Posts

OM NAMA SIVAAYA-90

Image
    ఓం  నమః  శివాయ-40     ********************  ఎప్పుడేమి అనిపిస్తే అప్పుడది చేస్తావు  తప్పొప్పులు గమనించక పప్పులో కాలేస్తావు  అంబ రెందు కన్నులను  ఆటగా మూసావు  అంధకారములోనుండి  అంధకాసురుడుదయించాడు  మూడో  కంటి అగ్గిని జలధిలో  దాచావు  ఆ జలధిలో నుండి జలంధరడుదయించాదు  కపాలమును గిల్లుటుకై గట్టిగ హుంకరించావు  అతిభయంకరముగ కాలభైరవుడుదయించాడు.  కుడి-ఎడమని చూడకుండ జటను విసిరికొట్టావు  భద్రతనే మరిచిన వీరభద్రుడుదయించాడు  హద్దు అదుపులేనివారి పనులను వద్దనవు నీవని  ఒక్కటే నిష్ఠూరములుర ఓ తిక్కశంకరా.  శివుడు తనకు ఏ పనిచేయాలనిపిస్తే దానిని ఆలోచించకుండా చేసే తొందరపాటు స్వభావము కలవాడు.కనుకనే అంధకాసురుడు-జలంధరుడు-కాలభైరవుడు-వీరభద్రుడు జన్మించారు.వారు యుక్తాయుక్తములను మరచి హింసాప్రవృత్తితో ముజ్జగములను గడగడలాడించారు.తిరిగి శాంతిని నెలకొల్పుటకు అంధకుని-జలంధరుని అంతమొందించవలసినది.మిక్కిలి కష్టముతో వీరభద్రుని-కాల భైరవుని శాంతింపచేసినారు.ఇదంతా శివుని నిర్వాకమే-నింద.  జ...

OM NAMA SIVAAYA-89

Image
  ఓం నమః శివాయ-26   ****************  ప్రళయము చూస్తుంటావు-ప్రణవము చేస్తుంటావు  అదృశ్యము చేస్తావు-పంచకృత్యమని అంటావు  అల్లుడిని కానంటావు-ఇల్లరికము ఉంటావు  సన్యాసిని అంటావు-సంసారిగ  ఉంటావు  దయనీయుడనంటావు-దహించివేస్తుంటావు  ఎవ్వడు వాడంటావు-ఎదిరించలేడనంటావు  ఎడమకాలితో తన్నుతావు-మడమతిప్పనంటావు  ఎడమకాలు ఎవరిదంటే-తడబడుతుంటావు  నీవు చేయని శిక్షణను-నీవే చేసానంటావు  అమ్మ చేయుచున్న రక్షణను-అంతా దాచేస్తావు  మక్కువ అంటూనే అమ్మను-నువ్వు తక్కువగా భావించే  కక్కూర్తి వాడవటర  నీవు  !     ఓ తిక్కశంకరా.  శివుడు జగములు జలమున మునిగిపోతుంటే చేతకానివాడై కళ్ళుమూసుకొని జపము చేసుకుంటాడు.దక్షుడికి నేను ఇప్పుడు అల్లుడిని కానని,నమస్కరించకుండా,ఎప్పుడు కైలాసములోనే ఇల్లరికము ఉంటాడు.దయార్ద్రహృదయుడనని అంటూనే దహించివేస్తుంటాడు. ఎడమకాలితో శత్రువులను తరిమికొడుతు,మడమతిప్పని ధైర్యము కలవాడనని అంటాడు.సర్వము సతి చేస్తుంటే,దానిని చెప్పకుండా అంతా తానేచేస్తున్నానని చెప్పుకుంటాడు.ఎడమకాలి ప్రసక్తి వస్తే త...

OM NAMA SIVAAYA-88

Image
  ఓం నమః శివాయ-88   ********************  ఉమ్మిపూసి మందు అనిన కిమ్మనక ఉంటాడు  గుగ్గిలపు వాసనలకు ఉబ్బితబ్బిబవుతుంటాడు  కుంటి గాడిదమీద కులుకుతు కూర్చుంటాడు  మట్టిముంతకోసమని గట్టివాదులాడువాడు  చెన్నప్పవ్వ బొంతను కప్పుకుని రోతగా ఉంటాడు  రంగులు మారుస్తు ఎంతో పొంగిపోతు ఉంటాడు  రాళ్ళు రువ్విన వాని ఆరళ్ళను తీరుస్తాడు  బాణపుదెబ్బలను తింటు బాగుబాగు అంటాడు  క్లేశహారిని అంటు కేశములను కోరుతాడు,  కళ్యాణప్రదాతనని కళ్యాణము కానీయడు  నవ్వులపాలవుతున్నా నవ్వుతూనే ఉంటాడని  వెక్కిరిస్తున్నారురా ఓ తిక్క శంకరా.  సాలీడు పాకిన చోటంతా శివలింగమునకు పొక్కులు వస్తే,నక్క నాయనారు భార్య ఉమ్మివేసి అదే దానికి మందని అంటే ఆనందంగా స్వీకరించాడు.కలశ నాయనారు భార్య మంగళసూత్రమును తాకట్టు పెట్టి గ్రాసము తీసుకురావటానికి వెళుతుంటే సాంబ్రాణిని దానికి బదులుగా ఇచ్చాడు.చాకలి నాయనారు తన కుంటిగాడిదమీద మాసిన బట్టల మూతతో పాటు కూర్చోపెడితే వాహనపూజ అంటు వాహ్వా అన్నాడు.నీలకంఠ నాయనారుకు మట్టిముంతను దాచిపెట్టమని,అది చాలా మహిమాన్వితమైనదని,మాయమాటలు...

OM NAMA SIVAAYA-87

Image
  ఓం  నమః శివాయ-37  **********************  సూర్యరశ్మి తాకిడికి పారిపోయిన నాచు  జారినాడులే అంటూ చేరుతోంది చెరువులోకి  చుట్టివేసి ఉందని ముట్టుకోలేననిన నీరు  పరిచారులే పదమంటూ చేరుకుంది చాపకిందికి  .పరిక్రమ సమయమని..ఆక్రమించలేనన్న చీకటి   మళ్ళీ మామూలేగా అంటు ఆవరించింది మనసులోకి   విబుధగోష్టి వేళయని బంధనాలనిన వికృతి  .వివరము తెలియలేదంటువిస్తరించిందిమనిషిలోకి   పిశాచాలతో ఆడే పిచ్చివాడు శివుడని,పునరావృత   మాయను పూర్తిగా మాయము చేయలేనివాడని కచ్చగా వచ్చి మమ్ము గుచ్చుతుంటే  హెచ్చరించలేవని నిన్ను తక్కువ చేస్తున్నారురా ఓ తిక్కశంకరా శివుడు పూర్తిగా దేనిని తొలగించలేడు.కనుకనే నాచు మరల నీటిలోనికి ప్రవేశించగలుగుతోంది.మాయ చాపకింది నీటిలా మనకు తెలియకుండానే మన దరిచేరుతుంది.ధ్యానము ధ్యాసను కుదురుగా ఉండనీయదు.మనసును చలించేలా చేస్తుంది.సద్గోష్ఠి ముగియగానే విపరీత భావనలు సమయము చూసి స్వాధీనము చేసుకుంటుంది.వీటన్నికి కారణము శివుని అసమర్థతే.-నింద.  ప్రకృతి  నమః శివాయ-వికృతి నమః శివాయ  రాకయు నమః శివాయ...

OM NAMA SIVAAYA --86

Image
 ఓం నమః శివాయ-86  **************  గణపతిని శిక్షించగ గజముతలను పెట్టావు  అంధకుని  రక్షించగ భృంగిగా మార్చావు  దక్షుని జీవింపచేయ మేకతలను పెట్టావు  బ్రహ్మ తలలు పడగొడుతు భిక్షపాత్రలంటావు  నరసింహుని శాంతింపగ పక్షితలతో వెళతావు  వ్యాఘ్రపాదుడంటు కాళ్ళకు పులిపాదములతికిస్తావు  తలరాతల మార్పులంటు తలలనే మారుస్తుంటావు  వెతలను తీరుస్తానంటు కతలనే రాస్తావు  నా కతవినిపించానంటే నా తల మారుస్తావేమో  తలమానికము నేనంటు తలల మార్పుచేర్పులతో  తలకొక మాదిరిగ తరియింపచేయువాడనంటు,వారిపై  ఉక్కుపాదమెందుకురా ఓ తిక్కశంకరా.  శివుడు తాను తలరాతలను మారుస్తానంటూ,చేతకాక వారి తలను తీసి వేరొక తలను అతికిస్తుంటాడు.అంతటితో ఆగకుండా కాళ్లకు పులిపాదములను అతికిస్తాడు.భ్రింగికి మూడుకాళ్ళు కలిగిన వికృత రూపమునిచ్చాడు.బ్రహ్మకల్పము ముగుసిన వెంటనే వాని తలలను దండగా గుచ్చుకొని వేసుకొని మురిసిపోతు,నేను తలమానికమైన వాడినని గొప్పలు చెప్పుకుంటాడు.-నింద.  కతలు నమః శివాయ-వెతలు నమః శివాయ  శర్భం నమః శివాయ-శర్వుడు నమః శివాయ నమః శివాయ నమః శ...

OM NAMA SIVAAYA-85

Image
  ఓం  నమః శివాయ-85   ********************** గట్టిగానే వారు నిన్ను ప్రార్థించారనుకుంటు,అందరిని నెట్టుకుంటు వచ్చినీవు మట్టిలింగమవుతావు  సుతిమెత్తని బాలుడని వెతలను తొలగించాలంటు,అద్భుత  కతలను అందీయగ వచ్చినీవు సైకతలింగమవుతావు  అఖిలజగములకు మేము అమ్మా-నాన్నలమంటు,చక్కని  వలపుచాట వచ్చినీవు తెలుపు-నలుపు లింగమవుతావు  ఆకలిదప్పులతో నున్నారని-పాలధారలివ్వాలని,ఆగని  ఆతురతతో వచ్చినీవు అమృతలింగమవుతావు  హుటాహుటిని హడావిడిగా హనుమ పట్టుకొచ్చాడని,భళిరే  మెచ్చుకుంటు వచ్చినీవు అనేక లింగములవుతావు  లింగము అంటే గుర్తు అని-బెంగ తీరుస్తుందని వస్తే  ఒక్క గుర్తునుండవురా ఓ తిక్క శంకరా.  సివుడికి తొందర ఎక్కువ తన రూపమును గురించి,దానికి సంబంధించిన సంకేతమైన లింగము గురించి ఒక నిర్దిష్టమైన ప్రకటనమును చేయలేనివాడు.కనుకనే ప్రార్థనలకు ఉబ్బి తబ్బిబ్బై, అందరిని నెట్టుకుంటు వచ్చి మట్టిలింగముగా వెలిసినాడు.ఆ విషమును గమనించకుండ మార్కండేయుని అనుగ్రహించుటకై ఇసుకలింగముగా మారి పూజలందుకునే వాడు.ద్రాక్షారామ భీమేశ్వరుని భక్తుడు నీలో మీ ఇద్దరిని చూడ...

OM NAMA SIVAAYA-84

Image
  ఓం నమః శివాయ-84   ****************  నీ చేతల మంచి-చెడులు నీ నిర్ణయమని అంటుంటే  నిరపరాధులను నీవు బాధిస్తున్నావంటున్నవి  శిలను శిల్పముగా మలచే స్థపతి అని నీవంటే  తప్పుచేయకున్నను తప్పవు ఉలిదెబ్బలు అంటున్నది శిల  నీటిని నివ్వెరపరచే నిషాదుడను అని నీవంటే  తప్పుచేయకున్నను తప్పదు వలకాటు అంటున్నది చేప  అడవిని సంరక్షించే మృగయుదను అని నీవంటే  తప్పుచేయకున్నను తప్పదు శరమువేటు అంటున్నది మృగము  ప్రళయమునే చూడగలుగు ప్రబుద్దుడను అని నీవంటే  ముంచుతున్న ఆపదను రక్షించలేని సాక్షివి అంటున్నది ప్రళయము  నిర్దయతో హింసిస్తు నిష్కళంకుడను అని నీవంటే  నిక్కమనుకోరురా ఒక్కరైన ఓ తిక్కశంకరా.  శివుడు తాను శిల్పినంటు-జాలరినంటు-వేటగాని నంటు-ప్రళయసాక్షినంటు చెప్పుకుంటు ఎన్నో ఎందరినో నిరపరాధులను అమాయకులను శిక్షిస్తున్నాడు.-నింద.  శరము నమః శివాయ-శరణము నమః శివాయ  జననము నమః శివాయ-మరణము నమః శివాయ  నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ " యోగక్షేమ ధురంధరస్య సకలశ్రేయః ప్రదోద్యోగినో   దృష్ట్వాదృష్ట్వామతో...