Posts

PURUHOOTIKAA PEETHIKAAPURAE

Image
   "పురుహూత సతి మాత పీఠికాపురు సంస్థిత    పుత్రవాత్సల్యతా దేవి భక్తానుగ్రకారిణి"   మాయాసతి పీఠికాభాగము పడిన ఆంధ్ర ప్రదేశములోని పవిత్ర స్థలమును "పీఠికాపురము" అనియు,పిఠాపురము అనియు,పిష్ఠపురము అనియు,పాదగయ అనియు భావిస్తూ,భజిస్తూ ఉంటారు.పీఠికాపురి పాలిని "పీఠాంబ" అని నమ్ముతారు.ఆ తల్లి ఒక చేతిలో బంగారు పాత్ర,వేరొక చేత బాగుగా పండిన ఉసిరికాయ,మరొక చేత త్రిశూలము,నాల్గవ చేత లోహదండమును ధరించి నేత్రోత్సవము చేసెడిదట.వృతాసుర సంహార దోషమును తొలగించుకొనుటకు ఇంద్రుడు అమ్మగురించి అత్యంత నియమ నిష్ఠలతో తపమాచరించి ప్రసన్నురాలిని చేసుకొనెనట అమ్మ సంతసింసించి ఇంద్రుని మరొక పేరైన (పురుహూతుడు)పురుహూతిక నామమును స్వీకరించి,ఆశీర్వదించినదట. హుంకారిణి శక్తిపీఠ్ముగా ప్రసిద్ధిచెందిన స్థలములో వెలిసిన తల్లిని " ఓంకారిణి" అని కూడా పిలుస్తారు.   ఇంద్రునిచే నిర్మింపబడిన పంచ మాధవక్షేత్రములలో ఒకటైన "కుంతీ మాధ క్షేత్రము" ఇక్కడ కలదు.పిఠాపురమునకు ఉత్తరదిక్కున "ఏలేరూఅనే ఏరు ఒకటి ఉంది.దీనిని ప్రస్తుతము చెరుకుల కాలువ అని పిలుస్తున్నారు    రాక్షసరాజైన గయుడు విష్ణుభక్తుడ...

UJJAYINYAAM MAHAA KAALI

Image
   "ఉజ్జయిన్యాం  మహాకాళి మహా కాళేశ్వరేశ్వరి    క్షిప్రతిరస్థిత మాతా వాంచితార్థ ప్రదాయిని"  మధ్యప్రదేశములోని  మాల్వా పీఠభూమి యందు,క్షిప్రనదీ తీరములోని మాల్వ పీఠభూమి యందు,పదహారు జనపదములలె ఒకటైన అవంతీ రాజ్యమునందు పడిన మాయాసతి పై పెదవి/పలువరస ఉజ్జ్వల మహా కాళిగా/మహా కాలునిగా ఆవిర్భవించెను.దీనిని "మహా శ్మశానము" అని కూడా అంటారు   చంద్రసేనుడను భక్తుని రక్షించుటకు శివుడు ఇక్కడ వెలిశాడని అంటూంటారు.విక్రమాదిత్యుడు,సాందీపని,మహాకవి కాళిదాసు తరించిన ప్రదేశము కనుక ,సాధనతో ఎందరో మహానుభావులు సిద్ధిపొందిన క్షేత్రము కనుకను,సిద్ధమాతా క్షేత్రమని కూడా వ్యవహరిస్తారు.   మంగళనాథుని కోవెల కుజునిచే నిర్మింపబడినదని ఇక్కద మంగళగ్రహ దివ్యశక్తి కలదని,దర్శించిన ప్రజలు కుజదోషము నుండి విముక్తులగుదురని భక్తుల విశ్వాసము..    అబంతీ పట్టణము కాలక్రమమున ఉజ్జయినిగా మారినది.దాని యందు మహాకాలుడుగా  అయ్యవారు,మహాకాళి గా అమ్మవారు ఆరాద్గింపబడుదురు.ఈ క్షేత్రమును మహా శ్మశానవాటిక అనికూడా అంటారు.అమ్మవారు రౌద్రరూపిగా పుర్రెలను మొలకు వస్త్రములుగా ధరిస్తుంది.కాలము ప్రళయస్...

MOOHOORYAE EKAVEERIKAA

Image
     ఏకవీరికాదేవి   "దత్తాత్రేయ సమారాధ్యా అనసూయాత్రిసేవితా    ఏకవీరా మహాదేవి మస్తకేనైవ శోభిని    రేణుకామాతా  మాయా సమ్హార రూపిణి    కృపయా పాతునస్సర్వాన్ మయూరే  ఏకవీర్యకా".     ఏకైవ అనేక రూపేషు-ఏకవీరా.     ఏకైక   శక్తి స్వరూపము జగత్కళ్యాణము కొరకు అనేకములుగా గోచరింపచేయునది ఏకవీరాదేవి.ఏకైక వీరత్వ స్వరూపము ఏకవీరాదేవి అని లలితాసహ్స్రనామస్తోత్రములో"సమానాధిక వర్జితా" అని కీరింపబడినది.అనగా అమ్మశక్తికి సమానమైన శక్తిగాని,అధికశక్తి కానిలేదు.   ఒకే స్థితిలోనున్న శక్తి అనేక గతులలో ప్రవేశించి ప్రకటింపబడునది ఏకవీరాదేవి.ఈ తల్లిని ఏకవేణిదేవి అని కూదా కొలుస్తారు.అదితి అని ఛిన్నమస్త అని కూడా భావిస్తారు.    దేవీభాగవత ప్రకారము ముహూర్ క్షత్రమును మాతాపురి,మాత్రిపురపురి అని కూడా వ్యహరించెడివారు.మరాఠీభాసలోఅమ్మను ఆయీ అంటారు.ఇక్కడివారు ఏకవీరా ఆయీ అని అమ్మను కొలుస్తారు.   మాయాసతి కుచేయి మాహూరప్రాంతములో పడి రేణుకాదేవిగా/ఏకవీరాదేవిగా ఆవిష్కరింపబడినదని స్థలపురాణము చెప్పుచున్నది.పరశురామునికి ఈ క్షేత్...

KOLHAAPURAE MAHAALAKSHMI

Image
   కొల్ హాపురే  మహాలక్ష్మి    " స్థూల సూక్ష్మే మహారౌద్రే  మహాశక్తి ప్రదాయిని      మహాపాప హరేదేవి మహాలక్ష్మి నమోస్తుతే."      మహారాష్ట్ర పన్ హాల పర్వత సమీపమున,భోగవతి,తులసి,కుంభి,కసరి,దమని అను పంచ గంగా తీరమున మాయాసతి నేత్రద్వయము పడి మహాలక్ష్మి గా మనలను పరిపాలించుచున్నది.దేవీ భాగవత పురాణ దేవీగీతలో కొల్ హాపురి మహలక్ష్మి గురించి ప్రస్తుతించ బడినది.కొండజాతులచే ఈ తల్లి కొల్లమ్మ గా పూజింపబడుచున్నది.శిలాహార రాజుల ఇలవేల్పు మహాలక్ష్మి.        మహాలక్ష్మి పీఠము మణిద్వీప సమానము.వజ్రశిలారూపిణిగా  అనుగ్రహించుతల్లి ఒకచేత మదీఫలము,మరొక చేత గద,వేరొక చేత కేటకము అను ఆయుధము,నాల్గవచేత అక్ష్య పాత్రతో కాంతులీనుతుంటుంది.తలపై కుండలినీశక్తి ప్రతిరూపముగా పాము,సర్వజగతికి సంకేతముగా పానవట్ట్,త్రిశక్త్యాతగా లింగమును ధరించి యుండును.పద్మాసనమునకు మారు సిం హవాహినిగా చిద్విలాసముతో ఉంటూంది.శాంతలక్స్మి సంకేతములైన పద్మసనే పద్మకరే మహాలక్ష్మిదేవి రౌద్రరూపియై అసురత్వమును  అరికట్టుతుంటుంది.        షట్శక్తి క్షేత...

SREESAILAE BHRAMARAAMBIKAA

Image
      శ్రీశైలే  భ్రమరాంబికా  " శివ పార్శ్వావస్థిత మాతే  శ్రీశైలే శుభపీఠికే    భ్రమరాంబిక  మహాదేవి  కరుణారస వీక్షణ"     " శ" కారము సుఖ బీజము."ర" కారము అగ్ని బీజము."ఈ" కారము చిఛ్చక్తి స్వరూపము.ఎటువంటి పరిస్థితినైనను అనుకూలముగా చేయగలది "శకారము." శకార-ర కార-ఈ కార సమ్మిళితము  శ్రీశైలము. శ్రీశైలమునకు సిరిగిరి,శ్రీగిరి,శ్రీ పర్వతము మొదలైన నామాంతరములున్నవి.శ్రీ అనగా సంపద. శైలము అనగా పర్వతము."శ్రీశైలము" అనగా సంపద్వంతమైన పర్వతము.దీనికి శ్రీ కైలాసము అనుపేరు కూడా వ్యవహారములో కలదు.మహేశ్వరులు శ్రీ కైలాసమునందున్నారని 13 వ శతాబ్దపు శాసనము తెలియచేయుచున్నది       కృష్ణానదీ తీరమున,దట్టమైన నల్లమల అడవుల గుట్టలపై పడిన మాయాసతి మెడ భాగము "భ్రమరాంబికా దేవి" గా భక్తులను అనుగ్రహించుచున్నది.అయ్యవారు మల్లిఖార్జున స్వామి. శ్రీ సిరివరపు నాగమల్లిఖార్జున శర్మగారి  అభిప్రాయము ప్రకారము శ్రీశైలము ద్వాదశ జ్యోతిర్లింగములలో రెండవది.అష్టాదశ శక్తిపీఠములలో ఆరవది.దశ భాస్కర క్షేత్రములలోను ఆరవది.    అమ్మవారి గర్భగుహ లోపల అగస్...

ALAMPURAE JOEGULAAMBA

Image
   ఆలంపురే జోగులాంబ  "లంబస్తనీ వికృతాక్షి ఘోరరూపాం మహా బలాం   ప్రేతాసన  సమారూఢాం  జోగులాంబాం  నమామ్యహం"   మాయాసతి పైపలువరస పడి జోగులాంబగా కర్నూలుకు సమీపములోనున్న ఆలంపుర క్షేత్రమునందు భక్తులను అనుగ్రహించుచున్నది.ఉష్నస్వభావముతో నున్న తల్లిని చల్లబరచుటకు అలయము చుట్టు తటాకములు ప్రసాంతముగా ప్రవహించుచుండును.స్వభావములోనేకాదు స్వరూపములో కూడ అమ్మ ఉగ్రముగా ఉండి తలపై తేలు,బల్లి,గుడ్లగూబ,  శవము మొదలగు వాని   ఆభరణములుగా అలంకరించుకొనును.        అలంపురము పూర్వము హలపురము హలంపురంగా వ్యవహరింపబడినది. చాలుక్యరాజైన రెండవ పులకేశి ఆలయ పునర్నిర్మాణము గావించెనని శాసనములు తెలియచేయుచున్నవి.   పూర్వము ఋషిశాపము వలన తన బ్రహ్మత్వమును కోల్పోయిన బ్రహ్మ ఈ పుణ్యస్థలమున శివుని గురించి ఘోరతపము చేసెనట.పరమేశుడు సంతుష్టుడై బాల బ్రహ్మ,తారక బ్రహ్మ,పద్మ బ్రహ్మ,కుమార బ్రహ్మ,ఆత్మ బ్రహ్మ,వీర బ్రహ్మ,విశ్వ బ్రహ్మ,గరుడ బ్రహ్మ,శబ్ద బ్రహ్మ అను నవ బ్రహ్మ రూపములలో సాక్షాత్కరించి అనుగ్రహించెనట.శివ బ్రహ్మమే జగమంతా అని భావించిన రస సిద్ధుడు నవబ్రహ్మ మందిరమ...

CHAAMUMDAAA KRAUMCHA PATTANAA.

Image
   " దం ష్ట్రా  కరాళవదనే  శిరోమాలా విభూషణే    చాముండే  ముండమదనే  నారాయణి నమోస్తుతే"     చండముండాసురను  శిరస్ఛేదము చేసిన తదుపరి సిం హవాహిని యైన అమ్మ కాళి పరమేశ్వరిని దర్శించగా, తల్లి చండముండ ఖండిత శిరములను కాళి రెండుచేతులలో చూసి చాముండా అని పిలిచినదని దేవీభాగవతము పేర్కొంటున్నది.చాముండి పర్వతముపై వెలిసిన తల్లి కనుక చాముండేశ్వరీదేవి అనికూడా కొలుస్తారు.   పూర్వకాలములో అనేక మునులు యోగులు నిశ్చలచిత్తముతో ఏకాగ్రతతో అమ్మకరుణ అను ఆహారము లభించువరకు ఒంటికాలిపై ఘోరతపముచేసి కృతకృత్యులయ్యారట.మనవునితో సమానమైన ఏకాగ్రత,పట్టుదల,చాకచక్యము గలది క్రౌంచము (కొంగఒక్కటే) తన కార్యము సఫలము అగువరకు దీక్షగా ఏటిగట్టున వేచియుంటుంది.అదే పట్టుదలతో ఏకాగ్రతతో ఎటువంటి ప్రలోభములకు లోనుకాకుండ ఎందరో తపమాచరించి తరించిన పట్టణము కనుక క్రౌంచపట్టణము అను పేరు వచ్చినదట.కాని కాల క్రమేణా కొంగజపము విపరీతార్థముగా వ్యవహారములోనికి వచ్చి దొంగ జపముగా మారినది.ఆ విధముగా చూసుకొనిన శుంభ నిశుంభులు తమ స్వార్థమునకు బ్రహ్మగురించి తపమాచరించి వరములు పొందిన తరువాత కన్నుమిన్ను కానని వ...