Posts

NAAYANAARLU

Image
  సత్-చిత్-రూపులారా సాక్షాత్ సదాశివుడు తన డమరుకమునుండి విలక్షణ నయనార్ల చరితములను, కరుణాకటాక్ష అక్షర వానలను మనపై కురిపించదలిచాడు.నాయనారు అంటే పరమపూజ్యుడు అని అర్థము. భగవంతునికి- భక్తునికి మధ్యగల అవినాభావ సంబంధపు అద్భుత లీలలను అసలేమి తెలియని నా చేయి పట్టుకొని మురిపెముగా పెరియ పురాణకథలను,కార్తీకమాస శుభ సందర్భముగా తానే వ్రాసుకొన్నాడు.కాని ఇంతలో నా అజ్ఞానము చేతిని విడిచిపెట్టి నవరత్నమాలికా సదృశమైన నాయనార్ల కథలలో కొన్ని గులకరాళ్ళను చేర్చుతూ, తనపని తాను చేసుకుపోయింది.రాయిని సైతము సాలగ్రామములుగా సవరించుచు మనకు అక్షయ ముక్తిఫలములను ప్రసాదించదలిచాడు ఆ పరమేశ్వరుడు.కావున గుణదోషములను వదిలి (స్థల-సంఖ్య-పేరు) శివ సన్నిహితులమై,స్మరించి-తరించుదాము రండి.నా సాహసమును మన్నించి సదాశివుడు మందహాసముతో మనలనందరిని ఆశీర్వదించును గాక.

CHIDAANAMDAROOPAA-MAANIKYA VAACHAGARU

Image
 చిదానందరూపా-మాణిక్య వాచగరు   కలయనుకొందునా  నిటలాక్షుడు  కలడనుకొందునా    " బ్రహ్మాండం వ్యాప్తదేహాః భసిత హిమరుచా భాసమానా భుజంగై    కంఠే కాలాత్ కపర్దాః కలిత శశికళాః చంద్ర కోదండ హస్తాః    వ్యక్షా రుద్రాక్ష భూషాః ప్రణత భయహరా శాంభవామూర్తివేదాః    రుద్రా  శ్రీరుద్రసూక్త ప్రకటిత భవా నః ప్రయచ్చంతు సౌఖ్యం."   చిదానందరూపా-మాణిక్య వాచగరు   కలయనుకొందునా  నిటలాక్షుడు  కలడనుకొందునా   కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా   అంబాపతి భక్తుడు అరగౌణ మహారాజ అమాత్యులవారు   తిరువిలయడలును  అందించిన  మాణిక్య వాచగరు   అశ్వములను కొనుటకు పోవుదారిలో ఈశ్వరుడెదురాయెగ   విశ్వపాలకుని కరుణను ధనము ఈశుని ఆలయమాయెగ   తడవుగ అడవిలో నక్కలు వెడలెను  హయముల మాదిరి   విషయము తెలిసిన రాజు విధియించెను శిక్షను బెదిరి   బెంగను తీర్చగ గంగకు ఉప్పొంగగ ఉత్తరువాయెగా   శివ ప్రతిరూపము దైవము ఒకటిగ మారగ కారణమాయెగ   చిత్రముగాక  ఏమిటిది  చిదానందు...

CHIDAANAMDAROOPAA-KOETTALI NAAYANAARU

Image
   చిదానందరూపా-కోట్టలి  నాయనారు-31   " అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవః యజ్ఞాత్ భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవః." చిదానందరూపా-కోట్టలి నాయనారు కలయనుకొందునా నిటలాక్షుడు కలడనుకొందునా కలవరమనుకొందునా కటాక్షించిన వరమనుకొందునా శివునకు ధాన్య నివేదనము శ్రీకరమనుకొను కోట్టలి గుడులలో ధాన్యవితరణము సేవను సైన్యపు నెచ్చెలి నియమములోనె సదాశివుని సందర్శించును ఎల్లవేళల తనవారిని పంపమనె తాను ఊరిలో లేనివేళల శివ సంకల్పము ఏమో ధాన్యము వారి ఇంటను భోజనమాయెను వికలముచేసెను మనసును కోట్టలి హంతకుడాయెను తల్లి-తండ్రి-బంధువుల తప్పిదము సహించనిదాయెగ భక్తుని ఆగ్రహమే భవబంధ విముక్తుని చేయగ కారణమాయెగ చిత్రము గాక ఏమిటిది చిదానందుని లీలలు గాక చిత్తముచేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక. తైత్తరీయ ఉపనిషత్తు ప్రకారము ఆత్మ నుండి ఆకాశము,ఆకాసము నుండి వాయువు,వాయువు నుండి అగ్ని,అగ్ని నుండి నీరు,నీటి నుండి భూమి,భూమి నుండి ఔషధులు,ఔషధుల నుండి అన్నము సంభవించినది కనుక " అన్నం పరబ్రహ్మ స్వరూపము" అంటారు. అన్న వైశిష్ట్యమును తెలుసుకొనిన కోట్టలి పరమ శివ భక్తుడుచోళదేశ సైన్యాధికారి...

CHIDAANAMDAROOPAA-PASUPATI RUDRA NAAYANAARU

Image
 చిదానందరూపా-పశుపతి నాయనారు-30  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా  పశుపతి రుద్ర నాయనారు పుట్టెను తిరువరియూరునందు  పురుతశి నక్షత్రంబున గురుతర పూజలనందు  కంఠములోతు నీటను అకుంఠిత భక్తిని కొలుచువాడు  ఉత్కంఠత నిండగ నమక-చమకములను పలికెడివాడు  నమ్మిన భక్తిమార్గమున మూడు సంధ్యలను వందనములిడు  కమ్మని స్తవములు తెమ్మెరలై ముక్కంటి ముంగిటనుండు  లాలనచేయగ దలచి పశుపతి, పశుపతిని పిలిచెగ  నీలకంఠుని పొందగ కంఠపులోతు నీరు కారణమాయెగ  చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని లీలలు గాక  చిత్తముచేయు శివోహం  జపంబు చింతలు తీర్చును  గాక.  అలంకార ప్రియో విష్ణుః అభిషేక ప్రియ శివః-అని ఆర్యోక్తి.సాక్షాత్ జల లింగమైన జంబుకేశ్వరునకు అభిషేకములు అవసరమా? ఆయన చల్లదనమునకువచ్చినలోటేమిటి?మంచు కొండ ఇల్లాయె! కట్టి పడేసిన గంగమ్మ కనుసైగ చేస్తే కదిలి ముంచేస్తుందాయె.యోగేశ్వరుని అల్లుకున్న యోగ సాస్త్రాలైనపాములు శీతలత్వముతో అనరతము సేవిస్తూనే ఉన్నాయాయె.అదియే  శివ చమత్కారము...

CHIDAANAMDAROOPAA-CHAERAMAN PERUMAL NAAYANAARU

Image
 చిదానందరూపా-చేరమాను నాయనారు-29  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా  వీరభోజ్య రాజ్యమును వీడిన చేరమాను  వీతరాగుడు  తిరు అంబైలో స్థిరపడినాడు,శివారాధనను వీడని వాడు  పరమేశుని ఆనగా తిరిగి రాజ్యపాలన చేయవలసి వచ్చె  పశుపక్ష్యాదులు సైతము  ప్రశాంతముగ పరవశించె  రతిపతిని కాల్చినవానిని రాజు  రజకునిలోన గాంచె  విశ్వేశ్వరుడీతడేనని  వినయ నమస్కారమును  గావించె  తాళపత్రమును వినిపించగ స్వామి బాణపతిని పంపించెగ  తాళగతుల నర్తించిన మువ్వలు తరియించగ కారణమాయెగ  చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని లీలలు గాక  చిత్తము చేయు శివోహం జపంబు చింతలు తీర్చును గాక.  చేర వంశమునకు చెందిన చేరమాన్ పెరుమాళ్ అసలు పేరు పెరుం-ము-కొత్తయారు.పట్టాభిషిక్ తుడైన చేర వంశీయ పెరుం-ము-కొత్తయారు చేరమాన్ పెరుమాళ్ గా ప్రసిద్ధిచెందాడు.విషయ భోగాసక్తుడు కానందున వయసురాగానే సన్యసించి తిరువంజక్కళములో శివపూజాదులతో నిశ్చింతగా నుండెను.శివ నిఎదేశమైనదేమో ఆ దేశపు రాజైన సెన్ గ...

CHIDAANAMDAROOPAA-SOMASI MAARA NAAYANAARU

Image
జాగ్రత్స్వప్నసుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజ్జృంభతే యా బ్రహ్మాదిపిపీలికాంతతనుషు ప్రోతా జగత్సాక్షిణీ | సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞాపి యస్యాస్తి చే- చ్చండాలోఽస్తు స తు ద్విజోఽస్తు గురురిత్యేషా మనీషా మమ  చిదానందరూపా-సోమసి నాయనారు-28  కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా  కలవరమనుకొందునా  కటాక్షించిన  వరమనుకొందునా  పావన సోమయజ్ఞమును పాయక చేసెడివాడు  తిరువెంబూరులోని  శివభక్తుడు సోమసి మార నాయనారు  పురహితమును కోరువంశమున పుట్టిన బాపడు  పరహితమును కోరు అనిశమును పూజను  మానడు  గురువని తలచెను సుందరారును,తిరువూరును  చేరెను  భుజియింపగ  యాగ హవిస్సును శివునే కోరెను  చండిక తోడుగ శివుడు చండాలుడిగ  వచ్చెగా  సదాశివుని కరుణను పొందగ సమానత్వమే కారణమాయెగ  చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని లీలలు గాక  చిత్తము చేయ్  శివోహం జపంబు చింతలు తీర్చును గాక  ఒకసారి ఆది శంకరాచార్యులవారికి ఎదురైన  పంచమ కులజుడు,వారిచే పవిత్ర మనీష పంచకమునే ప్రసాదింపచేసినాడు. ...

CHIDAANAMDAROOPAA-ENAADINAATHA NAAYANAARU

Image
 చిదానందరూపా-ఎనాది నాధ నాయనారు-27   కలయనుకొందునా  నిటలాక్షుడు కలడనుకొందునా   కలవరమనుకొందునా  కటాక్షించిన వరమనుకొందునా   "ఎనాది" ఖడ్గవిద్యా గురువు,భర్గుని నమ్మిన భక్తుడు    శివభక్తుల పాలిట ఎప్పుడు తానొక కల్పతరువు   ఫాల విబూదిరేఖలను చూసి పరమేశునిగానే తలుచు   ప్రాణము విడుచుటకైనను వెనుకాడక ముందర నిలుచు   ఈశుని లీలయనంగ  అతిసూరను అడిగెను  పోటి   ఈసును తెలియని  శౌర్యము వివరించెను లేరని సాటి   శివభక్తుని వేషపు సాయము శిరమును దునుమాడినదిగా   విశ్వేశ్వర సన్నిధిచేరగ విభూతి  కారణమాయెగ   చిత్రముగాక  ఏమిటిది  చిదానందుని లీలలు గాక   చిత్తముచేయు  శివోహం జపంబు చింతలు తీర్చును గాక.