Posts

NABHAS-INDRA

Image
వైభవోపేతమైన "నభశ్ మాసము రానే వస్తున్నది.సూర్యనారాయణుడు దేవతలను శత్రువుల నుండి రక్షించుటకు,భవనభాండములను ఐశ్వర్యవంటము చేయుటకు "ఇంద్ర" నామధారియై బయలుదేరుచున్నాడు.అంగీరస ముని మంగళాశాసనములు దిగంతములను చైతన్యవంతము చేయుచున్నవి.ప్రమదముతో అప్సరస ప్రమలోచ హావభావ నాట్యమునకు దీటుగా గంధర్వుడు విశ్వవసు గానము వీనులవిందు చేయుచున్నది.సర్పశ్రేష్టుడు ఎలపాత రథ పగ్గములను పటిష్టము చేయుచు,పయనమునకు సిధ్ధపరుస్తున్నాడు.యక్షుడు శ్రోత స్వామి రథమునకు సప్తాశ్వములను అనుసంధించుచున్నాడు.వార్య రాక్షసుడు రథమును ముందుకు జరుపుచుండగా,అందరిని బ్రోచుటకు ఇంద్రుడు తన కిరణప్రసార ప్రయోజనమునకు ఉపక్రమించాడు.   తం ఇంద్రం ప్రణమామ్యహం.

SUCHIMASA-VARUNA

Image
 వరదుడడిగో వరుణనామ ధారియైనాడు.శుచి మాస శుభసంకేతమును సూచిస్తూ,వశిష్ట మహాముని వేదఘోషను ప్రారంభించాడు.అంభోరుహనేత్రి రంభ నాట్యమును ప్రారంభించగనే హూ హూ గంధర్వగానము ఓహో అనేలా జతకలిపింది.ఘర్మసర్జన కిరణ ప్రసాదుని రథపగ్గములను యక్షుడు చిత్రస్వనుడు పరిసీలించి,పయనమునకు సిధ్ధపరుస్తున్నాడు.శుక్ర సర్పము స్వామి రథమునకు సప్తాశ్వములను అనుసంధిస్తున్నాడు.సముద్రజలమును త్రాగు స్వామి సంసార మను సముద్రమును దాటించుటకు అవ్యాజ కరుణతో అడుగులు వేస్తున్నాడు.   " తం వరుణం ప్రణమామ్యహం.

SUKRAMASAMU-MITRA

Image
  చాంద్రమాన చైత్ర-వైశాఖ మాసములను (వసంత ఋతువును) పూర్తి చేసి,సౌరమాన శుక్రమాస శుభములను అందించుటకు,చంద్రుని-సముద్రమునందు మిక్కిలి ఆసక్తి గల మన స్వామి "మిత్ర" నామధారియై కనులవిందు చేయుచు కదులు చున్నాడు.అనుకూల స్వభావము కలవాడు మిత్రుడు అని వాచ్యార్థము.మన స్వామి తన కిరణ ప్రసరణము చేత తైలోత్పత్తులను-ఇంధనములను కలిగించుటకు కదులుచున్నాడు.స్వామి అనుగ్రహము వలనే మనము వాటిని గుర్తించి,ఉపయోగించుకొనగలుగుచున్నాము.  త్రిగుణాతీతుడు(రజో-తమో-సత్వ)అత్రి మహాముని.వేదోక్త ప్రకారముగా స్వామిని కీర్తిస్తు,లాంఛనముగా రథమునకు దారిచూపుటకు సిధ్ధమవుతున్నాడు అత్రిమహాముని.జన్మాంతరమున విరాటరాజుగా భావింపబడు హా హా అను పేరుగల గంధర్వుడు పాడుతుండగా,మేనక మనోహరముగా నర్తించుచున్నది.సర్పాధిపతి తక్షకుడు పగ్గములను ఏకాగ్రతతో పరిశీలిస్తూ,అప్రమత్తతో నున్నాడు.రథస్వనుడను యక్షుడు స్వామి రథమునకు సప్తాశ్వములను అనుసంధానము చేస్తూ,అనవరత ధ్యానాసక్తుడైనాడు.పౌరసేయుడను రాక్షసుడు రథమును ముందుకు జరుపుచుండగా కదులు చున్న మిత్రస్వామి కిరణములు కళ్యాణప్రదములగు గాక.  తం మిత్రం ప్రణమామ్యహం.

MADHAVAMASAMU-ARYAMA

Image
అదిగో మధుమాస సంరక్షణను దిగ్విజయముగా పూర్తిచెసుకొని,    పులహ మహాముని వంశాభివృధ్ధికి కారణమవుతు,వేదవేద్యునికి లాంఛనప్రాయముగా మార్గమును చూపిస్తూ,మురిసిపోవాలని తహతహలాడుతున్నాడు.అప్సరసాంగన పుంజికస్థలి తన దివ్యశక్తులతో నారద గానామృతమునకు అనుగుణముగా నర్తిస్తున్నది.కఛ్చనీరుడను సర్పము ఏకచక్ర రథ పగ్గములను ఏకాగ్రతతో పరిశీలిస్తూ,ప్రయాణమునకు సిధ్ధపరుస్తున్నాడు ఒద్దికగా.అతౌజుడను యక్షుడు సలక్షణుడై స్వామిరథమునకు సప్తాశ్వములను అనుసంధిస్తూ,ఆనందిస్తున్నాడు.ప్రహేతి రాక్షసుడు పరాక్రమోపేతుడై రథమును ముందుకు జరుపుతున్నాడు.తన కిరణముల ద్వారా ఉష్ణోగ్రతల పెంచుతు,అవనీతలమును ఆనందమయము చేయుటకు మాధవమాస అధిపతియై "ఆర్యమ" నామాలంకృత శోభితుడై తరలు    వాయు తత్త్వ ప్రధాన స్వామీ.  " తం ఆర్యమ ప్రణమామ్యహం."

MADHUMAASAMU-DHAATA

Image
 మధుమాసము-ధాత  ******************  అదిగో! ఆనందోత్సాహము! ఆస్వాదించండి.  " మననాత్ త్రాయతే మంత్రః" మననము చేసే వారిని రక్షించేదే మంత్రము అను ఆర్యోక్తికి అద్దము పడుతూ,బ్రహ్మ మానసపుత్రుడు,సప్తర్షులలో ఒకరైన పులస్త్యుడు (ప్రథమముగ నుండువాడు),పురాణ సంపదను మానవాళికి చేరువ చేసిన మహనీయుడు వేదవేద్యుని కీర్తిస్తూ,లాంఛన ప్రాయముగా మార్గమును చూపిస్తు మురిసిపోవాలని తహతహలాడుతున్నాడు.క్షీరసాగర మథనానంతరము జలరసముగా ప్రకటింపబడిన/వెలువడిన( అపొ-నీటి-రస-సారము)కృతస్థలి అను అప్సరస అవనీతలమును చిగురింపచేయుటకు ఆడుతూ స్వామిని అనుసరిస్తున్నది.అసమాన సౌందర్యముతో,అప్రమేయ పరాక్రమముతో కోకిలమ్మకు కొత్త కూత నేర్పించుటకా యన్నట్లు,తుంబురుడు తన మధుర గానముతో పరమాత్మను తన్మయ పరుస్తూ,తరించిపోతున్నాడు.   నాగరాజైన వాసుకి ఏకచక్ర రథ పగ్గములను ఏకాగ్రతతో పరిశీలిస్తూ,ప్రయాణమునకు సిధ్ధము చేస్తున్నాడు.  పర్వత పరిరక్షకుడు పరిశీలనా దక్షుడు అయిన రథకృత్ అను యక్షుడు జగములను తన శక్తిచే మాయామోహితులను చేయుటకు స్వామి రథమునకు సప్తాశ్వములకు అనుసంధానమును చేస్తూ, ఆనందిస్తున్నాడు.హేతి రాక్షసుడు రథమునకు వెనుక నిలబడి...

DVAADASAATMAN -NAMOSTUTE.

Image
 ద్వాదశాత్మన్ నమోస్తుతే  **********************   "బృహత్వాత్-బృమ్హణత్వాత్ ఇతి బ్రహ్మ."అన్నింటికంటె ఏదిఉత్కృష్టమైనదో అది,బృహతి.బృమ్హణము అంటే వ్యాపకత్వము.ఏది అన్నిటికంటె మహోత్కృష్టమైనదో,ఏది అన్నింటియందు వ్యాపించి యుందో అదియే "బ్రహ్మము." వేదము ఆదిత్యుని బ్రహ్మముగా కీర్తిస్తుంది.సర్వజీవుల యందలి ఆత్మయే బ్రహ్మము.అది జగతఃస్థుషః -తాను కదలకుండ ఉంటూ అన్నింటిని కదిలించే శక్తి గల స్థావర-జంగమాత్మకము.   ప్రత్యక్ష పరంజ్యోతి ఏడాది పొడవునా ఒకతే స్వరూప-స్వభావాలతో వెలుగులు-వేడి వెదజల్లుతుంటే మనము తట్టుకోగలమా? అసలు ఆ ఊహనే అమ్మో? మన పొట్ట నింపుకోగలమా?విద్య పై పట్టు సాధించగలమా?వైద్యరంగపు మెట్లు ఎక్కగలమా?కొన్ని రోజులు చిగురులు-మరి కొన్ని రోజులు గుబురులు.కొన్ని రోజులు ఎండలు-మరి కొన్ని రోజులు వానలు.కొన్ని రోజులు వెన్నెల-మరి కొన్నిరోజులు శిశిరము.కొన్ని జీవులు పుట్టుట-మరి కొన్ని జీవులు గిట్టుట.కొంత మందికి బాల్యము-మరి కొంత మందికి భారము.ఇవన్నీ కలిగించటానికే " ఏకం సత్ విప్రా బహుదా వదంతే" అన్నట్లు పన్నెడు రాశులలో పన్నెండు రూప -గుణములతో,తన నుండి ప్రకటింప బడిన ఆరు శక్తులతో కలిసి,...

AKHANDA MANDALAKARAM-VYAAPTAM YENA CHARACHARAM

Image
 అఖండ మండలాకారం-వ్యాప్తమ్యేన చరాచరం.  ************************************************   ఆద్యంతరహితమైన తత్త్వానికి సంకేతము మండలం.ఒక తేజో బిందువు విస్తరించి పెద్దగా వృత్తాకారములో గోచరమయితే అది మణ్డలము.అనంతత్త్వానికి ప్రతీక.    ఈ సృష్టి ఆవిర్భవించక ముందున్న పరంజ్యోతియే సృష్టి ఆవిర్భావం జరిగినపుడు సూర్య మండలం గా భాసిస్తోందని ఆర్యోక్తి.   సమూహములతో నిండినది అని మనము మండల శబ్దమును అన్వయించుకుంటే,ఆదిత్యులు,అప్సరసలు,మునులు,గ్రామణులు,యాతుధాన్యులు,గంధర్వులు,సర్పములు,వాలిఖ్యాది మునులు మొదలగు గణములతో సంసేవింపబడుచున్న అనంత తేజోరాశి,ఉత్తరాయణ పుణ్యకాలమున సంపూర్ణ మండల భాతితో లోకపాలన చేస్తుంది.   అంతటా వ్యాపిస్తూ దేనికి అంటని వాడు ఆ మండలములోని పరంజ్యోతి.స్వయం ప్రకాశకత్వము-సృష్టి-స్థితి-లయకారకత్వమును కలిగిన దివ్య తేజము.సూర్యుడంతేనే జాగ్రదావస్థ.సకల చరాచరములు చతనత్వమును పొందకలుగుటకు కారణమైనది ఆ మండల ద్వారము గుండా ప్రసరించుచున్న దివ్య కిరణములు.కనుకనే  " రశ్మిమంతం-సముద్యంతం" గా సంకీర్తింపబడుతున్నది.    సూర్య మండలము ఆనందమయము-విజ్ఞాన మయము-యజ్ఞమయమ...