Posts

TIRUPPAAVAI-22

అంగణ్ మాఞాలాత్తరశర్ అబిమాన పంగమాయ్ వందునిన్ పళ్ళికట్టిల్ కీరే శంగం ఇరుప్పార్ పోల్వందు తలైప్పెయ్-దోం కింగిణి వాయ చ్చేయ్ద తామరై పూప్పోలే శెంగణ్ శిరిచ్చిఱిదే యెమ్మేల్ విరయావో తింగళుం ఆదిత్తియనుం ఎరుందార్పోల్ అంగణ్ ఇరండు కొండుం ఎంగళ్మేల్ తింగళుం ఆదిత్తియనుం ఎరుందార్పోల్ అంగణ్ ఇరండుం కొండ్రు ఎంగళ్మేల్ నోక్కుదియేల్ ఎంగళ్మేల్ శాపం ఇరింద్ ఏలో రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-22 విచిత్రముగ నామది శ్రీ విల్లిపుత్తూరుగా మారినది విష్ణు చిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది. " అభిమాన వఙ మాయ్ వందు" అన్నీ తమవల్లే అనుకొన్నవారైన ^ అంతరించిపోయిన అహంకార రాజులలో మనో సామ్రాజ్యమును అప్పగించి వింతగ సామంతులైన స్వామి సిం హాసనము క్రిందనున్న నిరహంకార గోపికలలో సూర్య-చంద్రులిద్దరు చిత్రముగ సడిసేయని మువ్వలైన కరుణకిరణ నయనములను విచ్చుకుంటున్న పువ్వులలో స్థిరముగ చింతించినంతనే ఆగామి సంచితములైన అంతము చేయ గలుగు ఆ అనంత పద్మనాభ స్వామిలో అతి పవిత్ర వ్రతము చేయ అతివలార రారె ఆముక్త మాల్యద ఆండాళ్ అమ్మ వెంట నేడె. భావము అహంకరించిన అజ్ఞానులగు రాజులను నిరహం...

TIRUPPAAVAI-23

మారిమలై మురైంజిల్ మన్ని క్కిడందు ఱంగుం శీరియ శింగం అరివుత్తు త్తీవిరిత్తు వేరి మయర్ పొంగ ఎప్పాడుం పేరుందు దఱి మూరి నిమిరిండు మురంగిప్పు ఱప్పట్టు పోదరుమా పోలే నీ పూవై ప్పూవణ్ణా ఉన్ కోయిల్ నిన్రు ఇంగనే పోందరిళిక్కో ప్పుడైయ శీరియ శింగాశ నత్తిరుందు యాం వంద కారియం ఆరాయ్ అందరుళ్ ఏలో రెంబావాయ్ . ఓం నమో నారాయణాయ-23 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరి నామ సంకీర్తనమే కోరుతోంది హర్ష-వర్ష ప్రదమైన వ్రతమును చేయించు చున్నదైన గోదా తల్లి పలుకుచున్న " ఏలో రెంబావాయ్" లో అమ్మ పిలుపు వినబడి నిదురను చాలించిన వాడైన శీరియ సింగము భంగి గుహ వెడలిన స్వామిలో పరిమళ కేసరములు ప్రపంచీకరణమైన శంకలేని భక్తి చేయు గోపికల కైంకర్యములో సిం హాసనమధిస్టించమని వినయము వింజామరలైన వినుతుల తోడ్కొనిపోవు విభవ స్వాగతములలో అతి పవిత్రమైన వ్రతము ఆచరింప రారె ఆముక్తమాల్యద ఆండాళ్ అమ్మ వెంట నేడె. భావము చెలులను వ్రతమును చేయుటకు పిలుచుచున్న అమ్మ్మను,అమ్మ పిలుపువిని నిదురను చాలించి సిం హము వలె గుహనుండి బయటకు వచ్చిన స్వామిని,స్వామి అనుగ్రహమును తన కేసరములతో...

TIRUPPAAVAI-24

అన్రి వులగ మళందాయ్! అడిపోత్తి శెన్రంగుత్తెన్నిలంగై శెత్తాయ్! తిఱల్ పోత్తి పొన్రచ్చకడం ఉదైత్తాయ్! పుగళ్ పోత్తి కన్రు కుణిలా ఎఱిందాయ్! కజల్పోత్తి కున్రు కుడైయా ఎడుత్తాయ్! కుణం పోత్తి వెన్రు పగై కెడుక్కుం నిన్ కైయిల్ వేల్పోత్తి ఎన్రెన్రు ఉన్ శేవగమే యేత్తిప్పఱై కొళ్వాన్ ఇన్రుయాం వందోం ఇరంగేలో రెంబావాయ్. ఓం నమో నారాయణాయ-24 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది ఆరుసార్లు పలుకుచున్న మంగళాశాసనమైన అసుర సం హారకుని దివ్య ఆపాద మస్తకములో వాత్సల్యాతిశయమునకు మంగళాశాసనమైన గోవర్ధనగిరిధారి-పాలిత గోవుల-గోపాలురలో "సర్వేజనా-సుఖినో భవంతు"అను మంగళాశాసనమైన భక్తి-ప్రపత్తి స్తుతుల పోత్తి పాశురములో ఆ" బాల" గోపాలునికి మంగళాశాసనమైన దిష్టితీయుట అను గోపికల స్పష్టమైన ప్రేమలో రంగనాథ స్వామికి మంగళములు పాడరారె అంగనలారా! ఆండాళ్ అమ్మవెంట నేడే. భావము గోవర్ధనగిరిని ఎత్తి గోవులను-గోపాలురను రక్షించిన స్వామికి మంగళము.సర్వ జనులకు శాంతి-సౌఖ్యములనిచ్చే స్వామికి మంగళము.స్వామికి దృష్టి తగులకూడదని,స్వామికి-స్వామ...

TIRUPPAAVAI-25

ఒరుత్తి మగనాయ్ పిఱందు ఓరి రవిల్ ఒరుత్తి మగనాయ్ యొళిత్తు వళిర తరిక్కిలా నాగిత్తాన్ తీంగు నినైంద కరుత్తై పిళ్ళైప్పిత్తు క్కంజన్ వయత్తిల్ నెరుప్పెన్న నిన్ర నెడుమాలే! ఉన్నై అరితిత్తి వందోం పఱై తరుదియాగిల్ తిరుత్తక్క శెల్వముం శేవగముం యాంపాడి వరుత్తుముం తీరంద్ మగిళింద్ ఏలో రెంబావాయ్. ఓం నమో నారాయణాయ- విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది ఒక్క రాత్రి సమయములో యశోదను రహస్యముగ చేరినవాడైన "ఒరుత్తి మగనాయ్ పిరందు" అని కీర్తించుచున్న గోపికలలో జాతక కర్మను రహస్యముగా జరిపించుకొనిన వాడైన ఆపదలతో ఆటలాడుకొనిన ఆ ఆపద్బాంధవునిలో కూడని గుణములకూడి కీడును తలపెట్టిన వాడైన ముడిబడనీయని కుంపటి ఆ కంసుని గుండెలలో అష్టాక్షరిలో పుట్టి ద్వయమంత్రములో పెరిగిన వాడైన "ఉన్నై తిరుత్తిత్తు వందోం" అంటున్న ముందుకాళ్ళ బంధములో నల్లనయ్యను కీర్తించగ నళినాక్షులు రారె ఆముక్త మాల్యద ఆండాళ్ అమ్మవెంట నేడె. భావము శ్రీ కృష్ణుడు పాపం! పుట్టిన వెంటనే దేవకీదేవిని వీడి రహస్యముగా యశోద బిడ్డడుగా వచ్చి చేరాడు....

TIRUPPAAVAI-26

మాలే! మణివణ్ణా! మార్గళి నీరాడువాన్ మేలైయార్ శెయ్వనగళ్ వేండువన కేట్టియేల్ ఞాలత్తై యెల్లాం నజుంగ మురల్వన పాలన్న వణ్ణత్తు ఉన్ పాంచశన్నియమే పోల్వన శంగంగళ్ పోయ్ ప్పాడుడై యనవే శాలప్పెరుం పఱయై పల్లాండి శైప్పారే కోలవిళక్కే కొడియే వితానమే ఆలినివైయాం అరుళ్ ఏలోరెంబావాయ్ ఓం నమో నారాయణాయ-26 విచిత్రముగ నామది శ్రీవిల్లిపుత్తూరుగా మారినది విష్ణుచిత్తీయమై శ్రీహరినామ సంకీర్తనమే కోరుతోంది చెంతనున్న స్వామిసేవ చెదరని వ్యామోహమైన దాచలేని గోపికల "మాలే" అను పిలుపులో గాయకులు- శంఖములు మేలుకట్లు కోరుకున్న వారైన అర్థులు-దాతలు ఒక్కరైన అద్వైత భావములో పదునాలుగు భువనముల స్థూలము సూక్ష్మముయైన పదిలముగా పరుండిన వటపత్ర శాయిలో పరాత్పరుని కోరుతూ " పరను" వద్దన్నవారైన నల్లనయ్య సన్నిధిలో పాడుతున్న" పల్లాండ్లలో" సారసాక్షుని సన్నిహితపు సాహచర్యమునకు రారె ఆముక్త మాల్యద ఆండాళ్ అమ్మవెంట నేడె. భావము వ్యాపించిన మోహములో మునిగిన గోపికలు శ్రీ కృష్ణుని దాసోహభావముతో మాలే!(వీడలేని వ్యామోహమా!) అని సంభోదిస్తూ,వటపత్రశాయిగా (శయనించేస్వామి-శాయి) స్వామిని దర్శించుచు,వారి...

amma-9

అమ్మ మన అందరికీ అత్యంత ప్రత్యేకము,అవుతుంది మనతో అమ్మ మమేకము, చిట్టిపొట్టి నడకలతో,చిలుకతల్లి పలుకులతో అమ్మకు మన ఆరాధన అనవరతము తెలుపుదాము ఆకారము మాదైనా దాని శ్రీకారము అమ్మ విరిబాలలు మేమైతే పరిమళములు అమ్మ పెదవివంపు అమ్మ ఐతే పదము తీపి అమ్మ కీర్తి శిఖరము యెక్కించే ప్రేమమూర్తి అమ్మ మిమ్ము నుతించ పూలదండలెందుకమ్మ కైదండలుండగ బహుమతులెందుకమ్మ సన్నుతులు ఉండగ ఆశయాలు,ఆశీసుల అండతో ఆచరణగా మారితే అవధిలేని ఆనందం భువిని పొంగిపొరిలితే అమ్మ పులకరిస్తుంది,ఆనందం పలకరిస్తుంది.

SIVARPANAM

Nimmagadda Subbalakshmi November 4, 2014  ·  శివార్పణం ఈశ నిన్ను గాననైతిని ఈసు మనమున నిండగా పాశములు తొలగించు నా మది కాశివాసము చేయగా నే చీమనైనా కాకపోతిని శివుని ఆనతి చాటగా పామునైన కాకపోతిని సామి గళమును చేరగా సాలెనైన కాకపోతిని శూలి గూటిని నేయగా కరినియైనా కాకపోతిని కనికరమునే పొందగా లేడినైనా కాకపోతిని వేడుకగ దరిచేరగా పులితోలునైన కాకపోతిని నూలుపోగుగ మారగా పందినైన కాకపోతిని బొందినే అందీయగా ఎద్దునైన కాకపోతిని పెద్దదేవుని మోయగా బూదినైనా కాకపోతిని ఆదిదేవుని తాకగా జటనుయైన కాకపోతిని జటిలమును తొలగించగా విషమునైన కాకపోతిని విషయమును గ్రహియించగా పుర్రెనైనా కాకపోతిని వెర్రితనమును బాపగా వాని యోగమేమో కాని ఉపయోగములుగా మారగా నన్ను తరియించనీ నీ అనవరతపు      కరుణగ