Thursday, January 25, 2018

MAYIPORUL NAYANAR



" ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాఃశరీరం గృహం
పూజా తే విషయోపభోగరచనా నిద్రా సమాధిస్థితిః | 
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం"
చిదానందరూపా-మయిపోరుల్ నాయనారు
*************************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
మెయిపోరుల్ నాయనారు మహారాజు-శివభక్తుడు
చిక్కుజడలు-విబూది-రుద్రాక్షల అనురక్తుడు
కొండకోన సేతి ప్రజల అండనున్న శివయోగి
ధర్మముతో గెలువలేని శత్రువైనాడు కపటయోగి
మంత్రోపదేశమంటురాజమందిరమును ప్రవేశించె
కుతంత్రమును చూడమంటు కత్తిదూసి హతమార్చె
శత్రువును పొలిమేర దాటించగ రాజు శాసించె
కైవల్యమును పొంద కపటయోగి సేవ కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.
అపకారికి సైతము నెపమెంచక ఉపకారముచేసే సంస్కారము కలవాడుమెయిపోరల్ నాయనారు.మెయిపోరల్ అనగా భగవంతుడొక్కదే "సత్యము" అని నమ్మేవాడు.మిలాడ్ నాడు ప్రాంత సైన్యాధ్యక్షుడు.తిరుక్కొయిలూరు విరాటేశ్వర స్వామి భక్తుడు.భగవంతునియందు భగవద్భక్తుల యందు సమదృష్టి కలవాడు.పొరుగు రాజైన ముత్తునాథన్ శౌర్య ప్రతీకలైన మెయిపోరల్ సైన్యమును ధర్మయుద్ధమున జయించలేక కపటయోగి రూపమున ముత్తునాథన్ తిరుక్కొయిలూరు ప్రవేశించి,అంతః పురములోనికి ప్రవేశించబోవగా ధాతన్ అను ద్వారపాలకుడు అడ్డుకొనెను.వేదవిద్యను రహస్యముగా బోధించుటకు వెళ్ళవలెనని అసత్యమాడి
లోనికి వెళ్ళెను.మెయిపోరల్ ఆ యోగిని ఉన్నతాసనముపై కూర్చుండబెట్టి పూజించుచుండగా కత్తితో నిర్దాక్షిణ్యముగా దునుమాడెను.గమనించిన ధూతన్ బంధించబోగా మెయిపోరల్ నివారించి క్షేమముగా పొలిమేర దాటించి రమ్మని ఆనతిచ్చెను.అతను తిరిగివచ్చువరకు వేచియుండి,తన కుటుంబమునకు రాజ్యము శివసామ్రాజ్యముగా భాసిల్లాలని కోరిన నాయనారును రక్షించిన సదాశివుడు మనందరిని రక్షించుగాక.
(ఏకబిల్వం శివార్పణం.)

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...