Posts

NIRVAANA SHATKAMU.

Image
నిర్వాణషట్కము 1. హృదయమునకు శ్వాసనందించు ప్రాణవాయువును కాను    ఊపిరితిత్తులను పనిచేయించు అపాన వాయువును కాను    సంకోచ వ్యాకోచ కారియైన వ్యానవాయువును కాను    వాగ్రూప విలసితమైన ఉదాన వాయువును నేనుకాను    జీర్ణావస్థను నిర్వహించు సమాన వాయువును కాను    పంచ వాయువులు కాని నిరాకార నిరంజనమును నేను 2.త్రేణుపుగా వెలువడు గాలియైన నాగ ను నేనుగాను   కనురెప్పకదలిక కారణమైన కూర్మ గాలిని గాను   తుమ్ముటకు సహాయకారియైన కృకల వాయువును గాను   మూసి-తెరచు హృదయ నాడుల ధనంజయ గాలిని గాను   ఆవులింతలో దాగినదేవత్త దేవదత్త గాలిని గాను   పంచోప వాయువులు కాని చిదానందమును నేను. 3..నయన-కర్ణ-జిహ్వ-చర్మ -నాసికను నేనుకాను    శబ్ద-స్పర్శ-రూప-రస-గంధాదులును నేనుకాను   అన్నమయ-ప్రాణమయాది పంచకోశములును   రక్త-మాంస-చర్మాదులైన సప్తధాతువులను కాను   నవరంధ్ర సహిత శరీరమును నేను కాను   దశేంద్రియములకు అధీనుడను నేను కాను   ఇంద్రియావస్థలు లేని శివస్వరూపమును నేను. 4.అరిషడ్వర...

CHANDRASEKHARA ASHTAKAMU

Image
ముని మార్కండేయ విరచిత చంద్రశేఖరాష్టకం  ***************************** ********* 1.ముప్పు తొలగగమేరువింటికి వాసుకిని అల్లెత్రాడు చేసి   తప్పిదములు సంహరించి తన భక్తులను సంస్కరించగ   నిప్పు బాణములైన హరితో, త్రిపురాసురులను వధించిన   చంద్రశేఖరునాశ్రయములో నన్నేమి చేయగలడు యముడు? . కొంచపు విబూది పూతలతో సంచితములను తొలగచేయు    వంచన తలబోసిన మారుని కంటిసెగ తుదముట్టించిన    పంచపుష్పముల భక్తి పూజించిన పాదపద్మ విరాజితుని    చంద్రశేఖరునాశ్రయించిన నన్నేమి చేయగలడు యముడు? 3. ప్రకాశవంతమైనది కరిచర్మము శివుని ఉత్తరీయమై    ఆకాశ్గంగయును మురిసినదిగ అలల అభిషేకమై    సంకాశుని కొలుచుచు హరిబ్రహ్మాదులు తరించుచున్నవేళ     చంద్రశేఖరునాశ్రయించిన నన్నేమి చేయగలడు యముడు? 4. పాములను ధరించు వాడు-ఎడమభాగము పార్వతియేవాడు    నోములను పండించువాడు విషము కప్పిన గరళకంఠుడు    ఆమ్నాయ రూపము లేడిని గండ్రగొడ్డిలిని ధరించినవాడు    చంద్రశేఖరునాశ్రయించిన నన్నేమి చేయగలడు యముడు? ...

SA SAKTI SIVA ASHTAKAM

స శక్తి శివ అష్టకము  ************************ 1. చతుర్వేదముల నాదసారము కావ్యనాటక పాటవములు    ఇతిహాసముల దరహాసములు మేలుబాణి పురాణములు    సకలశాస్త్ర సమాహార సంపద సముపార్జనకు సాధనా    విజ్ఞానము ప్రసాదింపుము  శరణు శరణు శివ డమరుకం. 2.నాలుగు వేదములతో కూడినవిగ ఆరు వేదాంగములు   నాలుగు ఉపాంగములు కలిసినవి, పదునాలుగు విద్యలు   నాలుగు అరవై కళలలో ఆరితేరుటకు చేయు సాధనా   చతురత ప్రసాదింపుము శరణశరణు శివ డమరుకం. 3. శంక నివారణోపాయములు మరియు  శబ్దశాస్త్రపు రీతులు    తడబడక సాగిపోవు బుధజనుల తర్క-మీమాంసాదులు    ఆశుకవితా అద్భుతాలు అనవరత ఆస్వాదన సాధనా    పటిమను ప్రసాదింపుము శరణు శరణు శివ డమరుకం 4. గణిత శాస్త్రము ఖగోళ భూగోళ వైజ్ఞానిక శాస్త్రములు    అణిమ గరిమ అష్టసిద్ధులు లోక క్షేమ కారకములుగ    సంపూర్ణజ్ఞాన సముపార్జనకు దృఢ సంకల్ప సాధనా    శక్తి-యుక్తి ప్రసాదింపుము శరణు శరణు శివ డమరుకం. 5.పట్టిన పట్టువీడక కష్టసాధ్యపు క్లిష్టమార్గమునందున ...

BHRNGIKRTA SIVASTOTRAM

 భృంగి కృత శివ స్తుతి.   ****************** 1. ఆశాపాశముల కట్టబడి రోయక దుర్వ్యసనుండనైతిని    హింసాప్రకృతితో కౄరుడను కనుగానక గురుతెరుగని    విశ్వాసములేని దుష్కీర్తిభాజనుని జడుని,కృతఘ్నుని    శరణము వేడుకొను భృంగిని కరుణించుము పార్వతీపతి. 2. బలహీనత్వము తోడుగ బధ్ధకత్వము గల భగ్నవ్రతుని    పలాయన మంత్రము జపించు పాపిని పరమ డాంభికుని    శూలితో మూర్ఖపు వాదనకు దిగిన ఆదివ్యాధి పీడితుని    శరణము వేడుకొను భృంగిని కరుణించుము పార్వతీపతి. 3.. యోచన చేయగలేక దుష్కర్మల వీడగలేని కామాంధుని    విచక్షణ చేయగ చేతగాని మూర్ఖుని,స్వధర్మ రహితుని    నీచపు లక్షణముల చేతులు కలిపిన యశోవర్జితుని    శరణము వేడుకొను భృంగిని, కరుణించుము పార్వతీపతి 4.సకలము నీవేనని తెలియనికుసంస్కారిని గురుద్వేషిని   వికలము చేసినవి మనమును వీడక వెంటాడుతున్నవి   తికమక వీడినది శివకటాక్షమును కోరి చేరినది   శరణము వేడుకొను భృంగిని కరుణించు పార్వతీపతి 5. కలనైననుమంచి గంధ పుష్పములతో ...

SAKALA DEVATA SIVASTUTI.

  సకలదేవతా శివస్తుతి   **************** 1. దేవదేవ త్రినేత్రాయ  అందుకో వందనములు    జటామకుట కపర్ది అందుకో వందనములు. 2.భూత భేతాళ నాథాయ అందుకో వందనములు   రక్త పింగళ నేత్రాయ  అందుకో వందనములు. 3.భైరవ ఊర్థ్వకేశాయ  అందుకో  వందనములు   అగ్ని నేత్ర చంద్రమౌళి అందుకో  వందనములు. 4.బ్రహ్మ కపాల మాలాయ  అందుకో  వందనములు   బ్రహ్మాండ కాలాతీతాయ అందుకో వందనములు. 5.కరిగర్భ నివాసాయ  అందుకో  వందనములు   కరి మస్తక పూజ్యాయ అందుకో  వందనములు. 6.ప్రచండదందహస్తాయ అందుకో  వందనములు   ప్రపంచ పూర్ణ వ్యాప్తాయ  అందుకో వందనములు. 7.నీలకంఠ త్రిసూలాయ  అందుకో వందనములు   లీలా మానుష దేహాయ అందుకో వందనములు 8.అష్టమూర్తి  యజ్ఞమూర్తి  అందుకో వందనములు   దక్షయజ్ఞ వినాశాయ అందుకో  వందనములు. 9.వేద వేదాంగ వక్త్రాయ  అందుకో వందనములు   వేద వేదాంత వేద్యాయ  అందుకో వందనములు 10.సకలసన్మంగళ విగ్రహాయ అందుకో  వందనములు    సకల దేవతాస్తుతాయ  అందుకో  వంద...

PASUPATI ASHTAKAMU

 పశుపతి అష్టకము  **************  స్తుతించు పశుపతి శశిపతి సతిపతిని  స్మరించు నాగపతి లోకపతి జగపతిని  జనార్తిహరుని చరణములు శరణమని  భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.  నిత్యముకారు  రారు తలితండ్రులు బాంధవులు  సత్యముకావు చూడు తరలు సిరిసంపదలు  మృత్యు కబళించువీని కాలవసములని  భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.  చిన్న మురజను పెద్ద డిండిమను శివుడు  మథుర పంచమ నాదములు పలుకుచున్నాడు  ప్రమథగణ సేవితుడు పరమేశ్వరుదని  భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని,  శరణుఘోషల ఆవిరి గ్రహియించు సూరీడు  కరుణధారలు వర్షించుకాలమేఘమాతడు  శివుడు లేనిదిలేదు ఇలను లేనే లేదని  భజింపుము భక్తితో మనుజ గిరిజపతిని.  చితాభస్మాలంకృత సిత చిత్ప్రకాశమువాడు  మణికుండలముల భుజగ హారముల రేడు  నగజనాథుని దయ నరశిరో రచితుని  భజింపుము భక్తితో మనుజగిరిజపతిని.  యజ్ఞకర్త యజ్ఞభోక్త యజ్ఞస్వరూపము తాను  యజ్ఞఫలితములనిచ్చు సద్గురు శంకరుడు  దుష్టత్వమణచిన దక్షయజ్ఞ విధ్వంసకుని  భజింపుము భక్తితో మనుజ...

DURVAASA MUNIKRTA RUDRAKAVACHAM.

 దుర్వాసమునికృత  రుద్రకవచం.  స్వయంభువ సదాశివ పరమేశ ప్రణామములు  సకలభువన సత్ప్రకాశం నీదుతేజం ప్రణామములు  శరీర-ప్రాణములను రుద్రుడు రక్షించుగాక,  భద్రుడై ,జగములను రాత్రిపగలు రక్షించుగాక  ఊర్థ్వభాగం రుద్రుడుగ ,పార్శ్వ భాగములు తానై  కరుణ ఈశ్వరుడు, శిరమును రక్షించుగాక  నీలలోహితుడు నుదురును, ముఖము శివుడు,  కర్ణములను శంభుడు ,కరుణ రక్షించు గాక  నాసికను శివ ,పెదవులను పార్వతీపతి,  వరదుడు వాగీశుడు నా జిహ్వ రక్షించు గాక.  గరళకంఠుడు కంఠము, బాహువులను భవుడు,  స్తనములు కరుణను శర్వుడు రక్షించుగాక వక్షస్థలం-నడుము-నాభి శర్వుడు రక్షించుగాక  బాహుమధ్యలను సూక్ష్మరూపుడై రక్షించుగాక  పాశాంకుశధరుడు-వజ్రశక్తి సమన్వితుడు  స్వరము-సర్వము  సర్వేశ్వరుడు రక్షించుగాక. ప్రయాణ సమయమున నదితానై, చెట్టుతానై  విరూపాక్షుడు అన్నితానై ,రక్షించునుగాక  ఎండవేడి కాల్చుతుంటే, చలిముల్లు గుచ్చుతుంటే  ఏకాకిని నన్ను, వృషధ్వజుడు రక్షించుగాక.  పరమ పవిత్రం రుద్...