Posts

SIVA SANKALPAMU-87

Image
        పొగడ్తలకు పొంగిపోతే ఉబ్బు లింగడు అని అంటున్నారు   చిరాకును చూపిస్తుంటే చిందేస్తున్నాడంటున్నారు  కోపముతో ఊగుతుంటే మూడోకన్ను తెరిచాడంటున్నారు  చిట్టిచీమ  కుట్టగానే శివుని ఆన అంటున్నారు  బిచ్చగాడివి నీవంటు ముచ్చటించుకుంటున్నారు  శుచిలేనిది  చూస్తుంటే శివ శివ అంటున్నారు  కలసిరాక దిగులుంటే గంగపాలు అంటున్నారు  అలసత్వముతో ఉంటే అచ్చోసిన ఆంబోతు అంటున్నారు  కన్నీళ్ళు కార్చుతుంటే నెత్తిన గంగమ్మ అంటున్నారు  దిక్కుమాలిన ఉపమానాలతో నిన్ను తొక్కేస్తున్నారు  మంచుకొండ దేవుడిలో మంచితనము ఏది అంటూ  ఎక్కిరించారురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-86

మాతంగ పతిగ నీవుంతే ఏది రక్షణ వాటికి  గణపతి అవతరించాడు కరివదనముతో  అశ్వపతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి  తుంబురుడు వచ్చాడు గుర్రపు ముఖముతో  నాగ పతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి  పతంజలి వచ్చాడు పాము శరీరముతో  వానర పతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి  నారదుడు వచ్చాడు వానర ముఖముతో  సిమ్హపతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి  నరసిమ్హుడు వచ్చాడు  సింహపు ముఖముతో  పశుపతిగ నీవుంటే అశువుల రక్షణ లేకుంటే నేను  మొక్కేదెలాగురా ఓ తిక్క సంకరా.

SIVA SANKALPAMU-73

నీకు పూజచేస్తే పున్నెమని విన్నానురా,భక్తితో అర్ఘ్య పాద్య జలములడుగ  కస్సుమన్నదిర గంగ స్నానమెట్లుచేయిస్తు సముదాయించర గంగను ఆసనమీయ చూదగ తుర్రుమన్నదిర పులి కట్టుకోను  బట్తలన్నకనుమరుగైనద్ కరి జందెమైన ఇద్దమన్న  చరచర పాకింది పాము నైవేద్యముచేయ బోవ విషజంతువులన్ని మాయం అక్కజమేమున్నదిలే నీ  అక్కర తీరినదేమో ఒక్కటైనకలిసిరాదు నీకు చక్కనైన పూజసేయ మాయ తొలిగిపోయె నేడు మానసపూజ ఉందిగ దిక్కులే ధరియించిన ఓ చక్కని శంకరా!

SIVA SANKALPAMU-72

  గుర్తించిన శ్రీ కరి పాములకు గుడినే  కట్టించావు   గుడిగోపురమునుచూసిన పాపనాశనమే  అన్నావు   గుడ్డితనమును పోగొట్టి చూపునిస్తుంటావు   గుర్తించువారికి   భక్తి గుళికలూందిస్తావు   గురువుగా మారి వారిని  తరియింపచేస్తావు   గుడిలో కూర్చుని గురుతర  పూజలందుకుంటావు   గుహునితండ్రిగా నీవు అహమును తొలిగిస్తావు   గుగ్గిల నాయనారు భక్తిని గుబాళింప చేసావు   గుణనిధిని కరుణించి గుండెలో దాచుకున్నావు   గుచ్చిన  బాణముచూపి  పాశుపతమునుఈచ్చావు   గుక్క తిప్పుకోకుంద ఎక్కిఎక్కి ఏడ్చు నన్ను,నీ   అక్కున  చేర్చుకోవేమిరా ఓ తిక్క శంకరా!

SIVA SANKALPAMU-66 .

 కన్నులు నిప్పులు రాల్చ కరుణాకటాక్షము ఎట్లు అగునురా   కరము పుర్రెను దాల్చ వరద హస్తము ఎట్లు అగునురా   గళమున గరళమున్న మంగళము ఎట్లు అగునురా   పాములు నగలుగ నున్న సామి ఎట్లు అగునురా   గంగ నెత్తిన ఉన్న తీరిన బెంగ ఎట్లు అగునురా   విషమ రూపము ఉన్న అనిమిషుడు ఎట్లు అగునురా   అసుర భయముతో ఉన్నవాడు శూరుడు ఎట్లు అగునురా   తాండవములో నున్న దుష్ట తాడనము ఎట్లు అగునురా   కనులు తెరిచిన కదనము కనులు మూసిన ప్రణవము ఐతే   కనుల పండుగ ఏదిమాకు కనులు కాయలు కాచినా అని   తనకు తోచిన తీరే కాని మమ్ము తరియింపగ చూడడేమిరా అన   దిక్కు తోచక ఉన్నానురా ఓ తిక్క శంకరా.

SIVA SANKALPAMU-65

కంటినీటి పూసలు నీకు కలిమిని అందీయగలవా  సిగపూవగు గంగమ్మ నీకు సిరులను అందీయగలదా  కట్టుకున్న గజచర్మము నీకు పట్టుపుట్టములు అందీయగలదా  నమ్ముకున్న ఎద్దు నీకు సొమ్ములను అందీయగలదా  అలదుకున్న విబూతి నీకు వైభవమును అందీయగలదా  కరముననున్న శూలము నీకు వరములను అందీయగలదా  పట్టుకున్న పాములు నీకు పసిడిని అందీయగలవా  కరుగుచున్న నగము నీకు నగలను అందీయగలదా  కదలలేని చంద్రుడు నీకు ఇంద్రపదవి ఈయగలడా  కాల్చుచున్న కన్ను నీకు రత్నరాశులను అందీయ గలదా  "ఓం దారిద్ర్య దు:ఖ దహనాయ" అనగానే నువు ఔనంటే విని  ఒక్కరైన నమ్మరురా ఓ తిక్క శంకరా .................  శివుడు ధరించిన విబూది,రుద్రాక్షలు,ఎద్దు,శూలము ,కరిచర్మం,పా(ప)ములు,గంగ(పాలు) మూడో కన్ను(నాశనం) దరిద్ర్యమును తొలగించునని పొగడుట,శివుడు దానిని అంగీకరించుట హాస్యాస్పదము-నింద.  సంపద,భద్రత,ధర్మము,పవిత్రత,వి ఘ్న నివారణము,త్రికాల జ్ఞానము కలిగిన శివుడు అనేక విధములైన దారిద్ర్యములను తొలగించగల మహా దేవుడు-స్తుతి.

SIVA SANKALPAMU-64

       మౌనము మాటాడునట మాయేదో చేసావులే  మేథా దక్షిణా మూర్తిగా బోధించేది మాయేలే  మూగయు మాటాడునట మాయేదో చేసావులే  మూక పంచశతిగా కీర్తించేది మాయేలే  కాళ్ళకింద పద్మాలట మాయేదో చేసావులే  పద్మపాదుడు అతడట గురుభక్తి మాయేలే  పూవులే పళ్లట మాయేదో చేసావులే  పుష్పదంతుడు అతడట పుణ్యాల మాయేలే  బోడిగుండు శివుడట మాయేదో చేసావులే  శంకర భగవత్పాదుడట శంక లేనే లేదులే  మాయా సతిని చూసి అమ్మయ్య అని నీవు మోస్తుంటే,నే  బిక్కచచ్చి పోయానురా ఓ తిక్క శంకరా. .............................. .............................. .............................. .............................. .............................. .............................. .................. శివుని మౌన వ్యాఖ్య,మూక పంచశతి,పద్మపాదుడైన సునందుని స్తుతి పుస్పదంతుని భక్తి,సాక్షాత్ శివ స్వరూపమైన ఆది శంకరుని స్తోత్రములు శివుని పూజనీయుడిని చేస్తున్నాయని స్తుతి.శివుడు మాయామోహ పూరితుడై దక్షయజ్ఞ కుండమునుండి తిరిగి వచ్చిన మాయా సతిని ,తన భార్య అనుకుని మో...