Posts

OM NAMA SIVAAYA-68

Image
  ఓం నమః శివాయ-41   ****************   సగము మహాదేవుడట-సగము మహాదేవి అట   సగము తేట తెలుపట-మరొకసగము పసిడిపసుపట   సగము చంద్రబింబమట సగము మల్లెదండలట   సగము జటాజూటమట-సగము ధమ్మిల్లమట   సగము బూదిపూతలట-సగము కస్తురి తిలకమట   సగము నాగహారములట-సగము నానాహారములట   డమరుక దక్షిణ హస్తమట-వరద వామ హస్తమట   సగము పులితోలేనట-సగము చీనాంబరములట   సగము తాండవపాదమట మరొకసగము లాస్య పాదమట   చెరిసగము స్త్రీ-పురుషులటసృష్టి కొనసాగింపునకట  నగజ అనఘ జతలో మిగిలిన సగమేది అంటే  దిక్కులు చూస్తావేమిరా ఓ తిక్క శంకరా.  అమ్మను దర్శించుకుందామని వస్తే ఏదో వెలితిగా ఉంది.అమ్మ మల్లెదండల థమ్మిలమునకు  బదులు సగభాగము గంగను ధరించిన జటాజూటము కనిపించుచున్నది.కస్తురి తిలకముతో కన్నులవిందు చేయు ముఖమును బూదిపూతలు అడ్డుచున్నవి.మంగళకరమైన అమ్మ సొమ్ములను పాములు దాచివేయుచున్నవి.చీనాంబర శోభను పులితోలు కప్పివేయుచున్నది.పాదనమస్కారమును చేద్దామనుకుంటే లాస్యపాదము-తాండవ పాదము కనిపించుచున్నవి.ఆరాతీస్తే ఆ ఆదిశంకరుడు అమ్మను సగము ఆక్రమించేశాడు.మిగిలిన సగభాగ...

OM NAMA SIVAAYA-67

Image
  ఓం నమః శివాయ-67   ******************  అగ్గిలో  కాల్చావు ఆ భక్తనందనారుని  అఘోరవ్రతమన్నావు ఆ చిరుతొండనంబికి  అంబకము అడిగావు ఆ బోయ తిన్నడిని  చర్మకార దంపతుల చర్మము ఒలిపించావు  ఆ అయ్యలప్ప అర్థాంగినే ఆశగా కోరావు  దొంగతనము నేర్పావు ఆ కన్నడ బ్రహ్మయ్యకు  కళ్ళను నరికించావు కఠినముగా మహదేవుని  కళ్ళను పీకించావు కటకట మల్లికార్జుని  అంత పరీక్షించావు అమ్మాయి గొడగూచిని  నీ వీరశైవగాథలు కౄరత్వపు దాడులు  మోక్షమనె పేరుగల ఘోరమైన శిక్షలు  అక్కరలేదనవేమిరా ఓ తిక్క శంకరా.  శివుడు కౄరుడు.కనుకనే నందనారుని అగ్నిలో దూకమన్నాడు.చిరుతొండనంబిని (సిరియాళుని తండ్రి) చిత్ర-విచిత్రముగా పరిక్షించినాడు.తిన్నడిని కన్ను అడిగాడు.హరలయ్య-కళ్యాణమ్మల చర్మమును కోసుకునేలే చేసాడు.కాళ్ళు నరికించుట-కళ్ళుపీకించుట చూస్తూ ఉరుకున్నాడు.ఇదింకా మరీ చోద్యం.తన భక్తుడైన ఇయర్వగై నాయనారు ధర్మపత్నిపై తనకు మోహం కలిగినదని,తన వెంట ఆమెను పంపించమన్నాడు.హవ్వ.ఎంత నీచపు ఆలోచన.పాపము గొడగూచి అను చిన్న పిల్లపై ఆమె తల్లితండ్రులపై నైవేద్య క్షీరమును శివుని సమర...

OM NAMA SIVAAYA-66

Image
  నీ చిన్మయముద్రను నేను అనురక్తితోచూస్తుంటే   నీ తలపని గంగమ్మ నన్ను తుంగతొక్కుతానంటున్నది   నీ జటాజూటము నన్ను దక్షుడు అనుకుంటున్నది   నీ శిరమున శశి  గ్రహణము నాకేనని అంటున్నది   నీ కంఠములోని విషము నన్ను కబళించాలనుకుంటున్నది   నీ చేతి డమరుకము నా వివరము అడుగుతున్నది   నీ నడుము పులితోలు కలవరమేఅంటున్నది   నీ వాహనమైన ఎద్దు నన్ను గద్దిస్తోంది   నీ మంజీరమైన పాము నాపై బుసలు కొట్టుతున్నది   వేడుకొనుట దేవుడెరుగు నిన్ను చూడనీయకున్నవి  నీ వైనము ఏమిటి? నావైపు చూడవు భయముతో  ఉక్కిరిబిక్కిరి అవుతున్నానురా ఓ తిక్క శంకరా!  శివ దర్శనమునకై వెళ్ళిన భక్తుని శివుని గంగ-జటాజూటము-చంద్రుడు-విషము-డమరుకము-పులితోలు-మంజీరము ఎద్దు ఎద్దేవా చేస్తూస్వామి దగ్గరకు వెళ్ళనీయకున్నవి.శివుడు వాటిని మందలించలేని అసమర్థతతో,కళ్ళుమూసుకొని ధ్యానముద్రలో నున్నట్లు నటిస్తున్నాడు. వైనము నమః శివాయ-ధ్యానము నమః శివాయ భయము నమః శివాయ-అభయము నమః శివాయ  నమఃశివాయ నమః శివాయ ఓం నమః శివాయ " జటాభిర్లంబమానాభిరృత్యంత  మభయప్రదం   దేవం శ...

OM NAMA SIVAAYA-65

Image
   ఓం నమః శివాయ-65    ********************   సుగంధిపుష్టి కర్తకు సుప్రభాత దీపములు నిటలాగ్ని హోత్రునికి నిత్య ధూప దీపములు పాషాణపు దేవునికి ప్రభల వెలుగు దీపములు కందర్ప దర్పునికి కర్పూర దీపములు పరంజ్యోతి రూపునికి ప్రమిదలలో దీపములు జలజాక్షునికి వేడుకగా జలములోన దీపములు ప్రమథ గణాధిపతికి ప్రదోషవేళ దీపములు ఆశాపాశ రహితునికి ఆకాశదీపములు మా ఆర్తిని తొలగించే కార్తీక దీపములు దీపములను పేర వెలుగు నీ నామ రూపములు జాణతనము తోడుకాక జ్వాలాతోరణములో చిక్కు కున్నావురా ఓ తిక్క శంకరా. .............................................................................................................................................................................................................................సుగంధ భరితుడు,పోషకుడు,వృద్ధికారుడు అని చెబుతు శివుడు పొద్దున్నే వెలిగించే దీపాలకై ఎదురుచూస్తుంటాడు.కామ దహనము చేసానంటు కర్పూర దీపాలను కోరతాడు.లింగము రాయి కనుక దీపాలను చూడలేదు. పద్మములు జలములో నున్న దీపాల వేడిని తట్టుకోలేవు.మన ఆశలన్నిటిని దూరము చేస్తానంటు శివుడు ఆకాశదీపాలకై త...

OM NAMA SIVAAYA-64

Image
గలగలపారే గంగను జటలో చుట్టేసినావు  భగభగ మండే అగ్గిని నుదుటను కట్టేసినావు  శశకమనే చంద్రుని  సిగను సింగారించునావు  విర్రవీగు విషమును కంఠమునబంధించినావు  చరచర పాకు పాములను చతురత పట్టేసినావు  కూరిమితెలియని పులినిఒలిచిపెట్టేసినావు  రిపులగు త్రిపురాసురులను మట్టుపెట్టేసినావు  పరమనీచులైన వారి పాపములను పాపినావు  తిర్యక్కులను గాచితిమిరము నెట్టేసినావు  నీ చుట్టు తిరుగుచున్న నా పాపములను చుట్టేసి  శ్రీరస్తు అని కావగ శ్రీకారము చుట్టమంటే  పక్క చూపులెందుకురా ఓ తిక్క శంకరా.  గంగానదికి పూజ్యతను కలిగించాడు.అగ్గిని ఆరాధ్యనీయము చేసాడు.శాపగ్రస్థుడైన చంద్రుని శిరమున ధరించాడు.హాలాహలమును తనలో దాచుకొని అర్చనలను పొందునట్లుచేసాడు.పరమనీచముగా ప్రవర్తించిన రాక్షసులను పవిత్రులను చేసాడు.క్రిమికీటకములకు సైతము పాపపుణ్యములను లెక్కించక ఆదరించిన శివుడు,నాపై తన కృపాకటాక్షమును ప్రసరించుటకు నిర్లక్ష్యము చేస్తున్నాడు-నింద.  లక్ష్యం నమః శివాయ-నిర్లక్ష్యం నమః శివాయ  ద్వంద్వం నమః శివాయ-నిర్ద్వంద్వం నమః శివాయ  నమః శివాయ నమః శివాయ ...

OM NAMA SIVAAYA-63

Image
నీకు పూజచేస్తే పున్నెమని విన్నానురా,భక్తితో అర్ఘ్య పాద్య జలములడుగ  కస్సుమన్నదిర గంగ స్నానమెట్లుచేయిస్తు సముదాయించర గంగను ఆసనమీయ చూడగ తుర్రుమన్నదిర పులి కట్టుకోను  బట్టలన్న కనుమరుగైనది కరి జందెమైన ఇద్దమన్న  చరచర పాకింది పాము నైవేద్యముచేయ బోవ విషజంతువులన్ని మాయం అక్కజమేమున్నదిలే నీ  అక్కర తీరినదేమో ఒక్కటైనకలిసిరాదు నీకు చక్కనైన పూజసేయ తక్కువేమి చేసావని పక్కదారి పట్టాయి మక్కువ మాకంటూనే పిక్కబలము చూపాయి వానిని చక్కదిద్దవేమిరా ఓ తిక్కశంకరా.

OM NAMA SIVAAYA-62

Image
  ఓం  నమః శివాయ-62   *********************  రూపులేని గాలిని అన్నిరూపులలో నిలుపుతావు  అలసటలేకుండ కదులుతు ఉండాలంటావు  కల్పవృక్షాలనైన కాళ్ళతో నీళ్ళుతాగమంటావు  కాస్తంత బంధించి కొమ్మలను కదుపుతుంటావు  భూమాతను సైతము కాళ్ళతో తాడనము చేస్తావు  కనికరములేకుంద కదులుతుండాలంటావు  ఆకాశము నే చూడమంటు హడావిడి చేస్తావు  వ్యోమకేశుడిని అంటు వదలక తాకుతునే ఉంటావు  గలగలల జలము మీద జాలిలేక ఉంటావు  గంగను బంధించి చుక్కచుక్క తాగుతునే ఉంటావు  పంచభూతములని చూడవు పంచమంటుంటావు  తొక్కేసినావుర వాటిని ఓ తిక్క శంకరా. .