Posts

JVAALAAYAAM VAISHNAVEEDAEVI

Image
  jvaalaayaam  vaishNaveedaevi    "సర్వ మంగళ మాంగళ్యే  శివే సర్వార్థ సాధికే    శరణ్యే త్రయంబికే గౌరి నారాయణి నమోస్తుతే."     "కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః".తల్లి తన చేతివేళ్ళగోళ్ళనుండి దశావతార నారాయణులను సృష్టించి,వారిని ధర్మ సంస్థాపనకు ఉపకరణములు చేసి,వారి శక్తులను తనలో అంతర్లీనము(కల్కి)తప్ప అంతర్లీనము చేసుకొన్నది.ఇది చర్మ చక్షువులకు అర్థమైనది.సూక్షమను ఒకింత ఆలోచిస్తే 1.కర్త-2.కరణము-3.కార్యము-4.ఫలము/ఫలితము అని నాలుగుగా విభజింపబడిన శక్తియొక్కటే.కనుక కర్తగా తలపోసి,కరణములను సృష్టించి,కార్యరూపము దాల్చి,ఫలితములను ఫలములను అందుకొనుచున్నది అమ్మ.చిఛ్చక్తియే  సర్వవ్యాపకమై (వైష్ణవమై)  త్రికూటాచల పర్వత మధ్యమున మాయాసతి శిరోభాగము సర్వ శ్రేష్ట జ్వాలాయాం శక్తిపీఠముగా మనలను అనుగ్రహించుచున్నది.     త్రికూటాచల పర్వతశ్రేణులలోని జ్వాలా క్షేత్రములో,మాయాసతియొక్క శిరోభాగము పడిన ప్రదేశములోఒకే శిలపై ఊర్థ్వ భాగమున శక్తిస్వరూపము గాను,అథోభాగమున మహాలక్ష్ని-మహావాణి-మహా గౌరి శక్తులైన మూడురూపములలో ద్యోతకమగుతు,మనలను దీవిస్తుంటుంది తల్లి. ...

PRAYAAGE MAADHAVAESVARI.

Image
    prayaagae maadhavaeSvari      " త్రివేణి సంగమోద్భూత త్రిశక్తీనాం  సమాహృతి     ప్రజాపతి కృతాశేష యుగమారాభివందితా     బృహస్పతి కరాంతస్థ పీయూష పరిసేవితా     ప్రయాగే  మాధవీదేవి సదాపాయాత్ శుభాకృతీ"     ప్రజాపతి ఎక్కువ యాగములను చేసిన ప్రదేశము కనుక ప్రయాగ అని పేరువచ్చినది.ప్రకృష్ట యాగ వాటికగా ప్రసిద్ధి పొందిన క్షేత్రము కనుక ప్రయాగ అని తలచేవారు ఉన్నారు.బృహస్పతి మోహిని వదిలిన అమృతభాండమును తీసుకెళ్ళుచుండగా కొన్ని బిందువులు పడిన ప్రదేశము కనుక " అమృత తీర్థము" అని కూడ పిలుస్తారు.విష్ణుపాదోద్భవ గంగ యమున నదులను ఇళ-పింగళ నాడులుగాను,సరస్వతిని సుషుమ్నగాను గౌరవిస్తారు.మూడునదుల సంగమము  ముక్తిప్రదమనుట  నిర్వివాదాంశము..అమ్మతత్త్వము సాకారము-నిరాకారము,సద్గుణము-నిర్గుణము.నిరంజనము-నిత్యము.తన లీలా విశేషముగా అమ్మ సాక్షాత్కరించి వెంటనే అంతర్ధానమయినదట.ఒక కొయ్య  స్థంభములో మాత తన శక్తిని నిక్షిప్తపరచినదని భావిస్తారు.కొందరు విశాలమైన అరుగు ప్రేదేశమును అమ్మగా తలుస్తారు.యద్భావం తద్భవతి.      అమ్మవారిని అ...

HARIKSHAETRAE KAAMAROOPAA

Image
      హరిక్షేత్రే  కామరూపా    " కామాఖ్యే కామదే దేవి నీలాచల నివాసిని     కామస్య సర్వదే మాత మాతృసప్తక సేవితే     జామదగ్నస్య రామస్య మాతృహత్యా విమోచని     పంచ శంకర సంస్థాన భక్తపాలన తత్పరా     కళ్యాణదాయిని మాతా విప్రదర్శన నర్తనా     హరిక్షేత్రే కామరూపే ప్రసన్నా  భవసర్వదా."    మాయాసతి యోని భాగము పడిన ప్రదేశము మహాకాళి మహాలక్ష్మి మహాగౌరి త్రిశక్త్యాత్మకమై కామాక్ష్యాదేవిగా నీలాచల పర్వతమందు ప్రకటితమై మనలను పరిపాలిస్తున్నది.ఒకానకొప్పుడు తల్లి స్వామితో ఆనందవిహారమును చేయగోరిన స్థలమని,అందువలన సత్సంకల్పములు నెరవేరతాయని విశ్వసిస్తారు.బ్రహ్మపుత్రా నదిఒడ్డున కల ఈ ప్రదేశములలో ౠషులు,సత్పురుషులు అచలములై అచంచల భక్తితో అమ్మను ఆరాధించి పునర్జన్మా రాహిత్యమును పొందిరి.అమ్మ నిర్మాల్యము సహితము సర్వదుఖః హరము  .   దేవి భాగవత ప్రకారము గుహరూపముననున్న దేవాలయ సొరంగము ఒక పవిత్రస్థలమునకు దారితీస్తుంది.అక్కడ ఏ విధమైన రూపము మనకు (చర్మ చక్షువులకు) గోచరించదు.కాని భూగర్భములోని సహజమైన నీటిబుగ్గలోని నీరు యోని ఆకా...

MANIKYAE DAKSHAVAATIKAA.

Image
 మాణిక్యే  దక్షపీఠికా   " ద్రక్షావతి స్థితశక్తి విఖ్యాత మాణిక్యాంబికా    వరదా శుభదా దేవి భక్త మోక్ష ప్రదాయిని      పంచభూతములు  సమతౌల్యమును పాటించు పవిత్ర ప్రదేశము "ఆరామము".అమరారామము,ఖీరారామము,సోమారామము,భీమారామము,దక్షారామము అను పంచారామములో "దక్షారామము" ఒకటి.ఆరామము అనగా అతిమనోహరము అను అర్థము కూడాకలదు.ఆరామ అనగా శ్త్రీ అనే అర్థము ఉండి.స్త్రీత్వముతో అనగా మాతృత్వముతో అనుగ్రహించెడి పవిత్ర క్షేత్రములు ఆరామములు అని భావించుటలో తప్పులేదేమో.మాయాసతి ఎడమబుగ్గ పడిన ప్రదేశము ఎనలేని వాత్సల్యమై  మాణిక్యాదేవియై మనలను ఆశీర్వదించుచున్నది.పార్వతీ పరమేశ్వరులు కైలాసము నుండి,కాశికి ,కాశి నుండి దక్షారామమునకు విచ్చేశారని స్థలపురాణము చెప్పుచున్నది.దక్షుడు నిరీశ్వర యాగము చేసిన ప్రదేశము తిరిగి భీమేశ్వరునిచే సంస్కరించబడినది కనుక దక్షారామము అని పేరు వచ్చినదని చెబుతారు.దక్షప్రజాపతి పుత్రిక దాక్షాయణి పేరుతో దాక్షాయిణి పురమని కూడా పిలుస్తారు.కాలక్రమేణ ఆరామము ఉద్యానవనముగా వ్యవహరింపబడుచున్నది.     త్రిలింగ శైవ పుణ్యక్షేత్రాలుగా కీర్తింపబడుతున్న కాళేశ్వరము...

ODHYAANAE GIRIJAADAEVI.

Image
   ఓఢ్యాణే  గిరిజాదేవి    " ఓఢ్యాణే గిరిజాదేవి  పితృర్చన ఫలప్రదా    బిరజ పరా పర్యాయస్థిత  వైతరిణితటే    త్రిశక్తీనాం స్వరూపాచ లోకత్రాణ పరాయణా    నిత్యం భవతు సాదేవి వరదా కులవర్ధని."   వైతరిణి నదీతీరమున కల ఓఢ్యాణపురములో మాయాసతి నాభిభాగము పడి వరప్రదాయిని గిరిజాదేవిగా కొలువైనది.ఒడిషా/ఒరిస్సా/ఒడియా/ఒరియా అని పులువబడుచున్న ప్రదేశములోని జాజ్ పూర్ ప్రాంతమును జగజ్జనని తన నివాసముగా ఎంచుకున్నది.నాభి ప్రదేశమును నడుమును ఓడ్డానముతో ప్రకాశించు తల్లి ఉన్న ప్రదేశము కనుక ఓఢ్యాణపురము అని కూడా భావిస్తారు.హిమవన్నగము మేనకలను తల్లితండౄలుగా అనుగ్రహించిన తల్లి కనుక గిరిజాదేవి అని అమ్మను కొలుస్తారు.విరజ అనగా శుభ్రపరచు అను అర్థమును అన్వయించుకుంటే మన పాపములను శుభ్రపరచుచు మనలను పునీతులను చేయు తల్లికనుక విరజాదేవి అని పూజిస్తారు.ఆర్యా స్తోత్ర ప్రకారము ఉత్కళరాజ్యస్థులు విరజా దేవిని తమ కులదేవత గా ఆరాధించెడివారు.   తల్లి మహాలక్ష్మి-మహాశక్తి-మహా సరస్వతిగా పరిపాలిస్తుంటుంది.అమ్మ నాభి ప్రదేశము పడిన ప్రదేశము అని కొందరు భావిస్తే,గయాసురుని ...

PURUHOOTIKAA PEETHIKAAPURAE

Image
   "పురుహూత సతి మాత పీఠికాపురు సంస్థిత    పుత్రవాత్సల్యతా దేవి భక్తానుగ్రకారిణి"   మాయాసతి పీఠికాభాగము పడిన ఆంధ్ర ప్రదేశములోని పవిత్ర స్థలమును "పీఠికాపురము" అనియు,పిఠాపురము అనియు,పిష్ఠపురము అనియు,పాదగయ అనియు భావిస్తూ,భజిస్తూ ఉంటారు.పీఠికాపురి పాలిని "పీఠాంబ" అని నమ్ముతారు.ఆ తల్లి ఒక చేతిలో బంగారు పాత్ర,వేరొక చేత బాగుగా పండిన ఉసిరికాయ,మరొక చేత త్రిశూలము,నాల్గవ చేత లోహదండమును ధరించి నేత్రోత్సవము చేసెడిదట.వృతాసుర సంహార దోషమును తొలగించుకొనుటకు ఇంద్రుడు అమ్మగురించి అత్యంత నియమ నిష్ఠలతో తపమాచరించి ప్రసన్నురాలిని చేసుకొనెనట అమ్మ సంతసింసించి ఇంద్రుని మరొక పేరైన (పురుహూతుడు)పురుహూతిక నామమును స్వీకరించి,ఆశీర్వదించినదట. హుంకారిణి శక్తిపీఠ్ముగా ప్రసిద్ధిచెందిన స్థలములో వెలిసిన తల్లిని " ఓంకారిణి" అని కూడా పిలుస్తారు.   ఇంద్రునిచే నిర్మింపబడిన పంచ మాధవక్షేత్రములలో ఒకటైన "కుంతీ మాధ క్షేత్రము" ఇక్కడ కలదు.పిఠాపురమునకు ఉత్తరదిక్కున "ఏలేరూఅనే ఏరు ఒకటి ఉంది.దీనిని ప్రస్తుతము చెరుకుల కాలువ అని పిలుస్తున్నారు    రాక్షసరాజైన గయుడు విష్ణుభక్తుడ...

UJJAYINYAAM MAHAA KAALI

Image
   "ఉజ్జయిన్యాం  మహాకాళి మహా కాళేశ్వరేశ్వరి    క్షిప్రతిరస్థిత మాతా వాంచితార్థ ప్రదాయిని"  మధ్యప్రదేశములోని  మాల్వా పీఠభూమి యందు,క్షిప్రనదీ తీరములోని మాల్వ పీఠభూమి యందు,పదహారు జనపదములలె ఒకటైన అవంతీ రాజ్యమునందు పడిన మాయాసతి పై పెదవి/పలువరస ఉజ్జ్వల మహా కాళిగా/మహా కాలునిగా ఆవిర్భవించెను.దీనిని "మహా శ్మశానము" అని కూడా అంటారు   చంద్రసేనుడను భక్తుని రక్షించుటకు శివుడు ఇక్కడ వెలిశాడని అంటూంటారు.విక్రమాదిత్యుడు,సాందీపని,మహాకవి కాళిదాసు తరించిన ప్రదేశము కనుక ,సాధనతో ఎందరో మహానుభావులు సిద్ధిపొందిన క్షేత్రము కనుకను,సిద్ధమాతా క్షేత్రమని కూడా వ్యవహరిస్తారు.   మంగళనాథుని కోవెల కుజునిచే నిర్మింపబడినదని ఇక్కద మంగళగ్రహ దివ్యశక్తి కలదని,దర్శించిన ప్రజలు కుజదోషము నుండి విముక్తులగుదురని భక్తుల విశ్వాసము..    అబంతీ పట్టణము కాలక్రమమున ఉజ్జయినిగా మారినది.దాని యందు మహాకాలుడుగా  అయ్యవారు,మహాకాళి గా అమ్మవారు ఆరాద్గింపబడుదురు.ఈ క్షేత్రమును మహా శ్మశానవాటిక అనికూడా అంటారు.అమ్మవారు రౌద్రరూపిగా పుర్రెలను మొలకు వస్త్రములుగా ధరిస్తుంది.కాలము ప్రళయస్...