Thursday, January 25, 2018

AMARANEETI NAAYANAARU

" రత్నై కల్పితం ఆసనం,హిమజలై స్నానంచ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం
జాతి చంపక బిల్వపత్ర రచితం పుష్పంచ ధూపం తధా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యాతాం"
చిదానందరూపా-అమరనీతి నాయనారు.
********************************************
.
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
అమరనీతి నాయనారు అను బంగారునగల వ్యాపారి
మఠములను కట్టించినాడు ఆ గంగాధర పూజారి
పరమశివ భక్తుల పాదములను కడుగుతాడు
కాశి విశ్వేశ్వరులంటు కౌపీనములను ఇస్తాడు
కాలచమత్కారమేమొ బ్రహ్మచారి కౌపీనము
కఠిన పరీక్షనే పెట్టింది తులాభార రూపముగా
కుటుంబమే కూర్చున్నది కౌపీనమును తూయగా
కారుణ్యము కురిపించగ కౌపీనము కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు "శివోహం" జపంబు చింతలు తీర్చు గాక.
కనకాభరణములు తనను చుట్టిముట్టియున్నను అమరనీతి మనసు చుట్టేది మాత్రము మహేశ్వర పాద సన్నిధిని మాత్రమే.తిరువల్లూరు దేవాలయములోని తిరుశివ నిత్యదర్శనమును సేవనమును కోరి, మఠములను నిర్మించి,,శివభక్తులకు అన్న వస్త్రదానములతో అమితానందమునొందుచుండగా,ఆదిదేవుడు బ్రహ్మచారిగా మఠమున ప్రవేశించి,తన పొడి కౌపీనమును భద్రపరచమని అమరనీతికిచ్చి తాను నదీస్నానమునకు వెళ్ళెను.తిరిగివచ్చిన బ్రహ్మచారికి ఇవ్వవలసిన కౌపీనము మాయమైనది.అమరనీతి కౌపీనమునకు బదులుగా తులాభారములో సమముగా తూగగలిగినది నిశ్చలభక్తి యొక్కటే యని నిరూపించబడినది.విషయభోగములను విషనాగులబారి పడకుండా విశేషఫలమునందించుటకు కౌపీనమును కారణముచేసిన శరణాగత రక్షకుడు మనలను కటాక్షించును గాక.
(ఏక బిల్వం శివార్పణం.)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...