Posts

SAKALA DEVATA SIVASTUTI.

  సకలదేవతా శివస్తుతి   **************** 1. దేవదేవ త్రినేత్రాయ  అందుకో వందనములు    జటామకుట కపర్ది అందుకో వందనములు. 2.భూత భేతాళ నాథాయ అందుకో వందనములు   రక్త పింగళ నేత్రాయ  అందుకో వందనములు. 3.భైరవ ఊర్థ్వకేశాయ  అందుకో  వందనములు   అగ్ని నేత్ర చంద్రమౌళి అందుకో  వందనములు. 4.బ్రహ్మ కపాల మాలాయ  అందుకో  వందనములు   బ్రహ్మాండ కాలాతీతాయ అందుకో వందనములు. 5.కరిగర్భ నివాసాయ  అందుకో  వందనములు   కరి మస్తక పూజ్యాయ అందుకో  వందనములు. 6.ప్రచండదందహస్తాయ అందుకో  వందనములు   ప్రపంచ పూర్ణ వ్యాప్తాయ  అందుకో వందనములు. 7.నీలకంఠ త్రిసూలాయ  అందుకో వందనములు   లీలా మానుష దేహాయ అందుకో వందనములు 8.అష్టమూర్తి  యజ్ఞమూర్తి  అందుకో వందనములు   దక్షయజ్ఞ వినాశాయ అందుకో  వందనములు. 9.వేద వేదాంగ వక్త్రాయ  అందుకో వందనములు   వేద వేదాంత వేద్యాయ  అందుకో వందనములు 10.సకలసన్మంగళ విగ్రహాయ అందుకో  వందనములు    సకల దేవతాస్తుతాయ  అందుకో  వంద...

PASUPATI ASHTAKAMU

 పశుపతి అష్టకము  **************  స్తుతించు పశుపతి శశిపతి సతిపతిని  స్మరించు నాగపతి లోకపతి జగపతిని  జనార్తిహరుని చరణములు శరణమని  భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.  నిత్యముకారు  రారు తలితండ్రులు బాంధవులు  సత్యముకావు చూడు తరలు సిరిసంపదలు  మృత్యు కబళించువీని కాలవసములని  భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.  చిన్న మురజను పెద్ద డిండిమను శివుడు  మథుర పంచమ నాదములు పలుకుచున్నాడు  ప్రమథగణ సేవితుడు పరమేశ్వరుదని  భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని,  శరణుఘోషల ఆవిరి గ్రహియించు సూరీడు  కరుణధారలు వర్షించుకాలమేఘమాతడు  శివుడు లేనిదిలేదు ఇలను లేనే లేదని  భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.  చితాభస్మాలంకృత సిత చిత్ప్రకాశమువాడు  మణికుండలముల భుజగ హారముల రేడు  నగజనాథుని దయ నరశిరో రచితుని  భజింపుము భక్తితో మనుజగిరిజపతిని.  యజ్ఞకర్త యజ్ఞభోక్త యజ్ఞస్వరూపము తాను  యజ్ఞఫలితములనిచ్చు సద్గురు శంకరుడు  దుష్టత్వమణచిన దక్షయజ్ఞ విధ్వంసకుని  భజింపుము భక్తితో మనుజ...

DURVAASA MUNIKRTA RUDRAKAVACHAM.

 దుర్వాసమునికృత  రుద్రకవచం.  స్వయంభువ సదాశివ పరమేశ ప్రణామములు  సకలభువన సత్ప్రకాశం నీదుతేజం ప్రణామములు  శరీర-ప్రాణములను రుద్రుడు రక్షించుగాక,  భద్రుడై ,జగములను రాత్రిపగలు రక్షించుగాక  ఊర్థ్వభాగం రుద్రుడుగ ,పార్శ్వ భాగములు తానై  కరుణ ఈశ్వరుడు, శిరమును రక్షించుగాక  నీలలోహితుడు నుదురును, ముఖము శివుడు,  కర్ణములను శంభుడు ,కరుణ రక్షించు గాక  నాసికను శివ ,పెదవులను పార్వతీపతి,  వరదుడు వాగీశుడు నా జిహ్వ రక్షించు గాక.  గరళకంఠుడు కంఠము, బాహువులను భవుడు,  స్తనములు కరుణను శర్వుడు రక్షించుగాక వక్షస్థలం-నడుము-నాభి శర్వుడు రక్షించుగాక  బాహుమధ్యలను సూక్ష్మరూపుడై రక్షించుగాక  పాశాంకుశధరుడు-వజ్రశక్తి సమన్వితుడు  స్వరము-సర్వము  సర్వేశ్వరుడు రక్షించుగాక. ప్రయాణ సమయమున నదితానై, చెట్టుతానై  విరూపాక్షుడు అన్నితానై ,రక్షించునుగాక  ఎండవేడి కాల్చుతుంటే, చలిముల్లు గుచ్చుతుంటే  ఏకాకిని నన్ను, వృషధ్వజుడు రక్షించుగాక.  పరమ పవిత్రం రుద్...

POOJACHAEYUDAMU RAARE

పూజ చేయుదము రారె నిత్య కళ్యాణిని నిలిపి నీవె మాకు శరణు అనుచు పూజ సేయుదము రారె విరాజమాన పాదములకు. ...... పూర్ణ కుంభమును నిలిపి పరిపూర్ణ భక్తిని అందు కలిపి షడ్వికారములు వదిలి షోడశోప చారములతో .... ఆవాహనమును చేసి ముదావహమును అందు కలిపి మూర్ఖత్వము వదిలివేసి అర్ఘ్య పాద్యములతో ...... పంచామృతములు కలిపి మంచిని మరికొంత కలిపి సంకుచిత తత్వమును వదిలి సుగంధ అభిషేకములతో ...... పట్టు వస్త్రమును తెచ్చి పట్టుదలను పైన పేర్చి బెట్టులన్ని కట్టిపెట్టి పట్టు చీర చుట్టబెట్టి .... తిమిరంబులు తిప్పికొట్టి త్రికరణ శుద్ధిని పెట్టి అంతర్జ్యోతిని చూపి పరంజ్యోతిని ప్రార్థించగ .... ఏలా లవంగ పూలతో జాజి చంపకములతో మాలతి మందారులతో మాహేశ్వరిని మరి మరి .... మల్లెలు మొల్లలు మంచి పొన్నలు పొగడలు తెచ్చి రంగుల రోజా పూలతో రాజేశ్వరిని రమణీయముగ .... మరువము దవనము తెచ్చి మరువక మదిని తలచి పచ్చని చామంతులతో పరాశక్తి పాద పద్మములను ........ హ్రీంకారికి ఓంకారికి శ్రీంకారికి శంకరికిని శ్రీ మత్ పంచదశాక్షరి శ్రీ లలితా త్రిపుర సుందరికి .... అథమత్వమును వదిలి అథాంగ పూజలు చేసి కథలు గాథలు వింటూ మధురస నైవేద్యాలతో ...... ఆకులు పోకలు తెచ్చి ...

HAPPY DEEPAAVALI-2018

 అల్లుడొస్తున్నాడోచ్    ******************   మీరెవరైనా చూశారా?    మందుగుండు సామానులు మాయమై పోయాయి   మతాబులు చిచ్చు బుడ్లు కాకరపువ్వొత్తులు   భూచక్రములు బాంబులు విష్ణుచక్రములు   రాకెట్లు లడీలు తాటాకు టపాకాయలు     మీరెవరైన చూశారా?  అల్లుడుగారు వస్తే సున్నపుగోడలను చూస్తారో  క్రీగంట కిటికీలను-ఓరగ తలుపులను చూస్తారో  గచ్చు అరుగు చూస్తారో-పెరటినుయ్యి చూస్తారో  గడప సొగసు చూస్తారో గందరగోళమంటే  మమతల మతలబుగ మారినవి .మతాబులు  అల్లుడుగారు వస్తే ఏమివండి పెట్టాలో  మరీమరీ తినమంటూ మర్యాదలు చేయాలో  వద్దన్నాగానీ వినక వడ్డిస్తూ ఉండాలో  అసలేమీ తోచటములేదన్న అనసూయమ్మకు  ఆసరా అయినాయి ఆ రెండు చక్రాలు.  అల్లుడుగారు వస్తే ఏమికోరుకొన మనాలో  పదే పదే ప్రస్తావిస్తూ బలవంతపెట్టాలో  బెట్టుచేస్తున్నా గాని కట్టపెడుతుండాలో  అమ్మో! భయమేస్తోందన్న ఆ పరంధామయ్యకు  అనుభవం అయినాయి ఆ ఆటంబాంబులు.  అల్లుడుగారు వస్తే వారితో ఏమి ఆటలు ఆ...

MAHAKALASHTAKAMU

Image
  మహాకాలాష్టకమ మహాకాలాష్టకము ************* 1. సర్వరూప నమోనమః సర్వేశ్వర నమోస్తుతే బ్రహ్మరూప నమోనమః విష్ణురూప నమోస్తుతే రుద్రరూప నమోనమః అవ్యయాయ నమోస్తుతే మహాదేవ నమోనమః మహాకాల నమోస్తుతే. 2. సోమరూప నమోనమః సూర్యరూప నమోస్తుతే నీలకంఠ నమోనమః పరమేశ నమోస్తుతే యజమాని నమోనమః యజ్ఞరూపి నమోస్తుతే మహాదేవ నమోనమః మహాకాల నమోస్తుతే 3.స్థితిపతి నమోనమః లయకర్త నమోస్తుతే ఫణిపతి నమోనమః పశుపతి నమోస్తుతే ప్రమథుడ నమోనమః ప్రథముడ నమోస్తుతే మహా దేవ నమోనమః మహాకాల నమోస్తుతే 4.సద్యోజాత నమోనమః సంరక్షక నమోస్తుతే తత్పురుష నమోనమః దిగంబర నమోస్తుతే ఈప్సితార్థ నమోనమః ఈశానాయ నమోస్తుతే మహాదేవ నమోనమః మహాకాల నమోస్తుతే 5. అఘోరుడ నమోనమః ఘోరరూప నమోస్తుతే ఉగ్ర నామ నమోనమః ఉమాపతి నమోస్తుతే కాలరూప నమోనమః కాలకాల నమోస్తుతే మహాదేవ నమోనమః మహాకాల నమోస్తుతే. 6.పంచముఖ నమోనమః పంచభూత నమోస్తుతే విశ్వాత్మక నమోనమః విశ్వేశ్వర నమోస్తుతే మహాకాయ నమోనమః మహేశాయ నమోస్తుతే మహాదేవ నమస్కారం మహాకాల నమోస్తుతే. 7.భీభత్సమ నమోనమః వాత్సల్యమ నమోస్తుతే దుష్టవైరి నమోనమః శిష్టపాల నమోస్తుతే లింగరూప నమోనమః...

UPAMANYUKRTA SIVASTOTRAM

Image
 ఉపమన్యుకృత శివస్తుతి   ********************* 1జయశంకర పార్వతీపతి శివశంభో భక్తవత్సల  మదనాంతక కపర్ది శరనం తవ చరన పంకజం. 2.త్రికరణం,ఉ నినుధ్యానించు పండితుల దుఃఖ ఖండిత   చంద్రశేఖర సంతత శరణం తవ చరణ పంకజం. 3.ఎటుచూసిన అంధకారము హృదయము నివసింపుము దినకరుని తేజము శరణము తవ చరణ పంకజం 4..కనగలద చర్మచక్షువు తనంతట  కరుణాలయ  శివదర్శనం సుకృతం శరణం తవ చరణ పంకజం 5పంచామృతము పాలు చక్కెర దోరపండ్లు సరిపోలవు శివనామము మధురం శరణం తవ చరణ పంకజం 6విషభక్షక నందివాహన సమదృష్టి సర్వరక్షక  విషమేక్షణ విరాగి శరనం తవ చరణపంకజం. 7.అనురాగము దృఢవైరాగ్యం విచిత్రము మహదైశ్వర్యము భిక్షుకత్వము   వివరింపని విచిత్రం శరణం తవ చరణ పంకజం .8. కాదనలేని కల్పవృక్షమై కామితము నెరవేర్చును    కరుణాలయ హృదయం శరణం తవ చరణ పంకజం 9.వినతిగొను విశ్వపాలక సర్పముల సమలంకృత కనికరమే అభయం శరణం తవ చరణ పంకజం 10.ప్రతిక్షణము పన్నగములు పశుపతి పరిరక్షితం    పరమేశ్వర ప్రస్తుతి శరణం తవ చరణ పంకజం. 11. ఒక్క క్షణము నిన్నుచూడక ఉపమన్యు మనగ...