Posts

SIVA SANKALPAMU

Image
ప్రియ మిత్రులారా, సచిద్రూపము (సత్తు-చిత్తు-రూపము) పరమాత్మను మనము సత్యం-శివం-సుందరం అని కీర్తించుచున్నాను.సత్యము అనగా శాశ్వతత్వము.సుందరము అనగా సంతోష ప్రదము.శాశ్వత సంతోషమే శివము.అదియే పరమాత్మ ప్రకాశము. పాలు-మీగడ,పెరుగు,మజ్జిగ,వెన్న ఇలా రూపాంతరములు చెంది నెయ్యిగా మారుతుంది.పేరుకున్నా,కరిగించినా అది నెయ్యిగానే ఉంటుంది.రూపాంతరము చెందదు.అదే విధముగా శాశ్వత సుందర తత్త్వమునకు ఆకర్షింపబడినవారు దానినుండి వెనుదిరగలేరు.అది మనదారిని మళ్ళించి వేస్తుంది.మహేశ్వరునితో మమేకము చేస్తుంది."దాస ుని తప్పులు దండముతో సరి" అంటూ మనచే ఆడిస్తుంది.పాడిస్తుంది.మనసును జోకొట్టి శివుని నిందించేలా చేస్తుంది.మేల్కొలిపి స్తుతించేలాను చేస్తుంది మనసుతో దాగుడుమూతలు ఆడుకుంటూ,బుద్ధిని అందులో భాగస్వామిని చేస్తూ,నిందాస్తుతులను అందచేస్తుంది.సమయము,స్థలము తానేయైన కాశీనాథుడు కార్తీక మాస శుభ సందర్భముగా తన డమరుకము నుండి లక్షణ అక్షరవానలు కురిపించ దలిచాడు.అక్షయ ముక్తిఫలములను పంచుతు మనలను మురిపించదలిచాడు.దోసిలొగ్గి స్వీకరించి తరించుదాం.నా దోసములను శివకృపతో సవరించుదాం.మీ సోదరి

SIVA SANKALPAMU01

Image
     ఓం నమ: శివాయ-01     అర్హత ఉందో-లేదో  అసలేనేనెరుగను     అర్చన అవునో-కాదో అదికూడా నేనెరుగను     నమక-చమక అంతర్గత  గమకము నేనెరుగను     కోట్ల అపచారములో షోడశోపచారములో     అహంకార గద్యమో  అపురూప నైవేద్యమో     అశక్తతా కళంకమో   భక్తి నిష్కళంకమో     దు:ఖ నివృత్తియో ఇదిసత్కృతియో  నేనెరుగను     దుష్ట పరిహారమో  ఇది ఇష్ట పరిచారమో     కుప్పల తప్పులు చేస్తూ నే ఒప్పులుగా భావిస్తే     గొప్పదైన మనసుతో నా తప్పిదములు క్షమియిస్తూ     సకల దేవతలతో పాటు  సముచితాసనుడివై     సన్నిహితుడుగ మారరా లోక సన్నుత ఓ శంకరా.

SIVA SANKALPAMU-02

Image
 ఓం నమ: శివాయ-02  కామక్రోధ లోభమోహ మదమాత్సర్యములను  అరిషడ్వర్గముల చేతిలో ఆట బొమ్మవైనావట  నీవు ఆదిదేవుడవనుటకు ఏదిరా ఋజువు శివా  ఆహా నీ కామము నోహిని తల్లిగా చేసినది  అయ్యో నీ కోపము ఆ కామిని కాల్చేసినది  అమ్మో నీ లోభము చల్లదనపు ముల్లైనది  ఔరా నీ మోహము భ్రింగిని అవమానపరచినది  అదిగో నీ మదము సతీ వియోగమును చేసినది  అబ్బో నీ మత్సరము సుతును సంహరించినది  భద్రతను కలిగించే ఆ రుద్రుడివి నీవేనా  శుభముల ప్రతిరూపమగు ఆ శంభుడివి నీవైతే  నీకే మ్రొక్కేనురా ఓ తిక్క  శంకరా .

SIVA SANKALPAMU-03

Image
 ఓం నమ: శివాయ-03  నీ మహన్యాసము నన్ను అపహాస్యము చేస్తున్నది  నీ అంగన్యాసములు అర్థముగాకున్నవి  నీ రుద్ర నమక చమకము నన్ను మొద్దు అంటున్నవి  నీ సహస్రనామములు పలుకగ సహాయము గాకున్నవి  నీ శత ఎనిమిది నామములు నన్ను సతమతము చేస్తున్నవి  నీ దందకములు నాకు అందగాకున్నవి  నీ అష్టకములు నా వాక్కు స్పష్టము గాదంటున్నవి  నీ షడక్షరీ మంత్రము నన్ను నిర్లక్ష్యము చేస్తున్నది  శివ ప్రబంధములు పెద్ద ప్రతిబంధకములు అగుచున్నవి  నీ పంచాక్షరి మంత్రము మించిపోలేదు అంటున్నది  గుక్కతిప్పుకోలేని నాకు "శివ" యను చక్కని  ఒక్క మాట చాలనవేర ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-04

Image
  ఓం నమ: శివాయ-04  పాలు తాగి విషము కక్కు పాము మీది మోజుతో  పాలకడలి విషము మింగ పావుగా మారావు  అసత్యమాడిన ఆ బ్రహ్మ ఎంత చతురుడో  తన కపాలమును చూసి దొంగవని అంటాడు  ఫాలములో దాగిఉన్న కన్ను ఎంత చుప్పనాతిదో  అసలు తెరువనీయవని అలుకతో ఉంటుంది  తలపైని తైతక్కల గంగకెన్ని నిక్కులో  అటుఇటు కదలనీయవని ఆడిపోసుకుంటుంది  కుదురుగ ఉండలేని శశికెన్ని కినుకలో  రాహు-కేతు బాధను కబళించవు అంటాడు  బుజ్జగిస్తున్న తల్లి బెజ్జమాట వినకుండా  చిక్కుల్లో పడతావురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-05

Image
   ఓం నమ: శివాయ-05  నేను అభిషేకము చేస్తుంటే అభినివేశము ఏది అంటావు  నేను దీపారాధనము చేస్తుంతే భక్తి ఉద్దీపనము ఏది అని అంటావు  నేను చందనము అలదుతుంతే అలదే చందమా అంటావు  నేను పూలహారములను వేస్తుంటే పాప పరిహారములా అంటావు  నేను మహన్యాసము చదువుతుంతే చాల్లే అపహాస్యము అంటావు  నేను ఆరగింపు చేస్తుంటే పండ్లను ఏరలేదా అంటావు  నేను హారతులను ఇస్తుంతే శేవా నిరతి ఏది అంతావు  నేను మంత్రపుష్పము అందిస్తే సంపెంగ పుష్పము అంటావు  నేను సకల ఉపచారములను చేస్తుంతే త్రికరణ ఏది అంటావు  నేను శక్తికొలది పూజచేస్తుంతే అనురక్తిలేదు అంటావు  నువ్వు సంతుష్టిని చెంది,పరిపుష్టిని ఇచ్చేందుకు,భక్తి అనే  రొక్కమెంత కావాలిరా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-06

Image
 ఓం నమ: శివాయ-06  పెద్ద దేవుడనని నీవంటే మద్ది తెల్లపోయింది  అంబే శివుడనని నీవంతే జంబు బెంబేలెత్తింది  భూత నాథుడనని నీవంతే చూతము చూతము అంది  యోగిని నేనేనంటే రేగి ఆగిపోయింది  చెలకని వాడనని నీవంటే చెరుకు ఊరుకున్నది  మీ రేడునని నీవంటే మారేడు మిన్నకుంది  ఉబ్బులింగడనని నీవంతే కొబ్బరి తబ్బిబ్బయింది  నిర్వాహకుడిని నేనేనంటే ఉర్వారుకము నవ్వింది  దొడ్డవాడనని నీవంతే గడ్డి అడ్డుచెప్పకుంది  "వృక్షేభ్యో-హరికేశేభ్యో" అని అనగానే  అన్ని చెట్లు నీవంటే అక్కజముతో పచ్చి అని నిన్ను  వెక్కిరించాయిరా ఓ తిక్క శంకరా.