Posts

SREESAILAE BHRAMARAAMBIKAA

Image
      శ్రీశైలే  భ్రమరాంబికా  " శివ పార్శ్వావస్థిత మాతే  శ్రీశైలే శుభపీఠికే    భ్రమరాంబిక  మహాదేవి  కరుణారస వీక్షణ"     " శ" కారము సుఖ బీజము."ర" కారము అగ్ని బీజము."ఈ" కారము చిఛ్చక్తి స్వరూపము.ఎటువంటి పరిస్థితినైనను అనుకూలముగా చేయగలది "శకారము." శకార-ర కార-ఈ కార సమ్మిళితము  శ్రీశైలము. శ్రీశైలమునకు సిరిగిరి,శ్రీగిరి,శ్రీ పర్వతము మొదలైన నామాంతరములున్నవి.శ్రీ అనగా సంపద. శైలము అనగా పర్వతము."శ్రీశైలము" అనగా సంపద్వంతమైన పర్వతము.దీనికి శ్రీ కైలాసము అనుపేరు కూడా వ్యవహారములో కలదు.మహేశ్వరులు శ్రీ కైలాసమునందున్నారని 13 వ శతాబ్దపు శాసనము తెలియచేయుచున్నది       కృష్ణానదీ తీరమున,దట్టమైన నల్లమల అడవుల గుట్టలపై పడిన మాయాసతి మెడ భాగము "భ్రమరాంబికా దేవి" గా భక్తులను అనుగ్రహించుచున్నది.అయ్యవారు మల్లిఖార్జున స్వామి. శ్రీ సిరివరపు నాగమల్లిఖార్జున శర్మగారి  అభిప్రాయము ప్రకారము శ్రీశైలము ద్వాదశ జ్యోతిర్లింగములలో రెండవది.అష్టాదశ శక్తిపీఠములలో ఆరవది.దశ భాస్కర క్షేత్రములలోను ఆరవది.    అమ్మవారి గర్భగుహ లోపల అగస్...

ALAMPURAE JOEGULAAMBA

Image
   ఆలంపురే జోగులాంబ  "లంబస్తనీ వికృతాక్షి ఘోరరూపాం మహా బలాం   ప్రేతాసన  సమారూఢాం  జోగులాంబాం  నమామ్యహం"   మాయాసతి పైపలువరస పడి జోగులాంబగా కర్నూలుకు సమీపములోనున్న ఆలంపుర క్షేత్రమునందు భక్తులను అనుగ్రహించుచున్నది.ఉష్నస్వభావముతో నున్న తల్లిని చల్లబరచుటకు అలయము చుట్టు తటాకములు ప్రసాంతముగా ప్రవహించుచుండును.స్వభావములోనేకాదు స్వరూపములో కూడ అమ్మ ఉగ్రముగా ఉండి తలపై తేలు,బల్లి,గుడ్లగూబ,  శవము మొదలగు వాని   ఆభరణములుగా అలంకరించుకొనును.        అలంపురము పూర్వము హలపురము హలంపురంగా వ్యవహరింపబడినది. చాలుక్యరాజైన రెండవ పులకేశి ఆలయ పునర్నిర్మాణము గావించెనని శాసనములు తెలియచేయుచున్నవి.   పూర్వము ఋషిశాపము వలన తన బ్రహ్మత్వమును కోల్పోయిన బ్రహ్మ ఈ పుణ్యస్థలమున శివుని గురించి ఘోరతపము చేసెనట.పరమేశుడు సంతుష్టుడై బాల బ్రహ్మ,తారక బ్రహ్మ,పద్మ బ్రహ్మ,కుమార బ్రహ్మ,ఆత్మ బ్రహ్మ,వీర బ్రహ్మ,విశ్వ బ్రహ్మ,గరుడ బ్రహ్మ,శబ్ద బ్రహ్మ అను నవ బ్రహ్మ రూపములలో సాక్షాత్కరించి అనుగ్రహించెనట.శివ బ్రహ్మమే జగమంతా అని భావించిన రస సిద్ధుడు నవబ్రహ్మ మందిరమ...

CHAAMUMDAAA KRAUMCHA PATTANAA.

Image
   " దం ష్ట్రా  కరాళవదనే  శిరోమాలా విభూషణే    చాముండే  ముండమదనే  నారాయణి నమోస్తుతే"     చండముండాసురను  శిరస్ఛేదము చేసిన తదుపరి సిం హవాహిని యైన అమ్మ కాళి పరమేశ్వరిని దర్శించగా, తల్లి చండముండ ఖండిత శిరములను కాళి రెండుచేతులలో చూసి చాముండా అని పిలిచినదని దేవీభాగవతము పేర్కొంటున్నది.చాముండి పర్వతముపై వెలిసిన తల్లి కనుక చాముండేశ్వరీదేవి అనికూడా కొలుస్తారు.   పూర్వకాలములో అనేక మునులు యోగులు నిశ్చలచిత్తముతో ఏకాగ్రతతో అమ్మకరుణ అను ఆహారము లభించువరకు ఒంటికాలిపై ఘోరతపముచేసి కృతకృత్యులయ్యారట.మనవునితో సమానమైన ఏకాగ్రత,పట్టుదల,చాకచక్యము గలది క్రౌంచము (కొంగఒక్కటే) తన కార్యము సఫలము అగువరకు దీక్షగా ఏటిగట్టున వేచియుంటుంది.అదే పట్టుదలతో ఏకాగ్రతతో ఎటువంటి ప్రలోభములకు లోనుకాకుండ ఎందరో తపమాచరించి తరించిన పట్టణము కనుక క్రౌంచపట్టణము అను పేరు వచ్చినదట.కాని కాల క్రమేణా కొంగజపము విపరీతార్థముగా వ్యవహారములోనికి వచ్చి దొంగ జపముగా మారినది.ఆ విధముగా చూసుకొనిన శుంభ నిశుంభులు తమ స్వార్థమునకు బ్రహ్మగురించి తపమాచరించి వరములు పొందిన తరువాత కన్నుమిన్ను కానని వ...

PRADYUMNAE SRNKHALAADEVI

Image
        ప్రద్యుమ్నే శృంఖలాదేవి   " ప్రద్యుమ్నే వంగరాజ్యాయాం శృంఖల నామ భూషితే     విశ్వ విమోహితే దేవి శృంఖల బంధనాశిని"    వంగదేశములోని  ప్రద్యుమ్న నగరములో పడిన మాయా సతి పొట్ట భాగము "శృంఖలాదేవి" గా ఆరాధింపబడుతున్నడి.ఈ తల్లిని" శృంగలాదేవి","సిం హళాదేవి" అని కూడా ఆరాధిస్తారు.   సిం హళ అనే శబ్దమునకు సంకెల -బాలెంత నడుము కట్టు అని కూడా వ్యవహారములో ఉంది.స్థలపురాణము ప్రకారము ఈ ప్రదేశములో ఋష్యశృంగ మహాముని అమ్మవారిని  పూజించి,కటాక్షమునకై తపమాచరించి ప్రసన్నురాలిని చేసుకొనెనట.ఇక్కడ మనకు "ఋష్యశృంగము" అను పెద్ద కొండ ఆ ముని గుర్తుగా మనకు దర్శనమిస్తుంది.అతడు అమ్మతో సహా కర్ణాటక లోని  శృంగేరీ పీఠమును దర్శించి తిరిగివచ్చి ఈ స్థలములో అమ్మ శక్తిని ప్రతిపాదితము చేశారట.భక్తానుగ్రహముతో తల్లి శృంగలాదేవి నామముతో ఆరాధింపబడుతుందట.   ఇంకొక ఐతిహాసిక కథనము ప్రకారము ధర్మనిరతికై శ్రీకృష్ణపరమాత్మా రుక్మిణీమాతలను పరీక్షింపదలచి వారిని బండికాడికి కట్టి లాగమన్నాడట.లాగుతున్న సమయములో అమ్మవారికి దాహమువేయగా స్వామి   జలమును అందించినాడట.అమ్మ దప్ప...

KAAMAAKSHI KAAMCHIKAPURE

Image
   కామాక్షి కాంచికాపురి   ***************************   "పుష్పేషు జాజి పురుషేషు విష్ణు    నారీషు రంభ  నగరేషు కంచి"  ఆర్యోక్తి.   మాయాసతి వీపు భాగము పడిన ప్రదేశము కామాక్షి దేవిగా భక్తుల  కల్పతరువైనది.అయ్యవారు  ఏకామబరేశ్వరుడు.ఏకామ్రేశ్వరుడు అను కూడా పిలుస్తారు.అమ్మవారి సైకత లింగ పరమేశ్వరిని మామిడిచెట్టుక్రింద్ అ నిలిపి తపమాచరించి పతిగా పొందినది.పంచభూతాత్మిక క్షేత్రముగా ప్రసిద్ధిచెందినది కంచీపురము.   "అయోధ్యా మధురా మాయా కాశి కాంచి అవంతికా" అను భారత దేశములోగల సప్త మోక్ష పురములలో ఒకటి.ఆద్వైత విద్యకు ఆధారస్థానము.పూర్వకాలములోని అలంకారికులు లాక్షణికులు తమ రచనలను ప్రమాణీకరణకు కంచికి పంపి వారి ఇంటిముఖము పట్టెడివారు కనుక కథ కంచికి మనము ఇంటికి అను నానుడి.ఎందరో కవులు చరిత్రకారులు విదేశీ యాత్రికులు(పాహియాను) కాంచీ వైభమును గురించి ప్రస్తావించిరి.  " క" కారము సృష్టికి" మ" కారము పోషణకు ప్రతీకలుగా గుర్తిస్తారు.కామాక్షి విలాసము అను గ్రంధము ప్రకారము అమ్మ శక్తిని మన్మథుని యందు ఆవహింపచేస్తుందట.   ..ఇతిహాసకథల ప్రకారము అమ్మ భీకర...

LANKAAYAAM SAANKAREEDEVI.

Image
  1.లంకాయాం శాంకరీదేవి-కామాక్షి కంచికాపురి.     **************************************************    సంస్కృతములో శ్రీ అంటే భవ్యమైనది.లంక అంటే తేజస్సుగల భూమి లేక ద్వీపము.జలావృత భూభాగము లంక.ఇక్కడ పడిన మాయాసతి మొలభాగము శాంకరీదేవిగా ప్రకాశించుచున్నది.త్రికోణేశ్వరుడు అయ్యవారు.దక్షిణసముద్రతీరముననున్నది.ఇక్కడ పార్వతీదేవి శివలింగము లోపల కొలువై భక్తులకు దర్శనమిస్తారు.స్థపురాణ కథలను బట్టి ఒకసారి ఆదిశేషునిలో వాయుడేవునిలో అహము ప్రవేశించి విపరీత పరిస్థితులకు దారితీసెను.దాని పర్యవసానముగా శివుడు దక్షిణతీరమును కైలాసముగావించ దలచెను.    శివుని ఆన గాన అమ్మవారి మదిలో లంకలో ఒక అపురూప సుందర భవనమును నిర్మింపచేసుకుని  సకుటుంబముగా నివసింపదలచెను.ఆమె ముచ్చట తీర్చుటకు శివుడు విశ్వకర్మచే పరమాద్భుత భవనము నిర్మింపబడేను.గృహప్రవేశ పౌరోహిత్య అవకాశము రావణుని వరించినది.భవనసౌందర్యమునకు మోహితుడైన రావణుడు పూజానంతరము ఆ భవనమును దక్షిణగా కోరెను,(ధర్మముకాదని తెలిసియు)కరుణాంతరంగ అందులకు అంగీకరించి రావణుడు ధర్మము తప్పనంత కాలము ఊండుటకు అంగీకరించెను.సీతాపహరణ సమయమున అమ్మమాటలు పెడచెవిన పె...

MAHAAMAHOPAADHYAAYA SRI GIDUGU JAYAHO

Image
https://www.youtube.com/watch?v=vXopOY3iMso