Posts

OM NAMA SIVAAYA-52

Image
   ఓం నమః శివాయ-52    ********************  పెద్ద దేవుడనని నీవంటే మద్ది తెల్లబోయింది  అంబే శివుడనని నీవంటే జంబు బెంబేలెత్తింది  భూతనాథుడనని నీవంటే చూతము చూతము అంది  యోగిని నేనని నీవంటే రేగి ఆగిపోయింది  చెలకని వాడనని నీవంతే చెరుకు ఊరుకున్నది  మీరేడునని నీవంటే మారేడు చేరమన్నది  ఉబ్బులింగడనని నీవంటే కొబ్బరి తబ్బిబ్బయింది  నిర్వాహకుడినని నీవంటే ఉర్వాకము నవ్వింది  దొడ్డవాడనని నీవంటే గడ్డి అడ్డుచెప్పకుంది  "వృక్షేభ్యో-హరికేశేభ్యశ్చః" నమకము అనగానే  అన్నిచెట్లు నీవంటే అక్కసుతో పచ్చియని,నిన్ను  వెక్కిరించాయిరా ఓ తిక్క శంకరా.

OM NAMA SIVAAYA-51

Image
   ఓం నమః శివాయ-51    ********************   నీ నెత్తిమీద గంగను చూసి నదులు బెంగపడ్డాయట   మా నీత్తిమీదికి ఏ ఆపద ముంచుకొస్తుందోనని  నీ కంఠమంటిన పామును చూసి కొండచిలువలు బెంగపడ్డాయట  మా కంటిముందు ఏ దందన వెన్నంటి ఉందోనని  నీ చేతిలోని మృగమును చూడగనే సుఖము మృగ్యమైపోయిందట  వాడిబాణమేదో తమను దాడిచేయనుందని   నీ గజచర్మమును చూసి గజములు గజగజలాటేనట   పొట్టచీల్చి ఎవరు తమను పొట్టనుపెట్టుకుంటారోనని   నీ బ్రహ్మపుర్రెలు చూసిన జనులు కుర్రో-మొర్రోలేనట   రిమ్మతెగులు తగులుకొని దుమ్మునోట కొడతావని  "దయనీయశ్చ-దయాళుకాస్తి" అని సువర్ణమాల అనగానే,నే   ముక్కున వేలేసానురా ఓ తిక్క శంకరా.

om nama sivaaya-50

Image
   ఓం నమః శివాయ-52  ****************  చంద్రుని అమృతధారలు ఔషధములను ఇస్తే  చమత్కారివై నేను గొప్ప వైద్యుడనంటావు  సూర్యుడు నేరుగా పత్రహరితమును అందిస్తే  సూటిగా  నేనే హరికేశుడనని అంటావు  డమరుకము అనవరతము అమరనాదమును చేస్తుంటే  డాంబికముతో  నేనే గొప్ప గురువునని అంటావు  గంగమ్మ జీవనదిగా జలధారలను ఇస్తే  దగాకోరువై నేనే ధాన్యరాశి నంటావు  పదములకడ ప్రమథగణము పరిచర్యలు చేస్తుంటే  పనిచేయకనే నేను పరిపాలకుడనంటావు  సొమ్మొకడిది-సోకొకడిది అన్నారు ఇదేనేమో  పక్కా మోసగాడవురా ఓ తిక్క శంకరా.  చంద్రుడు-సూర్యుడు-డమరుకము-గంగమ్మ-ప్రమథగణము కష్టపడుతుంటే,శివుడు వాటి శ్రమను ప్రస్తావించకుండా,అన్ని పనులను తానే చేస్తున్నానని గొప్పదనము తనకు ఆపాదించుకుంటాడు.-నింద.  చంద్రుడు నమః శివాయ-సూర్యుడు నమః శివాయ  ధాన్యము నమః శివాయ-ధ్యానము నమః శివాయ  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ  " నమ ఉర్వర్యాయచ ఖల్యాయచ" రుద్ర నమకం.  ధాన్యరూపమున భూమినుండి పుట్టిన రుద్రునకు నమస్కారములు.అంతేకాదు ధాన్యమున...

OM NAMA SIVAAYA-49

Image
ఓం నమ శివాయ-49 ***************   ముక్కంటినిన్ను ముద్దాడ నే మూఢునిగా మారాలా   ఇక్కట్లను కలిగించిన నిగమశర్మ ధర్మంలా   గరళ కంఠుని దయకై నే గంగలో మునగాలా   విశ్వమంత జ్వాలలతో విషమును విరజిమ్మాలా   కపర్ది కనికరమునకై నే కైలాసము చేరాలా   ఆర్ద్రతతో నినదించే రుద్రవీణ నాదములా   నిటలాక్షుని వీక్షణకై నేను నిర్దయతో ఉండాలా   పశుపక్షుల వేటాదగ సంధించు  శరములా   పరమేశా నీ పాదమును చేర నే పాపిలా మారాలా   అణువణువు అతినీచపు పనుల గుణనిధిలా   పాడిలేని వాడవై నన్ను రాపాడుతున్నను,నా   హక్కు వదులుకోనురా  ఓ తిక్క శంకరా.

OM NAMA SIVAAYA-48

Image
  ఓం  నమః శివాయ-48   ******************   మాతంగపతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి   గణపతి అవతరించాడు కరివదనముతో   అశ్వపతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి   తుంబురుడు వచ్చాడు గుర్రపు ముఖముతో   నాగపతిగ నీవుంటే ఏది రక్షణ వాటికి  పతంజలి వచ్చాడు పాము శరీరముతో   వానర పతిగ నీవుంటే ఏదిరక్షణ వాటికి   నారదుడు వచ్చాడు వానర ముఖముతో   సింహపతిగ నీవుంటే ఏదిరక్షణ వాటికి   నరసిమ్హుడు వచ్చాడు సింహపు ముఖముతో   పశుపతిగా నీవుంటే అశువుల రక్షణ లేకుంటే   ఇంకెక్కడికి పోవాలిరా ఓ తిక్క శంకరా. OM  NAMA SIVAAYA--48

OM NAMA SIVAAYA-47

Image
  ఓం నమః శివాయ-47  ******************   కన్నుల నిప్పులు రాలచ కరుణ ఎట్లు అగునురా   కరమున పుర్రెను దాల్చిన వరదహస్తమా అది  గళమున గరళము నిలిపి మంగళమనమంటావు  పాములను చుట్టుకొని మా సామివి నీవంటావు  గంగ నీత్తిమీద ఉన్న తీరిన బెంగయా అది  విషమరూపుడా నిన్ను అనిమిషుడంటున్నారు  అసురభయముతో నున్నగాని శూరుడవని అనుకుంటు  తాండవముతోనే దుష్ట తాడనమును చేస్తావట  కనులు తెరిచిన కదనము-కనులు మూసిన ప్రణవము  కనులపండుగ ఏది నిన్ను చూడ కనులు కాయలు కాచిన తనకు తోచిన తీరే-మమ్ము తరియింపచేయడని ఒక్కడినే  దిక్కుతోచక నున్నారురా ఓ తిక్క శంకరా.

OM NAMA SIVAAYA--46

Image
  ఓం నమః శివాయ-46   ***************  రూపివా/అరూపివా/అపురూపివా? శివా నీవు  కన్నతండ్రిని చూడ నే కాశిపోవ కానరాడు  దేవతల మోహమడచ మొదలు-చివర కానరాడు  చిదంబరము పోయిచూడ చిన్నగను కానరాడు  అటుచూడని-ఇటుచూడని ఆటలెన్నో ఆడతాడు  నింగిలోకి సాగుతాడు-నేలలో  దాగుతాడు  అగ్గినంటి ఉంటాడు-గాలినేనే అంటాడు  జ్యోతిని నేనంటాడు-ప్రీతిని నీకంటాడు  ఈ వలసలు ఎందుకంటే చిద్విలాసమంటాడు  దాగుడుమూతలు ఆడుతు  పట్టుకోమంటాడు  సుందరేశ్వరడునంటాడు ముందున్నానంటాడు  ఒక్కరూపునుండవేమిరా ఓ తిక్కశంకరా.