Posts

SIVA SANKALPAMU-86

Image
ఓం నమ: శివాయ-86 పాలకడలి జనించిన " గరళము" నిను చేరితే మురిపాల పడతి హరిని "శ్రీహరిని" చేసింది "శరభరూపమున" నీవు శ్రీహరిని శాంతింప చేస్తే విభవమంత హరిదేగా " ప్రహ్లాదచరిత్రలో" " చిలుకు ఏకాదశి " నాడు చకచక లేచేసి " దామోదరుడు" నిన్ను చేరినది మోదము కొరకేగా " అభిషేక జలాలతో" నీవు ఆనందపడుతుంటే " అలంకారాలన్నీ" హరి తన ఆకారాలంటాడు అనుక్షణము నీవు "అసురులను చెండాడుతుంటే" లక్షణముగా "హరి తులసిని పెండ్లాడాడు" " అలసటయే నాదని"" ఆనందము హరిది" అని "ఒక్క మాట" చెప్పవేర ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-87

Image
ఓం నమ: శివాయ-87 "పెద్ద దేవుడనని" అని నీవంటే" మద్ది" తెల్లబోయింది "అంబే శివుడిని" అని నీవంటే "జంబూ" బెంబేలెత్తింది "భూత నాథుడిని" అని నీవంటే "చూతము" చూతమంది "దొడ్డవాడిని" అని నీవంటే " గడ్డి" అడ్డుచెప్పకుంది "చెలకని వాడను" అని నీవంటే "చెరకు" ఊరుకున్నది "మీ రేడును" అని నీవంటే "మారేడు" మారాడకున్నది "ఉబ్బు లింగడిని" అని నీవంటే "కొబ్బరి"నిబ్బరించుకుంది "నిర్వాహకుడిని" అని నీవంటే "ఉర్వారుకము"నవ్వింది "యోగిని" అని నీవంటే నీవంటే "రేగి" ఆగి పోయింది " వృక్షేభ్యో- హరికేశేభ్యో" అని మొహమాటముతో అనగానే "అన్ని చెట్లు" నీవంటే "అక్కసుతో" పచ్చి అని,నిన్ను వెక్కిరించాయిరా ఓ తిక్క శంకరా. 

SIVA SANKALPAMU-88

Image
ఓం నమ: శివాయ-88 కంటినీటి పూసలు నీకు కలిమిని అందీయగలవా సిగ పూవగు గంగమ్మ నీకు సిరులను అందీయగలదా కట్టుకున్న గజ చర్మము నీకు పట్టు పుట్టమీయ గలదా నమ్ముకున్న ఎద్దు నీకు సొమ్ములను ఈయగలదా కరమున ఉన్న శూలము నీకు వరములు అందీయ గలదా పట్టుకున్న పాములు నీకు పసిడిని అందీయ గలవా కదలలేని చంద్రుడు నీకు ఇంద్రపదవిని ఈయగలడా కాల్చుచున్న కన్ను నీకు కాసులనందించ గలదా కరుగుచున్న నగము నీకు మెరుగు తరగని సంపదీయ గలదా ఆది శక్తి పక్కనున్న ఆది భిక్షువైన నిన్ను " ఓం దారిద్య్ర దుఖ: దహనాయ- నమ: శివాయ" అని పొగడుతుంటే ఒక్కరైన నమ్మరురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-89

Image
ఓం నమ: శివాయ *************** సుగంధిపుష్టి కర్తకు సుప్రభాత దీపములు నిటలాగ్ని హోత్రునికి నిత్య ధూప దీపములు పాషాణపు దేవునికి ప్రభల వెలుగు దీపములు కందర్ప దర్పునికి కర్పూర దీపములు పరంజ్యోతి రూపునికి ప్రమిదలలో దీపములు జలజాక్షునికి వేడుకగా జలములోన దీపములు ప్రమథ గణాధిపతికి ప్రదోషవేళ దీపములు ఆశాపాశ రహితునికి ఆకాశదీపములు మా ఆర్తిని తొలగించే కార్తీక దీపములు దీపములను పేర వెలుగు నీ నామ రూపములు జాణతనము తోడుకాక జ్వాలాతోరణములో చిక్కు కున్నావురా ఓ తిక్క శంకరా

SIVA SANKALPAMU-90

Image
"అసంగోహం అసంగోహం-అసంగోహం పున: పున:"ఓం నమ: శివాయ శివుని తల్లి "బెజ్జ మహాదేవి" అంటున్నారు "శిలాదుడు" తండ్రి అని నేను వింటున్నాను శివుని అక్క "మగాదేవి" గారాబం చేస్తుందట శివుని పత్ని "పార్వతి" పరిపాలించేస్తోందట గణపతి-గుహుడు శివుని సుతులంటున్నారు శివుని సఖుడు "హరి" అట చెప్పుకుంటున్నారు శివ భక్తి "తమదని" పక్షులు చెప్పుకుంటున్నాయి శివ లీలలు "యుగయుగములు" కనువిందు చేస్తున్నవి భావనలో నిండినది "బహు చక్కని కుటుంబము" "బ్రహ్మజ్ఞాన వలీనము" బహు చక్కగ చెబుతున్నది "అసంగోహం-అసంగోహం అసంగోహం-పున:పున:" చక్కనైన మాటలేరా ఓ తిక్కశంకరా.

SIVA SANKALPAMU-91

Image
" నాస్తి శర్వ సమో దేవ నాస్తి సర్వ సమో గతి నాస్తి శర్వ సమో దానే నాస్తి సర్వ సమో రణే"-యుద్ధంలో శర్వునితో సమానుడు లేడు. ఓం నమ: శివాయ నారి ఊడదీయమనగానే " జారిపోవ చేసావు" అమ్ములు దాచేయమనిన" గమ్మున దాచేసావు" విల్లు కనపడకూడదనిన "వల్లె" అని అన్నావు పినాకమే కానరాని "పినాకపాణివి" నీవు మంచపు కోడును కూడా" కనిపించకుండ చేసావు" ఖట్వాంగమే కానరాని" ఖండోబా దేవుడవు" పరశును మొద్దుచేయమనిన" పదునును తీసేసావు" " ఖండ పరశు కానరాని" పరమేశ్వరుడవు నీవు లేశమైన లేకుండా" ఆశాపాశము తీసేశావు" " పాశుపతాస్త్రము లేని" పశుపతివి నీవు రుద్రములో చెప్పారని వద్దనక,అన్ని, చేస్తుంటే, నిన్ను తెలివితక్కువ అంటారురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-92

Image
" గళే ౠండమలం "తనౌ సర్పజాలం" మహాకాలకాలం గణేశాధిపాలం ఝటాజూటభంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశానమీడే. " ఓం నమ: శివాయ " విషమును దాచిన వాని వివరము" నీకెందుకంటు అతని భక్తులము మేము "అనుక్షణము వదలమంటు" నీ" పాద మంజీరమైన పాము" వదలని" ఆపదగా మారింది" నీ" నడుముకు చుట్టుకున్న పాము" "నరకము తానేనంది" నీ" జందెమైన పాము" నన్ను" బంధించిస్తోంది" నీ" కరకంకణమైన పాము" నాపై "కనికరమే లేదంది" నీ "మోచేతిని తాకుపాము" "వెతలకతగ మారింది" నీ "మెడను తిరుగు పామేమో" "సంసారము తానంది" "నీ జడను ఆడుచున్న పాము" నన్ను" జడముగా మార్చింది" పోనీ అని "నువ్వు వాటిని రానిస్తే","కాని పనులు చేస్తూ" కాలకూటము చిమ్మి "నన్ను" కాటువేయ చూస్తుంటే " ఒక్క మాటైన అనవురా" ఓ తిక్క శంకరా.