Posts

SIVA SANKALPAMU-20

 ఎంగిలి జలములతో నీకు అభిషేకము చేయలేను  ఎంగిలి పడ్డ పూలతో నీకు అర్చనలు చేయలేను  ఎంగిలున్న నోటితో ఏ మంత్రములు చదువలేను  సుగంధిపుష్ఠికర్తకు ఏ పరిమళము అందీయగలను  జ్యోతిర్లింగమునకు ఏ నీరాజనమును అందీయగలను  నీదికానిదేదైనా నీకు నైవేద్యము చేయాలిగా  నైవేద్యానంతర సేవలు నా శివునికి చేయాలిగా  కాదనక కనికరించి కొనసాగనీయని పూజను  నిన్ను ధ్యానించమనిన తన పని కాదంటుంది  నిలకడగ ఉండమంటే అటు ఇటు పరుగిడుతుంది  బుద్ధి లేక ఉంటుంది,హద్దు మీరుతుంటుంది,నా  తైతక్కల మనసు నీది ఓ తిక్క శంకరా. .............................. .............................. .............................. .............................. .............................. .............................. .................శివుడు ఎంగిలి వస్తువులతో చేయబడిన పూజలు స్వీకరించే దేవుడు కనుక కుదురులేని పిచ్చి మనసు నైవేద్యము చాలని నింద భావమునేగానిబాహ్యమును చూడని పరమ శివునికి ఆత్మార్పణమును మించిన నైవేద్యము లేదని స్తుతి..      ఏక బిల్వం...

SIVA SANKALPAMU-19

తిరిపమెత్తు వాడవని నిరుపేద శ్రీనాథుడు  గల గల ప్రవహించనీయవని గడుసువాడవని గంగ  చర చర పాకనీయవని చతురుడవని పాము  పరుగులు తీయనీయవని పాశమున్నదని లేడి  కిందకు జారనీయవని నిందిస్తున్నది విషము  గంతులేయనీయవని వంతపాడు చంద్రుడు  కట్టడి చేస్తున్నావని కట్టుకున్న కపాలము  హద్దు దాటనీయవని వద్దనున్న వృషభము  ఆ లయకారుడు అసలు ఆలయమున ఊంటాడా? అంటూ  మేమెంతో గొప్పవారిమని వంతులవారీగా  నీ చెంతనే ఉంటూనే కాని చింతలు చేస్తుంటే,వారి  పక్కదారి మార్చవేరా ఓ తిక్క శంకరా. ..............  శివా..గంగ,పాము,లేడి,విషము,చం ద్రుడు,పుర్రె,ఎద్దు శ్రీనాఠుడు అను కవి తామెంతో గొప్పవారమని నీవు వారిని నిర్బంధించావని,లయకారుడు ఆలయములలో ఉండడని నింద .అవి అలా శివుని దగ్గర ఉండగలుగుట శివుని దయ.శివుడు భక్తుల గుండెలనే ఆలయములో నివసిస్తాడు అని  స్తుతి.   ఏక బిల్వం  శివార్పణం

SIVA SANKALPAMU-18

 విశ్వ నాథుడివని నిన్ను విబుధులు మాట్లాడుతుంటే  అనాథుడిని నేనంటూ ఆటలాడుతావు  పరమ యోగీశ్వరుడవని నిన్ను ప్రమథగణము   అంటుంటే  పార్వతీ సమేతుడినని ప్రకటిస్తూ ఉంటావు  భోళా శంకరుడవని నిన్ను భక్తులు భళి భళి అంటుంటే  వేళాకోళములేయని    వేడుకగా   ఉంటావు  నాగాభరణుడవని నిన్ను యొగులు స్తుతి చేస్తుంటే  కాలాభరణుడిని అంటు లాలించేస్తుంటావు  విషభక్షకుడవు అంటు ఋషులు వీక్షిస్తుంటే  అవలక్షణుడిని అంటూ ఆక్షేపణ తెలుపుతావు  మంచి చెడులు మించిన చెంచైన దొర నీవు  వాక్కు నేర్చినాడవురా ఓ తిక్క శంకరా. .....................  తల్లితండ్రులు లేనివాడు,విష భక్షణము చేసిన అవలక్షణుడు,నిర్దాక్షిణ్య స్వభావముకల బోయవాడు ,చెప్పిన ప్రతిదానిని వ్యతిరేకించే స్వభావము కలవాడు అని నింద. కాలాతీతుడు,శక్తి సమేతుడు,చెడును శిక్షించి,మంచిని రక్షించే బోయవాడు,మనందరిని తన సంసారముగా భావించే సన్యాసి శివుడు-స్తుతి.     ఏక బిల్వం  శివార్పణం

SIVA SANKALPAMU-17

    ఓం నమ: శివాయ-17 నీ క్షమాగుణము చూసి పులి శాంతముగా మారింది పాపం,పులిని బెదిరిస్తూ లేడి తరుముకొస్తోంది నీ పిరికితనమును చూసి పులి పిల్లిగా మారింది పాపం,పిల్లి అనుకుని ఎలుక ఎగిరిపడుతోంది నీ మంచితనము చూసి అగ్గికన్ను తగ్గియుంది పాపం తగ్గిందంటు దానిని మంచు ముంచివేస్తోంది నీ వ్యాపకత్వమును చూసి పాము తాను పాకుతోంది పాపం,పాకుతోందంటూ దానితోక చలిచీమ కొరుకుతోంది నీ పెద్దతనము చూసి కదలకుండ ఎద్దు ఉంది పాపం,మొద్దు ఎద్దు అంటు జగము ఎద్దేవా చేస్తున్నది సహనముతో నీ సహవాసము కోరిన వాటి ఇక్కట్లను చూడవేరా ఓ తిక్క శంకరా. .............................. .............................. .............................. .............................. .............................. .............................. ..................శివుని క్షమ,శాంతము,వ్యాపకత్వము,పేదరికమునుచూసి, శివుని దగ్గర ఉన్న పులి,పాము,ఎద్దు,మూడో కన్ను అదే విధముగా ఉందామనుకుని ఇబ్బందులు పడ్దాయి-నింద   .శివుని దగ్గర ఉండి శివుని అనుసరించుట వలన అవి లోక పూజ్యములైనవి.సహనముతో సహవాసము స్వర్గమే కదా.  ...

SIVA SANKALPAMU-16

   కూడు తినగనీవు కునుకు తీయగనీవు  నీరు పారనీవు నాతీరు మారగనీవు  పుర్రె జారగనీవు గొర్రె పెంటికలో ఉంటావు  హాస్యము చూపిస్తావు వేశ్య చన్నులో ఉంటావు  జన్నములు కానీయవు అన్నము దొరకనీయవు  జలకమాడనంటావు జలములో ఉంటావు  కాశి నేను అంటావు కార్తీకము అంటావు  మంచిచెడులు చూడవు మాయలు చేస్తుంటావు  రూపముతో ఉంటావు అరూపిని అని అంటావు  ప్రదోషములో ఆడతావు అవశేషములు ఏరుతావు  మరుభూమిలో తిరుగుతావు పరిపాలన జరుపుతావు  చక్కదిద్దుకోవేమిరా  ,నీ తీరు ఓ తిక్క శంకరా.  ................  శివుడు ఉపవాసము,జాగరణ చేయమంటాడు.దక్ష యజ్ఞము జరుగనీయలేదు.కాశిలో అన్నము దొరకనీయలేదు.సమయము స్థలము తానే అంటాడు.బ్రహ్మ పుర్రెను పట్టుకుంటాడు.లింగముగా అలంకారములతో సుందరేశునిగా దర్శనమిస్తాడు.సాయంకాల నాట్యము చేస్తాడుశ్మశానములో మిగిలినవి ఏరుకుంటు ఉంటాడు.పరాక్రమవంతుడైనను పారిపోతున్నట్లు నటిస్తాడు.ఒక్కచోట అభిషేకముతో,వేరొక చోట అపరిశుభ్రముగ కనిపిస్తు ఉంటాడు-నింద .భక్తులు పూజించుటకై ఎక్కడెక్కడో దర్శనమిస్తాడు.భగవంతునికి దగ్గరగా ఉండుటయే కద ...

SIVA SANKALPAMU-15

నీ నెత్తిమీది గంగను చూసి నదులు బెంగపడ్దాయట మా నెత్తిమీదికి ఏ ఆపద ముంచుకొస్తుందో అని నీ కంఠమంటిన పామును చూసి కొండచిలువలు బెంగపడ్దాయట మా కంటిముందు ఏ దండన వెన్నంటి ఉందో అని నీ చేతిలోని మృగమును చూసి వాటికి సంతోషము మృగ్యమై పోయెనట వాడి బాణమేదో తమను దాడిచేయనుందని నీ గజ చర్మమును చూసి గజములు గజగజలాడుతున్నాయట పొట్టచీల్చి ఎవరు తమను పొట్టను పెట్టుకుంటారో అని నీ బ్రహ్మ పుర్రెలు చూసి జనము విలవిలలాడుతున్నారట రిమ్మతెగులు తగులుకొని దుమ్ము నోట కొడుతుందేమో అని "దయనీయశ్చ దయాళుకాస్తి" అని సువర్ణమాల అనగానే నే ముక్కున వేలేసానురా ఓ తిక్క శంకరా. భావము నదులు,పాములు,కొండచిలువలు,లేళ్ళు,ఏనుగులు,పుర్రెలు శివుని చూచి భయపడుచున్నారు.వీటన్నిటిని హింసిస్తు శివుడు దయామయుడు అని కీర్తింపబడుచున్నాడు-నింద. అహంకారపు బుద్ధి అను గంగ,చెడు ఆలోచనలు అను విషకోరలు గల పాములు,నిలకడ లేక పరుగులు తీయు మనసు అను లేడి,స్వార్థ సారూప్యమైన ఏనుగు,విచక్షణారహిత పుర్రె శివ కారుణ్యముతో జగత్పూజ్యతను పొందగలిగినవి-స్తుతి. ( ఏక బిల్వం శివార్పణం)

SIVA SANKALPAMU-14

కళల మార్పుచేర్పులతో కదులుచున్న చంద్రుడు నీ సిగముడుల చీకట్లో చింతిస్తూ ఉంటాడట కుబుసపు మార్పుచేర్పులతో కదలాడు పాములు నీలలోహిత చీకట్లో చింతిస్తూ ఉంటాయట కునుకురాక తెరువలేక కుదురులేని మూడోకన్ను తెర తీయని చీకట్లో చింతిస్తూ ఉంటుందట ఆకాశము నుండి సాగి జార అవకాశము లేని గంగ బందిఖానా చీకట్లో చింతిస్తూ ఉంటుందట చీకటిని తొలగించలేని జ్యోతి శివుడేనట చింతలు తొలగించలేని వింతశక్తి శివుడట దోషము తొలగించలేని వానికి ప్రదోష పూజలా అంటూ ఒక్కటే గుసగుసలు ఓ తిక్క   శంకరా! భావము చీకటిని దోషము అనికూడ అంటారు.(మానసిక) చీకట్లను తొలగించుటకు అవి కమ్ముకునే ముందు చేసే పూజలను ప్రదోష పూజలు అంటారు.గంగకు,చంద్రునికి,కన్నుకు,పాములకు చీకట్లను తొలగించలేని శివుడు దోష హరుడుగా ప్రదోష పూజలు అందుకుంటున్నాడు-నింద. కళలు మారు చంద్రుడు,జనముల మధ్య స్థానము లేని పాములు,గతి తప్పిన గంగ,పరంజ్యోతి యైన శివుని కరుణచే లోకారాధ్యులుగా శివుని దయచే కీర్తింపబడుచున్నారు.స్తుతి. ( ఏక బిల్వం శివార్పణం)