Thursday, January 25, 2018

NAYANARS-INTRODUCTION

పాహిమాం హర హర మహాదేవ శంభో శంకర-పాహి-పాహి
************************************************************
పంచభూత సమమిళితము ప్రపంచము.నింగి-నేల-నిప్పు-నీరు-గాలి అను పంచభూతములు(ఐదు ప్రధానంసములు) పరోపకార ఫలితమే మన పర్యావరణము.
చాంద్రమాన ప్రకారము చంద్రుడు కృత్తిక నక్షత్ర నివాసముచేయు మాసము కార్తిక మాసము.చంద్రునకు గల మరో పేరు సోముడు.పరమేశ్వరుని అర్థనారీశ్వర శక్తి ఉమ,తల్లి ఉమను కూడియున్న పరమేశ్వరుని సోముడు అని కీర్తిస్తారు. కార్తిక మాసములో పంచభూతములైన నింగి శరత్కాల వెన్నెలతో ఔషధములను అందించుచు ఆరోగ్య వంతులను చేస్తుంటుంది.నేల ఔషధులను ఉత్పత్తి చేస్తుంటుంది.నీరు వర్షపునీటిలోని ఔషధములను స్వీకరించి పరిశుభ్రమై పరిపుష్టినిచ్చుటకు సిద్ధముగా ఉంటుంది కృత్తికా నక్షత్రము అగ్ని నక్షత్రము కనుక నిప్పును సర్వరోగములను దహిస్తూ,సర్వజనుల శ్రేయస్సుకు కారణమవుతుంటుంది.గాలి పచ్చదనములోని ప్రాణవాయువును అందిస్తూ ప్రపంచ సౌభాగ్యమునకు ప్రధాన కారణముగా పనిచేస్తుంటుంది.కనుక ఈ మాసములో స్నానము,జపము,తపము,ఉపాసనము.దీపము,ధ్యానము,దానము సదాశివునికి సంతోషదాయకము.(మన లోపలి-బయటి ప్రపంచమునకు.)
" న కార్తిక సమో మాసో-న కృతేన సమే యుగం
న వేద సదృశం శాస్త్రం-న తీవ్ర్థం గంగయా సమం."
యుగములలో మొదటిదైన సత్య యుగమునకు ,నదులలో గంగానదికి,శాస్త్రములలో వేదమునకు,మాసములలో కార్తిక మాసమునకు సమానమైనది లేదని పెద్దలు నిర్ధారించారు.ఎందరో మహానుభావులు ఎల్లవేళల వీలుకాని పక్షమున కార్తిక మాసములో ప్రకృతిని పరమేశ్వరునిగా భావించి,సేవించి,తరించుచున్నారు.వారందరికి నా ప్రణతులు మరియు ప్రణుతులు.వారిలో "పెరియ పురానము" లోని నాయనార్లు పరమేశ్వరుని పూజిస్తూ,దూషిస్తూ,తమకు నచ్చిన నియమమును ఆరాధనగా భావించి,ఆ చంద్ర తారార్క ఆరాధ్యులైనారు.
ప్రియ మిత్రులారా,
సచిద్రూపము (సత్తు-చిత్తు-రూపము) పరమాత్మను మనము సత్యం-శివం-సుందరం అని కీర్తించుచున్నాను.సత్యము అనగా శాశ్వతత్వము.సుందరము అనగా సంతోష ప్రదము.శాశ్వత సంతోషమే శివము.అదియే పరమాత్మ ప్రకాశము.
పాలు-మీగడ,పెరుగు,మజ్జిగ,వెన్న ఇలా రూపాంతరములు చెంది నెయ్యిగా మారుతుంది.పేరుకున్నా,కరిగించినా అది నెయ్యిగానే ఉంటుంది.రూపాంతరము చెందదు.అదే విధముగా
శాశ్వత సుందర తత్త్వమునకు ఆకర్షింపబడినవారు దానినుండి వెనుదిరగలేరు.అది మనదారిని మళ్ళించి వేస్తుంది.మహేశ్వరునితో మమేకము చేస్తుంది.భక్తుల కథలను అందించుట భగవంతునికి ప్రీతిపాత్రము కనుక ,ఆ శివుడు పెరియపురాణ కథలను మురెపముగా నా చేయి పట్టుకొని తనే నవరత్న మాలికగా అల్లుచున్నప్పుడు,నా అజ్ఞానము ఆ తండ్రి చేతిని విడిచిపెట్టి,గులక రాళ్లను చేరుస్తూ,తన పని తాను చేసుకు పోయింది. పెద్ద మనసుతో నా సాహసమును మన్నించి,వానిని సాలగ్రామములుగా మలచుచున్న సదాశివునికి సమర్పిస్తూ,మీముందు ఉంచటానికి ప్రయత్నిస్తాను.స్థలముల,వరుసన,పేర్ల విషయములలో లోపములున్న సవరించి,సహకరించగలరు.
సాదర ప్రణామములు.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...