Posts

CHIDAANAMDAROOPAA-TIRUNAVUKKARASAARU

Image
  చిదానందరూపా-తిరునవుక్కరసారు.6   కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా   కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా   మనసులోని చీకట్లను తరిమేసే మరుల్ నీకియారు   అచంచల భక్తులలో అతనికెవరు  సాటిరారు   వ్యాధి దరిచేరి అప్పారును రాజధిక్కారిగ మార్చినది   కఠిన శిక్షరూపమై బండతో పాటుగ కడలిలో ముంచినది   తేవారములే నాయనారును కడతేర్చే పరిహారములైనవి   పశ్చాత్తాప పల్లవ గుణభారవీహారముగా  మార్చినది   తిరువాయుమూరుకు  తిరిపెమెత్తువాడు రమ్మనుట   వాగీశనాయనారు ముక్తికి వ్యాధియే  కారణమగుట   చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక   చిత్తముచేయు శివోహం  జపంబు నా చింతలు తీర్చుగాక.   మరుల్ నీకియారు అనగా చీకట్లను పారద్రోలేవాడు.భావి సూచకముగా తండ్రి సార్థక నామధేయుడవుతాడని ఆ పేరును పెట్టారేమో.తల్లితండ్రులను కోల్పోయిన బాలుని అక్క తిలకవతి తల్లియై సాకింది.తిలకవతి శివభక్తురాలు.తమ్ముడు శివుని నమ్మకపోయినా శివ వైభవములను నిరంతరము చెబుతుండేది.మరుల్ నీకియారు శివ దూషణ చేస్తూ మూర్ఖ వాదనలను చేసేవాడు.ఇలా వుండగా శూలవ్యాధి...

CHIDAANAMDAA-SAKKIYA NAAYANAAR

Image
  చిదానందరూపా-5  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా  శివపూజకు అనుమతిలేని  పాలనలో  ఏమి తక్కువచేసెను   స్వామి లాలనలో  కనపడులింగము పూర్వము తానును  రాయియే కదా  ఆ రాయికి  రాతిపూజ అపూర్వపు సేవయే కదా  దూషణలన్నియు చేరు నిన్నుప్రదోష పూజలుగ  చాలు చాలు  భావము గ్రహియించలేని నిన్ను భజియించుట భావ్యము కాదు కాదు  అనినను,లెక్కకుమించిన పున్నెము సక్కియ నాయనారుకు  సదాశివుని కరుణను పొందగ విసిరిన రాళ్ళే కారణమాయెగ  చిత్రముగాక ఏమిటిది చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు శివోహం జపంబు నా చింతలు తీర్చు గాక.   నిథనపతిని ప్రసన్నము చేసుకొనుటకుకావలిసినది భక్తి తత్పరత యను ధనము కాని బాహ్యాడంబరము కాదని నిరూపించినాడు సక్కియ నాయనారు అని పిలువబడే శాక్య నాయరారు. మగేశ్వరుని మానసపూజకు పాషాణమునకు -పారిజాతమునకు తారతమ్యములేదని తాదాత్మ్యమునొందిన సక్కియ నాయనారు తొండైనాడు ప్రాంతానికి సంబంధించిన భాగవతోత్తముడు.ఇతని ఈశ్వరసేవాతత్పరతను తెలియచేయు రెండు కథలు ప్రచార...

CHIDAANAMDA ROOPAA-GUGGILAM NAAYANAAR.

Image
    చిదానందరూపా-4   కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా   కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా   కాముని చంపినవానికి చేయు ఆ గుగ్గిలపు సేవ   క్షామమునింపగ ఇంటను,తినుబండారములను   చేకొని రావగ,చేత తాళితో శివ శివ అనుచు,భక్తి   నిగ్గుతేల్చగ కదిలెను  ఆ, బుగ్గిపూతలవాడు   గుగ్గిలమునమ్మువానిగా  బిగ్గరగ అరచుచు, సమీపించగ   మొగ్గును చూపి కలయ, గుగ్గిలమంతయు పొందె తాళితో   లింగము వంగిన వేళను, తాళక తనమెడ ఉరిబిగించె   స్వామి ఆలింగనమును పొందగ ఆ గుగ్గిలము కారణమాయెగ   చిత్రముగాక  ఏమిటిది చిదానందుని లీలలు గాక సంబరేను చెట్టువలన గలిగిన ధూపద్రవ్యము సాంబ్రాణి.పది సుగంధ వృక్షముల బెరడు,కాడ,ద్రవము,ఆకు మొదలగు వానినుండి దశాంగములతో కూడిన గుగ్గిలమును ధూపముగా వేస్తూ "త్రయంబకం యజామహే  సుగంధిం పుష్టి వర్ధనం " అంటూ తిరుక్కడవూరులోని అమృత కలశేశ్వరుని అర్చిచు మహా భక్తుడు గుగ్గిల కలశ నాయనారు.  దేవతలు అసురులు అమృత కలశముతో తిరుక్కడవూరికి వచ్చారట.ఆ కలశమును నేలపై ఉంచి ,స్నానము చేయుటకు నదికి వెళ్ళ...

CHIDAANAMDAROOPAA-NAKKA NAYANAAR

Image
    చిదానందరూపం శివోహం-శివోహం     ****************************  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా కటాక్షించిన  వరమనుకుందునా  సాలీడు పాకగ  స్వామి శరీరము పొక్కిపోయె  గ్రహచారము చాలక ఎర్రగ కందిపోయె  పాయని భక్తి  తానొక ఉపాయము సేసి వేగమే  జాలము చేయక ఉపచారము చేయుచు సాగిపోయె ఆ  నక్కనయనారుని ధర్మపత్ని,గమనించిన నాయనారు  క్షమియించగ కోరగ,ఆమె వైద్యమే సరియనె సాంబుడు గాఢత ఎంత ఉన్నదో కద  ఆ మూఢపు భక్తిలో నెమ్మదినీయగ స్వామికి తల్లి  ఉమ్మియె కారణమాయె చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని  లీలలు గాక చిత్తముచేయు   "శివోహం" జపంబు నా చింతలు తీర్చుగాక.

CHIDAANAMDAROOPAA-NEELAKAMTHANAAYANAARU

Image
"  సౌవర్ణే నవరత్నఖణ్డరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ శాకానామయుతం జలం రుచికరం కర్పూరఖణ్డోజ్జ్వలం తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు " చిదానందరూపా-నీలకంఠ నాయనారు ******************************   కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా   కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా   నీలకంఠ నాయనారు  వృత్తిరీత్యా కుమ్మరి   గృహస్థధర్మములోనున్న శివకీర్తనా నేర్పరి   రక్షకుడు శివుడంటు భక్తులను కొలిచెడివాడు   భిక్షకులకు దానముగా భిక్షాపాత్రలనిచ్చేవాడు   కాలపు పరిహాసమేమొ  కామవశుడైనాడు   కానిపనికి శిక్షగా  భార్యను తాకకున్నాడు   ఒకయోగి భిక్షాపాత్ర నాయనారు యోగమునే  మార్చినది   కామేశుడు కరుణించుటకు కామము కారణమాయెగ   చిత్రముగాక ఇదేమిటి చిదానందుని లీలలు గాక   చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చుగాక.  ధర్మము భక్తుడు నిర్దేశించినది.భక్తి భగవంతుడు అనుగ్రహించినది.నీలకంఠ నాయనారు భగవత్ నిర్దేశితమైన గృహస్థ...

CHIDAANAMDAROOPAA-AMARANEETI NAAYANAAR

Image
"  రత్నై కల్పితం ఆసనం,హిమజలై స్నానంచ దివ్యాంబరం  నానారత్న విభూషితం మృగమదామోదాంకితం చందనం  జాతి చంపక బిల్వపత్ర రచితం పుష్పంచ ధూపం తధా  దీపం దేవ దయానిధే  పశుపతే హృత్కల్పితం గృహ్యాతాం"  చిదానందరూపా-అమరనీతి నాయనారు. ******************************************** .  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా  అమరనీతి  నాయనారు అను  బంగారునగల వ్యాపారి  మఠములను కట్టించినాడు ఆ  గంగాధర పూజారి  పరమశివ భక్తుల  పాదములను  కడుగుతాడు  కాశి విశ్వేశ్వరులంటు  కౌపీనములను ఇస్తాడు  కాలచమత్కారమేమొ  బ్రహ్మచారి కౌపీనము  కఠిన పరీక్షనే పెట్టింది తులాభార రూపముగా   కుటుంబమే కూర్చున్నది కౌపీనమును తూయగా  కారుణ్యము కురిపించగ కౌపీనము కారణమాయెగ  చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు  "శివోహం" జపంబు చింతలు తీర్చు గాక.   కనకాభరణములు తనను చుట్టిముట్టి...

KASMEERAETU SARASVATEE.

Image
    కాశ్మీరేతు  సరస్వతి  " శారద  నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా    హార  తుషార ఫేన రజతాచల కాస ఫణీశ కుంద మం    దార సుధా పయోధి సిత తామర సామర వాహినీ శుభా    కారతనొప్పు నిన్ను మది గానగ నెన్నడు కల్గు భారతీ" అని,  శ్రీమదాంధ్ర మహాభాగవతములో పోతనామాత్యునిచే కీర్తింపబడిన సరస్వతి పీఠము మాయాసతి కుడిచేయి పడిన ప్రదేశముగా చెబుతారు. సర్వస్వాత్ సరస్వతి అను నానుడి కలదు.స్వాత్ లోపల నిండియున్న సర  సర్వము.మనలోపలనిండి సమయ సందర్భానుసారము ప్రకటితమయే శక్తియే  సరస్వతి అని సారస్వతమని  పండితులు భావిస్తారు. సంగీతములో సాహిత్యములో నిండియున్నా  స్వర ప్రస్థానములే  సరస్వతీ రూపముగా భావించే శాక్తేయ సంప్రదాయము కలదు.       " అక్షరాభ్యాసములోనే" యోగశక్తి  నిక్షిప్తము అయివున్నది..వర్ణము అనగా అక్షరము-రంగు అని రెండు అర్థములు కలవు.సర్వశుక్లా  సరస్వతీ అన్న సూక్తిని గ్రహించినట్లయితే అమ్మవారు శుద్ధసత్వమైన తెల్లనితెలుపు రంగు.కనుక సర్వ వర్ణోప శోభితా అను స్తుతి వాక్యమును మనము అన్ని అక్షరముల స్వరూపముగా భావించినట...