NAAMANAMDI ADIGAL



బాల్యే దుఃఖాతిరేకో మలలులితవపుః స్తన్యపానే పిపాసా
నో శక్తశ్చేంద్రియేభ్యో భవగుణజనితాః జంతవో మాం తుదంతి 
నానారోగాదిదుఃఖాద్రుదనపరవశః శంకరం న స్మరామి
క్షంతవ్యో మే‌உపరాధః శివ శివ శివ భో శ్రీ మహాదేవ శంభో"

చిదానందరూపా-12
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా నిటలాక్షుని వరమనుకొందునా
నామనంది అడిగళ్ అడ్డనామాలవాని భక్తుడు
తిరురారూరు సామికి దొడ్డసేవానురక్తుడు
ఆరాధన భాగముగా ప్రదోష దీపారాధనమును తలిచాడు
ఆదిదేవుని దీపములకు ఊరివారిని ఆజ్యమును అడిగాడు
అది శాపమో-పాపమో శివ వ్యతిరేకులు వారు
నెత్తిమీది గంగమ్మతో దీపాలు పెట్టమన్నారు
నీటిని-నిప్పును సమముగ నిక్షిప్తము చేసుకొన్నవాడు
నిర్వాణమునిచ్చుటకు నీటిదీపములే కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చును గాక.
కఠిన పరీక్ష-కరుణా కటాక్షము, కైవల్యమను నాణెమునకు రెండువైపులు.మనము ఏ భావమును స్వీకరించిన అదియేగోచరమగును.శివభక్తుల చరితలందు కటాక్షమునకు పొందుటకు ఎక్కవలసిన మెట్టు కఠిన పరీక్షయే.
"సర్వజ్ఞానప్రదం దీపం సర్వ సంపత్ శుభావహం
దీపం దానం ప్రదాస్యామి శాంతిరస్తు సదా మమ".
దీపము సర్వజ్ఞాన దాయకము.సమస్త సంపత్ప్రదాయకము.శివ లీలగా రోజు ఏమాపెరూరు గ్రామము నుండి తిరువారూరుకు రెండుగంటలు నడిచివెళ్ళి శివుని పూజించు నామనంది ఆడిగళ్ కు
ఒకానొక ప్రదోషసమయమున శివారాధనగా దీపములను వెలిగించాలన్న సంకల్పము వచ్చింది.తన ఊరువెళ్ళి నెయ్యిని తెచ్చుటకు సమయముచాలదు.ఆ ఊరువారిని కొంచము ఆజ్యమును అడుగగా వారు శైవమునకు విముఖులు గావున నామనందితో హేళనగా కంట అగ్గి ఉన్నవానికి దీపముల సేవలా అంటూ నెయ్యి ఇచ్చుటకు తిరస్కరించారు.అంతటితో ఆగక మీ శివుడు అంతటి మహనీయుడైతే నెత్తిమీద ఉన్నను నీటితో దీపములు వెలుగునట్లు చేయమన్నారు.గంగాధరుని ఆన గంగ తైలశక్తినిసంతరించుకొని నామనందికి సంతోషమును కలిగించినది.దాని ప్రభావముగా హేళనచేసిన వారిని శివపూజాసక్తులుగా చేసినది.అంతా శివమయమే.అందరూ శివగణములే.నామనంది ఆధ్వర్యములో "పంగుణి ఉత్తరము" ఊరేగింపులతో పరవశించు సాంబశివుడు నామనందిని అనుగ్రహించిన రీతిని మనందరిని అనుగ్రహించుగాక.
( ఏక బిల్వం శివార్పణం.)

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

Appa Rama Bhakti Ento Goppara (ఆప్పా రామ భక్తి ఎంతో గొప్పరా)