Posts

ఓం నమ: శివాయ-20

Image
   ఓం నమ: శివాయ-20   పాశము విడువని  నాడూ యమపాశము విడిపించగలడ   గంగను విడివని వాడు  నా బెంగను  తొలగించగలడ   మాయలేడిని  విడువనివాడు  మాయదాడిని ఎదిరించగలడ   విషమును  విడువనివాడు  మిషలను  కనిపెట్టగలద   ఉబ్బును విడువని వాడు జబ్బులు  పోగొట్ట గలడ   నృత్యము విడువని వాడు దుష్కృత్యములను  ఆపగలడ   భిక్షాటన విడువనివాడు శిష్టుల రక్షించగలడ   చిన్ముద్రను విడువనివాడు  ఆదుర్దా గమనించగలడ   వింతరాగమున్నవాడు  వీతరాగుడవగలడ   బైరాగిగ తిరుగువాడు  భగవంతుడు అవుతాడా   అనాధుడనను వాడు  బాధలు తొలగించగలడ,అంటు   బుగ్గలు నొక్కు కుంటున్నారురా  ఓ తిక్క శంకరా.

ఓం నమ: శివాయ-21

ఓం నమ: శివాయ-22

Image
      ఓం నమ: శివాయ-22   అనిశము వశమగుతావు  పశునామములకు  నీవు   పశుపతి అని పిలువగానే  పరవశమేగా  నీకు   కాల భైరవుని  కాశికాపుర పతిని  చేశావు   శరభమువై  నరసిం హుని  శాంతింప చేశావు   మిక్కుటమగుప్రేమకల    కుక్కుటేశ్వరుడవు నీవు   వ్యాళమును అనుగ్రహించిన  కాళేశ్వరుడవు నీవు   స్కంధోత్పత్తికి వనమున లేడిగ కనిపించావు   వ్యాఘ్రమునకు మోక్షమిచ్చిన  వ్యాఘ్రేశ్వరుడవు నీవు   జంబుకమును  కరుణించిన  జంబుకేశ్వరుడవు   శ్రీ కరి కాళములను దయతలచిన  శ్రీ కాళ హస్తీశ్వరుడవు   పాశమేసి నన్ను బ్రోవ రమ్మంటే,నా భక్తిని   కప్పల తక్కెడ  అంటావురా ఓ తిక్క శంకరా. 

ఓం నమ: శివాయ-23

Image
    ఓం నమ: శివాయ-23   నీ పాదము పట్టుకుందమన్న  చిందులేస్తు  అందకుంది   నీ నడుమును  వేడుకుందామన్న పులితోలు  అలిగింది   నీ హృదయము దరిచేరదమన్న  కుదరదు అని అంటోంది   నీ చెవికి చెబుదామన్న  చెడ్డ  పుర్రె అడ్డుకుంది   నీ చుబుకము  పట్టుకుందామన్న  విషము సెగలు కక్కుతుంది   నీ కన్నుకు  కనిపిద్దామన్న  కొంచమైన  తెరువకుంది   నీ  ముక్కుకు  చెబుదామంటే  మూసి జపము చేస్తున్నది   నీ జటకు  ఉటంకిద్దామంటే  గంగవెర్రులెత్తుతోంది   నన్ను రానీయక నీవు తమ సొంతమంటు  గంతులేస్తున్నవి   సుంతయైన  కనికరమే చూపించలేమంటున్నవి   నీ దరి  సేదతీరుతూ ఆదరమునే మరచిన వాటి   టక్కరితనమును చూడరా  ఓ తిక్క శంకరా.   

ఓం నమ: శివాయ-24

Image
ఓం నమ: శివాయ -24 చక్కదనపు నలుగునిడి స్నానము చేయిద్దామనుకుంటే పుక్కిలింత నీళ్లతో సొక్కిపోయి ఉంటావు పట్టు పుట్టాలు నీకు కట్టాలనుకుంటేను గట్టిగా విడువనంటు చుట్టుకుంది పులితోలు కనక భూషణములను కంఠమునకు వేయాలనుకుంటేను కాలకూట విషము పాము కౌగలించుకున్నదాయె ప్రేమతో పరమాన్నము తినిపిద్దామనుకుంటేను పచ్చి మాంసపు ముక్క పచ్చి అనక ఉందాయె పక్కింటి వాళ్లతో ఆడుకోమమటేను నాకు పక్కిల్లే లేదని ఎక్కి ఎక్కి ఏడుస్తావు ఎవరు నీకులేరను వారికి ఎరిగించు నిజమును అక్కను నేనున్నానని ఓ తిక్క శంకరా. ......................................................................................................................................................................................................

ఓం నమ: శివాయ-25

Image
ఓం నమ: శివాయ-25 కాదనలేవుగ పాముని,కాదనలేవుగ చీమని కాదనలేవుగ లేడిని,కాదనలేవుగ వేడిని కాదనలేవుగ దండని,కాదనలేవుగ కొండని కాదనలేవుగ తేటిని,కాదన లేవుగ నీటిని కాదన లేవుగ బూజుని,కాదనలేవుగ బూదిని కాదన లేవుగ మేథని,కాదన లేవుగ వ్యాధిని కాదనలేవుగ గౌరిని,కాదనలేవుగ శౌరిని కాదనలేవుగ సుతులని,కాదనలేవుగ నుతునులని కాదన లేవుగ విందుని,కాదనలేవుగ విందుని కాదనలేవుగ మునులని,కాదనలేవుగ జనులని ఒకే ఒక్కసారి నిన్ను ఒక్కడినే రమ్మంటే,ఈ తొక్కిసలాటేమిరా ఓ తిక్క శంకరా

ఓం నమ: శివాయ-26

Image
ఓం నమ: శివాయ-26 ఉదారతను చూపగ ఆ అసురుని ఉదరములో ఉంటివి గంగిరెద్దు మేళము నిన్ను కాపాడినది ఆనాడు కరుణను చాటగ ఆ అసురుని చేతికి అగ్గినిస్తివి మోహిని సహాయము నిన్ను కాపాడినది ఆనాడు భోళాతనమును చాటగ ఆ అసురునికి ఆలిని అందిస్తివి నారద వాక్యము నిన్ను కాపాడినది ఆనాడు ఆత్మీయత అనుపేర ఆ అసురునికి ఆత్మలింగమును ఇస్తివి గణపతి చతురత నిన్ను కాపాడినది ఆనాడు భ్రష్టులైన వారిని నీ భక్తులు అంటావు రుసరుసలాడగ లేవు కసురుకొనవు అసురతను మొక్కారని అసురులకు గ్రక్కున వరములనిస్తే పిక్క బలము చూపాలిరా ఓ తిక్క శంకరా ..........................................