NAANNA OKA GODUGU



అసలేమి అర్థంకాదు.
********************
1.కడలినీరు తాగుతాడు
కడుపు నింప సాగుతాడు
నా చేతి స్పర్శ తగలగానే
హర్షముగా మారతాడు
వర్షము తానౌతాడు
అంతలోనె
వర్షము తడిపేస్తుందని నాన్నవుతాడు గొడుగు.
2.తప్పులు చూపిస్తాడు
నిప్పులు కురిపిస్తాడు
నా తప్పు తెలుసుకోగానే
మెప్పును దాచేస్తాడు
ఉప్పెన తానౌవుతాడు
అంతలోనె
ఉప్పెన ముంచేస్తుందని నాన్నవుతాడు పడవ.
3.పప్పుసుద్ద అంటాడు
దెప్పిపొడుస్తుంటాడు
నా అభ్యాసము చూడగానే
సిద్ధము అవుతుంటాడు
యుద్ధము తానవుతాడు
అంతలోనె
యుద్ధము గెలిపిస్తుందని నాన్నవుతాడు కవచము
4.పెదవి విరుస్తుంటాడు
బెదిరిస్తుంటాడు
నా కుదురు గెలుపు" కుదురవుతోందనగానే"
నోటమాట రానీయడు
తోటమాలి తానౌతాడు
వింతగానే
చప్పట్లతో నన్ను హత్తుకోలేనని నాన్నవుతాడు శాలువ
ఇప్పుడిప్పుడే " కొంచము" అర్థమవుతున్నాడు నాన్న.
పితృదేవోభవ.

Comments

Popular posts from this blog

AMBA VANDANAM-JAGADAMBA VANDABAM

DASAMAHAVIDYA-MATANGI

KAMAKSHI VIRUTTAM-TELUGU LYRICS.