Posts

CHAMAKAMU-ANUVAAKAMU-06

  శివుని కరుణ అర్థముకానిది.శివుని కరుణ అద్భుతమైనది. " రుద్రం సురనియంతారం శూల ఖట్వాంగధారిణం   జ్వాల మాలా వృతం ధ్యాయేత్ భక్తానాం అభయప్రదం."    దేవతలను కూడ నియమించు రుద్రుడు సాధకులకు శుభములొసగును గాక. మేఘములందు మెరుపు-ఉరుము-పిడుగు రూపముగా విరాజిల్లుతూ రుద్రుడుసృష్టి/వృష్టి రూపముగా ప్రసన్నుడై భూమిని ఫలవంతము చేయుచు,ఇంద్రరూపముగా కీర్తింపబడుతున్నాడు.    రుద్రుడు ఇంద్రియములకును-మనసునకును అధిపతి.వానిని అనుభవించునపుడు ఇంద్రునిగను-నియమించునపుడు రుద్రునిగను చెప్పబడును.   అర్థ ఇంద్ర అనువాకముగా ప్రశస్తి చెందిన అనువాకము ముఖ్యముగా కార్య-కారణ సంబంధమును సోదారహరణముగా తెలియచేస్తున్నది.అంతే కాకుండ మొదటి అనువాకము అగ్నా- విష్ణో అంటూ, ఇద్దరిని కలిపి అనుగ్రహహించమని ప్రార్థించుటతో సత్వర సమిష్టి ఫలితములను పొందవచ్చునన్న వేద సంప్రదాయమును మరొకసారి ప్రతిపాదించుచున్నది.ఈ ఇద్దరిలో రెండవ వారిగా సంబోధింపబడుచున్న ఇంద్ర శబ్దము మూలము.దాని ఆదేశముననుసరించి మొదటి శబ్దమైన అగ్ని,వరుణ మిత్ర మున్నకు దేవతా శక్తులు మన ప్రార్థనలను స్వీకరించి,ప్రస...

CHAMAKAMU-ANUVAAKAMU-05

Image
  శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.    ఈ అనువాకము భూమి యొక్క గొప్పదనమును -భూగర్భ సంపదలను ప్రస్తావిస్తూ,జీవుడు పరిపూర్ణతను సంపాదించుకొనుటకు పరమాత్మ కోరినకోరికలను తీర్చే కొంగుబంగారము సాధకుని యజ్ఞమును సమర్థవంతము చేయాలనుకుంటున్నాడు.    మనము ఒక మహావృక్షమును సామాన్యదృష్టితో చూసినపుడు మనకు భూమిపైన ఉన్న కాండము-కొమ్మలు-ఆకులు-పూలు-పళ్ళు మాత్రమే కనిపిస్తాయి కాని,వాటన్నిటికి మూలకారణమైన మహిమాన్వితమైన వేరు కనపడదు.అంతమాత్రమున వేరులేదనగలమా? అదే విధముగా మన చర్మనేత్రములు భూభాగ ఉపరితలమును మాత్రమే వీక్షించగలవు కాని భూగర్భ సంపదను ఆలోచించలేవు.అర్థముచేసుకొనలేవు.ఇక స్వామిని అర్థించ గలవా? సాధ్యము కానే కాదు. అందుకే స్వామి ఘోర-అఘోర రూపములకు సంకేతముగా "అశ్మాచమే-మృత్తికాచమే" అంటూ కఠినమైన రాయి కావాలి-మెత్తనైన మట్టి కావాలి" అని అర్థింపచేస్తూ,అభీష్టసిధ్ధిని కలిగించాలనుకుంటున్నాడు.  భూమిని దున్నిన భూమి-దున్నని భూమి " "కృష్ణ పశ్యంచమే-అకృష్ణ పశ్చమ్యచే" అంతూ వర్గీకరించి కొన్ని భూములను ఆహారదాతలుగాను,మరికొన్నింటిని ఆవాస (ఇల్లు) దాతలుగాను ,ఆ భూములు అందించే సంపదలను కోరుక...

CHAMAKAMU-ANUVAAKAMU-04

Image
  శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.   జీవుల మేథను విస్తరింప చేస్తూ ధాన్యము యొక్క నాణ్యత ను వర్గీకరింపచేస్తూ " ఊర్క్సమే" అంటూ సామాన్య ధాన్యమును పరిచయము చేసాడు.అంతే కాదు సిరి ధాన్యములను ప్రస్తావింప చేసాడు " యవాశ్చమే-మాషాశ్చమే-తిలాశ్చమే అంటు రాగులను,మినుములను,నువ్వులను ఇంకా అనేకానే సిరి ధాన్యములను ఆవిష్కరిమచేసినది ఈ అనువాకము.    ధాన్య రకములనే కాక వాటి పరిమాణములోని వైవిధ్యమునుకూడ 1.రాశి.చిన్న రాశి.3.పెద్ద రాశి.4. చాలా పెద్ద రాశి.5.పూర్ణ రాశి అంటు " విభశ్చమే-ప్రభశ్చమే-బహుశ్చమే-భూయశ్చమే-పూర్ణశ్చమే అంటు ప్రస్తుతిస్తూ.   ఘన ఆహారముతో పాటు ద్రావకములను/పానీయములను కూడ జోడించి పాలు-నేయి-తేనె మొదలగు వానిని "పయశ్చమే-ఘృతశ్చమే-మధుశ్చమే" అంటు జీవుని యజ్ఞసాఫల్యతకై లభ్యమయేలా చేసినది.   పండ్లను అర్థించి స్వీకరించుటకై పచ్చని చెట్లను,గుబురు పొదలను నమకములో చెప్పినట్లు " వృక్షాశ్చమే" అని జీవుని కోరుకొమ్మని యజ్ఞసామాగ్రిని పరిపూర్ణము చేసుకోమని సూచిస్తున్నది. అన్న-పానీయములను అందించుటకు సిధ్ధమైన తరువాత "రయశ్చమే-రాయశ్చమే" అంటూ, బంగారమున...

CHAMAKAMU-ANUVAAKAMU-03

Image
  శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.మొదటి అనువాకము ఆహార సిధ్ధిని అందించుచున్న మాతృ స్వరూపము గాగ,రెండవ అనువాకము ఆలోచనా సిధ్ధిని అందించుచున్న పితృ స్వరూపము గాను భావించుచున్న వారికి,చమకమునకు వజ్ర మకుట సమానమైన మూడవ అనువాకము ఆచార్య స్వరూపముగా భావించుటలో ఎటువంటి సందేహము లేదనుటకు  ఆకారమును-ఆలోచనను పుష్ఠివంతము చేసుకొనుచున్న జీవుడు వానిని యుక్తాయుక్త విచక్షణతో ఉపయోగించుకోవాలనుకుంటున్నాడు.     .అందుకే "శంచమే-మయశ్చమే" అంటూ ఆర్తిగా అనువాకమును ఆరంభించాడు"                 శివుని అనుగ్రహముతో జీవుడు తన విశ్వసందర్శనములోని  వస్తువుల తారతమ్యములను గుర్తించాలనుకుంటున్నాడు.ఏవి ఉపయోగములో-ఏవి నిరుపయోగములో,ఏవి సారములో-ఏవి నిస్సారములో,ఏవి క్షణికములో-ఏవి శాశ్వతములో,ఏవి ఉపయోగములో-ఏవి నిరుపయోగములో,ఏవి అనుసరణీయములో-ఏవి పరిత్యజనీయములో,ఏవి ప్రియములో-ఏవి అప్రియములో,ఏవి అనుకూలములో-ఏవి ప్రతి కూలములో గమనించవలెనని,దానికి తనకు మార్గదర్శకుడైన గురువు ఆవశ్యకత ఎంతయో గలదని ,  ప్రియంచమే-అనుకామశ్చమే-సౌమనసశ్చమే  వస్తువైవిధ్యమును ప్రస...

CHAMAKAMU-ANUVAAKAMU02

Image
  శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.   రెండవ అనువాకములో చమకము అర్థుల ఆలోచనా వైచిత్రిని,   జ్యేష్ఠంచమ-ఆధిపత్యంచమే అంటూ ప్రారంభించింది.కలయతీతి కాలం. పరిణామ స్వభావముగల కాలములో ఒక్కొక్క సారి అనుకూల పరిస్థితులు మరొక్కప్పుడు ప్రతికూల పరిస్థితులు ఏర్పడుతుంటాయి.అప్పుడు వాటిని  ఎదుర్కోవాలంటే స్థితప్రజ్ఞత్వము కల నాయకుడు.పరిణితితో ఆలోచించగలిగి యుండాలి.సామర్థ్యముతో సమస్యలను పరిష్కరించుకోగలగాలి.     అంతేకాదు అవసరమైన పరిస్థితులలో ఆగ్రహమును అంతర్ముఖముగా-బహిర్ముఖముగా తగిన మోతాదులో వ్యక్తము చేయగలిగి యుండాలి.ప్రకటిత కోపియై యుండాలి కాని ప్రకృత కోపియై వశుడు కారాదు అనే సత్యాన్ని "భామశ్చమే-మన్యశ్చమే " అంటూ మనకు చెబుతోంది. వారసత్వమను ప్రక్రియకు నారుపోసి ముందు జాగ్రత్తగా మాకు మా ముందు తరములవారికి ప్రసాదించమని ప్రార్థనను ."వర్ష్మాశ్చమే" అంటూ.   మానసికోల్లాసమునకు క్రీడలను పరిచయము చేస్తూనే అనగా ఈశ్వర లీలను గుర్తించు సామర్థము,దానిని పొందుటకు సత్యము-ధర్మము-శ్రధ్ధ,వేద సంహితాధ్యనము మొదలగు వానిని మతిశ్చమే-సుమతిశ్చమే అంటూ సూచిస్తున్న చమకముతో మరిన్ని మంచి విష...

CHAMAKAMU-ANUVAAKAMU01

Image
  చమకము-ప్రథమ అనువాకము.    ***************************  శివుని కరుణ అర్థము కానిది.శివుని కరుణ అద్భుతమైనది.రుద్రనమకము పరమాత్మ సర్వాంతర్యామిత్వమును,సర్వ సామర్థ్యమును వివరిస్తు విశ్వమే విశ్వేశ్వరుడు అను యథార్థమును సోదాహరణముగా మనకు వివరిస్తుంది.ఆ విషయము లోని మర్మమును అవగతము చేసుకోలేని మనము చేతులుచాచి చెంతకు చేర్చుకోవాలనే కరుణాంతరంగుడైన పరమాత్మను ఏమి అడగాలో,ఎప్పుడు అడగాలో,ఎందుకు అడగాలో,ఎలా అడగాలో తెలుసుకోలేని తమస్సులోనున్న మనలను కరుణించి,పరమాత్మ చమకము ద్వారా తానే మన బదులు అంతటా అవగతమవుతున్న పరమాత్మ అనుగ్రహమును ఆలంబన చేసుకొని,ఆధ్యాత్మిక సోపానములను అధిరోహించుటకు,మనము ఏమి అడగాలి,ఎప్పుడు అడగాలి,ఎవరికోసము/ఎందుకోసము అడగాలి,ఎలా అడగాలి తెలియచేయు వాత్సల్యమే చమకము.ఒకటి కాదు-రెండుకాదు,ఒకసారి కాదు-రెందు సార్లు కాదు,ఒక కాలమునకు కాదు విశ్వమంతయు విరాజమానమగుటకు అది కూడా,ఇది కూడా అహకాదు అలాకూడా,ఇలా కూడా,కాదు కాదు అప్పుడు కూడా/ఇప్పుడు కూడా,దానికి కూడా/దీనికి కూడా,నాకు కూడా/నా వంశమునకు కూడా ఇలా ప్రతి పదము తరువాత ఇంకా,ఇంకా,నాకు కావాలి అని కోరుటచే "చ" అని,నాకు కావాలి అని ప్రార్థి...

GIRISAMCHA- ABHICHAAKASI

Image
 శివానుగ్రహము అర్థముగానిది.అద్భుతమైనది.అట్టడుగననున్న వారిని గట్టిగా పట్టుకుంటుంది.కొత్తదనమును చూపిస్తుంది.మత్తుకళ్ళను తెరిపిస్తుంది.పరమ కరుణాంతరంగుడైన పరమేశుడు నన్నొక పరికరమును చేసి నా చేయి పట్టుకుని తనకు తాను వ్రాసుకొనుచున్న వాక్యములే ఈ గిరిశంచ-అభిచాకశీ.   ఇక్కడ పెద్దలు గిరిశంచ అను పదములోని గిరి శబ్దమునకు మూడువిధములైన అర్థములను వివరించారు. 1 మొదటిది గిరి కొండయందుండి (మన గుండెయందుండి) శం శుభములను కలిగించువాడు. 2.గిరులు-వేదములు వేదములయందుండి జగములకు మోదము కూర్చువాడు. 3.గిరి-ఇచ్చినమాట యందుండి ఆర్తరక్షణమును చేయువాడు.     ఇట్టి మహిమాన్విత స్వభావుడు పరమశివుడు రుద్రుడై -అభిచాకశీ అన్ని వైపులా తన తేజముతో ప్రకాశిస్తూ,వానిని సమర్థవంతము చేస్తున్నాడు.     భోళాశంకరుడు నేను ఏమి కోరుకోవాలో,ఎలా కోరుకోవాలో,ఎప్పుడు కోరుకోవాలో తానే నాకు స్పురింపచేసి నన్ను అనుగ్రహించుగాక.స్వామి దయతో మనము చమకముతో మమేకమై ఆనందసాగరములో మునిగి తేలుదాము.   నమకములో సత్యం-శివం-సుందరమును దర్శించగలిగితే స్వామి కరుణ మనము కోరుకునే ప్రతి అభ్యర్థన మన ఆధ్యాత్మిక సాధనకు...