Thursday, January 25, 2018

MAHARAASHRE EKAVEERAA

 ఏకవీరికాదేవి

  "దత్తాత్రేయ సమారాధ్యా అనసూయాత్రిసేవితా
   ఏకవీరా మహాదేవి మస్తకేనైవ శోభిని
   రేణుకామాతా  మాయా సమ్హార రూపిణి
   కృపయా పాతునస్సర్వాన్ మయూరే  ఏకవీర్యకా".

    ఏకైవ అనేక రూపేషు-ఏకవీరా.

    ఏకైక
  శక్తి స్వరూపము జగత్కళ్యాణము కొరకు అనేకములుగా గోచరింపచేయునది ఏకవీరాదేవి.ఏకైక వీరత్వ స్వరూపము ఏకవీరాదేవి అని లలితాసహ్స్రనామస్తోత్రములో"సమానాధిక వర్జితా" అని కీరింపబడినది.అనగా అమ్మశక్తికి సమానమైన శక్తిగాని,అధికశక్తి కానిలేదు.
  ఒకే స్థితిలోనున్న శక్తి అనేక గతులలో ప్రవేశించి ప్రకటింపబడునది ఏకవీరాదేవి.ఈ తల్లిని ఏకవేణిదేవి అని కూదా కొలుస్తారు.అదితి అని ఛిన్నమస్త అని కూడా భావిస్తారు.

   దేవీభాగవత ప్రకారము ముహూర్ క్షత్రమును మాతాపురి,మాత్రిపురపురి అని కూడా వ్యహరించెడివారు.మరాఠీభాసలోఅమ్మను ఆయీ అంటారు.ఇక్కడివారు ఏకవీరా ఆయీ అని అమ్మను కొలుస్తారు.
  మాయాసతి కుచేయి మాహూరప్రాంతములో పడి రేణుకాదేవిగా/ఏకవీరాదేవిగా ఆవిష్కరింపబడినదని స్థలపురాణము చెప్పుచున్నది.పరశురామునికి ఈ క్షేత్రమునకు గల సంబంధము ఏమిటి? అను ప్రశ్నకు సమాధానమే క్రింది వృత్తాంతము.

   ఇక్ష్వాకుడైన రేణువు కుమార్తె రేణుకాదేవి.రేణువు (పరమాణువు)సూక్ష్మతత్త్వమునకు ప్రతీక.సూక్ష్మముగా నున్న రేణువులో దాగి యున్న ఛిచ్చక్తియే రేణుకాదేవి.ఈ తల్లి స్వయంవరములో
  జమదగ్నిని వరించిన మహాపతివ్రత.వీరికి వసు-విశ్వావసు-బృహద్భాను,బృహత్కణ్వ అను నలుగు పుత్రులు.రేణుకాదేవి
  తపోశక్తితో భృగు మహర్షి అంశతో నున్న రాముడను శక్తిసంపన్నునకు తల్లియైనది.రాముడు తపోనిష్ఠాగరిష్ఠుడు.కైలాసమున పరమేశుని కరుణకై తపమొనరించి,వరముగా
  ధనుర్వేదమును,రత్నఖచిత ధనస్సును పొందెను.పాశుపత మహా
  మంత్రమును బ్రహ్మవలన
 పొందెను.గణపతి
 పరశు నిచ్చి దీవించుటచే పరశురాముడు గా కీర్తింపబడుచున్నాడు.

   పవిత్ర జలసేకరణకై నదీతీరమునకు వెళ్ళిన రేణుక ఒకనాడు అక్కడ చిత్రరథుడు అను గంధర్వుడు తనచెలులతో జలక్రీడలాడుచుంట చూసి,తానును జమదగ్నితో జలక్రీడాసక్తతను భావించెను.విషయమును గ్రహించిన జమదగ్ని అమ్మ కోరికను దోషముగానెంచి,దానికి శిక్షగా ఆమె తల నరకమని తన కుమారులనాదేశించెను.మాతృహత్యాదోషము అంటునని వారు నిరాకరించిరి.అంత జమదగ్ని పరశురాముని పిలిచి తల్లి శిరఛ్చేదమును కోరగా అటులనే గావించెను.(జ్ఞాని అయిన పరశురాముడు లోకకళ్యాణమునకై)తండ్రి ఆన శిరసావహించెను.సంతుష్టుడైన జమదగ్ని పరశురాముని వరము కోరుకోమనగా ,తల్లిని పునర్జీవితురాలిని చేయమని కోరి,తపమునకు వెడలిపోయెను.

   రేణుకామాత ఆవిర్భావమునకు కార్త్యవీరార్జునుని ప్రమేయముకూడా ఉన్నది.అమ్మలీలలో కదిలే పావులు.ఇతని పేరు అర్జునుడు.సొట్టచేతులతో రాజవంశములో జన్మించెను.దైవకృపవలన వీరత్వము లభించెను.కృతక వీరత్వము కలవాడు కనుక కార్త్యవీరార్జునుడూ.వెయ్యిచేతులుకలవాడు.అహంకారి.ఒకసారి జమదగ్ని ఆశ్రమములో ఆతిధ్యమును స్వీకరించి,దానికి కారణము కామధేనువని గ్రహించి,దానిని తనకిమ్మని జమదగ్నిని ఆజ్ఞాపించెను,వీలుకాని సమయమున ,జమదగ్నిని సం హరించి,రేణుకామాత కుడిచేయిని 21 సార్లు గాయపరచి,కామధేనువును బలవంతముగా లాగసాగెను.అప్పుడు ఆ ధర్మదేవత శరీరము నుండి అనేకానేక సేనలు పుట్టి,ఆ రాజును తరిమివేసెను.

     "ఇదం బ్రాహ్మం-ఇదం క్షాత్రం" అన్న పరశురాముని అమ్మ పిలిచి,ఒక కావడీలో

 జమదగ్నిమృతదేహము
ను తనను తీసుకుని వెళ్ళమని,ఆకాశవాణి ప్రేరణయైన ప్రదేశములో దహనసం స్కారములు చేయమని చెప్పెను.అటులనే వెళ్ళుచుండగా సహ్యాద్రి దగ్గర ఆకాశవాణి పలుకుల ప్రకారము అంత్యక్రియలను దత్తాత్రేయస్వామి ఆధ్వర్యములో  చేసెను.దత్తాత్రేయ స్వామిచే అమ్మవారు ఏకవీరాదేవిగా అనేకవిధముల స్తుతింపబడినది.స్వామి పరశురామునికి ఒక షరతు పెట్టెను.చితికి నిప్పంటించిన తరువాత వెనుదిరగకుండ వెడలిపొమ్మనెను.చితాభస్మము నుండి అమ్మవారి ఆవిర్భావము ప్రారంభమైనది.జుతూహలమును ఆపలేని పరశురాముడు వెనుతిరిగి చూడగానే అంతటితో ఆగిపోఇన ప్రకటన మనకు అమ్మవారి శిరమును మాత్రమే అందించినది.అమ్మ ముక్కు త్రికోణాకృతిలో త్రిగుణాత్మకముగా ఉంటుంది.అమ్మ పెదవి అతి విశాలమై సూక్ష్మ-స్థూల తత్త్వములకు ప్రతీకగ నిలుస్తుంది

      మూహూర్ క్షేత్రమునందు మూడు పవిత్ర పర్వతములు కలవు.మొదటి పర్వతమును రేణుక శిఖరమనియు,రెండవ దానిని దత్త శిఖరమనియు,మూడవ దానిని అత్రి-అనసూయ శిఖరమని అందురు.

  రేణుకా శిఖరమును "మాతృకాతీర్థము" అని కూడా అంటారు.రేణుక-జమదగ్ని అంత్యక్రియలు జరిపిన ప్రదేశము కనుక "అంత్యేష్టి స్థానము" అని కూడా పిలుస్తారు.అమ్మ సాక్షాత్కరించి కావ్యకంఠ గణపతి మునిని ఆశీర్వదించిందని చెబుతారు.మత్స్యకారులు,కోయజాతి జనులు  ఏకవీరాదేవిని కులదేవతగా కొలుస్తారు.తామస క్షేత్రముగా పరిగణిస్తారు కనుక జంతుబలులకు అభ్యంతరము లేదు.

  * తాంబూలమును ప్రసాదముగా పంచుట ఇక్కడి ప్రత్యేకత.

   చేదముగాని తల్లి మన ఖేదములను తొలగించునుగాక.

     శ్రీ మాత్రే నమ:.

No comments:

Post a Comment

TANOTU NAH SIVAH SIVAM-18

    తనోతు నః శివః శివం-17     *******************  " వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే    జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరౌ" ...