Posts

SIVA SANKALPAMU-107

  ఆనంద భాష్పాలతో అభిషేకము చేయనా   భక్తి మకరందమును  చందనముగ పూయనా   ఆది-అనాది లేదంటు బూదిని నే పూయనా   శాంతి సహనపుష్పాలతో పూజలనే చేయనా   పాప రహితము అనే దీపము వెలిగించనా   పొగడపూల వాసనలనే పొగలుగ నే వేయనా   లబ్బు-డబ్బు శబ్దాలతో స్తొత్రములే  చేయనా   ఉచ్చ్వాశ-నిశ్వాస  వింజామరలను  వీచనా   అరిషడ్వర్గములు లేని ఆతిధ్యమునీయనా   హర హర మహాదేవ అంటు హారతులే ఇయ్యనా   దాసోహం-దాసోహం అంటు నే ధన్యతనే పొందనా   నా పక్కనే  ఉన్నావురా  చూద చక్కనైన శంకరా!

SIVA SANKALPAMU-106

Image
 తిక్కవాడివై నీవుంటే భక్యుల మొక్కులెలా పెరుగుతాయి  మండే చెట్టూవై నీవుంటే పక్షులెలా వాలుతాయి   కరిగే కొండవై నీవుంటే మృగములెలా తిరుగుతాయి  పారని గంగవై నీవుంటే జలచరముఎలా బతుకుతాయి  స్వార్థపరుడివై నీవుంటే అర్థనారీశ్వరమెలా అవుతుంది  శితికంఠుడివై నీవుంటే స్థితికార్యమెలా జరుగుతుంది   లయకారుడివై నీవుంటే శృతిలయలెలా నిన్ను చేరతాయి  మన్నించమని నేనంటే నిన్నెంచను అని అంటావు  ఆదరమేమో నీది అవగతమయ్యెను అంతలోన  ఆ నిందా వాక్యములు అవి గతమయ్యెను వింతలోన  అంతలేసి మాటలాడ ముద్దుమాటలంటావురా  అద్దమంటి మనసున్న ఓ పెద్ద శంకరా.

SIVA SANKALPAMU-105

Image
   శివ సంకల్పము-105  నువ్వు తిక్కలోడివని అంది నా మూఢత్వం  నిన్ను చక్కదిద్దాలనుకుంది నా మూర్ఖత్వం  నీకేమి తెలియదంది నా అహంకారం  నీకు తెలియచేయాలనుకుంది నా అంధకారం  నిన్ను గౌరవించలేనంది నా తాత్సారం  నీతో గారడి చేయాలనుకుంది నా మాత్సర్యం  నీకు నాగరికత లేదంది నాలోని ఆటవికం  నిన్ను నాగరికుడిని చేయాలంది నాలోని ఆధునికం  నీకు పాఠము చెబుదామనుకుంది నాలోని ఆర్భాటం  నీకు పరీక్ష పెట్టాలనుకుంది నాలోని ఆరాటం  సముద్రాన్ని పరీక్షించు ఉప్పుబొమ్మ నేనైతే  నా తప్పు చెప్పినావురా ఓ గొప్ప శంకరా.

SIVA SANKALPAMU-104

ఓం నమ: శివాయ భక్తుల కంఠస్థమైన శితికంఠుని స్తోత్రములకు-దండాలు శివా పృథ్వీలింగమైన ఏకామ్రేశ్వరునికి -దండాలు శివా అగ్నిలింగమైన అరుణాచలేశునికి-దండాలు శివా జల లింగమైన జంబుకేశ్వరునికి-దండాలు శివా  వాయు లింగమైన శ్రీ కాళహస్తీశ్వరునికి- దండాలు శివా ఆకాశలింగమైన చిదంబరేశ్వరునికి- దండాలు శివా సూర్యబింబ లింగమైన కోణార్క దేవునికి-దండాలు శివా చంద్ర బింబలింగమైన చంద్రకోన దేవునికి-దండాలు శివా భక్తి ఆలింగనమైన మహాలింగమునకు -దండాలు శివా (ఓం) న-మ:-శి-వా-య అను పంచాక్షరికి-దండాలు శివా దం-డా-లు-శి-వా అను ఐదు అక్షరములకు-దండాలు శివా సుస్పష్టపు ఇష్టమైన అష్టమూర్తికి-దండాలు శివా. .............................. .............................. .............................. .............................. .............................. .............................. ...................మాలిన్యము లేనిది మాల.పరమాత్మ ప్రతిభను గుర్తించి చేయు కీర్తనలే స్తోత్రములు.ఉదాహరణ-శివ మహిమ నవరత్న మాలిక.విలువైన నవరత్నములు కంఠమున అలంకరింపబడి అతిశయించుట సాధారణ అర్థము భక్తుల కంఠములందు తిరుగుతు వాగ్రూపముగా వెలువడుట గూఢార్థము.నేల,నింగ...

SIVA SANKALPAMU-103

 చిలుకగ నే జన్మిస్తే చిదంబరుడ అంటాను  కోడిగ నే జన్మిస్తే కోటిలింగేశ్వర అంటాను  కాకిగ నే జన్మిస్తే కాళహస్తేశ్వర   ఆవుగ నే జన్మిస్తే అంబాపతి అంటాను  మేకగ నే జన్మిస్తే నే మేలమాడుతుంటాను  పాముగ నే జన్మిస్తే భృస్మేశ్వర అంటాను  ఏనుగుగ నే జన్మిస్తే ఏకాంబరేశ్వర అంటాను  కీటకముగ నే జన్మిస్తే నే కీర్తిస్తూనే ఉంటాను  జన్మకాదు ముఖ్యమనే కర్మసిద్ధాంతపు సాక్షిగా  ఏ జన్మలో నేనున్నా ఏలినవారి దయతో  "త్వమేవాహం" అని తలుస్తు నన్ను తరియింప చేయగా  బిరమున నన్ను బ్రోవరా పరమైన శంకరా.

SIVA SANKALPAMU-102

కాసు లేనివాడవని కానిమాటలన్నాను బేసి కన్నులను చూసి రోసిపోయి ఉన్నాను దోసములే నీ పనులని ఈసడించుకున్నాను వేసమేమిటో అంటుఈసడించుకున్నాను నీ కొండను ఎత్తినాడు నీ విల్లు ఎత్తలేదు కద సహకారమునుఈయనిది అతని అహంకారమేగ దిక్కు నీవు అనగానే  పక్కనేఉంటావు అహంకారమును వదిలేస్తే అధీనుడివి అవుతావు స్వల్పకాలిక లయముతో శక్తినీస్తావు దీర్ఘకాలిక లయముతో ముక్తిని ఇస్తావు నిన్ను తక్కువన్న నా తెలివి పక్కదారి మళ్ళించి మొక్కనీయరా భక్తితో  ముక్కంటి శంకరా!

SIVA SANKALPAMU-101

తామరలున్న కొలనులో తిరుగాడు కప్పను నేననుకో తామసమడచి ఆ కప్పను తుమ్మెదగా మార్చరాదో మధురసమున్న పాత్రలో తిరుగాడు తెడ్డుననుకో మేధను అనుగ్రహించి తెడ్డును జిహ్వగ మార్చరాదో కొమ్మకు చుట్టుకుని తిరిగాడు గాలిపటము నేననుకో ఇమ్ముగ జాలిచూపి దానిని చుక్కల పక్కకు చేర్చరాదో వాన నీరు వృధాచేయు సంద్రమునునేననుకో పన్నీరై క్షుథతీర్చు పంటబీడు చేయరాదో శివుడెంత అని అన్న గర్వపు గంగను నేననుకో శివపాదమే తనకు సర్వమన్న గంగగా చేయరాదో ఇన్ని మార్పు చేర్పులకు కూర్పువైన నిన్ను ఎన్న తరము కదురా నా కన్నతండ్రి శంకరా.