని శక్తివంతము చేస్తుంది.అన్న కోశము ఆకలిని గుర్తించి ఆహారమును వెతుకుతుంది.దొరికిన తరువాత అన్నమును పరబ్రహ్మ స్వరూపమని భావిస్తుంది.అన్నకోశము తన శక్తిని
ప్రాణ కోశమునకు,మనోకోశమునకు,విజ్ఞాన కోశమునకు తల్లి దయతో అందించి,ఆనందమయ కోశమును చేరి ఆనందో బ్రహ్మముగా అమ్మ ఉనికిని గుర్తించకలుగుతుంది తప్పులున్న దయచేసి సవరించగలరు..అమ్మా నాలోని ఆకలి నీవు దానిని తీర్చే ఆహారము నీవు అన్న విషయమును అర్థము చేసుకొనిన నన్ను ఆర్తితో అర్చన చేయనీ,
ధన్యోస్మి మాతా ధన్యోస్మి.
prapaSyantee maataa-03
ప్రపశ్యంతీ మాతా-03
******************
యా దేవి సర్వభూతేషు షోదశి రూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమోనమః.
కాళి-తార మాతలు వామాచార పధ్ధతులలో పూజింపబడుతుంటే దానికి విరుధ్ధముగా వినూత్నముగా దక్షిణాచారా పధ్ధతిలో పూజింపబడు తల్లి షోడశి.తన నామములోని పదహారు మంత్రాక్షరములను చంద్రుని షోడశ కళలుగా ప్రకటింపచేసిన నిత్య కళయే షోడశిమాత.
తన ముందరి శక్తులైన కాళి-తార బ్రహ్మవిద్యారూపాలుగా కనుక మనము పరిగణించగలిగితే,బ్రహ్మవిద్యతో పాటుగా సుందరీయోగమును జోడించి,తాను మాత్రమే కాకుండా,సకల జగములను సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దినది.పూవులు-పళ్ళు-పక్షులు-నెమళ్ళు-వివిధ వృక్షములు-సువాసనలు-శుభసంకేతములు.అద్భుతము అద్వితీయము తల్లి కల్పనాచాతుర్యము.
వీటన్నిటితో ఆడుతు-పాడుతు తల్లి లలితయై ,సుందరియై(,కాళి తత్త్వమును సత్యము అనుకుంటే-తారా తత్త్వమును శివముగా భావిస్తే)-షోడశి సుందరమై కను విందు చేస్తున్నది.
సుందరము అంటే బాహ్యము తాత్కాలికము కాదు అనే విషయమును తెలియచేయుటకై తల్లి సత్యమును-శుభమును కలుపున్న సుందరత్వముగా భాసించుచున్నది.
కాళి-తార మాతలు తటస్థమును అధిరోహిస్తే,షోడశి మాత పంచకృత్య సింహాసనమును
అధిష్టించినది.సృష్టి-స్థితి-సంహార-తిరోధాన-అనుగ్రహములను ఐదు పనులు తాను చేయుచున్నానని చెప్పకనే చెప్పినది తల్లి.కాళి జగములను సృష్టిస్తే-తార జగములకు వెలుగును శబ్దమును ఇస్తే-షోడశి ఇంకొక ముఖ్యమైన జ్ఞానశక్తికి ప్రతీకగా పాలిస్తున్నది.తల్లి త్రిపుర సుందరి.అనగా త్రిగుణములు దరిచేరలేని సుగుణరాశి
.త్రిగుణాతీత జ్ఞాన శక్తియై స్థూలములోని ఉపాధుల ఇంద్రియ వ్యామోహములను జయించుటకు పాశమను ఆశను,దానిని తీసివేసే శక్తిగాఅంకుశమును,విల్లమ్ములను ధరించిన తల్లి రూపము సూచిస్తున్నది.
తల్లీ సూక్ష్మ రూపమున సర్వరోగహర చక్ర నివాసివై,(లలాట వాసియై )నా ఇంద్రియములకు సహకరించుచు- వానినిసవరించుచు కన్నులు-కంఠము-శిరము లో జనించు తమోభావములను తరిమివేయుచు,జ్ఞానశక్తి స్వరూపివై యుక్తాయుక్త విచక్షణను వివరించుచున్న నిన్ను వీడని భక్తితో వినుతిచేయనీయవమ్మా.
ధన్యోస్మి మాతా ధన్యోస్మి.
PRAPAsYANTEE MAATAA-02
ప్రపశ్యంతీ మాతా-02
*******************
యా దేవి సర్వభూతేషు తారా రూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నంస్తస్త్యై నమోనమః.
శక్తి చిఛ్చక్తిగా ప్రకటింపబడుతోంది తారాదేవిగా.తృ అనే ధాతువునుండి ఏర్పడిన నక్షత్రము అనే భావమిచ్చునది తల్లి నామము.అంతే కాదు తరింపచేయునది.
కాళి అను మూలము నుండి వేరొక రూపకల్పనకు సహాయపడు నాభీస్థాన నివాసిని తల్లి.బొడ్డుతాడు ఏవిధముగా తల్లికి పెరుగుచున్న శిశువుకు వారథిగా ఉండి సహాయపడుతుందో అదేవిధముగా కాళి తత్త్వమునుండి తనకు కావలిసినవి స్వీకరించి కొత్తరూపును సంతరించుకున్నది తారాదేవి. కాళిని నల్లని చీకటిగా కనుక మనము భావిస్తే దానిని చీల్చుకొని తేజమును-శబ్దమును వెంట తీసుకుని వచ్చిన శక్తి తార.మూలమైన శక్తి కాళియై సృష్టిని చేసింది.ఇంకొక శక్తిని ప్రకటింపచేసి,సృష్టిలోని అజ్ఞానమును కత్తిరించమంది.అందుకు వెలుగును వాక్కును సహాయకారులుగా పంపించింది.
తారాదేవి ముఖ్యముగా వాగ్రూపశక్తి
.వాక్కు పర-పశ్యంతీ-మధ్యమ-వైఖరి అని నాలుగు విధములుగా విభజింపబడినది.స్థూలములో గమనిస్తే ఉరుములు-చెట్టు కొమ్మలనుండి వచ్చు శబ్దములు-అలల ఘోష-జంతువుల అరుపులు-మానవ సంభాషణలు తల్లి వాగ్రూపముగా చెప్పుకొనవచ్చును. మూలము నుండి బయలు దేరిన వాక్కు-దర్శనమై-భావమై-భాషయై బహుముఖముల విరాజిల్లుతుంటుంది.
కాళిమాత మన గుండెను పనిచేయిస్తుంటే,తారామాత మన వాక్కుకు వారధియై వ్యక్తపరిచేటట్లు చేస్తుంది.
తల్లీ నీవు అత్యంత దయతో నీ నివాసమైన నా
నాభీక్షేత్రము నుండి నాకొరకై పైపైకి పాకుతు
మూలకారణమైన పరావాక్కును పశ్యంతీ గా దర్శింపచేస్తూ,ూ,మధ్యమగా దానిని భావముగా మారుస్తూ,వైఖరి గా భాషను అలది బహుముఖములుగా వీనుల విందు చేయుచున్నావు.నిన్ను ప్రస్తుతించక మనగలనా తల్లీ.
ధన్యోస్మి మాతా ధన్యోస్మి.
prapaSyanti maata-01
ప్రపశ్యంతి మాతా -01
***************
యా దేవి సర్వభూతేషు కాళి రూపేణ సంస్థితా
నమస్తస్త్యై నమస్తస్త్యై నమస్తస్త్యై నమో నమః.
పదిశక్తుల పరమార్థము - కాళి ప్రథమశక్తి.
************************
ప్రియ మిత్రులారా! మీకు తెలియని విశేషములు కావు..ద్వంద్వమయమైనఈ జగతిలో రాత్రింబవళ్ళు-సుఖదుఃఖములు-జ్ఞాన-అజ్ఞానములు-కలిమి-లేములు-ఉఛ్చ్వాస-నిశ్వాసములు-స్త్రీ-పురుషులు ఉన్నట్లు శ్రీవిద్యోపానలో దక్షిణాచార-వామాచారములు ప్రాంతములను బట్టి,పరిసరములను బట్టి పరంపరను బట్టి ద్వివిధములుగా నున్నందున కాళి శక్తిని పూజావిధానమును తాంత్రికముగా భావించి భయపడుట తల్లిని సరిగా అర్థము చేసుకొనలేని మాయపొరయే.
తల్లి మనలో సూక్ష్మముగా జగతిలో స్థూలముగా మనలను రక్షించుటకు ప్రకటింపబడుతు,పరిపాలిస్తుంది.ఇది నిర్వివాదము.
అంధకారములో సమస్త ఆకారములు సమానమయి గుప్తస్థితిని పొందినపుడు ఇచ్చాశక్తి స్వరూపిణి అయిన కాళిమాత తిరిగి సృష్టిని ప్రారంభిస్తుంది.శివశక్తైక స్వరూపములో శివ స్వరూపముగా అచేతముగా నుండి సృష్టి కార్యమును ప్రారంభించలేని దశలో తటస్థమైన శివశక్తిని కుండలిని ద్వారాజాగృత పరచే శక్తియే కాళిమాత.
అంతే కాదు.శివ శక్తి జాగృత మగుటచే రాత్రి స్వరూపమైన కాళి పగటి స్వరూపమైన శివుని శక్తిని కలుపుకొని సంపూర్ణ దినముగా రూపుదిద్దుకుంటుంది.సృష్టి-స్థితి కార్యములను నిర్వహిస్తోంది.
ఇది స్థూల విచారణ అయితే సూక్ష్మముగా మన గుండె కరిపే రక్త ప్రసరణ కాలిసక్తియే.రక్తము సదా ప్రవహించే అనాత చక్రమునందుండి,తన నాలుకలనే నాళములతో రక్తమును తాగుతు-విడుస్తూ శ్వాసక్రియను తల్లి శాసిస్తోంది.రూపము కఠినము-స్వభావము కారుణ్యము మన సాధన రూపముతోనే ఆగిపోకూడదని,తరచి తరచి తత్త్వమును అందుకోవాలని అమ్మ తన నుండి అనేక శక్తులను వివిధ నామరూపములతో ప్రభవింపచేసి,ప్రస్తావింపచేసి-పరమార్థమును అందించుచున్నది.
కలయతీతి కాళి- కాలపు స్థితిగతులు నీవని,నా నాళముల నడకలు నీవై నన్ను నడిపిస్తున్నావని తల్లీ నీ కరుణచే పశ్యంతీ.చూడగలుగుతున్నాను.కాదు కాదు ప్రపశ్యంతీ-సంపూర్ణముగా
చూడగలుగుతున్నాను.
ధన్యోస్మి మాతా ధన్యోస్మి.
దోషములకు మన్నించగలరు.
Monday, September 14, 2020
SIVA SANKALPAMU-108
ఓం నమః శివాయ-108
******************
కరుణరస పట్టిది కచ్చితము కనికట్టనలేనిది
నేనేమరియున్నవేళ తానే నన్నుచేరినది
మనోకలశము చూచినది మక్కువ తిక్కశంకరుని
తక్కువచేసినగాని దయతలుచు దిక్కగువానిని
సన్నుతిచేయుచు సంతోషపు జలమును నింపుచున్నది
అనురక్తితో భక్తిదారమును చుట్లుగ చుట్టుచున్నది
పదపదమని చేరినవి పరమేశుని పదములు మామిడాకులై
అపరాధము తలంచుచు పలాయనమైనది నింద కుందుచు
నా పశ్చాత్తాపము పరివర్తన చెందెను నారికేళమై
నిను నిందించిన ఇంద్రియములు నిష్కృతి కోరెను
పుణ్యహవచనము జరుగుచున్నది పునీతమవ్వగా
వసియింపుము శివా నామది వాత్సల్యము వాసికెక్కగా.
పరబ్రహ్మము ఒక్కటే.పైపై తొడుగులు వేరువేరుగా గోచరిస్తుంటాయి.పరమాత్మను అనుభవించాలంటే సూక్ష్మాతి సూక్ష్మమైన దర్శనశక్తిని కలిగియుండాలి.ఈ శక్తి అచేతనములను చైతన్యవంతము చేయు చిత్-శక్తి.దీనిని ఆత్మ యొక్క (పరమాత్మలోని చిన్ని మచ్చుతునక)అఖండశక్తిగా కూడ భావించవచ్చును.నేను-నాది అను అపరిమితమైన అహము అఖండశక్తిచే ప్రభావితమై మంచుకరిగినట్లు కరిగి,అంతఃకరణ శుధ్ధితో అసలు నిజము తెలుసుకోగలుగుతుంది.తాను నీడను మాత్రమేనని తెలుసుకొని నిజమైన పరమాత్మకు దూరముగా నుండి నడవలేక కదులుతున్న నేను కదిలిస్తున్న నేనులో కలిసిపోతుంది. అంతే,
సర్వం శివమయం జగం.దీనిని అర్థము చేసుకొనేటట్లు చేయుటకు ఆదిదేవుడు తాను ఒక్కొక్క మెట్టు దిగుతు-నన్ను ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తు,అలసట రానీయకుండా ఆడిన ఆటయే శివసంకల్పమను ఈ నిందా-స్తోత్రముల మారేడు దళము.
...ప్రియ మిత్రులారా.నా ఈ చిన్ని ప్రయత్నమునకు ఊపిరినిచ్చినది మీ ఉన్నత సం స్కారమే కాని నా
అర్హత కాదు.ఈ పవిత్ర
" శివ సంకల్ప" పలుకులను -చూసినా-చూడకున్నా,వినినా-వినకున్నా,చదివినా-చదువకున్నా,చర్చించినా-లేకున్నా,ఎప్పుడో పుక్కిట పట్టేశామని వెక్కిరించినా,గొప్పగా ఏమిలేదు అని పెదవిని చప్పరించినా,తప్పులు సవరించుటకు కనికరించినా.మేమా--తప్పులను సవరించేది అని హుంకరించినా
(ఫలశృతి)
గంగా స్నాన ఫలితమును ఇచ్చు గంగాధరుని ఆన
నాశ రహిత పుణ్యమును ఇచ్చు నాగాభరణుని ఆన
విభవమొసగు-విజయమొసగు విశ్వేశ్వరుని ఆన
సర్వ జనులకు శుభములు ఇచ్చు సదా శివుని ఆన.
( సవినయ ధన్యవాద కుసుమాంజలి)
ఓం మంగళం- ఓంకార మంగళం
జయము మంగళం-జగన్నాథ మంగళం
శుభం మంగళం-శుభాకార మంగళం
సత్య మంగళం-సచ్చిదానంద మంగళం
నిత్య మంగళం-నిరాకార మంగళం
మహాదేవ మంగళం-మహనీయ మంగళం
అర్థనారీశ్వర అందుకో మంగళం.
జయ మంగళం-నిత్య శుభ మంగళం
జయమంగళం-నిత్య శుభ మంగళం.
సర్వం సదాశివ పాదారవిందార్పణమస్తు
Attachments area
SIVA SANKALPAMU-107
ఓం నమః శివాయ-107
********************
భక్తుల కంఠస్థమైన శితికంఠుని స్తోత్రములకు-దండాలు శివా
పృథ్వీలింగమైన ఏకామ్రేశ్వరునికి -దండాలు శివా
అగ్నిలింగమైన అరుణాచలేశునికి-దండాలు శివా
జల లింగమైన జంబుకేశ్వరునికి-దండాలు శివా
వాయు లింగమైన శ్రీ కాళహస్తీశ్వరునికి- దండాలు శివా
ఆకాశలింగమైన చిదంబరేశ్వరునికి- దండాలు శివా
సూర్యబింబ లింగమైన కోణార్క దేవునికి-దండాలు శివా
చంద్ర బింబలింగమైన చంద్రకోన దేవునికి-దండాలు శివా
భక్తి ఆలింగనమైన మహాలింగమునకు -దండాలు శివా
(ఓం) న-మ:-శి-వా-య అను పంచాక్షరికి-దండాలు శివా
దం-డా-లు-శి-వా అను ఐదు అక్షరములకు-దండాలు శివా
సుస్పష్టపు ఇష్టమైన అష్టమూర్తికి-దండాలు శివా.
పంచభూతములు-సూర్యుడు-చంద్రుడు-జీవుని కలయికయే అష్టమూర్తితత్త్వము.
జగత్ ఈశ ధీయుక్త సేవనం-భగవాన్ రమణమహర్షి.
చరాచరాత్మకములన్నియు ఈ ఎనిమిది శక్తుల సంగమమే.సూక్ష్మముగా మనలో పంచభూతములుగా,సూర్యునిగా కంటిని-బుధ్ధిని పాలిస్తూ,చంద్రునిగా మనసును మళ్ళిస్తూ,జీవుని లోని శక్తిగా అష్టమూర్తి సంగమము నెలకొన్నది.
సదా శివుడు అష్టమూర్తి తత్త్వముతో ఎనిమిది పేర్లతో ,భూతత్త్వమును వివరించు శర్వునిగా,జలతత్త్వమును వివరించు భవునిగా,అగ్నితత్త్వ ప్రతీకగా రుద్రనామముతో,వాయు తత్త్వధారియై ఉగ్ర నామముతో,ఆకాశ తత్త్వధారిగా గ్రీవా నామముతో,సూర్య ప్రతీకయైన ఈశాన నామముతో,చంద్ర తత్త్వ ప్రతినిధిగా మహాదేవ నామముతో,జీవునికి ప్రతినిధిగా యజమాన మూర్తి పశుపతి నామముతో ప్రకాశిస్తున్నాడు.శివుని అష్తమూర్తి తత్త్వమును అవగతము చేసుకొన్న జీవుడు శివుడుగా పరిణిని చెందుచున్నాడు.
శివోహం-శివోహం.
తెల్లారి పోయింది పల్లె లేచింది
పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది.
స్వామీ నీ దయతో ఈ రాతిరి తెల్లారుట వలన నా శరీరమునకు కమ్ముకున్న చీకట్లు తొలగి వెలుగు రేఖలతో నా కళ్ళు తెరుచుకుంటున్నవి.నా లోని ప్రతి అణువణువు జ్ఞానమయమవుతున్నది,నందివాహనా! .దీనిని కదలకుండా కళ్యాణ కర్తవై నన్ను అనుగ్రహించు .
ఇన్నాళ్ళు నేను పూజగా భావించబడినది పూజకాదని,నన్ను నేను మరిచిపోయి త్వమేవాహం (నువ్వే నేను-నేనే నువ్వు) భావనయే తరింపచేయగలిగినదను సత్యము ఇప్పుడిప్పుడే అర్థమగుచున్నది ఆదిదేవా.ఈ భావనను నాలో స్థిరముగా నిలుపు తండ్రీ.
నిజమును గ్రహించగలుగు వానికి శివమందిర ప్రాకారములు-ధ్వజస్తంభము-శివలింగము-అర్చకులు-నంది-బలిపీఠము-భక్తులు అన్నీ-అందరు శివస్వరూపముగానే దర్శనమిస్తారు అన్న నిర్ద్వంద్వము నీ దయతో అవగతమగుచున్నది.అనుగ్రహింపుము ఆదిదేవా.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-106
ఓం నమః శివాయ-106
********************
ఆనంద భాష్పాలతో అభిషేకము చేయనా
భక్తి మకరందమును చందనముగ పూయనా
ఆది-అనాది లేదంటు బూదిని నే పూయనా
శాంతి సహనపుష్పాలతో పూజలనే చేయనా
పాప రహితము అనే దీపము వెలిగించనా
పొగడ్తపూల వాసనలనే పొగలుగ నే వేయనా
లబ్బు-డబ్బు శబ్దాలతో స్తొత్రములే చేయనా
ఉచ్చ్వాశ-నిశ్వాస వింజామరలను వీచనా
అరిషడ్వర్గములు లేని ఆతిధ్యమునీయనా
హర హర మహాదేవ అంటు హారతులే ఇయ్యనా
దాసోహం-దాసోహం అంటు నే ధన్యతనే పొందనా
నా పక్కనే ఉన్నావురా చూడ చక్కనైన శంకరా!
అప్రాకృత శరీరం తం అతి మన్మథ రూపిణం శివా.
సచ్చిదానంద రూపాయ సదాశివాయతే నమః.
నా కోసం రూపమును ప్రకటించుకొని,నాచే పరిహాసము చేయించుకొని,పరమ దయతో నాకు పరతత్త్వమును పరిచయమును చేసిన పరమాత్మా! ఇప్పుడు ఎవరైనా నన్ను నీ రూపము గురించి అడిగారనుకో,ఆనందముతో నీ సూక్ష్మ తత్త్వముతో పాటు,నీ స్థూల రూపమును కూడా అగ్ని నీ ముఖమని-పరాపరాత్మకము ఆత్మ యని,కాలము గతి యని,భూమి నీ పాదపీఠమని,ఊరుపు గాలి యని,నాలుక జలోత్పత్తి స్థానమని,దిశలు(దిక్కులు) కర్ణంబులని,దివము నాభియని,సూర్యుడు కన్నులని,శుక్లము సలిలమని,జఠరము జలధులని,వేదములు (ఛందములు) ధాతువులని,పంచ ముఖములు విస్తరించినపుడు ఉపనిషత్తులని,హృదయమే ధర్మమని ఎంతో ఇష్టముతో నిన్ను దర్శించనీయి అష్టమూర్తి వైభవమును స్పష్ట పరచనీ తండ్రీ.అనుమానముతో మొదలైన భక్తి అనందాబ్ధిలో తేలియాడనీ.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-105
శివ సంకల్పము-105
************************
నువ్వు తిక్కలోడివని అంది నా మూఢత్వం
నిన్ను చక్కదిద్దాలనుకుంది నా మూర్ఖత్వం
నీకేమి తెలియదంది నా అహంకారం
నీకు తెలియచేయాలనుకుంది నా అంధకారం
నిన్ను గౌరవించలేనంది నా తాత్సారం
నీతో గారడి చేయాలనుకుంది నా మాత్సర్యం
నీకు నాగరికత లేదంది నాలోని ఆటవికం
నిన్ను నాగరికుడిని చేయాలంది నాలోని ఆధునికం
నీకు పాఠము చెబుదామనుకుంది నాలోని ఆర్భాటం
నీకు పరీక్ష పెట్టాలనుకుంది నాలోని ఆరాటం
సముద్రాన్ని పరీక్షించు ఉప్పుబొమ్మ నేనైతే
నా తప్పు చెప్పినావురా ఓ గొప్ప శంకరా.
ఆరూఢ భక్తిగుణ కుంచిత భావచాప
యుక్తైః శ్శివస్మరణ బాణ గణైరమోఘైః
నిర్జిత్య కిల్బిష రిపుం విజయీ సుధీంద్రః
సానంద మావహతిసుస్థిర రాజ్యలక్ష్మీ.
శివమే జగము-జగమే శివము
శివోహం శివోహం.
శివా! నీ అనుగ్రహ వృష్టిలో మునిగి పునీతుడనైన నేనేకాదు,మరెందరో బుధ్ధిమంతులు ధనుర్విద్యా సంపన్నతతో ధన్యులగుచున్నారు.వారి హృదయమనే ధనుస్సుకు నిష్కళంక భక్తి అనే నారి బంధించబడినది.నెరజాణలైన శివ నామములు అనే బాణములు అమ్ములపొదిని అలంకరించుచున్నవి.వారి ధన్యత నేమనగలను? అర్జునుని తో పాటు సమానముగా అందించిన నీ ధనుర్విద్యా చాతుర్యముతో వారు పాపములనే శత్రువులపై శివనామ బాణములను సునాయాసముగా సంధించుచు,భక్తి రాజ్యమునేలుచున్నారు భవబంధ విముక్తులై.స్వామి నీ కడగంటి చూపు చాలదా నన్ను కడతేర్చగ.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-104
ఓం నమః శివాయ-103
********************
చిలుకగ నే జన్మిస్తే చిదంబరుడ అంటాను
కోడిగ నే జన్మిస్తే కోటిలింగేశ్వర అంటాను
కాకిగ నే జన్మిస్తే కాళహస్తేశ్వర
ఆవుగ నే జన్మిస్తే అంబాపతి అంటాను
మేకగ నే జన్మిస్తే నే మేలమాడుతుంటాను
పాముగ నే జన్మిస్తే భృస్మేశ్వర అంటాను
ఏనుగుగ నే జన్మిస్తే ఏకాంబరేశ్వర అంటాను
కీటకముగ నే జన్మిస్తే నే కీర్తిస్తూనే ఉంటాను
జన్మకాదు ముఖ్యమనే కర్మసిద్ధాంతపు సాక్షిగా
ఏ జన్మలో నేనున్నా ఏలినవారి దయతో
"త్వమేవాహం" అని తలుస్తు నన్ను తరియింప చేయగా
బిరమున నన్ను బ్రోవరా పరమైన శంకరా.
" ఏషత్యేషజనిం మనోన్య కఠినం తస్మిన్నటానీతిమ
ద్రక్షాయై గిరిసీమ్ని కోమల పదన్యాసః పురాభ్యాసితః
నోచేదివ్య గృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు
ప్రాయః స్సత్సు శిలా తలేషు నటనం శంభో కిమర్థం తవః."
ఓ తండ్రీ! నేను దుర్భాషలాడతానని నీకు ముందే తెలుసుకదా.అయినా నీ పితృవాత్సల్యము నన్ని విడిచిపెట్టలేదుకదా.అందుకే అవును అందుకే వీడు పుడతాడు.వీడి మనసు కఠినమైనది అయినప్పటికి నేను అక్కడ సంచరించాలని నా మీది ప్రేమతో ఎన్నో దివ్య భవనము (మెత్తని తివాచీలు కప్పినవి),పూలపానుపులు (సుతిమెత్తనివి) యజ్ఞవాటికలు (అతి పవిత్రమైనవి) ఉన్నప్పటికిని శిలాతలములపై నాట్యము చేసి,నా కొరకు పురాభ్యాసితుడవైనావు.నీ పాదములెంత కందిపోయినవో కదా.వాటిపై భక్తి అను లేపమును అద్దుతు నన్ను సేవించుకొనీయి శివా.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-103
ఓం నమః శివాయ-103
********************
చిలుకగ నే జన్మిస్తే చిదంబరుడ అంటాను
కోడిగ నే జన్మిస్తే కోటిలింగేశ్వర అంటాను
కాకిగ నే జన్మిస్తే కాళహస్తేశ్వర
ఆవుగ నే జన్మిస్తే అంబాపతి అంటాను
మేకగ నే జన్మిస్తే నే మేలమాడుతుంటాను
పాముగ నే జన్మిస్తే భృస్మేశ్వర అంటాను
ఏనుగుగ నే జన్మిస్తే ఏకాంబరేశ్వర అంటాను
కీటకముగ నే జన్మిస్తే నే కీర్తిస్తూనే ఉంటాను
జన్మకాదు ముఖ్యమనే కర్మసిద్ధాంతపు సాక్షిగా
ఏ జన్మలో నేనున్నా ఏలినవారి దయతో
"త్వమేవాహం" అని తలుస్తు నన్ను తరియింప చేయగా
బిరమున నన్ను బ్రోవరా పరమైన శంకరా.
" ఏషత్యేషజనిం మనోన్య కఠినం తస్మిన్నటానీతిమ
ద్రక్షాయై గిరిసీమ్ని కోమల పదన్యాసః పురాభ్యాసితః
నోచేదివ్య గృహాంతరేషు సుమనస్తల్పేషు వేద్యాదిషు
ప్రాయః స్సత్సు శిలా తలేషు నటనం శంభో కిమర్థం తవః."
ఓ తండ్రీ! నేను దుర్భాషలాడతానని నీకు ముందే తెలుసుకదా.అయినా నీ పితృవాత్సల్యము నన్ని విడిచిపెట్టలేదుకదా.అందుకే అవును అందుకే వీడు పుడతాడు.వీడి మనసు కఠినమైనది అయినప్పటికి నేను అక్కడ సంచరించాలని నా మీది ప్రేమతో ఎన్నో దివ్య భవనము (మెత్తని తివాచీలు కప్పినవి),పూలపానుపులు (సుతిమెత్తనివి) యజ్ఞవాటికలు (అతి పవిత్రమైనవి) ఉన్నప్పటికిని శిలాతలములపై నాట్యము చేసి,నా కొరకు పురాభ్యాసితుడవైనావు.నీ పాదములెంత కందిపోయినవో కదా.వాటిపై భక్తి అను లేపమును అద్దుతు నన్ను సేవించుకొనీయి శివా.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-102
ఓం నమః శివాయ-102
*********************
తామరలున్న కొలనులో తిరుగాడు కప్పను నేననుకో
తామసమడచి ఆ కప్పను తుమ్మెదగా మార్చరాదో
మధురసమున్న పాత్రలో తిరుగాడు తెడ్డుననుకో
మేధను అనుగ్రహించి తెడ్డును జిహ్వగ మార్చరాదో
కొమ్మకు చుట్టుకుని తిరిగాడు గాలిపటము నేననుకో
ఇమ్ముగ జాలిచూపి దానిని చుక్కల పక్కకు చేర్చరాదో
వాన నీరు వృధాచేయు సంద్రమునునేననుకో
పన్నీరై క్షుథతీర్చు పంటబీడు చేయరాదో
శివుడెంత అని అన్న గర్వపు గంగను నేననుకో
శివపాదమే తనకు సర్వమన్న గంగగా చేయరాదో
ఇన్ని మార్పు చేర్పులకు కూర్పువైన నిన్ను
ఎన్న తరము కదురా నా కన్నతండ్రి శంకరా.
" రోధస్తోయహృతః శ్రమేణ పథికశ్చాయాం తరోర్వృష్టితో
భీతః స్వస్థగృహం గృహస్థమతిధిః దీనః ప్రభుం ధార్మికం
దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా
చేతః సర్వ భయాపహం వ్రజసుఖం శంభో పదాంభోరుహం
శివానందలహరి.
ఓ మనసా! ఏ విధముగా నీటిలో కొట్టుకొనిపోవువాడు ఒడ్డును,అలిసిన బాటసారి చెట్టు నీడను,వర్షభయము కలవాడు ధృఢమైన ఇంటిని,అతిథి గృహస్థుని,దీనుడు ధార్మికుడైన ప్రభువును,చీకటిలో భయపడువాడు దీపమును,చలిలో వణుకువాడు మంటనుచేరునట్లుగా,సమస్త భయములను పోగొట్టి సుఖమునిచ్చు శివుని పాద పద్మములను ఆశ్రయింపుము.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-101
ఓం నమః శివాయ-101
********************
కాసు లేనివాడవని కానిమాటలన్నాను
బేసి కన్నులను చూసి రోసిపోయి ఉన్నాను
దోసములే నీ పనులని ఈసడించుకున్నాను
వేసమేమిటో అంటుఈసడించుకున్నాను
నీ కొండను ఎత్తినాడు నీ విల్లు ఎత్తలేదు కద
సహకారమునుఈయనిది అతని అహంకారమేగ
దిక్కు నీవు అనగానే పక్కనేఉంటావు
అహంకారమును వదిలేస్తే అధీనుడివి అవుతావు
స్వల్పకాలిక లయముతో శక్తినీస్తావు
దీర్ఘకాలిక లయముతో ముక్తిని ఇస్తావు
నిన్ను తక్కువన్న నా తెలివి పక్కదారి మళ్ళించి
మొక్కనీయరా భక్తితో ముక్కంటి శంకరా!
మూగమనసులు చిత్రములోని గౌరమా నీ మొగుడెవరమ్మా అను జానపద గీతిక జ్ఞానదీపికగా ప్రకాశిస్తోమి పరమేశ్వరా నీ తత్త్వమును అర్థమును చేసికొని తరించుటకు.
పురుషపాత్రధారి వ్యంగంగా రూపమును మాత్రమే ఇల్లు-వాకిలి లేనివాడు,బిచ్చమెత్తుకుని తిరిగేవాడు,ఎగుడు-దిగుడు కన్నులవాడు,జంగమదేవర నీ వాడా? అంటు పరిహాసముచేస్తే,శక్తిస్వరూపమైన స్త్రీ పాత్రధారి శివుని రూపము వెనుక దాగిన తత్త్వమును ,ఆకాశమే ఇల్లు,భూమియే వాకిలి అంటు పంచభూత తత్త్వమును పరిచయము చేయుటయే కాక,బిచ్చమడిగేది భక్తి-బదులు ఇచ్చేది ముక్తి,అని ఆదిదేవుని అవ్యాజ కరుణను అనుభవించమంటున్నది.ఎగుడుదిగుడు కన్నుల లక్ష్యమును కూడ బేసికన్నులే లేకుంటేను బెంబేలెత్తును ముల్లోకాలు అంటు అగ్గికన్ను అంతరార్థమును అర్థమయ్యేలా చెబుతుంది.పాటతో పరమార్థమును చాటిన పండితునికి శతకోటి నమస్కారములు.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-100
ఓం నమః శివాయ-100
*******************
నీ సుతుడగు గణపయ్య అడ్డంకులు తొక్కాడు
నీవాహనమగు బసవయ్య పుష్టిని అందించాడు
నీకంఠాభరణము పొత్తముగా మారింది
నీ సగభాగపు గౌరమ్మ ఘంటము తానయింది
నీ సిగపూవగు గంగమ్మ గలగలా సాగింది
నీపరివారపు స్వచ్చంద సహకారములేగ
నీవే స్పురింపచేసిన నిందాస్తుతుల హేల
వికల్పములు పారద్రోలు శివ సంకల్పపు లీల
నా దిక్కైన శంకరుడు నాలోనే ఉన్నాడని
లెక్కలేని నా తిక్కను మక్కువతో నీకు ఇచ్చి
నీకు అక్కరే లేనివైన ఈ చక్కెర పలుకులను
నేనెక్కడ వ్రాసానురా?నా దిక్కైన శంకరా!
మహేశ పాప వినాశ నా హృదయవాస ఈశా
ఎంత భాగ్యమందినానో ఏలినావయా
భక్తి ఏదో పూజఏదో తెలియనైతిని
గుట్టు పట్టులేక నిన్ను తిట్టిపోస్తిని
మంత్రయుక్త పూజలేవి తెలియనైతిని
కుతంత్రముతో కూడి నిన్ను వెక్కిరిస్తిని
నిజము ఏదో నింద ఏదో తెలియనైతిని
బొమ్మ వెనుక బొరుసు నేను చూడనైతిని
చీకటేదో వెలుతురేదో తెలియనైతిని
ఏకమే అనేకమని నేనెరుగనైతిని
క్షమయు నీవైనవేళ నేను క్షేమమైతిని
రక్ష-రక్ష నామమే నా లక్ష్యమైనది.దేవా-మహేశా
ఏక బిల్వం శివార్ప
SIVA SANKALPAMU-99
>ఓం నమః శివాయ-99
*******************
శివ కుటుంబములోని "చిన్ని శిశువును" నేను
"ఆకలేస్తున్నదంటే" అన్నపూర్ణమ్మకు చెప్పు
"అన్నము నే తిననంటే" ఆ జాబిలిని కిందకు దింపు
"దాహమువేస్తున్నదంటే" ఆ గంగమ్మకు చెప్పు
"నేను ఆడుకోవాలంటే" ఆ లేడిపిల్లను పంపు
ఆటుపోటులన్నిటిని" ఆదరముతో" కప్పు
కనురెప్పగ పిల్లలను" కాచుటయే ఒప్పు"
కానిపనులు చేసినను" క్షమియించుటయే మెప్పు"
నిన్ను విడిచి ఉండలేక నిందించిన నా మనసు
తప్పు తెలిసికొన్నది" తరియిస్తున్నది నీ ఒడిలో"
లక్షణమగు ప్రేమతో" ఒక్క క్షణమైనను" నన్ను వీడక
రక్షను అందీయరా తక్షణమే శంకరా
నిన్ను విడిసి యుండలేనయా
కైలాసవాసా
నిన్ను విడిసి యుండలేనయా
కైలాసవాసా
lనిన్నుl
నిన్ను విడిసి యుండలేను
కన్నతండ్రి వగుట చేత
ఎన్నబోకు నేరములను
చిన్ని కుమరుడనయ్యా శివా
lనిన్నుl
సర్వమునకు కర్త నీవె
సర్వమునకు భోక్త నీవు
సర్వమునకు ఆర్త నీవు
పరమపురుష శివహర
lనిన్నుl
వరద పద్మ బాల శంభో
బిరుదులన్నీ కలవు నీకు
కరుణతోడ బ్రోవకున్న
బిరుదులన్నీ సున్నాలన్నా
lనిన్నుl
శివ మహాదేవ శంకర
నీవే తోడు నీడ మాకు
కావుమయ్య శరణు శరణు
దేవ దేవ సాంబశివ
lనిన్ను
Eka bilvam SivaarpaNam.
SIVA SANKALPAMU-98
ఓం నమః శివాయ-98
********************
సుగంధిపుష్టి కర్తకు సుప్రభాత దీపములు
నిటలాగ్ని హోత్రునికి నిత్య ధూప దీపములు
పాషాణపు దేవునికి ప్రభల వెలుగు దీపములు
కందర్ప దర్పునికి కర్పూర దీపములు
పరంజ్యోతి రూపునికి ప్రమిదలలో దీపములు
జలజాక్షునికి వేడుకగా జలములోన దీపములు
ప్రమథ గణాధిపతికి ప్రదోషవేళ దీపములు
ఆశాపాశ రహితునికి ఆకాశదీపములు
మా ఆర్తిని తొలగించే కార్తీక దీపములు
దీపములను పేర వెలుగు నీ నామ రూపములు
జాణతనము తోడుకాక జ్వాలాతోరణములో
చిక్కు కున్నావురా ఓ తిక్క శంకరా.
శివుడు చాలా పిరికివాడు.చీకటి అంతే భయపడుతు ఎవరు,ఎప్పుడు-ఎక్కద దీపములను వెలిస్తారా అని ఎదురుచూస్తూ,వెలించిన దీపముల నుండి తనకు కావలిసిన శక్తులను గ్రహిస్తూ,తనకు ఒక కన్నులో అగ్గి ఉందని,తాను జంబుకేశ్వరములో జలస్వరూపుడనని చెబుతూనే జలములో అరటిదొన్నెలలో భక్తులు పెట్టు దీపములకై ఎదురుచూస్తుంటాడు.చిదంబరములో ఆకాశతత్త్వమే నేనంటు భక్తులు ఇంకా ఆకాసదీపములను వెలించలేమిటబ్బ అని ఆలోచిస్తుంటాడు.పైగా తాను విరాగిని కనుకనే మన్మథుడిని సంహరించానని చెప్పుకుంటూనే "కర్పూరదీపం మయర్పితం" అని భక్తుడు అనగానే ముక్కుపుటాలను విస్తరింపచేస్తు,"కర్పూరదీపం మయ స్వీకృతం" అంటు సువాసనను పీలుస్తూనే ఉంటాడు.పైగా తాను కర్పూరగౌరం అంటు తన తెల్లని మేనిఛాయను గుర్తు చేసుకుంటుంటాడు.పరంజ్యోతికి ప్రమిదలలోని దీపమెందుకండి.సూర్యుని ముందు దివిటీల కాని మన స్వామి వద్దనడు.అవి ప్రమదభరితమే అంటూ పరుగులెత్తి మరి తీసుకుంటాడు.సుగంధపుష్టి కర్తట.ఏట్లా అయ్యడో చూసారా.సుప్రభాత దీపములనుండి సద్దుచేయకుండ తనకు కావలిసిన శక్తులన్నిటిని సంగ్రహిస్తాడు.(సద్దుచేయక్యండ)ప్రతినిధే ఇట్లా ఉంటే పాపము నమ్ముకున్న ప్రమథగనము పరిస్థితి ఊహిస్తేనే,ఉమాపతి నీ బండారం బయటపడుతోంది.ఇంకా చీకటి పడనేలేదు..కొంచంకొంచముగా ఆవరించుకుంటోంది.వెలుగు తాను తప్పుకోవాలనుకుంటోంది.ఇంతలోనే ,
ప్రదోషదీపములు వెలిగించండి అంటూ ఒకటే హడావిడి.గమనించారు అందరు శివుని బాగా.కాసేపు పొగిడి జ్వాలా తోరణము లోనికి ప్రవేశించి బయటకు రమ్మన్నారు.పాపము శివునికి చీకటి అంటే భయము పోగొట్టడానికే సుమండి.చాకచక్యముగా తప్పించుకొనే చతురతలేక , చేసేదిలేక సరేనన్నాడు.-నింద.
దోషము నమః శివాయ-ప్రదోషము నమః శివాయ
జ్యోతి నమః శివాయ-పరంజ్యోతి నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" కృష్ట పచ్యంచమే-అకృష్ట పచ్యంచమే" రుద్రము.
వ్యవసాయమునకు అనుకూలముగా ఉన్నిన నేలలో-దున్నని నేలలో సమబుధ్ధితో ప్రకటితమవుతానుతకు ఇంతకన్న ఏమి నిదర్శనముంటుంది శివా.దున్నని క్షేత్రమైన(శరీరమునును పంటకు పక్వము చేసిన పరమేశా! పాహిపాహి.నీ దృక్కులను నాగలితో (సీరంచమే) నా మనసనే బీడునేలను దున్ని,నీ కృపాకటాక్ష వృష్టితో చదునుచేసి-పంటను (నీ అనుగ్రహమే) పండించుటకు సిధ్ధము చేసిన కర్షకుడా దానిలో భక్తి-విశ్వాసము అను విత్తులను వేసి నన్ను అనుగ్రహింపుము.నా అజ్ఞానము కొంచము కొంచము నన్ను వీడుచున్నది.నీ అనుగ్రహము నా దారిని చూపించుచున్నది శుభసూచకముగా.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-97
ఓం నమః శివాయ-97
***************
కంటినీటి పూసలు నీకు కలిమిని అందీయగలవా
సిగపూవగు గంగమ్మ సిరులను అందీయగలదా
కట్టుకున్న గజచర్మము పట్టుపుట్టమీయగలదా
నమ్ముకున్న ఎద్దు నీకు సొమ్ములనందీయగలదా
కరమున నున్న శూలము వరములనందీయగలదా
పట్టుకిఉన్న పాములు నీకు పసిడిని అందీయగలవా
కరుగుచున్న నగము తరగని సంపదనీయగలదా
కదలలేని చంద్రుడు ఇంద్రపదవినీయగలదా
కాల్చున్న కన్ను నీకు కాసులనందీయగలదా
ఆదిశక్తి అండనున్న ఆదిభిక్షువైన నిన్ను నమ్మి
" ఒం దారిద్ర దుఃఖ దహనాయ నమః శివాయ" అంటుంటే
ఫక్కుమని నవ్వారురా ఓ తిక్క శంకరా.
శివుడు ధరించిన రుద్రాక్షలు-గంగమ్మ-ఎద్దు-శూలము-మంచుకొండ-చంద్రుడు-అగ్గి కన్ను సంపదలనిచ్చు శక్తిలేనప్పటికిని,భక్తులు అమాయకంగా దరిద్రమనే దుఃమును కాల్చివేసి,ఐశ్వర్య ప్రదుడు శివుడని నమ్మి, కీర్తిస్తుంటేనవ్వుకుంటూ వింటుంటాడేకాని,అది అబధ్ధమని చెప్పడు-నింద.
ధనికుడు-నమః శివాయ-దరిద్రుడు నమః శివాయ
భావము నమః శివాయ-భాగ్యము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
దారిద్ర దుఖః హరణ స్తోత్రము-వశిష్ట మహర్షి విరచితము.
***********************************************
1.నరకము దాటిస్తాడు-సకలము పాలిస్తాడు
శృతులను వినిపిస్తాడు-సుధలను కురిపిస్తాడు
సర్పాలను ధరిస్తాడు- కర్పూరపు కాంతివాడు
దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు.
2.. పాము కంకణముల వాడు-పార్వతి మెచ్చినవాడు
యమునికి యముడైనవాడు-తోయమును ధరించాడు
కరిచర్మము ఒలిచాడు-కళాధరుని మెచ్చినోడు
దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు.
3. జలధిని దాటిస్తాడు-జన్మలు తీసేస్తాడు
భక్తుల దగ్గరి వాడు-భ్రష్టుల శిక్షిస్తాడు
వెలుగు గుప్పిస్తాడు-స్మరణతో నర్తిస్తాడు
దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు
4. మూడు కన్నులవాడు-మువ్వల పాదముల వాడు
బూడిద పూతల రేడు-భువనైక మనోహరుడు
చర్మము ధరియించుతాడు-కర్మలు తొలగించుతాడు
దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు.
5. ముల్లోకములు వాడు-మూలస్థానము వాడు
పసిడి వస్త్రములవాడు-ప్రసాద గుణమే వాడు
చీకటి కూల్చేస్తాడు-చీకును తుంచేస్తాడు
దరిద్రమును దహిస్తాడు-దయార్ద్రహృదతుడు శివుడు.
6. బ్రహ్మ కొలుచు వాడు-బ్రహ్మాండములు వాడు
కాలసాక్షి ప్రియుడు-కాల కాలాంతకుడు
చూడచక్కని రేడు-మూడు కన్నుల వాడు
దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు
7.శ్రీ రామునికి సఖుడు-కైలాస నిలయుడు
సేవగణ సేవితుడు-కైవల్య వరదుడు
పాములు మెచ్చినవాడు-పావన చరితుడు
దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు.
8. సామి శివగణములకు-సామగాన ప్రియుడు
నామ స్మరణ ప్రియుడు-నంది వాహనుడు
కర్మఫలమిస్తాడు-చర్మ వస్త్ర ధరుడు
దరిద్రమును దహిస్తాడు-దయార్ద్ర హృదయుడు శివుడు.
ఏకబిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-96
ఓం నమః శివాయ-96
********************
ఎత్తైన కొండలలో భోగనందీశ్వరుడనని అంటావు
చేరలేనంత ఎత్తులో చార్ధాంలో ఉంటావు
లోయలలో హాయిగా త్రిసిల్లిరి మహాదేవుడనని అంటావు
దూరలేనంత గుహలలో అమరనాథుడివై ఉంటావు
కీకారణ్యములలో అమృతేశ్వరుడనని అంటావు
ఏదారులలో వేడుకగా అమృతేశ్వరుడనని అంటావు
కనుమల దగ్గర కామరూపకామాఖ్యుడనని అంటావు
జలపాతాల లోతులలో బాణేశ్వరుడనని అంటావు
భూగర్భమున దాగి హంపి విరూపాక్షుడినని అంటావు
ఈదలేనంత గంగఒడ్డున ఈశ్వరుడినంటావు
నామదిని వదిలేసావు దయలేక తెలియదుగా
నీకు ఎక్కడ ఉండాలో ఓ తిక్క శంకరా.
శివుడు ఎత్తైన కొండలలో-లోతైన లోయలలో-ఎడారులలో-కీకారణ్యములలో-ఎక్కడెక్కడో ఉంటాడు కాని నిత్యము నిర్మలభక్తితో కొలిచే భక్తుని మదిలో ఉండాలని తెలియనివాడు.-నింద.
ఎత్తు నమఃశివాయ-లోతు నమః శివాయ
అడవి నమః శివాయ -ఎడారి నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" గుహాయాం గేహేవా బహిరపి వనేవాద్రి శిఖరే
జలేవా వహ్నౌవా వసతు వసతేః కిం వద ఫలం
సదా యస్త్యైవాంతహ్కరణమపి శంభో తవపదే
స్థితంచేద్యోగోసౌసచ పరమయోగీ సచ సుఖీ"
శివానందలహరి.
పరమశివా నీ నిజతత్త్వమును తెలిసికొనలేని నా మనసును గుహలోకాని-ఇంటిలోకాని-వెలుపల కాని-పర్వతశిఖరముపై కాని నీటిలో కాని,నిప్పుపై కాని నిలిపిన ఏమి లాభము? పరమదయాళు!దానిని ఎల్లప్పుడు నీ పాదపద్మములయందు స్థిరముగా నిలిచియుండు యోగమును అనుగ్రహింపుము.స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-95
ఓం నమః శివాయ-95
***************
రూపివా/అరూపివా/అపురూపివా? శివా నీవు
కన్నతండ్రిని చూడ నే కాశిపోవ కానరాడు
దేవతల మోహమడచ మొదలు-చివర కానరాడు
చిదంబరము పోయిచూడ చిన్నగను కానరాడు
అటుచూడని-ఇటుచూడని ఆటలెన్నో ఆడతాడు
నింగిలోకి సాగుతాడు-నేలలో దాగుతాడు
అగ్గినంటి ఉంటాడు-గాలినేనే అంటాడు
జ్యోతిని నేనంటాడు-ప్రీతిని నీకంటాడు
ఈ వలసలు ఎందుకంటే చిద్విలాసమంటాడు
దాగుడుమూతలు ఆడుతు పట్టుకోమంటాడు
సుందరేశ్వరడునంటాడు ముందున్నానంటాడు
ఒక్కరూపునుండవేమిరా ఓ తిక్కశంకరా.
శివుడు తనమాటలతో మనలను తికమకపెట్టటానికి చూస్తుంటాడు.అరుణాచలములోని అగ్గి,కంచిలోని మట్టి,చిదంబరములోని గగనం,జంబుకేశ్వరములోని నీరు,శ్రీకాళహస్తిలోని గాలి నేనే నంటుంటే,మిగత ప్రదేశాలలో వేరే రూపాలలో శివుడులేడా అనే సందేహము మనకు రాదా? అసలే మనము చాలా తెలివైనవారముకదా.శివుని తెలివితక్కువ మాటలను నమ్మలేము కదా.అందుకని అదే విషయమును అడిగితే మాటమారుస్తూ మీరు కాశికి వచ్చి చూడండి.అక్కడి వెలుగు అంతా నేనే అంటూ ప్రగల్భాలు పలుకుతాడు.చాల్లే నీ బడాయి మాటలు అని అనుకునే లోపలే ఇదిగో మీకు నాపేరు చెబుతున్నాను అంటు మథురలో నున్న సుందరేశుని పేరును మహగొప్పగా చెబుతాడు.చాల్లే సంబడం అంటే ఏమాత్రము వినకుందా అన్ని జ్యోతిర్లింగాలలో నున్నది తానేనని ,మనతో సరదాగా ఆగుడుమూతలాట ఆడుతున్నానంటూ మాటలతో మరింత గారడి చేస్తూ,మనలను బురిడీ కొట్టిస్తాడు.అమ్మో ఎంత జాణతనము కాకపోతే తన చేతకాని తనాన్ని మన చేవలేని తనముగా చూపాలనుకుంటాడు.-నింద.
కాలడి నమః శివాయ-గారడి నమః శివాయ
బడాయి నమః శివాయ-బురిడీ నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః
సద్దుమణిగిన సత్వగుణము నిద్దురలేచిందేమో అన్నట్లుగా నా మనసులోని రజోతమోభావములు చేసేదిలేక దూరముగా జరుగుతు నక్కినక్కి చూస్తున్నాయి.నీ సంగతి తెలిసినదిలే .నేను నీతత్త్వము కొంచం కొంచం అర్థమవుతోంది.కాసేపు ఇద్దర్ము ఆడుకుందాము నా మాటలను అవునన్నా-కాదన్నా అది నాకు శిరోధార్యమే శివా.
శ్రీ తనికెళ్ళ భరణి గారికి నమస్కారములతో,
ఎంత మోసగాడివయ్యా శివా-నువ్వెంత వేషగాడివయ్యా శివా
పైన మూడు నామాలంటా శివా నీకు
లోన వేయి నామాలంటా శివా
బయటకేమో తోలుబట్టలంటా శివా నీకు
లోపల పీతాంబరాలంటా శివా
బయటకేమో లింగరూపమంటా శివా నీకు
లోపల శ్రీరంగమంటా శివా
కడతీర్చేవాదవీవె శివా మమ్ము
కాపాడేవాడవు నీవే శివా
ఎంత పిచ్చివాదవయ్యా శివా
ఎంత పిచ్చి వాడివయ్యా శివా
నీవెంతా మంచివాడవయ్యా శివా
నీవెంత మంచివాడివయ్యా శివా
ఎంతెంత ఎంతెంత మంచివాడివయ్యా శివా-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-94
ఓం నమః శివాయ-94
**************
గణపతిని శిక్షించగ గజముతలను పెట్టావు
దక్షుని రక్షింపగ మేకతలను పెట్టావు
నరసింహుని శాంతింపగ పక్షితలతో వెళతావు
కుక్కుటేశ్వరుడనంటు కోడితలతో ఉంటావు
నారదుని కనువుప్పు కోరి కోతి తలను పెట్టావు
తుంబురునికి సంబరముగ గుర్రపు తల పెట్టావు
శుభకరుడితదనుచు శుకము తలను పెట్టావు
పతంజలి అంటు మనిషికి పాముతలను పెట్టావు
తలరాతల మార్పులంటు తలలనే మారుస్తుంటావు
వెతలను తీరుస్తానంటు కతలనే రాస్తావు
నా కతవినిపించానంటే నా తల మారుస్తావేమో
తలమానికము నేనంటు తలల మార్పుచేర్పులతో
తలకొక మాదిరిగ తరియింపచేయువాడిననే నీవి,
దిక్కుమాలిన పనులురా! ఓ తిక్కశంకరా.
శివుడు సుందరేశ్వరుడనని చెప్పుకుంటూ సుందరముగా ఉన్నవానిని,వారిని క్రీడలుగా ముఖములను మారుస్తూ,బహుముఖములుగా మనలను రక్షిస్తున్నానంటున్నాడు.గణపతికి ఏనుగుతల.దక్షునికి మేకతల,నారదునికి కోతి తల,తుంబురునకు గుఱ్ఱము తల, శుక మహర్షికి చిలుకతల, పతంజలి అను పామునకు మనిషి తల పెట్టతమే కాకుండా నన్ను చూడండి నేనుకూడా కోడితలతో,పాము తలతో,పులితలతో ఎంత బాగున్నానో అని చెబుతూ,తన దిక్కుమాలిన పనులనే చక్కదిద్దు పనులను భ్రమలో ఉంటాడు శివుడు.
తల,-నింద.
కతలు నమః శివాయ-వెతలు నమః శివాయ
శరభుడు నమః శివాయ-శర్వుడు నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" భ్రంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీ స్ఫురన్ మాధవా
హ్లాదో నాదయుతో మహాసి తవపుః పంచేణా చాదృతః
సత్పక్షో సుమనో వనేషు న పునః సాక్షాన్మదీయే మనో
రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైల వాసి విభుః."
శివానందలహరి.
భృంగి ఇష్టపడునట్లుగా నాట్యము చేయువాడును,గజాసురుని మదమణచిన వాడును,ఢక్కా నాదమును చేయువాడును,శుధ్ధస్పటిక తెల్లదనమును కలవాడును,నారాయణునకు ప్రియమైన వాడును,సజ్జనులను కాపాడుటలో మంచిమనసున్న శ్రీశైల భ్రమరాంబిక పతి శరణు-శరణు.స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-92
ఓం నమః శివాయ-93
***************
నీ చిన్మయముద్రను నేను అనురక్తితోచూస్తుంటే
నీ తలపని గంగమ్మ నన్ను తుంగతొక్కుతానంటున్నది
నీ జటాజూటము నన్ను దక్షుడు అనుకుంటున్నది
నీ శిరమున శశి గ్రహణము నాకేనని అంటున్నది
నీ కంఠములోని విషము నన్ను కబళించాలనుకుంటున్నది
నీ చేతి డమరుకము నా వివరము అడుగుతున్నది
నీ నడుము పులితోలు కలవరమేఅంటున్నది
నీ వాహనమైన ఎద్దు నన్ను గద్దిస్తోంది
నీ మంజీరమైన పాము నాపై బుసలు కొట్టుతున్నది
వేడుకొనుట దేవుడెరుగు నిన్ను చూడనీయకున్నవి
నీ వైనము ఏమిటి? నావైపు చూడవు భయముతో
ఉక్కిరిబిక్కిరి అవుతున్నానురా ఓ తిక్క శంకరా!
శివ దర్శనమునకై వెళ్ళిన భక్తుని శివుని గంగ-జటాజూటము-చంద్రుడు-విషము-డమరుకము-పులితోలు-మంజీరము ఎద్దు ఎద్దేవా చేస్తూస్వామి దగ్గరకు వెళ్ళనీయకున్నవి.శివుడు వాటిని మందలించలేని అసమర్థతతో,కళ్ళుమూసుకొని ధ్యానముద్రలో నున్నట్లు నటిస్తున్నాడు.
వైనము నమః శివాయ-ధ్యానము నమః శివాయ
భయము నమః శివాయ-అభయము నమః శివాయ
నమఃశివాయ నమః శివాయ ఓం నమః శివాయ
సత్వగుణమును సద్దుమణిగించి తమో-రజోగుణములను తాళ్ళతో బంధింపబడిన నేను,నీవు వేరు-నేను వేరు అను తామసభావన,బింబ-ప్రతిబింబ వైనమే నిన్ను ఆశ్రయించి ఆనందించుచున్న అమృతమూర్తులను అన్యముగా భావించునట్లు(భ్రమించునట్లు)నా మసకబారిన మనోఫలకముపై ముద్రించుచున్నది.మహాదేవ నా తప్పును మన్నించి నీ సేవాభాగ్యమును అనుగ్రహించు తండ్రీ.
" జటాభిర్లంబమానాభిరృత్యంత మభయప్రదం
దేవం శిచుస్మితం ధ్యాయేత్ వ్యాఘ్రచర్మ పరిష్కృతం"
వ్రేలాడుచున్న జటలతో కూడినవాడై,నృత్యము చేయుచున్న వాడును,అభయమునిచ్చువాడును,స్వచ్చమైన చిరునగవు కలవాడును,వ్యాఘ్రచర్మముచే అలంకరింపబడినవాడును అగు సదాశివుని ధ్యానించెదను.-స్తుతి.
ఏకబిల్వం శివార్పణం
SIVA SANKALPAMU-91
ఓం నమః శివాయ-91
*********************
పాట పాడుచు నిన్ను చేర పాటుపడుతు ఒక భక్తుడు
నాటకమాడుచు నిన్నుచేర పోటీపడుతు ఒకభక్తుడు
నాట్యమాడుచు నిన్నుచేర ఆరాటపదే ఒక భక్తుడు
కవితవ్రాయుచు నిన్నుచేర కావ్యమైన ఒక భక్తుడు
తపమాచరించి నిన్నుచేర తపియించుచు ఒక భక్తుడు
ప్రవచనముల నిన్నుచేర పరగుతీయు ఒక భక్తుడు
చిత్రలేఖనములతో నిన్నుచేర చిత్రముగా ఒక భక్తుడు
నిందిస్తూనే నిన్నుచేర చిందులేయు ఒక భక్తుడు
నిలదీస్తూనే నిన్నుచేర కొలిచేటి ఒకభక్తుడు
అర్చనలతో నిన్నుచేర ముచ్చటనుచు ఒకభక్తుడు
ఏదారిలో నిన్నుచేరాలో ఎంచుకోలేని ఈ భక్తుడు
నువ్వు నక్కతోక తొక్కావురా ఓ తిక్కశంకరా.
శివుడు అనిశ్చిత
మనస్కుడు.ఒక క్రమపధ్ధతిని తన విషయములోను అనుసరించలేడు.అంతే కాదు భక్తులను తాను త్వరగా అనుగ్రహించుటకు ఒకేఒక చక్కని మార్గమును చెప్పలేడు.చేసేదిలేక పాపము వారు పాటో,ఆటో,కవితో,నాటకమో,ప్రవచనమో,చిత్రలేఖనమో తమకు తోచినది ఏఓ ఒక మార్గమును ఎంచుకొని,ప్రయత్నిస్తూ,ఫలితమునకు ఎదురుచూస్తుంటారు.కాని విచిత్రమేమంటే నక్క తోకను తొక్కిన ప్రదేశమును శాంతికై తవ్విస్తుంటే లంకెబిందెలు దొరికినట్లు అయోమయము దేవునకు అనేకానేక భక్తులు-నింద.
ఏకము నమః శివాయ-అనేకము నమః శివాయ
గమనము నమః శివాయ-గమ్యము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
సకలదేవతా శివస్తుతి
****************
1. దేవదేవ త్రినేత్రాయ అందుకో వందనములు
జటామకుట కపర్ది అందుకో వందనములు.
2.భూత భేతాళ నాథాయ అందుకో వందనములు
రక్త పింగళ నేత్రాయ అందుకో వందనములు.
3.భైరవ ఊర్థ్వకేశాయ అందుకో వందనములు
అగ్ని నేత్ర చంద్రమౌళి అందుకో వందనములు.
4.బ్రహ్మ కపాల మాలాయ అందుకో వందనములు
బ్రహ్మాండ కాలాతీతాయ అందుకో వందనములు.
5.కరిగర్భ నివాసాయ అందుకో వందనములు
కరి మస్తక పూజ్యాయ అందుకో వందనములు.
6.ప్రచండదందహస్తాయ అందుకో వందనములు
ప్రపంచ పూర్ణ వ్యాప్తాయ అందుకో వందనములు.
7.నీలకంఠ త్రిసూలాయ అందుకో వందనములు
లీలా మానుష దేహాయ అందుకో వందనములు
8.అష్టమూర్తి యజ్ఞమూర్తి అందుకో వందనములు
దక్షయజ్ఞ వినాశాయ అందుకో వందనములు.
9.వేద వేదాంగ వక్త్రాయ అందుకో వందనములు
వేద వేదాంత వేద్యాయ అందుకో వందనములు
10.సకలసన్మంగళ విగ్రహాయ అందుకో వందనములు
సకల దేవతాస్తుతాయ అందుకో వందనములు.
ఇది మహా పురాణాంతర్గత సకల దేవతా స్తుతి సకలాభీష్ట ప్రదం. సర్వమంగళ కరం. సదా శివ కృపాకటాక్ష కరం.
( ఏక బిల్వం శివార్పణం.)
ఓం తత్ సత్.
SIVA SAMKALPAMU-90
ఓం నమః శివాయ-90
*****************
అసత్యమాడు బ్రహ్మపుర్రె అంతగా నచ్చిందా
ఆభరనముగా చేసి అలంకరించుకున్నావు
హింసకు గురిచూసే బోయకన్ను నచ్చిందా
రక్తాశ్రువులను కార్చ అనురక్తిని చూపావు
అమ్మ దగ్గర ఉండనన్న అర్భకుని వాక్కు నచ్చిందా
అమృతధారగ మారి ఆర్ద్రతనందించావు
స్వార్థమే నింపుకున్న కరి ఉదరము నచ్చిందా
ఉదారతను చూపిస్తు ఒదిగిఒదిగి పోయావు
పృష్టభాగమున పూజలందు ఆవుచెవి నచ్చిందా
లంకకు నేరానంటు గోకర్ణమున నిలిచావు
పెంపును అందించుతావో పంపు అని చంపుతావో
పెక్కుమాటలేలరా ఓ తిక్క శంకరా.
ఓకే గూటి పక్షులు ఒద్దికగా ఉంతాయన్న సామెతను పెద్దలు చెప్పారు కద!ఒకే స్వభావము కలవారు ఒకరినొకరు విడువలేనంత సఖ్యముగా ఉండుతలో వింత ఏమీలేదు కదా.
శివుడా అవలక్షణ సంపన్నుడు.మరి శివుడు ఇష్టపడే వస్తువులు-మనుషులు అవలక్షణాలతో ఉండకపోతే ఎలా?శివుడు లోపభూయిష్ఠములను పాపరహితములుగా మారుస్తున్నానన్న భ్రమలో మునిగి,అబధ్ధాల బ్రహ్మపుర్రెను దండగుచ్చుకొని అలంకరించుకుంటాడు.అబధ్ధము చెప్పిన తన తోకను అటు-ఇటు తిప్పిందని (దురదవేసి విసురుకున్నదేమో)సత్యము పలికిందన్న
"గొప్పసాక్షి" అను బిరుదును దానికిచ్చి,పధ్ధతిగా రావణునితో లంకకు పోకుండా,దానిచెవి వంటి ఆకారముగల ప్రదేశములో(గోకర్ణము) తాను నిలిచి పోయాడు.అబధ్ధాలు ఇషమైనవి.సరే.దానికి మించిన స్వార్థము కలవారికి కూడ పరమార్థము తెలుసంటు పోయి వారి ఉదరనివాసము చేయుటయే కాక,చర్మమును కూడా తాను వస్త్రముగా ధరించే స్థితికి వచ్చాడు.అయ్యో-అయ్యయ్యో.మాతృదేవోభవ అని కృతజ్ఞతగా తల్లిని దగ్గరుండి చూసుకోవలసిన ఒక్కడే అయిన కొడుకు,టక్కరితనముతో తన కాలిని మొసలి పట్టుకున్నదని,అది విడువాలంటే తల్లి సన్యాసమును స్వీకరించుటకు అనుమతించాలని మాయమాటలతో పారిపోయిన వాడికి ధారణశక్తినొసగి దయచూపించాడు.అన్నిటికన్నా విడ్డూరము.రాయి కంటె కఠినమైన మనస్సుతో,కౄరత్వము కన్నునిండా నింపుకుని హింసకు గురిచూసే తిన్నని కన్ను నచ్చిందంటు అమాయకముగా తన కన్ను నుండి రక్తమును కార్చుకున్నాడు.ఎంతన్న లయకారుడిని అంటూ అందరిని అంతమొందించే అవలక్షణమున్నవాడుకదా.తప్పులుచేసే వాటికి మెప్పులు అందిస్తూ,తాను గొప్పవాడిననే భ్రమలో ఉంటాడు శివుడు.
సులక్షణము నమః శివాయ-అవలక్షణము నమః శివాయ
తప్పులు నమః శివాయ-తత్త్వము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
వన్నే యేనుఁగుతోలు దుప్పటము బువ్వా కాలకూతంబు చే
గిన్నే బ్రహ్మకపాల ముగ్రమగు భోగే కంఠహారంబు మే
ల్నిన్నీలాగున నుంటయున్ దెలిసియు న్నీపాదపద్మంబు చే
ర్చె నారాయణుఁడెట్లు మానసముఁ దా శ్రీకాళహస్తీశ్వరా!
ప్రభో, శ్రీకాళహస్తీశ్వరా! నీవు కట్టునది ఏనుగుచర్మము, ఆహారమా కాలకూటవిషము, చేతిలో బ్రహ్మదేవుని కపాలము, మెడలో భీకరమైన సర్పము. ఇంత ఉగ్రమైన ఆకారము కలిగిన నిన్ను చూసి కూడా ఆ శ్రీమన్నారాయణుడు సదా తన మనస్సును నీ ధ్యానమందు ఏ విధముగా నిలిపినాడో కదా ప్రభో? అటువంటి నిష్కళంక మనసును అనుగ్రహించి,నన్ను ఉధ్ధరింపుము శివా.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
Sunday, September 13, 2020
SIVA SANKALPAMU-89
ఓం నమ: శివాయ-89
******************
" అనిశము వశమగుతావు" పశునామములకు నీవు
"పశుపతి" అని పిలువగానే పరవశమేగా నీకు
"కాల భైరవుని" కాశికాపురపతిని చేసావు
"శరభమువై" నరసిమ్హుని శాంతింప చేసావు
మిక్కుటమగు ప్రేమగల "కుక్కుటేశ్వరుడివి" నీవు
వ్యాళము మీద మోజుగల "కాళేశ్వరుడివి" నీవు
"స్కంధోత్పత్తికి" వనమున లేడిగ క్రీడించావు
వ్యాఘ్రమునకు మోక్షమిచ్చి "వ్యాఘ్రేశ్వరుడివి" అయ్యావు
జంబుకమును అనుగ్రహించిన " జంబుకేశ్వరుడివి"
శ్రీ,హస్తి,కాళములను దయ తలచిన "శ్రీ కాళ హస్తీశ్వరుడవు"
" పాశమేసి" నన్ను బ్రోవ రమ్మంటే,నా భక్తిని
"కప్పల తక్కెడ" అంటావురా ఓ తిక్క శంకరా.
శివునికి పశువులన్నా-పశునామములన్న పక్షపాత బుధ్ధిని ప్రదర్శిస్తుంటాడు.వాటిని అనుగ్రహించడమే కాకుండా వాటిపేర్లను తన పేర్లగా ప్రకటించుకొని మురిసిపోతుంటాడు.శరభము (సగము పక్షి+సగము సింహము),కుక్కుటము (కోడి),కాళము/వ్యాళము,(పాము),వ్యాఘ్రము (పెద్దపులి),జంబుకము (నక్క),కుక్క వాహనమెక్కిన కాలభైరవునిగా గొప్పలు పోతుంటాడు.నన్ను నీ కరుణ అను పాశముతో బంధించి,కాపాడమంటే,నా భక్తి సరిపోలేదని చెప్పవచ్చునుకదా! అహ అలాకాకుండా కప్పలు అను మరొక ఉభయచరమును తలచుకొనుచు,నేను దాని వలె నిలకడగా త్రాసులో లేనని నిష్ఠూరములాడుతున్నాడు-నింద.
పశువు నమః శివాయ-పాశము నమః శివాయ
కప్ప నమః శివాయ-తక్కెడ నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
పశుపతి అష్టకము
**************
స్తుతించు పశుపతి శశిపతి సతిపతిని
స్మరించు నాగపతి లోకపతి జగపతిని
జనార్తిహరుని చరణములు శరణమని
భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.
నిత్యముకారు రారు తలితండ్రులు బాంధవులు
సత్యముకావు చూడు తరలు సిరిసంపదలు
మృత్యు కబళించువీని కాలవసములని
భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.
చిన్న మురజను పెద్ద డిండిమను శివుడు
మథుర పంచమ నాదములు పలుకుచున్నాడు
ప్రమథగణ సేవితుడు పరమేశ్వరుదని
భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని,
శరణుఘోషల ఆవిరి గ్రహియించు సూరీడు
కరుణధారలు వర్షించుకాలమేఘమాతడు
శివుడు లేనిదిలేదు ఇలను లేనే లేదని
భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.
చితాభస్మాలంకృత సిత చిత్ప్రకాశమువాడు
మణికుండలముల భుజగ హారముల రేడు
నగజనాథుని దయ నరశిరో రచితుని
భజింపుము భక్తితో మనుజగిరిజపతిని.
యజ్ఞకర్త యజ్ఞభోక్త యజ్ఞస్వరూపము తాను
యజ్ఞఫలితములనిచ్చు సద్గురు శంకరుడు
దుష్టత్వమణచిన దక్షయజ్ఞ విధ్వంసకుని
భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.
జాలిలేని జరామరణములకు జడియక
సారహీనపు సంసార భయమును తోసివేయుచు
సాగుచునున్న చరాచర హృదయ సంస్థితుని
భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.
హరి విరించి సురాధిపులు కొలువుతీరగ
యమ కుబేర దిక్పతులు నమస్కరించుచుండ
భవరోగ భంజనుని భువనత్రయాధీశుని
భజింపుము భక్తితో మనుజ గిరిజ పతిని.
కవి సూరి ఒక మహారాజు శివ భక్తుడు అన్నవివరములే లభ్యమైనవి.
పరమపవిత్రమైన ఈ స్తోత్ర పఠనము శ్రవణము స్మరణము సకలముక్తిప్రదము.
సర్వేజనా సుఖినో భవంతు.సమస్త సమ్మంగళాని భవతు.
సర్వేశ్వర కృపా కటాక్ష ప్రాప్తి తథ్యం.
( ఏక బిల్వం శివార్పణం.)
SIVA SANKALPAMU-88
ఓం నమః శివాయ-88
****************
గలగలపారే గంగను జటలో చుట్టేసినావు
భగభగ మండే అగ్గిని నుదుటను కట్టేసినావు
శశకమనే చంద్రుని సిగను సింగారించునావు
విర్రవీగు విషమును కంఠమునబంధించినావు
చరచర పాకు పాములను చతురత పట్టేసినావు
కూరిమితెలియని పులినిఒలిచిపెట్టేసినావు
రిపులగు త్రిపురాసురులను మట్టుపెట్టేసినావు
పరమనీచులైన వారి పాపములను పాపినావు
తిర్యక్కులను గాచితిమిరము నెట్టేసినావు
నీ చుట్టు తిరుగుచున్న నా పాపములను చుట్టేసి
శ్రీరస్తు అని కావగ శ్రీకారము చుట్టమంటే
పక్క చూపులెందుకురా ఓ తిక్క శంకరా.
గంగానదికి పూజ్యతను కలిగించాడు.అగ్గిని ఆరాధ్యనీయము చేసాడు.శాపగ్రస్థుడైన చంద్రుని శిరమున ధరించాడు.హాలాహలమును తనలో దాచుకొని అర్చనలను పొందునట్లుచేసాడు.పరమనీచముగా ప్రవర్తించిన రాక్షసులను పవిత్రులను చేసాడు.క్రిమికీటకములకు సైతము పాపపుణ్యములను లెక్కించక ఆదరించిన శివుడు,నాపై తన కృపాకటాక్షమును ప్రసరించుటకు నిర్లక్ష్యము చేస్తున్నాడు-నింద.
లక్ష్యం నమః శివాయ-నిర్లక్ష్యం నమః శివాయ
ద్వంద్వం నమః శివాయ-నిర్ద్వంద్వం నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" ఉపేక్షానో చేత్కిం నహరసి భవధ్ధ్యాన విముఖాం
దురాశా భూయిష్ఠాం విధిలిపిమ శక్తో యదిభవాన్
శిరస్తద్వైధాత్రం న న ఖలు సువృత్తం పశుపతే
కథంవా నిర్యత్నం కరనఖ ముఖేనైవ లులితం"
శివానందలహరి.
శివా! నీవు కాలభైరవుని సృష్టించి వాని కొనగోటితో బ్రహ్మ అహంకారపు తలను గిల్లించినాడవు.కాని నిన్ను ధ్యానించుటకు వెనుకాడుచున్నది,నీ అనుగ్రహమును నిరంతరము శంకించుచున్నది,దురాశతో నిండినది అయిన మనసుగల నా తలరాతను మార్చుట కానిపనికాదు. ఆలస్యము చేయక,నన్ను అనుగ్రహించుతండ్రీ -స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-87
Om nama@h Sivaaya-87
**********************
పాల కడలి జనించిన గరళము నిను చేరితే
మురిపాల పడతి లక్ష్మి హరిని శ్రీహరిని చేసింది
శరభ రూపమున నీవు శ్రీహరిని శాంతింప చేస్తే
విభవమంత హరిదేగా ప్రహ్లాద చరిత్రలో
చిలుకు ఏకాదశినాడు చక చక నిద్ర లేచేసి
దామోదరుడు నిన్ను చేరినది మోదము కొరకేగా
అభిషేక జలాలతో నీవు ఆనందపడుతుంటే
అలంకారాలన్ని హరి తన ఆకారాలంటాడు
అనుక్షణము నీవు అసురత చండాడుతుంటే
లక్షణముగ హరి తులసిని పెండ్లాడాడు
అలసటయే నాదని ఆనందము హరిది అని
ఒక్క మాట చెప్పవేరా ఓ తిక్క శంకరా!.
శివుడు తన పనులు తాను చేసుకుపొతాడు తప్ప ఆ పనులు తనకు ఉపయోగకరమా/కాదా అని ఆలోచించడు.అంతే కాదు తన చేత పనులను చేయిస్తూ,వాటి ఫలితములను అనాయాసముగా ఇతరులు (హరి) పొందుతున్నాడన్న విషయమును కూడ గుర్తించలేడు.కనుకనే క్షీరసాగర మథనములో హరునకు విషము-హరికి సిరి లభించాయి.తన నరసింహావతారమును ఉపసంహరించుకోలేని హరి,శరభరూపుడై(లక్ష్మి)యై తనను శాంతింపచేసినాడన్న విషయమును మరుగుపరచి,తన ప్రహ్లాద రక్షణమును ప్రకటితము చేసుకోగలిగాడు.అభిషేకజలాలతో ఆనందములో మునిగితేలుతూ,తనకు అలంకరించవలసిన పట్టుపీతాంబరములు,వనమాలలు,పరిమళద్రవ్యము హరి ముస్తాబుచేసుకుంటున్నాడన్న సంగతి కూద గమనించలేని అమాయకుడు శివుడు-నింద.
అభిషేకము నమః శివాయ-అలంకారము నమః శివాయ
అలసట నమః శివాయ-ఆనందము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
యమధర్మరాజకృత శివకేశవ స్తుతి
********************************
1.గోవింద మాధవ ముకుంద మురారి
శూలపాణి శశిశేఖర శంభో శంకర
అచ్యుత జనార్దన దామోదర వాసుదేవ
స్మరణము యమభటులనుంచు దూరము.
2. అంధకాసురవైరి నీలకంఠ గంగాధర
కైటభాసురవైరి వైకుంఠ పద్మపాణే
భూతేశ ఖండపరశు మృదేశ చండికేశ
స్మరణము యమభటులనుంచు దూరము.
3. నారసింహ మధుసూదన చక్రపాణి పరాత్పర
గౌరీపతి మహేశ్వర చంద్రచూడ శంకర
నారాయణ అసురాంతక మాధవ శార్ఙధర
స్మరణము యమభటులనుంచు దూరము.
4. ఉగ్రా! విషమేక్షణ కామవైరి మృత్యుంజయ
శౌరి! పీతవసన శ్రీకాంతుడ నీలమేఘ
ఈశాన! కృత్తివసన త్రిపురారి లోకనాథ
స్మరణము యమభటులనుంచు దూరము.
5. శ్రీకంఠ దిగంబర గౌరీపతి పినాకపాణి
శ్రీహరి మధువైరి శ్రీపతి పురుషోత్తమ
శ్రీమంత నాగభరణ పశుపతి చంద్రమౌళి
స్మరణము యమభటులనుంచు దూరము.
6.సర్వేశ్వర దేవదేవ త్రిపురాంతక శూలపాణి
గరుడధ్వజ పరబ్రహ్మ నరకాంతక చక్రపాణి
వృషభధ్వజ తుండమాలి నిటలాక్ష చంద్రమౌళి
స్మరణము యమభటులనుంచు దూరము.
7.రమాపతి రావణారి రాఘవ శ్రీరామ
భూతపతి మదనారి శంకర ప్రమథనాథ
ఇంద్రియపతి చాణూరారి మురారి జగన్నాథ
స్మరణము యమభటులనుంచు దూరము.
8. శూలి బాలేందుమౌళి హరా గిరీశ
చక్రి కంసప్రాణాపహారి హరి రాధేశ
భర్గ త్రిపురాసురవైరి హరా మహేశ
స్మరణము యమభటులనుంచు దూరము
9.గోపీపతే యదుపతే మాధవ వాసుదేవ
గౌరీపతే వృషభధ్వజ పాహి మహాదేవ
కర్పూరభాస గోవర్థనధర దేహి దేవదేవ
స్మరణము యమభటులనుంచు దూరము
10. స్థాణువు త్రినేత్రుడు పినాకపాణి
కృష్ణా కమలాకర శిఖిపింఛమౌళి
విశ్వేశ్వర త్రిపధధర చంద్రమౌళి
స్మరణము యమభటులనుంచు దూరము.
కాశీఖండములో యమునిచే చెప్పబడిన శివకేశవ నామములను పఠించినవారి వద్దకు పోవద్దని యముడు తన భటులకు ఆనతిచ్చెనట.ధూర్జటి కవి అన్నట్లు సదాభజన చేయు మహాత్ముల పాదధూళిని నా శిరమున ధరించి, వారిని గౌరవిస్తాను.కనుక భటులు వారివద్దకు పోరాదని యమధర్మరాజు ఆన.శివ కేశవ నామములు స్మరించువారికి జన్మరాహిత్యము తథ్యము.
( ఏక బిల్వం శివార్పణం.)
SIVA SANKALPAMU-86
ఓం నమః శివాయ-86
*****************
నిన్నే సొంతమని సేవిస్తే సుంతైనా కానరావు
ఎంతలేసి మాటలనిన సొంతమని అంటావు
నిన్నుచూడ తపియించగ నిరీక్షణే మిగుల్చుతావు
నువ్వెంతన్నవారి ముందు ప్రత్యక్షము అవుతావు
కరుణించే వేళలలో కఠినముగా ఉంటావు
లెక్కలేదన్న వారిపై మక్కువ చూపుతావు
మనసును కట్టేయమంటే బెట్టు ఎంతో చేస్తావు
కట్టుబాటు లేనివానిని కట్టి పడేస్తుంటావు
ముసలితనము వచ్చినా ముక్కిమూల్గమంటావు
పసికందుల హతమార్చి కసితీర్చుకుంటావు
నీ పనులప్రభావము నీకసలు తెలియదుగా
మక్కువలేదంటున్నారురా ఓ తిక్కశంకరా.
శివుడు నువ్వు లేవని,నిన్ను లెక్కచేయనని,మోసగాడివని,నీ అవసరము నాకు లేదని,నీకు ప్రీతికరమగు విధముగా నేనెందుకు ఉండాలని తర్కము చేసే మంజునాథుడి లాంటి వారిపై మక్కువ చూపిస్తాడు కాని భక్తితో కొలిచే వారికి,అనుగ్రహమునకై పరితపించే వారిపై నిర్లక్ష్యమును చూపుతు,సందర్భోచితము కాని కాని పనులను చేస్తుంటాడునింద.
ప్రత్యక్షము నమః శివాయ-పరోక్షము నమః శివాయ
విరుధ్ధము నమః శివాయ-సన్నధ్ధము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" ఆద్యాయామిత తేజసే శ్రుతివదైః వేద్యాయ సాధ్యాయతే
విద్యానంద మయాత్మనే త్రిజగతః సంరక్షణోద్యోగినే
ధ్యేయాయాఖిల యోగిభిః సురగణైః గేయాయ మాయావినే
సమ్యక్తాండవ సంభ్రమాయ జటనే సేయం నతిశ్శంభవే"
శివానందలహరి.
ఆదిదేవుడు,అమితమైన తేజశ్శాలి,వేదవచనములచే తెలియబడువాడు,విద్యానందమయుడు,ముల్లోకములను సంరక్షించుచు( దానిని సామాన్య మనసులకు తెలియనీయకుండ మాయ అను పొరను కప్పువాడు) గొప్ప తాండవమును చేయుచు,జగములను రమింపచేయు శివునకు నమస్కారములు.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-85
ఓం నమః శివాయ-85
*******************
అమ్మ ప్రేమ పరీక్షింప ఆదిభిక్షువైనావు
ముచ్చట తీర్చగ వేశ్యకు ముసలివాడినంటావు
పంది మీద పందెమేసి ఎరుకగా మారతావు
సింహమును శాంతింపగ శరభములా ఎగురుతావు
దేవతల మదమడచగ యక్షుడుడనని అంటావు
మునిపత్నుల పరీక్షింప మన్మథుడిగ మారతావు
పట్టుకుంటాడంటూ చెట్టు తొర్రలో దూరుతావు
చందనాలు వీడినీవు చండాలుడివవుతావు
గురికుదిరించాలంటు మురికివాడివవుతావు
పాఠము నేర్వాలని పరకాయ ప్రవేశమే చేస్తావు
మార సంహారకా నీకు మారువేషములెందుకంటే
బిక్కమొగము వేస్తావురా ఓ తిక్క శంకరా.
శివుడికి ఒక నిర్దిష్టమైన ఆకారములేదు.నిలకడయైన మనసులేదు.అతి చంచల స్వభావముతో ఒకసారి ముసలివానిగాను మరొకసారి మురికివానిగను,ఒక సారి ఎరుకగాను,మరొకసారి పిరికి గాను,ఒకసారి శరభముగాను,మరొకసారి శవములో దూరినవాడుగాను,ఒకసారి యక్షునిగాను,మరొకసారి లక్షణునిగాను,ఒకసారి పంచమునిగాను,మరొకసారి పంచభూతునిగాను ప్రకటితమగుతు,భక్తుడు మారువేషములెందుకని ప్రశ్నించగానే,సమాధానమునీయలేక సతమతమవుతుంటాడు-నింద.
ప్రఛ్చన్నము నమఃశివాయ-ప్రకటనము నమః శివాయ
వేషము నమః శివాయ-శేషము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
చూపు నిచ్చినది దేవుడైన మరి అంధులనేల సృజించె
పలుకు నిచ్చినది దేవుడైన మరి మూగల నేల సృజించె అన్న చెల్లి సందేహమునకు,
అక్క వేద శాస్త్రములు చదివిన వారె ఎరుగరు సృష్టి రహస్యం
అల్పబుధ్ధితో ప్రాణదాతనే సలుపకు పరిహాసం,అని సమాధానమిస్తుంది.ఇది ఒక సినీగేయము మనకు అందించే అద్భుతమైన నగ్నసత్యం.సర్వజ్ఞుడు పరమాత్మ.సర్వజ్ఞులమని భ్రమలో నున్న వారము మనము.
పంచకృత్య నిర్వహణకై పరమాత్మ నిరాకారుడైనప్పటికిని,అనేక ఆకారములను ప్రకటింపచేస్తూ,నిరంజనుడైనప్పటికిని అనేక (రంగులను) స్వభావములను మనకు భ్రమింపచేస్తు లీలను అవలీలగా అందిస్తున్నాడు.
శివాభ్యాం నతిరియం.
శుభస్వరూపులైన శివపార్వతులకు నమస్కరించుచున్నాను.
పునర్భవాభ్యాం శివాభ్యాం నతిరియం.
జగత్కళ్యాణమునకై మరల మరల ప్రకటింపబడు శివ-పార్వతులకు నమస్కరించుచున్నాను.
అస్తోక త్రిభువన శివాభ్యాం నతిరియం.
సమస్తమును ఆవరించిన మూడులోకములను రక్షించుచున్న శివపార్వతులకు నమస్కరించుచున్నాను.
ఆనంద స్పురత్ అనుభవాభ్యాం శివాభ్యాం నతిరియం.
ఆనంద ప్రకాశమును అందించుచున్న ఆదిదంపతులైన శివపార్వతులకు నమస్కరించుచున్నాను. శివాభ్యాం నతిరియం.శివశివాభ్యాం నతిరియం.
( ఐహికమైనది క్షణికమైనది సంతోషము.అద్భుతమైనది శాశ్వతమైనది ఆనందము.)
అనంతకళ్యాణ గుణభ్యాం నతిరియం.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-84
ఓం నమః శివాయ-84
******************
నీ మహన్యాసము నన్ను అపహాస్యము చేస్తున్నది
నీ అంగ కరన్యాసములు అర్థముగాకున్నవి
నీ రుద్ర నమక-చమకములు నన్ను మొద్దు అంటున్నవి
నీ సహస్రనామములు పలుకగ సహాయము గాకున్నవి
నీ శత ఎనిమిది నమములు నన్ను సతమతము చేస్తున్నవి
నీ దండకములు అసలు అండ కానేకానంటున్నవి
నీ అష్టకములు నావాక్కు స్పష్టము కాదంటున్నవి
నీ షడక్షరీ మంత్రము నన్ను నిర్లక్ష్యము చేస్తున్నది
శివ ప్రబంధములు పెద్ద ప్రతిబంధకమగుచున్నవి
నీ పంచాక్షరి మంత్రము మించిపోలేదు అంటున్నది
గుక్కతిప్పుకోలేని నాకు "శివ" యను చక్కని
ఒక్క మాట చాలనవేర ఓ తిక్క శంకరా!
శివుని భక్టుడు తనకు నమక-చమకములు,అంగన్యాస-కరన్యాసములు,పంచాక్షరి-అష్టకములు,అష్టొత్తర-సహస్రనామములు చదువలేనని,కనుక శివ నామ జపమును మాత్రమే చేస్తానని అంటుంటే శివుడు కిక్కురుమనుటలేదు.భక్తుని తికమక పెడుతున్నాడు.నింద.
నమకం-నమఃశివాయ-చమకం నమః శివాయ
న్యాసం నమః శివాయ-మహన్యాసం నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
నా రుద్రో రుద్రమర్చయేత్" రుద్రుడు కాని వాడు రుద్రుని అర్చించలేడు.
పంచభూత పంచేంద్రియ తత్త్వమే పరమేశ్వరత్వము అని తెలుపునది పంచాక్షరి.అష్టమూర్తి తత్త్వమును తెలుపునది అష్టకము.మన 27 నక్షత్రముల నాలుగు పాదములను గుర్తించుటయే అష్టోత్తర శతనామావళి.సహస్రము అను శబ్దమునకు వేయి అను సామాన్యార్థమును స్వీకరించినప్పటికిని,అనతత్త్వానికి,అసంఖ్యేత్వానికి నిలయమై ఆనందధారలను జాలువారు ఆదిదేవుని అనుగ్రహ ప్రతీక.భక్తుడు బాహ్యముగా ప్రకటితమగుచున్న తన చేతులలో,శరీర భాగములను కదిలించుచున్న చైతన్యమును ఈశ్వర శక్తిగా గుర్తించి,దానిని గౌరవించుట అంగన్యాస-మహన్యాసములు.శరీరమును చైతన్యమును చేయుచున్న శక్తిని గుర్తించి గౌరవించుటయే మహన్యాసము.తనను నడింపించుచున్న శక్తికి నమస్కరించుట (కృతజ్ఞతతో) ఆరాధనకు సిధ్ధమగుట.అంటే ఇప్పటి వరకు ఈ దేహమనే భాండమును శుధ్ధి చేసి,భక్తి సమర్పణమను పాకమును వండుటకు సిధ్ధమగుతున్నాడు సాధకుడు.అర్హతను అధికారమును శివుని అనుగ్రహముతో పొందినాడు.బాహ్యప్రకటనమును గమనించిన తరువాత -బహిర్ముఖము నుండి అంతర్ముఖమగుటయే శివ నామము.రెండు లక్షణమైన అక్షరములు.గడ్డికొనవలె (నీవార శూకము) మన హృదయములో ప్రకాశించు జ్యోతిని దర్శించగలిగినవాడే ధన్యుడు.అదే శుభము-చైతన్యమును గుర్తించుట.తనలోని రుద్రుని గుర్తించి,తాను రుదునిగా మారుట.అంతా ఈశ్వరానుగ్రహమే కాని ఇతరము కాదు.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-83
ఓం నమః శివాయ-83
********************
మరుని శరము నిన్ను చేరి మనువాడమని
మదనుడు అనగానే గౌరీపతివి అయినావు
క్షీరసాగర మథనమున విషమును స్వీకరించమని
అమ్మ నిన్ను అడగగానే గరళకంఠుడివి అయినావు
గంగవెర్రినెత్తిమీద సుతిమెత్తగ మొత్తమని
భగీరథుడు అనగానే గంగాధరుడుగ మారినావు
గంగిరెద్దు మేళములో నీకు రంగవస్త్రమౌతానని
కరిరాజు అనగానే గజచర్మధారివి అయినావు
భృంగి సైగ చేయగనే నీ సింగారపు నాట్యమట
" సంధ్యారంభ విజృంభితవు" నీవు కావని
" సంజ్ఞారంభ విజృంభితుడవు" పాపం నీవని
పెక్కుమార్లు విన్నానురా ఓ తిక్క శంకరా.
శివుడు తాను స్వంతముగా ఆలోచించి పనులను చేయలేని వాడు కనకనే ఇతరులు చెప్పిన పనులను చేస్తూ,దానికి తగినట్లుగా గౌరీపతి-గరళకంఠ-గంగాధర-గజచర్మాంబరధర-సంధ్యారంభ విజృంభిత నాట్య అను కొత్త పేర్లను కలుపుకుంటాడు.కన్నుల పండుగగా నున్నానని సంతోషపడుతుంటాడు కాని అందరు వారికిష్టమైన -కష్టమైన పనులను శివునిచే చేయించి,లబ్ధిని పొందుతున్నారన్న విషయమును గ్రహించలేని అమాయకుడు-నింద.
చర్మము నమః శివాయ-మర్మము నమః శివాయ
బాణము నమః శివాయ-భార్య నమః శివాయ
నమఃశివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" భృంగీచ్ఛానటనోత్కటః కరిమదగ్రాహీస్ఫురన్మాధమా
హ్లాదో నాదయుతో మహాసి తవపుః పంచేమణాచాదృతః
సత్చక్షు స్సుమనో వనేషు న పునః సాక్షాన్మదీయే మనో
రాజీవే భ్రమరాధిపో విహరతాం శ్రీశైలవాసే విభుః"
శివానందలహరి.
స్వామీ నీ కరుణను అర్థము చేసుకోలేని మా అజ్ఞానము వీడినది.శ్రీశైల భ్రమరాంబికాపతి,భృంగిని సంతోష పరచుటకు అతని కనుసన్నలలో నాట్యముచేస్తున్నట్లు నటిస్తున్నావు.కరిని కనికరముతో అనుగ్రహించి కరిచర్మాంబరధరుడివి అయినావు.నారాయణునికి అత్యంత ప్రీతిపాత్రుడవైన పరమశివా నీవు మన్మథునికి సహకరించవలెనను తలపుతో దానికి లక్ష్యముగా మారినావు.నీ ఈ పనులన్నిటికి కారణము నీకు మాపైగల అవ్యాజానుగ్రహమే కాని నీ అసమర్థత ఏమాత్రమును కాదు.సదాశివా! నా మనసనే సరస్సులో సదా విహరించుచు,సకలజగములను చల్లగా కాపాడు తండ్రీ.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-82
ఓం నమః శివాయ-82
********************
ఉమ్మిపూసి మందు అనిన కిమ్మనక ఉంటాడు
గుగ్గిలపు వాసనలకు ఉబ్బితబ్బిబవుతుంటాడు
కుంటి గాడిదమీద కులుకుతు కూర్చుంటాడు
మట్టిముంతకోసమని గట్టివాదులాడువాడు
చెన్నప్పవ్వ బొంతను కప్పుకుని రోతగా ఉంటాడు
రంగులు మారుస్తు ఎంతో పొంగిపోతు ఉంటాడు
రాళ్ళు రువ్విన వాని ఆరళ్ళను తీరుస్తాడు
బాణపుదెబ్బలను తింటు బాగుబాగు అంటాడు
క్లేశహారిని అంటు కేశములను కోరుతాడు,
కళ్యాణప్రదాతనని కళ్యాణము కానీయడు
నవ్వులపాలవుతున్నా నవ్వుతూనే ఉంటాడని
వెక్కిరిస్తున్నారురా ఓ తిక్క శంకరా.
సాలీడు పాకిన చోటంతా శివలింగమునకు పొక్కులు వస్తే,నక్క నాయనారు భార్య ఉమ్మివేసి అదే దానికి మందని అంటే ఆనందంగా స్వీకరించాడు.కలశ నాయనారు భార్య మంగళసూత్రమును తాకట్టు పెట్టి గ్రాసము తీసుకురావటానికి వెళుతుంటే సాంబ్రాణిని దానికి బదులుగా ఇచ్చాడు.చాకలి నాయనారు తన కుంటిగాడిదమీద మాసిన బట్టల మూతతో పాటు కూర్చోపెడితే వాహనపూజ అంటు వాహ్వా అన్నాడు.నీలకంఠ నాయనారుకు మట్టిముంతను దాచిపెట్టమని,అది చాలా మహిమాన్వితమైనదని,మాయమాటలు చెప్పి,దానిని మాయము చేసి,తిరిగి తనకు ఇవ్వలేదని గట్టిగా పోట్లాడాడు.సుచి-శుభ్రము అంటే తెలియని వాడుగా అందుకే చెన్నప్పవ్వ తన పాత కుళ్ళుకంపుకొట్టుచున్న బొంతను కప్పగానే,ఎంతో వెచ్చగా ఉందంటు వచ్చిపడుకున్నాడు.సక్కియ నాయనారు రళ్ళను గట్టిగా విసురుతుంటే దెబ్బతగులుతున్నా వాటిని పూలపూజగా అనుకొని నాయనారు కష్టాలను తీర్చాడు.అర్జునుడు బాణాలతో గట్టిగా కొడుతుంటే భలే బాగుందన్నాడు.అంతే కాదు.హవ్వ మరీ విడ్డూరము.కంచార నాయనారు కుమార్తె కళ్యాణమునకు వెళ్ళి వధువు కేశములను కోరాడు.పెళ్ళికూతురు జడను కోయించి తీసుకొనుటయే కాడు.ఏకంగా పెళ్ళిని చెడగొట్టుటలోను సిధ్ధహస్తుడు.మరేమనుకున్నారు.సుందరారు పుస్తె కట్టే సమయమునకు వెళ్ళి,వాడు తన బానిస అని పెళ్ళికానీయకుండా తన వెంట తెచ్చేసుకున్నాడు.ఎంతైన రంగులు మార్చే స్వభావమున్నవాదు కదా.కుంభకోణము దగ్గరనున్న ఆలయములో కళ్యాణ సుందరేశుని నామముతో రోజుకు ఐదారుసార్లు తన లింగపురంగును మార్చే చతుౠడు కదా ఏమైనా చేస్తాడు-ఎపుడైనా చేస్తాడు-ఎవరితోనైన చేస్తాడు.-నింద,
అర్థి నమః శివాయ-దాత నమః శివాయ
చింత నమః శివాయ-స్వాంతన నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" ఎందుకయా సాంబశివా ఎవరు నీకు చెప్పేరయ
ఎందూయా సాంబశివా-(శ్రీ దేవులపల్లి.)
అలలతోటి గంగపట్టి తలపాగా చుట్టి
నెలవంకను మల్లెపూల కలికితురాయిగ పెట్టి
.........
రుద్రుడవో కారుణ్య సముద్రుడవో హరహరహర
ఎందుకయా ఈ దాసునికందవయా దయామయా-స్తుతి.
..
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-81
ఓం నమః శివాయ-81
*********************
విశ్వనాథుడవని నిన్ను విబుధులు మాటాడుతుంటే
అనాథుదను నేనని ఆటలాడుతుంటావు
పరమ యోగీశ్వరుడవని ప్రమథగణము అంటుంటే
పార్వతీ సమేతుడనని ప్రకటిస్తు ఉంటావు
భక్తులు భోళాశంకరుడా భళిభళి అంటుంటే
వేళాకోళములే అని వేడుకగా అంటావు
నాగాభరణుడవని యోగులు స్తుతిచేస్తుంటే
కాలాభరణుడనని లాలించేస్తుంటావు
విషభక్షకుడవని ఋషులు వీక్షిస్తుంటే
అవలక్షణుదను అంటు ఆక్షేపణ తెలుపుతావు
మంచి-చెడులు మించిన మా మంచి చెంచుదొర
వాక్కు నేర్చి నాడవురా ఓ తిక్క శంకరా
శివుడు భక్తులు తన గుణగణములను పొగడుతుంటే దానికి విరుధ్ధముగా సమాధానములిస్తాడు.అన్నీ అబధ్ధాలే అంటూ వేళాకోళము చేస్తుంటాడు.తానూనాధుడనని,పార్వతీ సమేతుడననికాలాభరణుడనని,బేసికన్నులు కల అవలక్షణుడనని ఆక్షేపణగా మాట్లాడు స్వభావము కలవాడు-నింద.
నాథుడు నమః శివాయ-అనాథుడు నమః శివాయ
అఖిల రక్షక నమః శివాయ-అవలక్షక నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
అర్థనారీశ్వర అష్టకము.ఋషి ఉపమన్యు కృతము.
*****************************************
1.నల్లని మొయిలుకాంతి నాతల్లి కచము
ఎర్రని మెరుపు కాంతి శివ జటాజూటము
గిరినేలు నా తల్లి-ఉర్వినేలు నా తండ్రి
అర్థనారీశ్వరమై నన్ను ఆశీర్వదించు.
2.రత్నకుండల కాంతితో అమ్మ కర్ణములు
సర్పభూషణ కాంతితో స్వామి కర్ణములు
శివ నామము ప్రీతి-శివా నామము ప్రీతి
అర్థనారీశ్వరమై నన్ను ఆశీర్వదించు.
3.మందార మాలలతో మా తల్లి గళము
కపాలమాలలతో స్వామి మంగళము
దివ్య వస్త్రము దాల్చి-దిక్కులను దాల్చి
అర్థ నారీశ్వరమై నన్ను ఆశీర్వదించు.
4.పద్మార్చనతో నున్నది మాతల్లి పాదము
సర్పసేవితమైన సాంబశివ పాదము
చంద్ర ప్రకాశముతో-చంద్రాభరణముతో
అర్థనారీశ్వరమై నన్ను ఆశీర్వదించు.
5.అద్భుత ప్రదర్శనము మా తల్లి లాస్యము
ఆసన్న ప్రళయము మా తండ్రి తాండవము
సరిసంఖ్య కనులతో-బేసి కన్నులతో
అర్థనారీశ్వరమై నన్ను ఆశీర్వదించు.
6.నీలి కలువల కాంతి అమ్మ నయనములు
వికసిత కలువలు మా అయ్య నేత్రములు
జగములకు తల్లిగా-జగమేలు తండ్రిగా
అర్థనారీశ్వరమై నన్ను రక్షించు.
7.ఆది మధ్యాంతములు అన్ని మా అమ్మ
దిక్కులు-మూలలకు దిక్కు మా అయ్య
పంచకృత్యములను నియమించు వారు
అర్థ నారీశ్వరమై నన్ను ఆశీర్వదించు.
8.అమ్మా అని పిలిచినా,అయ్యను వేడినా
సన్నద్ధులౌతారు ఉద్ధరించంగ
ఉపమన్యు ఋషికృత స్తోత్ర పఠనమ్ము
అర్థనారీశ్వర కరుణ అరచేతనుంచు.
( ఏక బిల్వం శివార్ప
SIVA SANKALPAMU-80
ఓం నమః శివాయ-78
*********************
పాలుతాగి విషము కక్కు పాముమీది మోజుతో
పాలకడలి విషము మింగ పావుగా మారావు
పచ్చి అబధ్ధాల పుర్రెలమీది మోజుతో
పరమేష్టి పలుకులలో దొంగగా మారావు
సూర్య-చంద్ర-అగ్నుల ముక్కంటిని నేననే టెక్కుతో
అగ్గికన్ను తెరువలేని అసహాయుడవయ్యావు
గంగను బంధించిన వాడిననే గర్వముతో
కొంచమైన దించలేని నంగనాచివయ్యావు
పదహారవ చంద్రకళమీది పరమప్రీతితో
గ్రహణము తొలగించలేని ఘనుడవు నీవయ్యావు
గొప్పపనులు నావంటూ పప్పులో కాలేస్తావురా
ఒక్కసారి గమనించరా ఓ తిక్కశంకరా.
శివునికి పాములనుఆభరణములు గ ధరించుటపైగల ప్రీతి విషభక్షకునిగ మార్చినది.తుంచిన బ్రహ్మ పుర్రెలపైగల మోహము బ్రహ్మచే దొంగగా నిరూపింపచేసినది.వాటిని కనపడేటట్టుగా ఉంచుతాడేకాని దాచిపెట్టడము తెలియనివాడు.వృధ్ధిక్షయము అతీతమైన పదహారవ చంద్రకళను ధరించాననుకుంటాడే కాని గ్రహణమును ఆపలేని అసమర్థుడనుకుంటునారనుకోడు.గంగను బంధించిన మొనగాడను నేనేనను నంగనాచి కబుర్లు చెబుతాడు కాని కొంచము సైపైన దానిని కిందకు దించలేనని చెప్పడు.గొప్పపనులు తనవని అనుకుంటూ దోషిగా నిరూపించబడతాడు.
చంద్రకళనుధరించాననుకుంటాడే కాని గ్రహణ బాధను తొలగించలేడు.అగ్గిని కన్నుచేసి అదుపులో పెట్తాననుకుంటాడు కాని అది తెరువలేక బాధపడుతో0దన్న విషయాన్ని గ్రహించలేడు.అవి కుర్రో-ముర్రో అంటుంటే వాటి సమస్యలను పరిష్కరించలేని అసమర్థుడు శివుడు-నింద.
ఆభరణము నమః శివాయ-ఆదరణయు నమః శివాయ
చింతయు నమః శివాయ-నిశ్చింతయు నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
గ్రహణము అంటే స్వీకరించుట గ్రహించుట అని పెద్దలు చెబుతారు.రాహుకేతు గ్రహములను ఛాయగ్రహములంటారు.ఇవి భూమికి ఉపగ్రహము అయిన చంద్రుడు రవి మార్గమును ఖండిస్తు చేయు పయనములోని ఉత్తర దక్షిణ బిందువులు.భూమి సూర్యుని చుట్టు తిరుగుతు,తనచుట్టు తాను తిరిగే ప్రక్రియలో సకల చరాచర జీవరాశులకు అవసరమగు ఔషధ తత్త్వములను కొంతసేపు చంద్రునికి దగ్గరగా జరిగి స్వీకరిస్తుందట.మానసిక ప్రశాంతతకు కూడ తోడ్పదేటట్టు చేస్తుందట.భూమి ఈ గ్రహణ సమయములలో సౌరశక్తులను స్వీకరించి శారీరక పెరుగుదలను,చంద్ర తత్త్వమును గ్రహించి మానసిక మెరుగుదలను అందించుటకు కొద్దిసేపు మాత్రమే దగ్గరగా ఉండే విధానమును పరమేశుడు ప్రవేశపెట్టినాడట.విజ్ఞులు నా అభిప్రాయము తప్పయిన క్షమించి,సరైన వివరణను అందించగలరు.ధన్యవాదములు.
" ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం
భిత్వామహాబలిభిరీశ్వర నామ మంత్రైః
దివ్యాశ్రితం భుజగభూషణ ముద్వహంతి
యే పాదపద్మ మిహతే శివతే కృతార్థః"
శివానందలహరి.
శివా నీ పాదపద్మము నిధి వంటిది.దానిని నీ ధ్యానమనే అంజనముతో చూచి,చీకటిగా నున్న స్థానమును నీ నామమనే మహాబలశాలుల ద్వారా ఛేదించి,దేవతలు ఆశ్రయించగా,సర్పములు నిన్ను చుట్టుకొనగలిగినవి అవి ఆభరణముగా అలరారు భాగ్యమును పొందించినది వాటికి నీపై కల అచంచల కాని మభక్తియేరొక్కటి .కాదు.అవ్యాజ కరుణామూర్తి,నీ పాదనిధిని పొందగలుగు భాగ్యమును ప్రసాదింపుము.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-79
ఓం నమః శివాయ-79
*********************
అంతా ప్రకాశమే నేనంటూ ఆర్భాటము చేస్తావు
అభిషేకములు జరిగేవి అంతంత మాత్రమేగ
ఋషుల తపోశక్తులను సర్పములుగా మలిచావు
నాగాభరణుడనంటు సాగదీస్తు ఉంటావు
ఋషిపత్నులపై శంకవేస్తు పులిని పుట్టించావు
వ్యాఘ్రేశ్వరుడను అంటు గుడిని కట్టించావు
పసిడిబిల్వహారములతో పరిచయము అవుతావు
తెరచాటుగ కథలను దొంతెరలుగ నడుపుతావు
కొమ్ములున్న వారమంటు నెమ్మది తీసేస్తావు
కాళ్ళులేని వాడివంటు ముళ్ళు గుచ్చమంటావు
నిన్ను కొలుచు పతంజలికి నిలువెల్ల పరీక్షలని
మొక్కుటెందుకటర నిన్ను ఓ తిక్కశంకరా.
ఆ-సమస్తాత్- ఆ అంటే అంతట.కాశము-వెలుగు.అంతట వెలుగుతో నిండినది ఆకాశము.శివుడు అది నేనే అని గొప్పలు చెప్పుకుంటాడు కాని అక్కడ తనకు (మూలవిరాట్) రోజు అభిషేకము చేయరని మాత్రము చెప్పుకోడు.ఋషుల యజ్ఞ ఫలమును సర్పములుగా మార్చునట్లు వారిచే చేయించి,వాటిని తాను ఆభరణములుగా ధరిస్తాడు.ఋషిపత్నులపై ఋషులకు అనుమానమును కలిగించి వారిచే ఒక పులిని సృష్టింపచేసి,దాని తోలుతో ఒక వస్త్రమును-ఆసనమును చేసుకొన్నాడు.మూడు స్వరూపాలు-ఐదు మండపాలు అని గొప్పలేకాని,తెర వెనక నక్కి కథలను బాగానే నడిపిస్తాడు.అందుకేగా పాపం నంది విజ్ఞతను మరచి పతంజలిని కొమ్ములు లేనివాడని ఎగతాళిచేసాడు.మూడుకాళ్ళ భ్రంగి కాళ్ళులేనివాడవంటు పదునైన మాటలతో బాధించాడు.శివుడు తాను సరిగా ఉండడు.తన దగ్గరనున్నవారిని సత్ప్రవర్తనతో నుండనీయడు.-నింద.
కాళము నమః శివాయ-కాశము నమః శివాయ
శంకలు నమ: శివాయ-శంకర నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" నమో రుద్రేభ్యో యేంతరిక్షే యేషా వర్షమిషవత్" రుద్రము.
అంతరిక్ష స్వరూపమైన సదాశివా అనుగ్రహమును వర్షింపుము నీకు నమస్కారములు.
ఋషుల అహంకారమును నిర్మూలించి,పతంజలి మహర్షి యొక్క భక్తిని-భాషా పటిమను లోక విదితము చేస్తూ అనేకానేక అద్భుత గ్రంధములను మనలకు అనుగ్రహించిన అవ్యాజ కరుణాసాగరా-అంబికాపతి అనేకానేక నమస్కారములు.స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
Posted 30th June by taetatelugu.com
SIVA SANKALPAMU-78
ఓం నమః శివాయ-68
*****************
మాతంగపతిగ నువ్వుంటే ఏది రక్షణ వాటికి?
గణపతి అవతరించాడు కరివదనముతో
అశ్వపతిగ వుంటె నీవు ఏదిరక్షణ వాటికి?
తుంబురుడు వచ్చాడు గుఱ్ఱపు ముఖముతో
నాగపతిగ ఉంటేను ఏది రక్షణ వాటికి?
పతంజలి వచ్చాడు మనిషి ముఖముతో
వానరపతిగ ఉంటేను ఏది రక్షణ వాటికి?
నారదుడు వచ్చాడు వానర ముఖముతో
సింహపతిగ ఉంటేను ఏది రక్షణ వాటికి?
నరసింహుడు వచ్చాడు సింహపు ముఖముతో
పశుపతిగ నీవుంటే అశువులకు రక్షణలేదని
ఒక్కటే గుసగుసలు ఓ తిక్కశంకరా.
శివుడు తాను పశుపతినని,వాటిని సంరక్షిస్తానని చెప్పుకుంటాడు కాని కళ్ళెదురుగానే శిరము వేరు-మొండెం వేరుగా ఎన్నో రూపములు కనిపిస్తూ,శివుని చేతగానితనమును ఎత్తిచూపిస్తున్నాగాని కిమ్మనక ఊరుకుంటాడు కాని దురాగతములను ఆపడు.-నింద.తాను కూడ శరభ రూపమును ధరించి మరొక్కసారి ఋజువు చేసాడు.
శిరము నమః శివాయ-మొండెము నమః శివాయ
పశువు నమః శివాయ-మనిషి నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" ఛందఃశాఖి శిఖాన్వితైర్ద్విజవరైవరైః సంసేవితే శాశ్వతే
సౌఖ్యాపాదిని ఖేదభేదిని సుధాసారైః ఫలైర్దీపితే
చేతః పక్షిశిఖామణే త్యజవృధా సంచార మంత్యైరలం
నిత్యం శంకర పాదపద్మ యుగలీనీడే విహారం కురు."
శివానంద లహరి.
మనసా! నీ అవివేకపు ముసుగును తొలగించి అన్నిటింలో శివస్వరూపమును దర్శించుటకు ప్రయత్నించు.స్వామి నిరాకారుడు.ప్రకటింప బడుతున్న-ప్రకటించేయ బడుతున్న ఈ బాహ్య ఆకారములు స్వామి లీలలనె విభూతులు.కనుక నీవు వ్యర్థముగా అటు-ఇటు సంచరించకు.శంకరుని పాదపద్మములనే శుభప్రదమైన గూటిలో విహరించు.ఎందుకంటే ఆ గూడు వేదములనే చెట్టును ఆశ్రయించుకొని యున్న,వేదాంతము అనే కొమ్మలతో,వాని వాలి యున్న మంచి పండితులనే పక్షులతో ప్రకాశిస్తుంది.అనుగ్రహమును ప్రసాదిస్తుంటుంది.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
Posted 23rd July by taetatelugu.com
0 Add a comment
SIVA SANKALPAMU-77
ఓం నమ: శివాయ-77
నీ క్షమాగుణము చూసి పులి శాంతముగా మారింది
పాపం,పులిని బెదిరిస్తూ లేడి తరుముకొస్తోంది
నీ పిరికితనమును చూసి పులి పిల్లిగా మారింది
పాపం,పిల్లి అనుకుని ఎలుక ఎగిరిపడుతోంది
నీ మంచితనము చూసి అగ్గికన్ను తగ్గియుంది
పాపం తగ్గిందంటు దానిని మంచు ముంచివేస్తోంది
నీ వ్యాపకత్వమును చూసి పాము తాను పాకుతోంది
పాపం,పాకుతోందంటూ దానితోక చలిచీమ కొరుకుతోంది
నీ పెద్దతనము చూసి కదలకుండ ఎద్దు ఉంది
పాపం,మొద్దు ఎద్దు అంటు జగము ఎద్దేవా చేస్తున్నది
సహనముతో నీ సహవాసము కోరిన వాటి
ఇక్కట్లను చూడవేరా ఓ తిక్క శంకరా.
......................................................................................................................................................................................................శివుని క్షమ,శాంతము,వ్యాపకత్వము,పేదరికమునుచూసి, శివుని దగ్గర ఉన్న పులి,పాము,ఎద్దు,మూడో కన్ను అదే విధముగా ఉందామనుకుని ఇబ్బందులు పడ్దాయి-నింద
.శివుని దగ్గర ఉండి శివుని అనుసరించుట వలన అవి లోక పూజ్యములైనవి.సహనముతో సహవాసము స్వర్గమే కదా.
ఏక బిల్వం శివార్పణం
SIVA SANKALPAMU-76
నీ నెత్తిమీది గంగను చూసి నదులు బెంగపడ్దాయట
మా నెత్తిమీదికి ఏ ఆపద ముంచుకొస్తుందో అని
నీ కంఠమంటిన పామును చూసి కొండచిలువలు బెంగపడ్దాయట
మా కంటిముందు ఏ దండన వెన్నంటి ఉందో అని
నీ చేతిలోని మృగమును చూసి వాటికి సంతోషము మృగ్యమై పోయెనట
వాడి బాణమేదో తమను దాడిచేయనుందని
నీ గజ చర్మమును చూసి గజములు గజగజలాడుతున్నాయట
పొట్టచీల్చి ఎవరు తమను పొట్టను పెట్టుకుంటారో అని
నీ బ్రహ్మ పుర్రెలు చూసి జనము విలవిలలాడుతున్నారట
రిమ్మతెగులు తగులుకొని దుమ్ము నోట కొడుతుందేమో అని
"దయనీయశ్చ దయాళుకాస్తి" అని సువర్ణమాల అనగానే
నే ముక్కున వేలేసానురా ఓ తిక్క శంకరా.
భావము
నదులు,పాములు,కొండచిలువలు,లేళ్ళు,ఏనుగులు,పుర్రెలు శివుని చూచి భయపడుచున్నారు.వీటన్నిటిని హింసిస్తు శివుడు దయామయుడు అని కీర్తింపబడుచున్నాడు-నింద.
అహంకారపు బుద్ధి అను గంగ,చెడు ఆలోచనలు అను విషకోరలు గల పాములు,నిలకడ లేక పరుగులు తీయు మనసు అను లేడి,స్వార్థ సారూప్యమైన ఏనుగు,విచక్షణారహిత పుర్రె శివ కారుణ్యముతో జగత్పూజ్యతను పొందగలిగినవి-స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం)
SIVA SANKALPAMU-75
కళల మార్పుచేర్పులతో కదులుచున్న చంద్రుడు
నీ సిగముడుల చీకట్లో చింతిస్తూ ఉంటాడట
కుబుసపు మార్పుచేర్పులతో కదలాడు పాములు
నీలలోహిత చీకట్లో చింతిస్తూ ఉంటాయట
కునుకురాక తెరువలేక కుదురులేని మూడోకన్ను
తెర తీయని చీకట్లో చింతిస్తూ ఉంటుందట
ఆకాశము నుండి సాగి జార అవకాశము లేని గంగ
బందిఖానా చీకట్లో చింతిస్తూ ఉంటుందట
చీకటిని తొలగించలేని జ్యోతి శివుడేనట
చింతలు తొలగించలేని వింతశక్తి శివుడట
దోషము తొలగించలేని వానికి ప్రదోష పూజలా అంటూ
ఒక్కటే గుసగుసలు ఓ తిక్క శంకరా!
భావము
చీకటిని దోషము అనికూడ అంటారు.(మానసిక) చీకట్లను తొలగించుటకు అవి కమ్ముకునే ముందు చేసే పూజలను ప్రదోష పూజలు అంటారు.గంగకు,చంద్రునికి,కన్నుకు,పాములకు చీకట్లను తొలగించలేని శివుడు దోష హరుడుగా ప్రదోష పూజలు అందుకుంటున్నాడు-నింద.
కళలు మారు చంద్రుడు,జనముల మధ్య స్థానము లేని పాములు,గతి తప్పిన గంగ,పరంజ్యోతి యైన శివుని కరుణచే లోకారాధ్యులుగా శివుని దయచే కీర్తింపబడుచున్నారు.స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం)
SIVA SANKALPAMU-74
తిరిపమెత్తువాడవని నిరుపేద శ్రీనాథుడు
గలగల ప్రవహించనీయవని,గడుసువాడవని గంగ
చర చర పాకనీయవని చతురుడవని కాళము
పరుగులు తీయనీయవని పాశమున్నదని లేడి
కిందకు జారనీయవని నిందిస్తున్నది విషము
కదలనేనీయవని వంతపాడు జాబిలి
కట్టడి చేస్తున్నావని కట్టుకున్న కపాలములు
హద్దు దాటనీయవని వద్దనున్న వృషభము
ఆ లయకారుడు అసలు "ఆలయమున" ఉంటాడా?
మేమెంతో గొప్పవారమంటూ వంతులవారీగా
నీ చెంతనే ఉంటూ కాని చింతలు చేస్తుంటే వాని
పక్క దారి మార్చవేరా ఓ తిక్క శంకరా.
భావము
శివుడు బిచ్చగాడు.గంగను ప్రవహించనీయడు.పాములను పాకనీయడు.లేడిని పరుగెత్తనీయడు.విషమును కంఠమునుండి క్రిందకు జారనీయడు.చంద్రుని కదలనీయడు.ఎద్దును రంకెవేయనీయడు.పక్కనే ఉండి తనను నిందిస్తున్నా వినీ,విననట్లుంటాడు..-నింద.
అహమును,చపల చిత్తమును,అహంకారమును శివుడు నియంత్రించి,భక్తులను అనుగ్రహిస్తున్నాడు.-స్తుతి.
( ఏక బిల్వం శివార్పణం )
SIVA SANKALPAMU-73
"పెద్ద దేవుడనని" అని నీవంటే" మద్ది" తెల్లబోయింది
"అంబే శివుడిని" అని నీవంటే "జంబూ" బెంబేలెత్తింది
"భూత నాథుడిని" అని నీవంటే "చూతము" చూతమంది
"దొడ్డవాడిని" అని నీవంటే " గడ్డి" అడ్డుచెప్పకుంది
"చెలకని వాడను" అని నీవంటే "చెరకు" ఊరుకున్నది
"మీ రేడును" అని నీవంటే "మారేడు" మారాడకున్నది
"ఉబ్బు లింగడిని" అని నీవంటే "కొబ్బరి"నిబ్బరించుకుంది
"నిర్వాహకుడిని" అని నీవంటే "ఉర్వారుకము"నవ్వింది
"యోగిని" అని నీవంటే నీవంటే "రేగి" ఆగి పోయింది
" వృక్షేభ్యో- హరికేశేభ్యో" అని మొహమాటముతో అనగానే
"అన్ని చెట్లు" నీవంటే "అక్కసుతో" పచ్చి అని,నిన్ను
వెక్కిరించాయిరా ఓ తిక్క శంకరా.
భావము
మద్ది చెట్టు,నేరేడు చెట్టు,మామిడి చెట్టు,రేగి చెట్టు,గరిక,చెరకు,మారేడు చెట్టు,కొబ్బరి చెట్టు,దోస పాదు, హరితమునందిస్తుంటే భక్తులు శివుని పచ్చనైన కేశములతో విరాజిల్లు హరికేశునిగా పొగడగానే శివుడు వాటి గొప్పదనమును తనపై ఆపాదించుకొను చున్నాడు-నింద
శ్రీశైల స్థల వృక్షమైన మద్దిచెట్టు,జంబూ ద్వీపముగా ప్రసిద్ధి చెందిన నేరేడు చెట్టు,పావన బదరికా వనముగా రేగి చెట్టు,త్రిగుణాత్మకతతో పువ్వులు లేకుండానే కాయలు అందించే మారేడు చెట్టు,కంచిలో ఆమ్రేశ్వర రూపమైన మామిడిచెట్టు,
అచంచలతకు ప్రతీకయైన కొబ్బరి చెట్టు,తుఫాను సైతము కదల్చలేని గడ్డి,హింసించినను మధురతను ఇచ్చు చెరుకు,మృత్యుంజయ మంత్ర వివరణ యైన దోస పాదు,పరమేశ్వరుని దయచే జగత్పూజ్యములైనవి.
(ఏక బిల్వం శివార్పణం )
Image may contain: 1 person
SIVA SANKALPAMU-72
గడ్డి పరకలతో చేసే బహుదొడ్డవైన పూజలు
మే,మే అని స్తుఇంచే మేకతల రుద్రాలు
కమ్ముకోను మేమనే నమ్ముకున్న తుమ్మిపూలు
ప్రత్యర్థుల బెదిరింపుకు పుట్టమైన పులితోలు
తప్పనిసరి ఐతేనే విచ్చుకునే కన్నులు
పరుగుతీయలేనట్టి మృగమున్న చేతివేళ్ళు
అమ్మ బాబోయ్ చలి అంటు మూతపడ్డ గుడులు
హద్దులు మీరుతు ఆకాశాన్నితాకే జడలు
దుమ్మెత్తిపోస్తుంటే గమ్మత్తుగ నవ్వులు
పాడుబడ్డగుహనున్నావని పాడుచున్న భక్తులు
పరిహాసాస్పదుడవగుచు పరమ శివుడు నేనంటే
ఫక్కున నవ్వుతారురా ఓ తిక్క శంకరా.
............
చులకనయైన గడ్డిపోచ పూజలు,మేకతల పలికెడి మే మే మంత్రాలుకప్పుకున్న పులితోలు,ఎప్పుడు మూసిఉండే కన్ను ,ఆరునెలలు మూసిఉండే గుళ్ళు,హద్దులులేని జటలు,దుమ్మెత్తిపోసే జనాలు,ఉంటున్న పాడుబడ్డ గుహలు నిన్ను పరమ శివుడు అంటే పగలబడి నవ్వుతారు-నింద
...........
పవిత్రత,దక్షత,ప్రశాంతత,బూది అభిషేకాలు గలిగి,మన హృదయములో అతి రహస్యముగా నివసించుచున్న శివుడు మనలను రక్షించుగాక-స్తుతి.
SIVA SANKALPAMU-71
అసంగోహం అసంగోహం-అసంగోహం పున: పున:"
శివుని తల్లి "బెజ్జ మహాదేవి" అంటున్నారు
"శిలాదుడు" తండ్రి అని నేను వింటున్నాను
శివుని అక్క "మగాదేవి" గారాబం చేస్తుందట
శివుని పత్ని "పార్వతి" పరిపాలించేస్తోందట
గణపతి-గుహుడు శివుని సుతులంటున్నారు
శివుని సఖుడు "హరి" అట చెప్పుకుంటున్నారు
శివ భక్తి "తమదని" పక్షులు చెప్పుకుంటున్నాయి
శివ లీలలు "యుగయుగములు" కనువిందు చేస్తున్నవి
భావనలో నిండినది "బహు చక్కని కుటుంబము"
"బ్రహ్మజ్ఞాన వలీనము" బహు చక్కగ చెబుతున్నది
"అసంగోహం-అసంగోహం
అసంగోహం-పున:పున:"
చక్కనైన మాటలేరా ఓ తిక్కశంకరా.
భావము
శివ కుటుంబము చిద్విలాసము చేయుచుండగా,శివుడు ఎవరులేనివాడను,ఏ బంధములేని వాడనని అనుట అబద్ధము-నింద.
బెజ్జ మహాదేవి తల్లిగా భావించింది.శిలాదుడు తండ్రిగా లాలించాడు.(పారమార్థిక దృష్టితో చూస్తే వీరు శివుని తమ బిడ్డడుగా భావించారు.)మహాదేవి అక్కగా శివుని ఆదరించింది.పార్వతీ దేవి శివుని పత్నిగా ప్రకాశిస్తూ, పరిపాలిస్తోంది.వినాయకుడు-కుమార స్వామి పుత్రులుగా ధాత్రినేలుతున్నారు.విష్ణుమూతి నిన్ను చేర్చి కార్తీక దామోదరుడైనాడు.పశు పక్ష్యాదులు,కాలచక్రము నిన్ను తనవాడివని అచంచల భక్తితో కొలుచుచున్నవి.
పశుపతి, మోహ బంధములకు అతీతుడైన భవుడు, భవతారకుడు-స్తుతి..
( ఏక బిల్వం శివార్పణం.)
SIVA SANKALPAMU-70
ఓం నమః శివాయ-79
******************
అగ్గిలో కాల్చావు ఆ భక్తనందనారుని
అఘోరవ్రతమన్నావు ఆ చిరుతొండనంబికి
అంబకము అడిగావు ఆ బోయ తిన్నడిని
చర్మకార దంపతుల చర్మము ఒలిపించావు
ఆ అయ్యలప్ప అర్థాంగినే ఆశగా కోరావు
దొంగతనము నేర్పావు ఆ కన్నడ బ్రహ్మయ్యకు
కళ్ళను నరికించావు కఠినముగా మహదేవుని
కళ్ళను పీకించావు కటకట మల్లికార్జుని
అంత పరీక్షించావు అమ్మాయి గొడగూచిని
నీ వీరశైవగాథలు కౄరత్వపు దాడులు
మోక్షమనె పేరుగల ఘోరమైన శిక్షలు
అక్కరలేదనవేమిరా ఓ తిక్క శంకరా.
శివుడు కౄరుడు.కనుకనే నందనారుని అగ్నిలో దూకమన్నాడు.చిరుతొండనంబిని (సిరియాళుని తండ్రి) చిత్ర-విచిత్రముగా పరిక్షించినాడు.తిన్నడిని కన్ను అడిగాడు.హరలయ్య-కళ్యాణమ్మల చర్మమును కోసుకునేలే చేసాడు.కాళ్ళు నరికించుట-కళ్ళుపీకించుట చూస్తూ ఉరుకున్నాడు.ఇదింకా మరీ చోద్యం.తన భక్తుడైన ఇయర్వగై నాయనారు ధర్మపత్నిపై తనకు మోహం కలిగినదని,తన వెంట ఆమెను పంపించమన్నాడు.హవ్వ.ఎంత నీచపు ఆలోచన.పాపము గొడగూచి అను చిన్న పిల్లపై ఆమె తల్లితండ్రులపై నైవేద్య క్షీరమును శివుని సమర్పించక తాగినదని,నిందారోపణమును చేయించి,నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నావు.నిజము నిన్ను అడుగుదామని వస్తే నిర్దాక్షిణ్యముగా నీలో లీనము చేసుకున్నావు.ఎక్కడున్నది నీ భోళాతనము-నింద.
శిఖయు నమః శివాయ-రక్షయు నమః శివాయ
కాయం నమః శివాయ-సాయం నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
నమో ఘోరేభ్యో-అఘోరేభ్యో-ఘోరఘోర తరేభ్యో-రుద్రం. ఘోర (రౌద్ర) రూపము-అఘోర (శాంత) రూపము,ఘోరఘోర (సామాన్య) రూపము అన్ని శివుడే.తన భక్తులను చరితార్థులను చేయుటకు ఆడిన లీలా విశేషములే.వారందరిని తిరిగి అనుగ్రహించి-ఆశీర్వదించినది శివుడేగా.
" మానస్తోకే తనయే మాన ఆయుషిమానో గోషుమానో అశ్వేషు రీరిషః
వీరాన్మానో రుద్రభామితోవధీర్హ విష్మంతో నమసా విధేమతే."
పరమశివా! మేము నీకు కోపము వచ్చునట్లు ప్రవర్తించినను ,నీకు అపచారములను చేసినను మమ్ములను క్షమించి,మా (తోకే) సంతానమునకు,(ఆయుషి) ఆయువునకు,(గోషుమానో) గోవులకు,(అశ్వేషు) గుర్రములకు,((మారీరిష) బాధను కలిగింపకుము.మేము హవిస్సుకలవారమై (నీకు అర్పించుటకు) నిన్ను సేవించుకొను భాగ్యమును ప్రసాదింపుము.స్తుతి.
ఏక బిల్వం శివార్పణం
SIVA SANKALPAMU-69
ఓం నమః శివాయ-69
******************
అగ్గిలో కాల్చావు ఆ భక్తనందనారుని
అఘోరవ్రతమన్నావు ఆ చిరుతొండనంబికి
అంబకము అడిగావు ఆ బోయ తిన్నడిని
చర్మకార దంపతుల చర్మము ఒలిపించావు
ఆ అయ్యలప్ప అర్థాంగినే ఆశగా కోరావు
దొంగతనము నేర్పావు ఆ కన్నడ బ్రహ్మయ్యకు
కళ్ళను నరికించావు కఠినముగా మహదేవుని
కళ్ళను పీకించావు కటకట మల్లికార్జుని
అంత పరీక్షించావు అమ్మాయి గొడగూచిని
నీ వీరశైవగాథలు కౄరత్వపు దాడులు
మోక్షమనె పేరుగల ఘోరమైన శిక్షలు
అక్కరలేదనవేమిరా ఓ తిక్క శంకరా.
శివుడు కౄరుడు.కనుకనే నందనారుని అగ్నిలో దూకమన్నాడు.చిరుతొండనంబిని (సిరియాళుని తండ్రి) చిత్ర-విచిత్రముగా పరిక్షించినాడు.తిన్నడిని కన్ను అడిగాడు.హరలయ్య-కళ్యాణమ్మల చర్మమును కోసుకునేలే చేసాడు.కాళ్ళు నరికించుట-కళ్ళుపీకించుట చూస్తూ ఉరుకున్నాడు.ఇదింకా మరీ చోద్యం.తన భక్తుడైన ఇయర్వగై నాయనారు ధర్మపత్నిపై తనకు మోహం కలిగినదని,తన వెంట ఆమెను పంపించమన్నాడు.హవ్వ.ఎంత నీచపు ఆలోచన.పాపము గొడగూచి అను చిన్న పిల్లపై ఆమె తల్లితండ్రులపై నైవేద్య క్షీరమును శివుని సమర్పించక తాగినదని,నిందారోపణమును చేయించి,నిమ్మకు నీరెత్తినట్లు కూర్చున్నావు.నిజము నిన్ను అడుగుదామని వస్తే నిర్దాక్షిణ్యముగా నీలో లీనము చేసుకున్నావు.ఎక్కడున్నది నీ భోళాతనము-నింద.
శిఖయు నమః శివాయ-రక్షయు నమః శివాయ
కాయం నమః శివాయ-సాయం నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
నమో ఘోరేభ్యో-అఘోరేభ్యో-ఘోరఘోర తరేభ్యో-రుద్రం. ఘోర (రౌద్ర) రూపము-అఘోర (శాంత) రూపము,ఘోరఘోర (సామాన్య) రూపము అన్ని శివుడే.తన భక్తులను చరితార్థులను చేయుటకు ఆడిన లీలా విశేషములే.వారందరిని తిరిగి అనుగ్రహించి-ఆశీర్వదించినది శివుడేగా.
" మానస్తోకే తనయే మాన ఆయుషిమానో గోషుమానో అశ్వేషు రీరిషః
వీరాన్మానో రుద్రభామితోవధీర్హ విష్మంతో నమసా విధేమతే."
పరమశివా! మేము నీకు కోపము వచ్చునట్లు ప్రవర్తించినను ,నీకు అపచారములను చేసినను మమ్ములను క్షమించి,మా (తోకే) సంతానమునకు,(ఆయుషి) ఆయువునకు,(గోషుమానో) గోవులకు,(అశ్వేషు) గుర్రములకు,((మారీరిష) బాధను కలిగింపకుము.మేము హవిస్సుకలవారమై (నీకు అర్పించుటకు) నిన్ను సేవించుకొను భాగ్యమును ప్రసాదింపుము.స్తుతి.
ఏక బిల్వం శివార్పణం
SIVA SANKALPAMU-68
ఓం నమః శివాయ-78
*********************
పాలుతాగి విషము కక్కు పాముమీది మోజుతో
పాలకడలి విషము మింగ పావుగా మారావు
పచ్చి అబధ్ధాల పుర్రెలమీది మోజుతో
పరమేష్టి పలుకులలో దొంగగా మారావు
సూర్య-చంద్ర-అగ్నుల ముక్కంటిని నేననే టెక్కుతో
అగ్గికన్ను తెరువలేని అసహాయుడవయ్యావు
గంగను బంధించిన వాడిననే గర్వముతో
కొంచమైన దించలేని నంగనాచివయ్యావు
పదహారవ చంద్రకళమీది పరమప్రీతితో
గ్రహణము తొలగించలేని ఘనుడవు నీవయ్యావు
గొప్పపనులు నావంటూ పప్పులో కాలేస్తావురా
ఒక్కసారి గమనించరా ఓ తిక్కశంకరా.
శివునికి పాములనుఆభరణములు గ ధరించుటపైగల ప్రీతి విషభక్షకునిగ మార్చినది.తుంచిన బ్రహ్మ పుర్రెలపైగల మోహము బ్రహ్మచే దొంగగా నిరూపింపచేసినది.వాటిని కనపడేటట్టుగా ఉంచుతాడేకాని దాచిపెట్టడము తెలియనివాడు.వృధ్ధిక్షయము అతీతమైన పదహారవ చంద్రకళను ధరించాననుకుంటాడే కాని గ్రహణమును ఆపలేని అసమర్థుడనుకుంటునారనుకోడు.గంగను బంధించిన మొనగాడను నేనేనను నంగనాచి కబుర్లు చెబుతాడు కాని కొంచము సైపైన దానిని కిందకు దించలేనని చెప్పడు.గొప్పపనులు తనవని అనుకుంటూ దోషిగా నిరూపించబడతాడు.
చంద్రకళనుధరించాననుకుంటాడే కాని గ్రహణ బాధను తొలగించలేడు.అగ్గిని కన్నుచేసి అదుపులో పెట్తాననుకుంటాడు కాని అది తెరువలేక బాధపడుతో0దన్న విషయాన్ని గ్రహించలేడు.అవి కుర్రో-ముర్రో అంటుంటే వాటి సమస్యలను పరిష్కరించలేని అసమర్థుడు శివుడు-నింద.
ఆభరణము నమః శివాయ-ఆదరణయు నమః శివాయ
చింతయు నమః శివాయ-నిశ్చింతయు నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
గ్రహణము అంటే స్వీకరించుట గ్రహించుట అని పెద్దలు చెబుతారు.రాహుకేతు గ్రహములను ఛాయగ్రహములంటారు.ఇవి భూమికి ఉపగ్రహము అయిన చంద్రుడు రవి మార్గమును ఖండిస్తు చేయు పయనములోని ఉత్తర దక్షిణ బిందువులు.భూమి సూర్యుని చుట్టు తిరుగుతు,తనచుట్టు తాను తిరిగే ప్రక్రియలో సకల చరాచర జీవరాశులకు అవసరమగు ఔషధ తత్త్వములను కొంతసేపు చంద్రునికి దగ్గరగా జరిగి స్వీకరిస్తుందట.మానసిక ప్రశాంతతకు కూడ తోడ్పదేటట్టు చేస్తుందట.భూమి ఈ గ్రహణ సమయములలో సౌరశక్తులను స్వీకరించి శారీరక పెరుగుదలను,చంద్ర తత్త్వమును గ్రహించి మానసిక మెరుగుదలను అందించుటకు కొద్దిసేపు మాత్రమే దగ్గరగా ఉండే విధానమును పరమేశుడు ప్రవేశపెట్టినాడట.విజ్ఞులు నా అభిప్రాయము తప్పయిన క్షమించి,సరైన వివరణను అందించగలరు.ధన్యవాదములు.
" ధ్యానాంజనేన సమవేక్ష్య తమః ప్రదేశం
భిత్వామహాబలిభిరీశ్వర నామ మంత్రైః
దివ్యాశ్రితం భుజగభూషణ ముద్వహంతి
యే పాదపద్మ మిహతే శివతే కృతార్థః"
శివానందలహరి.
శివా నీ పాదపద్మము నిధి వంటిది.దానిని నీ ధ్యానమనే అంజనముతో చూచి,చీకటిగా నున్న స్థానమును నీ నామమనే మహాబలశాలుల ద్వారా ఛేదించి,దేవతలు ఆశ్రయించగా,సర్పములు నిన్ను చుట్టుకొనగలిగినవి అవి ఆభరణముగా అలరారు భాగ్యమును పొందించినది వాటికి నీపై కల అచంచల కాని మభక్తియేరొక్కటి .కాదు.అవ్యాజ కరుణామూర్తి,నీ పాదనిధిని పొందగలుగు భాగ్యమును ప్రసాదింపుము.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-67
ఓం నమ: శివాయ-missing in between
***************
కొంతమంది రుద్రులుగా భూమిమీద సంచరిస్తూ
తినకూడని ఆహారము తినిపించేస్తుంటావు
మరికొంతమంది రుద్రులుగా గాలిలో విహరిస్తూ
ఆయాసము-ఉబ్బసము విజృంభింప చేస్తావు
ఇంకొంతమంది రుద్రులుగా నీటిలోన చేరుతూ
క్రిమికీటక జలములతో వ్యాధులు పెంచేస్తావు
కొంతమంది రుద్రులతో గగనములో దాగుతూ
అతివృష్టి-అనావృష్టి నష్టము చేస్తుంటావు
ఆయుధమవసరములోని యుధ్ధమని అంటావు
అపచారము సవరించే పరిహారము అంటావు
సకలమును సన్స్కరించు పధ్ధతి యేనా ఇది?
టక్కరి కొక్కెరవటర నీవు ఓ తిక్క శంకరా.
.
భువనం నమః శివాయ-గగనం నమః శివాయ
దండన నమః శివాయ-దండము నమః శివాయ.
శంకరుడు అనేకానేక రూపములను తనలాగ ఉండువారిని సృష్టించి,వారిని నింగి-నేల-జలము మొదలగు పంచభూతములనే ఆయుధములుగా మలచుకొని,వాటి ప్రభావము చేతనే జనులను సదాచార పరులను చేయమంటున్నాడు.ఈ ప్రణాళికలో జనులు వ్యాధిపీడితులుగా,ఆకలి బాధితులు గా మారి,పశ్చాత్తపడి సన్మార్గమున నడిచేవారిని,క్షమిస్తూ,పధ్ధతి మార్చుకోని వారికి ముగింపు తెస్తు,నిర్దాక్షిణ్యముగా శివుడు ప్రవర్తిస్తున్నాడు-నింద.
" యే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్" రుద్రనమకం.
ఏ రుద్రులు భుజింపదగిన అన్నములయందును,త్రాగదగిన క్షీరాదులయందును ఉన్నవారలయి భుజించు పాపులగు జనులను,త్రాగునట్టి జనులను ధాతువైషమ్యమును కలిగించి వారి పాపాలకు దగినట్లుగా నానా విధంబుల బాధించుచున్నారో,వారల ధనుస్సులను వేయి యోజనముల దూరముగా పెట్టుము.
భువనం నమఃశివాయ-గగనం నమః శివాయ
రుద్రులు నమః శివాయ-భద్రత నమహ్ శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ.
" దశ ప్రాచీ దశ దక్షిణా దశ ప్రతీచీర్దశోదీచిః"
రుద్రము-(ప్రాచీ-తూర్పు-ప్రతీచీ-పడమర-ఉదీచె-ఉత్తరం-దక్షిణా -దక్షిణం)
నాలుగు దిక్కులు-నాలుగు మూలలు-ఊర్థ్వము-అథో దిక్కు పది తానై పరిపలించు పరాత్పరునకు పదివేళ్ళని కలిపి నేను చేయు నమస్కారములను స్వీకరించి,మనలను ఆయుధములు లేకుండ బాధించే రుద్రుల నుండి కాపాడును గాక.
సాధకులు " నమో రుద్రేభ్యోః అంటు చేయు వాచక నమస్కారములకు,తేభ్యోః అను శబదముతో చేయు మానసిక నమస్కారములకు,పదివేళ్ళను ముకుళించి చేయు కాయిక నమస్కారములకు ప్రీతి చెంది పరమేశ్వరానుగ్రహము మనలనందరిపై ప్రసరింప చేయును గాక.
సదాశివుడు తన రుద్రుల ద్వారా సదాచార సంపన్నులుగా అందరిని మలచుటకు అనుగ్రహించుటకు అనేకానేక రుద్రరూపములలో విశ్వపాలన చేస్తున్నాడు.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-66
ఓం నమః శివాయ-77
**********************
నీ కళ్యాణపు కర్తయైనాడుగ ఆ రతిరాజు
నీ సేమపు మామ యైనాడు ఆ హిమరాజు
నీ సిగపై కొలువైనాడు ఆ నెలరాజు
నీ మేనికి వస్త్రమైనాడు ఆ కరిరాజు
నీ కంఠపు కంటెయైనాడు ఆ భుజగరాజు
నీమ్రోలన్ నిలిచినాడు ఆ వృషభరాజు
నీతో పాటుగ కొలువైనాడు ఆ యమరాజు
నీవంటే నిరసనతో యున్నాడుగ ఆ దక్షరాజు
విరాజమానుడిని అని నీవు అన్నా,నువ్వు రాజువు కాదని
ఇందరు రాజులు నిన్ను ఆడించగ మందహాసముతో
నటరాజను ఒక రాజును నీకొసగిరి ,నీ
తక్కువ చాటేందుకేర ఓ తిక్కశంకరా.
మన్మథుడు,హిమవంతుడు,చంద్రుడు,ఏనుగులరాజు,సర్పరాజు,వృషభరాజు,యమరాజు,దక్షరాజు రాజథీవితో అలరారుచు,అందరు కలిసి పరిహాసమునకు శివునికి నతరాజు అను బిరుదునొసగి,తైతక్కలాడిస్తుంటే అమాయకముగా అది గ్రహించక,తాను వివిధరాజ విరాజమానుడనని సంతసితాడు కాని అసలు విషయమును అర్థము చేసుకోలేని అమాయకుడు శివుడు-నింద.
రాజు నమః శివాయ-బంటు నమః శివాయ
జటిలము నమః శివాయ-నటనము నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
" నటనం ఆడెనే భవతిమిరహంశుడా పరమశివుడు
నటనా వతన్సుడై తకధిమి తకయని"
నటనము నందు ఆసక్తిగలవాడట.ఏమా నటనము? సామాన్య హస్తపాద కదలికలే? లేక సకల చరాచర సృష్టి చైతన్యపు కదలికలా అంతే అవుననే చెప్పాలి.అయితే స్వామి చిదంబరములోనే తిల్లవనములోనే నృత్యము చేయుట ఎందుకు? అని ప్రశ్నించుకుంటే అఖిలభువనభాండములు తాను వ్యాపించియున్నప్పటికిని,విశ్వమనే క్షత్రము(క్షేత్రమునకు శరీరము అను మరో అర్థమును తీసుకుంటే) హృదయము వంటిది చిదంబరములోని తిల్లవనము.ఆ ప్రదేశమునకే శివనాట్యమును తిలకించగల-తరించగల శక్తిగలది.ఇంకొక విధముగా అన్వయించుకోవాలంటే ఇడ-పింగళ అను కుడి-ఎడమ నాడుల మధ్య గల సుషుమ్న నాడి వంటిది చిదంబరము.కుండలినిని జాగృత పరచి సహస్రారమునకు చేర్చగలిగిన శక్తికలది.అంతే కాకుండ అక్కడ మనకు వ్యాఘ్రపాదులవారు-పతంజలి స్తొత్రము చేస్తు స్వామి నాట్యమును అవలోకిస్తూ ఆనందిస్తుంటారు.వారి నామములు కూడ సంకేతములే.వ్యాఘ్రపాదములు స్వామిచే వారికి అతికింపబడినవి.కనుక అవి కదలకుండ స్థిరముగా నిలబడ శక్తి కలవి.అట్లు నిలబడిన ఆధ్యాత్మిక సాధనను,పతంజలి పైకి వేగముగా పాకు శక్తి సహస్రారమునకు పట్టు తప్పకుండ చేర్చి,ముముక్షువులుగా మార్చగలదు.
స్వామి చేయు సృష్టి-స్థితి-సమ్హార-తిరోధాన-అనుగ్రహములను పంచకృత్య సంకేతములే నటరాజ తత్త్వము.అజ్ఞానమనే అపస్మారకుని కాలికింద నొక్కివేసి,సృష్టికి రెండు కుడిచేతులతో ముందున్నది అభయముద్రతో,వెనుక ఉన్నది డమరుకముతో ,జ్ఞాన సంకేతములై ఉండగా ,ఎడమవైపున ముందున్న గజహస్తము తిరోధాన ప్రతీకగాను,వెనుకనున్న చేయి అగ్ని పాత్రతో విషవాసనలను దహించివేసే దయాళువుగాను దర్శనమిస్తుంటాయి.స్వామి విస్తరించిన జడలు సర్వ వ్యాపకత్వమును చాటిచెప్పుచుండగా ,వాటిలో చుట్తిన గంగ,చంద్రరేక స్వామి చల్లని మనసుకు చక్కని ప్రతీకలై చెలువారుచున్నవి.
రుద్రము స్వామిని " సభాభ్యో-సభాపతిభ్యశ్చవో నమో నమః" అని కీర్తిస్తున్నది.కడలిలోని నీరే కడలి అలలోను ఉన్నట్లు,స్వామి కదలికలే నా కదలికలను సత్యమును నిరంతరము నా మనసులో నిలుపుము శివా.నమస్కారములు.-స్తుతి
ఏక బిల్వం శివార్పణం.
SIVA SANKALPAMU-65
ఓం నమః శివాయ-76
********************
పట్టుబడతానన్న భయముతో పరుగుతీసిన దొంగ
ప్రదక్షిణము చేసానని ప్రగల్భమే పలుకుతాడు
సోమరియై నిదురపోవు తామసియైన దొంగ
నిష్కళంక సమాధియని నిబ్బరముగ అంటాడు
సందుచూసి విందు భోజనము చేయుచు ఒక దొంగ
వివరపు నైవేద్యమంటు వింతగ మాటాడతాడు
కడతేరుస్తారేమని కవచధారియైన దొంగ
కానుకగా ప్రాణమంటు పూనకమే పూనుతాడు
మాయదారి పనులనే మానసపూజలు అంటూ
ఆయాసము లేకుందా ఆ ఆ యశమే కోరుతుంటే
పోనీలే అనుకుంటూ నువ్వు వారిని ఏలేస్తుంటే
ఇంకెక్కడి న్యాయమురా ఓ తిక్కశంకరా.
శివుడు చెప్పలేనంత అమాయకుడు.బూటకపు మాటలను మాట్లాడిన వారిని కూడా నిజభక్తులనుకొని,వారిని అనుగ్రహిస్తుంటాడు.అదే అదనుగా దొంగ భక్తులు ప్రదక్షిణమును చేసానంటు,ధ్యానము చేసానంటూ,మహానైవేద్యము సమర్పించానంటూ అచ్చిక బుచ్చిక మాటలతో,అచ్చమైన భక్తుల వలె అనగానే,అసలు విషయమును గ్రహించకుండ అనుగ్రహించేస్తుంటాడు.నిజానిజములను విచారించలేడు.నింద.
దక్షిణ నమః శివాయ-ప్రదక్షిణ నమః శివాయ
వేద్యుడు నమః శివాయ-నైవేద్యుడు నమః శివాయ
నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ
"నమో నిషంగిణ ఇషుధిపతే తస్కరణాం పతయే నమః" రుద్ర నమకము.
దొంగలు గుప్తచోరులు-ప్రకటిత చోరులు అని రెండు వర్గములుగా విభజింపబడినారు.మూడో కంటికి తెలియకుండ దొంగతనమును చేయువారు గుప్తచోరులు.వారి దొంగతనమును కేవలము వారి రెండు కన్నులు మాత్రమే చూడగలవు.ఎదుటపడి మనకు తెలుస్తుండగనే దొంగిలించువారు ప్రకటిత చోరులు.
రుద్ర భాష్యము నిషంగిణ అను పదమునకు విల్లు ఎత్తి పట్టుకుని ఉన్నవాడు అను వాచ్యార్థమును చెప్పినప్పటికిని,అంతరార్థముగా దొంగతనమునందాసక్తిని ప్రదర్శించువాడని విశ్లేషిస్తున్నది.ఎవరీ దొంగలు? వారి పూర్జన్మ పాపఫలితములను దొంతనపు వాసనలతో పుట్టిన జీవులు.వారి దుష్కర్మలు వారి పాపక్షయమును వారే దోచుకొనునట్లు చేస్తుంది.అదియే ఈశ్వరానుగ్రహము.లీలా
మానుషధారియైన శివుడు వారి సర్వపాపములను-వాటికర్మలను దొంగిలించి,వారిని పునీతులను చేస్తుంటే,విచిత్రముగా వీరు శివుని ఎదురుగా నిలబడి మాట్లాడుతూ,స్వామి అనుగ్రహ కటాక్షమను విశేషమును దోచుకొని ధన్యులైనారు.వారి భాగ్యమును నేనేమనగలను? స్వామి అవ్యాజకరుణ తక్క.కాసేపు తాను దొంగిలిస్తూ,మరికాసేపు తాను దొంగిలింపబడుతూ దోబూచులాడు దొంగలదొరను సేవించుకొనుట తప్ప.-స్తుతి.
ఏక బిల్వం శివార్పణం.
Subscribe to:
Posts (Atom)
TANOTU NAH SIVAH SIVAM-18
తనోతు నః శివః శివం-17 ******************* " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...
-
వందనం =========== అంబ వందనం జగదంబ వందనం సంబరాన కొలువుతీరె శక్తి వందనం భవతారిణి భగవతి భక్తి వందనం. పారిజాత అర్చనల పాదములకు వందనం పాప...
-
శార్దూలము... మాతంగి వర్ణన. ఊతం భద్ర సుభద్ర రుద్రరమణీమ్ ఉచ్చిష్ట చండాలినీమ్ భాతిమ్ రోహిత వస్త్ర సంపుటికరీమ్ ...
-
విబుధజనుల వలన విన్నంత-కన్నంత-తెలియపరచు ప్రయత్నము.తప్పులను సవరించి మరింత సుసంపన్నము చేయగలరని ప్రార్థిస్తూ, శివతాండవ స్తుతి భావము. ****...