Posts

VAARANAASYAAM VISAALAAKSHI

Image
     వారణాశ్యాం విశాలాక్షి    " కాశంతు పునరాగత్య సంహృష్టం తాండవోన్ముఖం    విశ్వేశం దేవం ఆలోక్య ప్రీతివిస్తారితే క్షణా    సానురాగాచసా గౌరీ దద్యాత్ శుభపరంపరాం    వారణాస్యాం విశాలాక్షీ అన్నపూర్ణ పరాకృతీ    అన్నం జ్ఞానదదతీ సర్వాన్ రక్షతి నిత్యశః    త్వత్ ప్రసాదాన్ మహాదేవి అన్నలోపస్తు మాస్తుమే."    " వారణాస్యాం విశాలాక్షి నైమిశే లింగధారిణి    ప్రయాగే  లలితాదేవి  కామాక్షి గంధమాదనే."         గంగానదితో రెండు చిన్న నదులు "వరుణ", "ఆస్సి" అనే రెండు నదుల సంగమాల మధ్య ఉన్నందున "వారణాసి" అనే పేరు వచ్చిందని ఒక అభిప్రాయం. వారాణసి నగరానికి ఉత్తరాన వరుణ సంగమ స్థానం, దక్షిణాన అస్సి (ఇది చిన్న నది) నది సంగమ స్థానం ఉన్నాయి. మరొక అభిప్రాయం ప్రకారం "వరుణ" నదికే పూర్వకాలం "వారాణసి" అనే పేరు ఉండేది. కనుక నగరానికి కూడా అదే పేరు వచ్చింది. కాని ఈ రెండవ అభిప్రాయం అధికులు విశ్వసించడంలేదు. "వారాణసి" అనే పేరును పాళీ భాషలో "బారనాసి" అని వ్రాశేవారు. అది తరువాత బవారస్‌గా మారింది.'వారా...

GAYAE MAANGALYA GAURIKAA.

Image
" గదాధర సహోదరి గయా గౌరీ నమోస్తుతే    పితౄణాంచ సకర్తౄణాం దేవి సద్గుణదాయిని    త్రిశక్తిరూపిణీ మాతా సచ్చిదానందరూపిణి    మహ్యం భవతు సుప్రీతా  గయా  మాంగళ్య గౌరికా" త్రిమూర్తులలోఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, "గౌరి", భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ, మాణిక్యాంబ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది.  బీహారు రాష్ట్రములోని  గయ అను ప్రదేశములో పడిన మాయాసతి యొక్క వక్షోజములు ,దయయే ధర్మముగా గల మాంగల్య గౌరీదేవిగా ప్రకటింపబడి, ఆ క్షేత్రమును "పాలనా పీఠముగా" కీర్తింపబడుచున్నది.మంగళగిరి కొండలపై తూర్పు ముఖాభిముఖియైన్ గుహాలయములో తల్లి స్థితికారకత్వముగల తన రెండు స్తనములను,రెండు శిలారూపములుగా దర్శింపచేస్తూ,దయ చూపిస్తున్నదని పద్మ,విష్ణుస్థలపురాణములు కీర్తించుచున్నవి.       " గయ" అను శబ్దమునకు అనేక మూలములు కలది అను అర్థము కలదు.విష్ణువుచే ఖండించబడిన గయుని శరీరపు ముక్కలు అనేకములు ఈ పవిత్ర క్షేత్రమున అనేక అచలములై(కొండలై) అచంచల భక్తితో అమ్మను ఆరాధించుచున్నవి.   గయ అను పదమునకు పునీతముగావింపబడిన...

GAYAE MAAMGALYA GAURIKAA.

Image
    గయే  మాంగల్య గౌరికా  " గదాధర సహోదరి గయా గౌరీ నమోస్తుతే    పితౄణాంచ సకర్తౄణాం దేవి సద్గుణదాయిని    త్రిశక్తిరూపిణీ మాతా సచ్చిదానందరూపిణి    మహ్యం భవతు సుప్రీతా  గయా  మాంగళ్య గౌరికా"   ఫల్గునితీర  బీహారు రాష్ట్రములోని  గయ అను ప్రదేశములో పడిన మాయాసతి యొక్క వక్షోజములు ,దయయే ధర్మముగా గల మాంగల్య గౌరీదేవిగా ప్రకటింపబడి, ఆ క్షేత్రమును "పాలనా పీఠముగా" కీర్తింపబడుచున్నది.మంగళగిరి కొండలపై తూర్పు ముఖాభిముఖియైన్ గుహాలయములో తల్లి స్థితికారకత్వముగల తన రెండు స్తనములను,రెండు శిలారూపములుగా దర్శింపచేస్తూ,దయ చూపిస్తున్నదని పద్మ,విష్ణుస్థలపురాణములు కీర్తించుచున్నవి.       " గయ" అను శబ్దమునకు అనేక మూలములు కలది అను అర్థము కలదు.విష్ణువుచే ఖండించబడిన గయుని శరీరపు ముక్కలు అనేకములు ఈ పవిత్ర క్షేత్రమున అనేక అచలములై(కొండలై) అచంచల భక్తితో అమ్మను ఆరాధించుచున్నవి.   గయ అను పదమునకు పునీతముగావింపబడిన ప్రదేశము అని మరొక అర్థము కలదు.సుదర్శన చక్ర స్పర్శచే పునీతము గావింపబడిన అసురుని శరీరభాగములకు గయ అను నామము సార్థకమ...

JVAALAAYAAM VAISHNAVEEDAEVI

Image
  jvaalaayaam  vaishNaveedaevi    "సర్వ మంగళ మాంగళ్యే  శివే సర్వార్థ సాధికే    శరణ్యే త్రయంబికే గౌరి నారాయణి నమోస్తుతే."     "కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః".తల్లి తన చేతివేళ్ళగోళ్ళనుండి దశావతార నారాయణులను సృష్టించి,వారిని ధర్మ సంస్థాపనకు ఉపకరణములు చేసి,వారి శక్తులను తనలో అంతర్లీనము(కల్కి)తప్ప అంతర్లీనము చేసుకొన్నది.ఇది చర్మ చక్షువులకు అర్థమైనది.సూక్షమను ఒకింత ఆలోచిస్తే 1.కర్త-2.కరణము-3.కార్యము-4.ఫలము/ఫలితము అని నాలుగుగా విభజింపబడిన శక్తియొక్కటే.కనుక కర్తగా తలపోసి,కరణములను సృష్టించి,కార్యరూపము దాల్చి,ఫలితములను ఫలములను అందుకొనుచున్నది అమ్మ.చిఛ్చక్తియే  సర్వవ్యాపకమై (వైష్ణవమై)  త్రికూటాచల పర్వత మధ్యమున మాయాసతి శిరోభాగము సర్వ శ్రేష్ట జ్వాలాయాం శక్తిపీఠముగా మనలను అనుగ్రహించుచున్నది.     త్రికూటాచల పర్వతశ్రేణులలోని జ్వాలా క్షేత్రములో,మాయాసతియొక్క శిరోభాగము పడిన ప్రదేశములోఒకే శిలపై ఊర్థ్వ భాగమున శక్తిస్వరూపము గాను,అథోభాగమున మహాలక్ష్ని-మహావాణి-మహా గౌరి శక్తులైన మూడురూపములలో ద్యోతకమగుతు,మనలను దీవిస్తుంటుంది తల్లి. ...

PRAYAAGE MAADHAVAESVARI.

Image
    prayaagae maadhavaeSvari      " త్రివేణి సంగమోద్భూత త్రిశక్తీనాం  సమాహృతి     ప్రజాపతి కృతాశేష యుగమారాభివందితా     బృహస్పతి కరాంతస్థ పీయూష పరిసేవితా     ప్రయాగే  మాధవీదేవి సదాపాయాత్ శుభాకృతీ"     ప్రజాపతి ఎక్కువ యాగములను చేసిన ప్రదేశము కనుక ప్రయాగ అని పేరువచ్చినది.ప్రకృష్ట యాగ వాటికగా ప్రసిద్ధి పొందిన క్షేత్రము కనుక ప్రయాగ అని తలచేవారు ఉన్నారు.బృహస్పతి మోహిని వదిలిన అమృతభాండమును తీసుకెళ్ళుచుండగా కొన్ని బిందువులు పడిన ప్రదేశము కనుక " అమృత తీర్థము" అని కూడ పిలుస్తారు.విష్ణుపాదోద్భవ గంగ యమున నదులను ఇళ-పింగళ నాడులుగాను,సరస్వతిని సుషుమ్నగాను గౌరవిస్తారు.మూడునదుల సంగమము  ముక్తిప్రదమనుట  నిర్వివాదాంశము..అమ్మతత్త్వము సాకారము-నిరాకారము,సద్గుణము-నిర్గుణము.నిరంజనము-నిత్యము.తన లీలా విశేషముగా అమ్మ సాక్షాత్కరించి వెంటనే అంతర్ధానమయినదట.ఒక కొయ్య  స్థంభములో మాత తన శక్తిని నిక్షిప్తపరచినదని భావిస్తారు.కొందరు విశాలమైన అరుగు ప్రేదేశమును అమ్మగా తలుస్తారు.యద్భావం తద్భవతి.      అమ్మవారిని అ...

HARIKSHAETRAE KAAMAROOPAA

Image
      హరిక్షేత్రే  కామరూపా    " కామాఖ్యే కామదే దేవి నీలాచల నివాసిని     కామస్య సర్వదే మాత మాతృసప్తక సేవితే     జామదగ్నస్య రామస్య మాతృహత్యా విమోచని     పంచ శంకర సంస్థాన భక్తపాలన తత్పరా     కళ్యాణదాయిని మాతా విప్రదర్శన నర్తనా     హరిక్షేత్రే కామరూపే ప్రసన్నా  భవసర్వదా."    మాయాసతి యోని భాగము పడిన ప్రదేశము మహాకాళి మహాలక్ష్మి మహాగౌరి త్రిశక్త్యాత్మకమై కామాక్ష్యాదేవిగా నీలాచల పర్వతమందు ప్రకటితమై మనలను పరిపాలిస్తున్నది.ఒకానకొప్పుడు తల్లి స్వామితో ఆనందవిహారమును చేయగోరిన స్థలమని,అందువలన సత్సంకల్పములు నెరవేరతాయని విశ్వసిస్తారు.బ్రహ్మపుత్రా నదిఒడ్డున కల ఈ ప్రదేశములలో ౠషులు,సత్పురుషులు అచలములై అచంచల భక్తితో అమ్మను ఆరాధించి పునర్జన్మా రాహిత్యమును పొందిరి.అమ్మ నిర్మాల్యము సహితము సర్వదుఖః హరము  .   దేవి భాగవత ప్రకారము గుహరూపముననున్న దేవాలయ సొరంగము ఒక పవిత్రస్థలమునకు దారితీస్తుంది.అక్కడ ఏ విధమైన రూపము మనకు (చర్మ చక్షువులకు) గోచరించదు.కాని భూగర్భములోని సహజమైన నీటిబుగ్గలోని నీరు యోని ఆకా...

MANIKYAE DAKSHAVAATIKAA.

Image
 మాణిక్యే  దక్షపీఠికా   " ద్రక్షావతి స్థితశక్తి విఖ్యాత మాణిక్యాంబికా    వరదా శుభదా దేవి భక్త మోక్ష ప్రదాయిని      పంచభూతములు  సమతౌల్యమును పాటించు పవిత్ర ప్రదేశము "ఆరామము".అమరారామము,ఖీరారామము,సోమారామము,భీమారామము,దక్షారామము అను పంచారామములో "దక్షారామము" ఒకటి.ఆరామము అనగా అతిమనోహరము అను అర్థము కూడాకలదు.ఆరామ అనగా శ్త్రీ అనే అర్థము ఉండి.స్త్రీత్వముతో అనగా మాతృత్వముతో అనుగ్రహించెడి పవిత్ర క్షేత్రములు ఆరామములు అని భావించుటలో తప్పులేదేమో.మాయాసతి ఎడమబుగ్గ పడిన ప్రదేశము ఎనలేని వాత్సల్యమై  మాణిక్యాదేవియై మనలను ఆశీర్వదించుచున్నది.పార్వతీ పరమేశ్వరులు కైలాసము నుండి,కాశికి ,కాశి నుండి దక్షారామమునకు విచ్చేశారని స్థలపురాణము చెప్పుచున్నది.దక్షుడు నిరీశ్వర యాగము చేసిన ప్రదేశము తిరిగి భీమేశ్వరునిచే సంస్కరించబడినది కనుక దక్షారామము అని పేరు వచ్చినదని చెబుతారు.దక్షప్రజాపతి పుత్రిక దాక్షాయణి పేరుతో దాక్షాయిణి పురమని కూడా పిలుస్తారు.కాలక్రమేణ ఆరామము ఉద్యానవనముగా వ్యవహరింపబడుచున్నది.     త్రిలింగ శైవ పుణ్యక్షేత్రాలుగా కీర్తింపబడుతున్న కాళేశ్వరము...