Posts

SIVA SANKALPAMU-48

Image
ఓం నమ: శివాయ -48 ఆపివేయ పలికినదియేగా శివతాండవ స్తోత్రము శాపమీయ పలికినదియేగా శివ నక్షత్ర స్తోత్రము కనకాభిషకమునకై కదీలినదియేగా కాశీఖండము వీర శైవ ఉన్మాదమేగ బసవ పురాణము శాశ్వత స్థావరమునకేగా శంకరాచార్య విరచితములు మేక మేథ బోధలేగ నమక చమక స్తోత్రములు దిగ్గజ అక్కజమేగా శ్రీ కాళ హస్తీశ్వర మహాత్మ్యము అడిగి ఆలకిస్తావు ఆనంద భాష్పాలతో అతిశయముగ చూస్తావు హర్షాతిరేకముతో నిష్కళంక మనసు నిన్ను కొలిచినది శూన్యము యుక్తితో ముక్తి కోరువారిని నీ భక్తులు అను మాయలో చిక్కు కున్నావురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-49

Image
            ఓం నమ: శివాయ-49 తిక్కవాడివై నీవుంటే భక్తుల మొక్కులెలా పెరుగుతాయి మండే చెట్టువై నీవుంటే పక్షులెలా వాలుతాయి కరిగే కొండపై నీవుంటే మృగములెలా తిరుగుతాయి పారని గంగవై నీవుంటే జలచరములెలా బ్రతుకుతాయి స్వార్థపరుడివై నీవుంటే అర్థనారీశ్వరము ఎలా అవుతుంది శితికంఠుడివై నీవుంటే స్థితికార్యము ఎలా జరుగుతుంది లయ కారుడివై నీవుంటే శృతిలయలు ఎలా నిన్ను చేరుతాయి మన్నించమని నేనంటే నిన్నెంచను అంటావు ఆదరమేదో నీది అవగతమయ్యెను,అంతలోన ఆ నిందా వాక్యములు, అవి గతమయ్యెను వింతలోన అంతలేసి మాటలాడ ముద్దుమాటలంటావురా అద్దమంటి మనసున్న ఓ పెద్ద శంకరా.

SIVA SANKALPAMU-50

Image
ఓం నమ: శివాయ  -50 అగ్ని కార్య ఫలితములు అన్నీ ఇంద్రునికైతే బృహస్పతి చేరాడు బుద్ధితో ఇంద్రుని సరస్వతి చేరింది బృహస్పతిని చూసి ఆ ఇంద్రుని వరుణుడు చేరాడు ఆదరణకై ఆ ఇంద్రుని భూమికూడ చేరింది ఈవి కోరి ఆ ఇంద్రుని గాలి వీచసాగింది నేరుగా ఆ ఇంద్రుని విష్ణువు చేరాడు స్పష్టముగా ఆ ఇంద్రుని అశ్వనీ దేవతలు ఆశ్రయించారు ఆ ఇంద్రుని అవకాశమిది అని ఆకాశముం చేరింది ఆ ఇంద్రుని పంచభూతములు నిన్ను వంచించేస్తుంటే స్వార్థమంత గుమికూడి అర్థేంద్రముగా మారింది నిన్ను ఒక్కడినే వేరుచేసి ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-51

Image
 ఓం నమ: శివాయ-51  మౌనము మాటాడునట మాయేదో చేసావులే  మేథా దక్షిణా మూర్తిగా బోధించేది మాయేలే  మూగయు మాటాడునట మాయేదో చేసావులే  మూక పంచశతిగా కీర్తించేది మాయేలే  కాళ్ళకింద పద్మాలట మాయేదో చేసావులే  పద్మపాదుడు అతడట గురుభక్తి మాయేలే  పూవులే పళ్లట మాయేదో చేసావులే  పుష్పదంతుడు అతడట పుణ్యాల మాయేలే  బోడిగుండు శివుడట మాయేదో చేసావులే  శంకర భగవత్పాదుడట శంక లేనే లేదులే  మాయా సతిని చూసి అమ్మయ్య అని నీవు మోస్తుంటే,నే  బిక్కచచ్చి పోయానురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-52

Image
        ఓం నమ: శివాయ-52  ఆంతర్యము ఏమోగాని వెలుగసలే తెలియని  అమావాస్య జననానికి ఆనందపడతావు  విడ్డూరము ఏమోగాని వినయమే తెలియని  గంగ అభిషేకములకు పొంగిపోతు ఉంటావు  పూర్వపుణ్యము ఎమోగాని పువ్వులే తెలియని  మారేడు దళములకు మగ ఆనందపడతావు  ఇంద్రజాలమేదోగాని అందమే తెలియని  బూది పూతలకు మోజుపడుతుంటావు  నీదయ ఏమోగాని నియమములే తెలియని  నికృష్టపు భక్తులని నీదరి చేర్చుకుంటావు  కనికట్టో ఏమోగాని అసలు నీ జట్టే తెలియని  ఒక్కడిని ఉన్నానురా ఓ తిక్క శంకరా

SIVA SANKALPAMU-53

Image
   శివ సంకలపము-53  నిన్ను బాణముతో కొట్టితే బాగా కరుణిస్తావు  నిన్ను పాషాణుడివని తిట్టితే పరమ సంతోషిస్తావు  నిన్ను రోకలిబండతో కొట్టిన కలికిని కనికరిస్తావు  నిన్ను రాళ్ళతో కొట్టితే రయమున కనిపిస్తావు  నిన్ను లెక్కచేయని వాని మొక్కులందుకుంటావు  నిన్ను సేవించని వానికి సేవకునిగ మారుతావు  నిన్ను ముప్పతిప్పలు పెట్టినా గొప్ప భక్తులంటావు  నిన్ను రాపాడే వారినే కాపాడుతు ఉంటావు  పరమ హింసలను చేస్తుంటే పరమ హంసలు అంటావు  ఆత్మస్తుతి చేసేవాడిని ఆత్మీయుడు అంటావు  నిజ భక్తుల కరుణించి నీచ భక్తులను నీవు  పక్కకు పొమ్మనవురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-54

Image
   ఓం నమ: శివాయ-54  విశ్వ నాథుడివని నిన్ను విబుధులు మాట్లాడుతుంటే  అనాథుడిని నేనంటూ ఆటలాడుతావు  పరమ యోగీశ్వరుడవని నిన్ను ప్రమథగణము అంటుంతే  పార్వతీ సమేతుడినని ప్రకటిస్తూ ఉంటావు  భోళా శంకరుడవని నిన్ను భక్తులు భళి భళి అంటుంటే  వేళాకోళములేయని   అంటావు    వేడుకగా  నాగాభరణుడవని నిన్ను   యోగులు  స్తుతి చేస్తుంటే  కాలాభరణుడిని అంటు లాలించేస్తుంటావు  విషభక్షకుడవు అంటు ఋషులు వీక్షిస్తుంటే  అవలక్షణుడిని అంటూ ఆక్షేపణ తెలుపుతావు  మంచి చెడులు మించిన చెంచైన దొర నీవు  వాక్కు నేర్చినాడవురా ఓ తిక్క శంకరా.