Posts

OM NAMA SIVAAYA-93

Image
  ఓం  నమః శివాయ-29   *******************  పాఠము నేర్పిస్తానంటు గూడుపుఠాణి చేస్తుంటావు  ఒకరికొకరిమీది నుండి ఒకరి ఒద్దిక తీసేస్తావు  బుధ్ధులు మారుస్తావు యుధ్ధము చేయిస్తావు  బ్రహ్మ-విష్ణాదులను సైతము బరిలో దించుతావు  అస్త్రముపై అస్త్రముతో ఆటలాడిస్తావు  అవనీతలమును బొంగరముగ తిప్పుతుంటావు  మార్తాండుని సైతము మరుగున దాచేస్తావు  విస్పుటలింగములను ప్రస్పుటింపచేస్తావు  అఖిలజగములను అతలాకుతలము చేస్తావు  ఏమయ్యా! ఏమిటిది? అంటే శివమాయ అంటావు  అగ్నిస్తంభముగా నీవు ఆవిష్కరింపబడుట,వారి  రెక్కల కష్టమేరా ఓ తిక్క శంకరా. ఎటుచూసిన తననె జగములు స్తుతించుటలో తానొక్కడే ముజ్జగములకు మూర్ధాభిషిక్తుడననుకున్నాడు.అహంకారముతో నిండిన ఆనందముతో సంచరించుచుండగా క్షీరసముద్రములో అనంత శయనుడైన మరో వ్యక్తి కనిపించాడి.తనకు నమస్కరించలేదని వాదనకు దిగాడు బ్రహ్మ అతనితిఎ.నేను నీ తండ్రిని అని హరి అంటే కాదు నేనే నీ తండ్రిని అని బ్రహ్మ హుంకరించాడు.వారి వాదన యుధ్ధమునకు దారి తీసి ముజ్జగములను గజగజలాడించింది.సకల దేవతలు సదా శివుని ప్రార్థించగా ప్రపంచ స...

OM NAMA SIVAAYA--92

Image
  ఓం  నమః  శివాయ-92   ******************  రూపులేని గాలిని అన్ని రూపులలో నింపుతావు  అలసట లేకుందా కదులుతునే ఉండాలంటావు  కల్పవృక్షాలనైన కాళ్ళతో నీళ్ళుతాగమంటావు  కాస్తంత బంధించి కొమ్మలను కదుపుతుంటావు  భూమాతను సైతము కాళ్ళతో తాడిస్తుంటావు  కనికరము లేకుండా కదులుతుండాలంటావు  ఆకాశము నేను చూడమంటు హడావిడి చేస్తావు  వ్యోమకేశుడనని తాకుతునే ఉంటావు  గలగలల జలము మీద జాలిలేక ఉంటావు  గంగను బంధించి చుక్కచుక్క తాగుతావు  పంచభూతములని చూడవు-పంచమంటుంటావు  తక్కువేమైనదిర నీకు ఓ తిక్క శంకరా.

OM NAMA SIVAAYA-91

Image
  ఓం  నమః  శివాయ-33   ******************  ఎడమకాలి చెప్పు కుంచె ఎంతో నచ్చేసిందా  ఎరుకలవానిని వింతగ నెత్తికెక్కించుకున్నావు  నాయనారు నిర్లక్ష్యమునకు కోపము వచ్చేసిందా  పాతగోచి కోసము ఎంతో పేచీ పెట్టావు  లింగధారుల నియమములు సాంతం కట్టేసాయా  కుంచము నీవనగానే మంచిది అనుకున్నావు  వంకర పరీక్ష చేయాలను తలపొచ్చిందా  వంకయ్య గొడ్డుటావు పాలకు అడ్డుచెప్పకున్నావు  తిలకవ్వకు తికమకలు చూపాలనిపించిందా  కౌగిలించుకొనగానే  మగవానిగా మార్చావు  మిక్కిలి ప్రేమయని మక్కువ చూపిస్తానంటు  చిక్కులుపెడుతుంటావురా ఓ తిక్కశంకరా.   ఎడమకాలి చెప్పును చీపురుచేసి,శివలింగార్చిత పత్రిని తోసివేసిన కన్ననికి శ్రీకాళహస్తి కొండమీద,గుడిని కట్టించి తన నెత్తిమీదుంచుకున్నాడు ( పెరియ పురాణం)  .పాతగోచీ ముక్క కోసం అమరనీతి నాయనారుతో ఎన్నో వింత పేచీలు పెట్టినాడు.(బసవ పురాణ భక్తులు)ఒక లింగధారుల గుంపు దూర ప్రయాణమును చేయుచు,పూజా సమయమైనందున ఒక చోట ఆగి,శివలింగమునకై వెతుకగా వారికి కనపడలేదు.పూజా సమయము మించుతున్నదని వారు,వారు తెచ్చ...

OM NAMA SIVAAYA-90

Image
    ఓం  నమః  శివాయ-40     ********************  ఎప్పుడేమి అనిపిస్తే అప్పుడది చేస్తావు  తప్పొప్పులు గమనించక పప్పులో కాలేస్తావు  అంబ రెందు కన్నులను  ఆటగా మూసావు  అంధకారములోనుండి  అంధకాసురుడుదయించాడు  మూడో  కంటి అగ్గిని జలధిలో  దాచావు  ఆ జలధిలో నుండి జలంధరడుదయించాదు  కపాలమును గిల్లుటుకై గట్టిగ హుంకరించావు  అతిభయంకరముగ కాలభైరవుడుదయించాడు.  కుడి-ఎడమని చూడకుండ జటను విసిరికొట్టావు  భద్రతనే మరిచిన వీరభద్రుడుదయించాడు  హద్దు అదుపులేనివారి పనులను వద్దనవు నీవని  ఒక్కటే నిష్ఠూరములుర ఓ తిక్కశంకరా.  శివుడు తనకు ఏ పనిచేయాలనిపిస్తే దానిని ఆలోచించకుండా చేసే తొందరపాటు స్వభావము కలవాడు.కనుకనే అంధకాసురుడు-జలంధరుడు-కాలభైరవుడు-వీరభద్రుడు జన్మించారు.వారు యుక్తాయుక్తములను మరచి హింసాప్రవృత్తితో ముజ్జగములను గడగడలాడించారు.తిరిగి శాంతిని నెలకొల్పుటకు అంధకుని-జలంధరుని అంతమొందించవలసినది.మిక్కిలి కష్టముతో వీరభద్రుని-కాల భైరవుని శాంతింపచేసినారు.ఇదంతా శివుని నిర్వాకమే-నింద.  జ...

OM NAMA SIVAAYA-89

Image
  ఓం నమః శివాయ-26   ****************  ప్రళయము చూస్తుంటావు-ప్రణవము చేస్తుంటావు  అదృశ్యము చేస్తావు-పంచకృత్యమని అంటావు  అల్లుడిని కానంటావు-ఇల్లరికము ఉంటావు  సన్యాసిని అంటావు-సంసారిగ  ఉంటావు  దయనీయుడనంటావు-దహించివేస్తుంటావు  ఎవ్వడు వాడంటావు-ఎదిరించలేడనంటావు  ఎడమకాలితో తన్నుతావు-మడమతిప్పనంటావు  ఎడమకాలు ఎవరిదంటే-తడబడుతుంటావు  నీవు చేయని శిక్షణను-నీవే చేసానంటావు  అమ్మ చేయుచున్న రక్షణను-అంతా దాచేస్తావు  మక్కువ అంటూనే అమ్మను-నువ్వు తక్కువగా భావించే  కక్కూర్తి వాడవటర  నీవు  !     ఓ తిక్కశంకరా.  శివుడు జగములు జలమున మునిగిపోతుంటే చేతకానివాడై కళ్ళుమూసుకొని జపము చేసుకుంటాడు.దక్షుడికి నేను ఇప్పుడు అల్లుడిని కానని,నమస్కరించకుండా,ఎప్పుడు కైలాసములోనే ఇల్లరికము ఉంటాడు.దయార్ద్రహృదయుడనని అంటూనే దహించివేస్తుంటాడు. ఎడమకాలితో శత్రువులను తరిమికొడుతు,మడమతిప్పని ధైర్యము కలవాడనని అంటాడు.సర్వము సతి చేస్తుంటే,దానిని చెప్పకుండా అంతా తానేచేస్తున్నానని చెప్పుకుంటాడు.ఎడమకాలి ప్రసక్తి వస్తే త...

OM NAMA SIVAAYA-88

Image
  ఓం నమః శివాయ-88   ********************  ఉమ్మిపూసి మందు అనిన కిమ్మనక ఉంటాడు  గుగ్గిలపు వాసనలకు ఉబ్బితబ్బిబవుతుంటాడు  కుంటి గాడిదమీద కులుకుతు కూర్చుంటాడు  మట్టిముంతకోసమని గట్టివాదులాడువాడు  చెన్నప్పవ్వ బొంతను కప్పుకుని రోతగా ఉంటాడు  రంగులు మారుస్తు ఎంతో పొంగిపోతు ఉంటాడు  రాళ్ళు రువ్విన వాని ఆరళ్ళను తీరుస్తాడు  బాణపుదెబ్బలను తింటు బాగుబాగు అంటాడు  క్లేశహారిని అంటు కేశములను కోరుతాడు,  కళ్యాణప్రదాతనని కళ్యాణము కానీయడు  నవ్వులపాలవుతున్నా నవ్వుతూనే ఉంటాడని  వెక్కిరిస్తున్నారురా ఓ తిక్క శంకరా.  సాలీడు పాకిన చోటంతా శివలింగమునకు పొక్కులు వస్తే,నక్క నాయనారు భార్య ఉమ్మివేసి అదే దానికి మందని అంటే ఆనందంగా స్వీకరించాడు.కలశ నాయనారు భార్య మంగళసూత్రమును తాకట్టు పెట్టి గ్రాసము తీసుకురావటానికి వెళుతుంటే సాంబ్రాణిని దానికి బదులుగా ఇచ్చాడు.చాకలి నాయనారు తన కుంటిగాడిదమీద మాసిన బట్టల మూతతో పాటు కూర్చోపెడితే వాహనపూజ అంటు వాహ్వా అన్నాడు.నీలకంఠ నాయనారుకు మట్టిముంతను దాచిపెట్టమని,అది చాలా మహిమాన్వితమైనదని,మాయమాటలు...

OM NAMA SIVAAYA-87

Image
  ఓం  నమః శివాయ-37  **********************  సూర్యరశ్మి తాకిడికి పారిపోయిన నాచు  జారినాడులే అంటూ చేరుతోంది చెరువులోకి  చుట్టివేసి ఉందని ముట్టుకోలేననిన నీరు  పరిచారులే పదమంటూ చేరుకుంది చాపకిందికి  .పరిక్రమ సమయమని..ఆక్రమించలేనన్న చీకటి   మళ్ళీ మామూలేగా అంటు ఆవరించింది మనసులోకి   విబుధగోష్టి వేళయని బంధనాలనిన వికృతి  .వివరము తెలియలేదంటువిస్తరించిందిమనిషిలోకి   పిశాచాలతో ఆడే పిచ్చివాడు శివుడని,పునరావృత   మాయను పూర్తిగా మాయము చేయలేనివాడని కచ్చగా వచ్చి మమ్ము గుచ్చుతుంటే  హెచ్చరించలేవని నిన్ను తక్కువ చేస్తున్నారురా ఓ తిక్కశంకరా శివుడు పూర్తిగా దేనిని తొలగించలేడు.కనుకనే నాచు మరల నీటిలోనికి ప్రవేశించగలుగుతోంది.మాయ చాపకింది నీటిలా మనకు తెలియకుండానే మన దరిచేరుతుంది.ధ్యానము ధ్యాసను కుదురుగా ఉండనీయదు.మనసును చలించేలా చేస్తుంది.సద్గోష్ఠి ముగియగానే విపరీత భావనలు సమయము చూసి స్వాధీనము చేసుకుంటుంది.వీటన్నికి కారణము శివుని అసమర్థతే.-నింద.  ప్రకృతి  నమః శివాయ-వికృతి నమః శివాయ  రాకయు నమః శివాయ...