SAKKIYA NAAYANAR

"ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణాభేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా
ప్రణతిః స్తుతిర్బహువిధా హ్యేతత్సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో"
చిదానందరూపా-సక్కియ నాయనారు
********************************
కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా
కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా
శివపూజకు అనుమతిలేని పాలనలో
ఏమి తక్కువచేసెను స్వామి లాలనలో
కనపడులింగము పూర్వము తానును రాయియే కదా
ఆ రాయికి రాతిపూజ అపూర్వపు సేవయే కదా
దూషణలన్నియు చేరు నిన్నుప్రదోష పూజలుగ చాలు చాలు
భావము గ్రహియించలేని నిన్ను భజియించుట భావ్యము కాదు కాదు
అనినను,లెక్కకుమించిన పున్నెము సక్కియ నాయనారుకు
సదాశివుని కరుణను పొందగ విసిరిన రాళ్ళే కారణమాయెగ
చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక
చిత్తముచేయు శివోహం జపంబ నా చింతలు తీర్చు గాక.
నిథనపతిని ప్రసన్నము చేసుకొనుటకుకావలిసినది భక్తి తత్పరత యను ధనము కాని బాహ్యాడంబరము కాదని నిరూపించినాడు సక్కియ నాయనారు అని పిలువబడే శాక్య నాయరారు. మగేశ్వరుని మానసపూజకు పాషాణమునకు -పారిజాతమునకు తారతమ్యములేదని తాదాత్మ్యమునొందిన సక్కియ నాయనారు తొండైనాడు ప్రాంతానికి సంబంధించిన భాగవతోత్తముడు.ఇతని ఈశ్వరసేవాతత్పరతను తెలియచేయు రెండు కథలు ప్రచారములో నున్నవి.
బౌద్ధములో తనబుద్ధి నిలువనందున శివ పాదములను ఆశ్రయించి,రమించుచు ఒక రాయిని అప్రయత్నముగా స్వామిపై ఉంచిన,పరమ ప్రీతితో శివుడు దానిని స్వీకరించుటచే,ఆ పూజా విధానమునే కొనసాగించి కైవల్యమును పొందెననునది ఒక కథ.
శివుడు సర్వాంతర్యామి అని గ్రహించిన వాడు కనుక శివపూజను వీడలేని పరిస్థితి.శివద్వేషులైన జైనులు పాలన కనుక శివభక్తిని ప్రకటించుకోలేని దుస్థితి.శివద్వేషిగా బాహ్యములో-శివ దూతగా ఆంతర్యములో పరమ విశేష పాషాణపూజను చేసిన సక్కియ నాయనారును అనుగ్రహించిన సదాశివుడు మనందరిని అనుగ్రహించును గాక.
( ఏక బిల్వం శివార్పణం.)

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.

DASAMAHAVIDYA-MATANGI