tiruvembaavaay-14
తిరువెంబావాయ్-14
****************
"కృపాసముద్రం సుముఖం త్రినేత్రం
జటాధరం పార్వతీ వామభాగం
సదాశివం రుద్రం అనంతరూపం
చిదంబరేశం హృది భావయామి."
సందర్భము
********
"గమాగమస్థం గమనాదిశూన్యం
చిద్రూపదీపం తిమిరాపహారం
పశ్యామి తం సర్వజనాంతరస్థం
నమామి హంసం పరమాత్మ రూపం.
ప్రస్తుత పాశురములో వారు చేయున్న స్నాన విశేషము,ఆ సమయమున వారి కేశములు,ధరించిన ఆభరనములు వదులుగా జరిగి శబ్దము చేయుట,వారి దివ్య సంకీర్తనము వారు సామీప్యభక్తి దశలో నున్నారని తెలియచేస్తున్నది.
పాశురము
********
కాదార్ కుడైయాడ పైపూం కళాలాడ
కోదై కురళాడ వండిన్ కులామాడా
సీద పునలాడి చిట్రంబలం పాడి
వేదపొరుళ్ పాడి అప్పొరుళ్ ఆమా పాడి
శోది తిరం పాడి శూట్కొండ్రై తార్పాడి
ఆది తిరం పాడి అందం ఆమా పాడి
పేదిత్తునమ్మై వళర్తెడిత్తు పే వళిదన్
పాదత్తిరం పాడి ఆడేలో రెంబావాయ్.
.......
"నామ సంకీర్తనం యస్యా సర్వ పాప ప్రణాశనం
ప్రణమో దుఃఖ శమనం తం నమామి హరి పరం."
యుగధర్మముల ప్రకారము భగవంతుడు భక్తసులభునిగా తన కరుణా వీక్షణములతో కైవల్యమును అనుగ్రహిస్తున్నాడో,
ప్రస్తుత పాశురములో తిరుమాణిక్యవాచగరు మనకు విడివడుచున్న ఆభరణములు,కేశపాశమును చూపిస్తూ వానితో పాటుగా వారు చేచున్న తీర్థస్నాన ఫలితముగా విడిచిన మాయతెరను కూడా ప్రస్తావిస్తున్నారు. అంతః-బహిర్ శుద్ధులైన వారు స్వామి వేదస్వరూపమును,వేదాంత రహస్యములను గుర్తించి,మోక్షమార్గముగా దానిని గ్రహించి కీర్తించుచున్నారు. వారు హృదయమనే హ్రదములో ప్రాపంచిక విషయములను దూరము చేసుకొని ఆడుచు-పాడుచు పరవశిస్తున్నారు.వారి సుకృతమును నేను ఏమని వర్ణించగలను.సాక్షాత్తు ఉమయే స్వామిని ప్రాపంచిక వస్తువులకు భిన్నముగా/పరంజ్యోతిగా గుర్తించేందుకు పక్కనే ఉంది.
కంకణములు,మొలనూలు/ఒడ్డాణము/అందెలు మంగళ సంకేతములు.అవి ఇప్పుడు చేయుచున్న ధ్వనులు సామాన్యమైనవి కాది.మంగళ వాయిద్యములై స్వామికి మంగళమును పాడుచున్నవి.ఉపాధిని మించినది నేను అనే సత్యమని తెలుసుకున్న వారు,
"అహం బ్రహ్మాస్మి" అంటూ అలౌకికానందమును అనుభవిస్తున్నారు.
అంబే శివే దివ్య తిరువడిగళే పోట్రి.
ఏక బిల్వం శివార్పణం.

Comments
Post a Comment