Posts

OM NAMA SIVAAYA-96

Image
 ఓం నమ@ శివాయ-96  ***************  కొంతమంది రుద్రులుగా భూమిమీద సంచరిస్తూ  తినకూడని ఆహారము తినిపించేస్తుంటావు  మరికొంతమంది రుద్రులుగా గాలిలో విహరిస్తూ  ఆయాసము-ఉబ్బసము విజృంభింప చేస్తావు  ఇంకొంతమంది రుద్రులుగా నీటిలోన చేరుతూ  క్రిమికీటక జలములతో వ్యాధులు పెంచేస్తావు  కొంతమంది రుద్రులతో గగనములో దాగుతూ  అతివృష్టి-అనావృష్టి నష్టము చేస్తుంటావు  ఆయుధమవసరములోని యుధ్ధమని అంటావు  అపచారము సవరించే పరిహారము అంటావు  సకలమును సన్స్కరించు పధ్ధతి యేనా ఇది? టక్కరి కొక్కెరవటర నీవు ఓ తిక్క శంకరా.  .  భువనం నమః శివాయ-గగనం నమః శివాయ  దండన నమః శివాయ-దండము నమః శివాయ.   శంకరుడు అనేకానేక రూపములను తనలాగ ఉండువారిని సృష్టించి,వారిని నింగి-నేల-జలము మొదలగు పంచభూతములనే ఆయుధములుగా మలచుకొని,వాటి ప్రభావము చేతనే జనులను సదాచార పరులను చేయమంటున్నాడు.ఈ ప్రణాళికలో జనులు వ్యాధిపీడితులుగా,ఆకలి బాధితులు గా మారి,పశ్చాత్తపడి సన్మార్గమున నడిచేవారిని,క్షమిస్తూ,పధ్ధతి మార్చుకోని వారికి ముగింపు తెస్తు,నిర్దాక్షిణ్యముగా శివుడు ...

OM NAMA SIVAAYA-95

Image
 ఓం  నమ: శివాయ-32   ******************** కాళ్ళుజారతాయని చూడకుండ నీళ్ళూ పోస్తుంటావు తుడిచేందుకు బట్ట వేస్తే దానిని తడిపేస్తావు  ఏనుగులు కొలిచాయాని బాగానే చెబుతావు  ప్రత్యక్షపూజ కోరితే వృక్షము కమ్మంటావు  అప్పులింగేశ్వరుడనంటు గొప్పలెన్నో చెబుతావు  పప్పన్నానికి మాత్రము ఒప్పుకోను అంటావు  గురువును నేను నీకు అంటు గౌరితో అంటావు  అమ్మ శక్తిని కుదించి అఖిలాండేశ్వరి అంటావు   నీళ్లమడుగుపైన కన్నులపండుగగా వెలిసావు   తుళ్ళుచున్న ఆశలపై.నీళ్ళుజల్లుతుంటావు  నీళ్ళదొరని నేనంటు భక్తుల పెళ్ళికి అనుమతించని  ముక్కంటివి నీవటర ఓ తిక్కశంకరా.   నీళ్ళమడుగులో నుండి( కావేరి జలము) ప్రకటింపబడిన శివుడు నీళ్ళతో ఆడుతు వాఈఇని కింద పారపోస్తుంటాడు.భక్తుల కాలుజారి పడతారని ఆలోచించడు.ఏనుగులు ఈ క్షేత్రములో తనను పూజించాయని గొప్పలుచెప్పుకుంటాడు.శంభుడు అను యోగి ప్రత్యక్షపూజానుగ్రహమును కోరగా నేరేడు చెట్టుగా మారి తనను పూజించమన్నాడు.గౌరీదేవికి తాను గురువునని కనుక ఆమెను పెండ్లిచేసుకోనని చెప్పాడు.తాను చేసుకోపోతే మానె,ఎవరైన ఉత్సాహంగా పెళ్ళిముచ...

OM NAMA SIVAAYA-94

Image
   ఓం  నమః  శివాయ-28    **********************  సారూప్యము-సామీప్యము సాంగత్యమునకు ఆశపడి  నిర్హేతుక కృపనీదని నిన్ను సేవించాలని  కొంచము అటు జరుగమంటే చోటులేదు అంటావు  పోనీలే ఇటు జరుగమంటే వీలుకాదు అంటావు  ఎటు కుదిరితే అటు జరుగమంటే గుటకలు మింగుతావు  స్థపతిని నేనైనా స్థలమునకు అవస్థలంటావు  నాలాంటాడొకడు నన్ను కదలనీయడంటావు  బేలతనము చూపిస్తు జాలిలేక ఉంటావు  ఇబ్బందులు పడుతూనే ఇరుకున కిక్కురు మనవు  సిబ్బందులు చూస్తారని ఇసుమంత సిగ్గుపడవు  సర్వ వ్యాపివన్న సాకుతో నొక్కుతున్న వానిని  తొక్కివేయమేమిరా ఓ తిక్క శంకరా.  శివుడు తను సర్వస్వతంత్రుడనని-సర్వవ్యాపినని చెప్పుకుంటాడు కాని నిజమునకు అటు-ఇటు కొంచమైనను కదలలేనివాడు.పక్కకు తిరగగానే శివునిలాగానే ఉండే మరో మూర్తి శివుని అటు-ఇటు కదలకు అని మందలిస్తుంటాడు.స్థపతి-అన్నిటిని స్థాపించువాడు అని పిలువబడుతున్నప్పటికిని,కొంచం స్థలమును నేను కూర్చునుటకు సంపాదించలేనివాడు.చేసేదేమి లేక తన పక్కనున్నవాడు ఏమిచెప్తే సర్దుకుంటూఇరుకులో ఇబ్బందిపడుతుంటాడుకాని వాణ...

OM NAMA SIVAAYA-93

Image
  ఓం  నమః శివాయ-29   *******************  పాఠము నేర్పిస్తానంటు గూడుపుఠాణి చేస్తుంటావు  ఒకరికొకరిమీది నుండి ఒకరి ఒద్దిక తీసేస్తావు  బుధ్ధులు మారుస్తావు యుధ్ధము చేయిస్తావు  బ్రహ్మ-విష్ణాదులను సైతము బరిలో దించుతావు  అస్త్రముపై అస్త్రముతో ఆటలాడిస్తావు  అవనీతలమును బొంగరముగ తిప్పుతుంటావు  మార్తాండుని సైతము మరుగున దాచేస్తావు  విస్పుటలింగములను ప్రస్పుటింపచేస్తావు  అఖిలజగములను అతలాకుతలము చేస్తావు  ఏమయ్యా! ఏమిటిది? అంటే శివమాయ అంటావు  అగ్నిస్తంభముగా నీవు ఆవిష్కరింపబడుట,వారి  రెక్కల కష్టమేరా ఓ తిక్క శంకరా. ఎటుచూసిన తననె జగములు స్తుతించుటలో తానొక్కడే ముజ్జగములకు మూర్ధాభిషిక్తుడననుకున్నాడు.అహంకారముతో నిండిన ఆనందముతో సంచరించుచుండగా క్షీరసముద్రములో అనంత శయనుడైన మరో వ్యక్తి కనిపించాడి.తనకు నమస్కరించలేదని వాదనకు దిగాడు బ్రహ్మ అతనితిఎ.నేను నీ తండ్రిని అని హరి అంటే కాదు నేనే నీ తండ్రిని అని బ్రహ్మ హుంకరించాడు.వారి వాదన యుధ్ధమునకు దారి తీసి ముజ్జగములను గజగజలాడించింది.సకల దేవతలు సదా శివుని ప్రార్థించగా ప్రపంచ స...

OM NAMA SIVAAYA--92

Image
  ఓం  నమః  శివాయ-92   ******************  రూపులేని గాలిని అన్ని రూపులలో నింపుతావు  అలసట లేకుందా కదులుతునే ఉండాలంటావు  కల్పవృక్షాలనైన కాళ్ళతో నీళ్ళుతాగమంటావు  కాస్తంత బంధించి కొమ్మలను కదుపుతుంటావు  భూమాతను సైతము కాళ్ళతో తాడిస్తుంటావు  కనికరము లేకుండా కదులుతుండాలంటావు  ఆకాశము నేను చూడమంటు హడావిడి చేస్తావు  వ్యోమకేశుడనని తాకుతునే ఉంటావు  గలగలల జలము మీద జాలిలేక ఉంటావు  గంగను బంధించి చుక్కచుక్క తాగుతావు  పంచభూతములని చూడవు-పంచమంటుంటావు  తక్కువేమైనదిర నీకు ఓ తిక్క శంకరా.

OM NAMA SIVAAYA-91

Image
  ఓం  నమః  శివాయ-33   ******************  ఎడమకాలి చెప్పు కుంచె ఎంతో నచ్చేసిందా  ఎరుకలవానిని వింతగ నెత్తికెక్కించుకున్నావు  నాయనారు నిర్లక్ష్యమునకు కోపము వచ్చేసిందా  పాతగోచి కోసము ఎంతో పేచీ పెట్టావు  లింగధారుల నియమములు సాంతం కట్టేసాయా  కుంచము నీవనగానే మంచిది అనుకున్నావు  వంకర పరీక్ష చేయాలను తలపొచ్చిందా  వంకయ్య గొడ్డుటావు పాలకు అడ్డుచెప్పకున్నావు  తిలకవ్వకు తికమకలు చూపాలనిపించిందా  కౌగిలించుకొనగానే  మగవానిగా మార్చావు  మిక్కిలి ప్రేమయని మక్కువ చూపిస్తానంటు  చిక్కులుపెడుతుంటావురా ఓ తిక్కశంకరా.   ఎడమకాలి చెప్పును చీపురుచేసి,శివలింగార్చిత పత్రిని తోసివేసిన కన్ననికి శ్రీకాళహస్తి కొండమీద,గుడిని కట్టించి తన నెత్తిమీదుంచుకున్నాడు ( పెరియ పురాణం)  .పాతగోచీ ముక్క కోసం అమరనీతి నాయనారుతో ఎన్నో వింత పేచీలు పెట్టినాడు.(బసవ పురాణ భక్తులు)ఒక లింగధారుల గుంపు దూర ప్రయాణమును చేయుచు,పూజా సమయమైనందున ఒక చోట ఆగి,శివలింగమునకై వెతుకగా వారికి కనపడలేదు.పూజా సమయము మించుతున్నదని వారు,వారు తెచ్చ...

OM NAMA SIVAAYA-90

Image
    ఓం  నమః  శివాయ-40     ********************  ఎప్పుడేమి అనిపిస్తే అప్పుడది చేస్తావు  తప్పొప్పులు గమనించక పప్పులో కాలేస్తావు  అంబ రెందు కన్నులను  ఆటగా మూసావు  అంధకారములోనుండి  అంధకాసురుడుదయించాడు  మూడో  కంటి అగ్గిని జలధిలో  దాచావు  ఆ జలధిలో నుండి జలంధరడుదయించాదు  కపాలమును గిల్లుటుకై గట్టిగ హుంకరించావు  అతిభయంకరముగ కాలభైరవుడుదయించాడు.  కుడి-ఎడమని చూడకుండ జటను విసిరికొట్టావు  భద్రతనే మరిచిన వీరభద్రుడుదయించాడు  హద్దు అదుపులేనివారి పనులను వద్దనవు నీవని  ఒక్కటే నిష్ఠూరములుర ఓ తిక్కశంకరా.  శివుడు తనకు ఏ పనిచేయాలనిపిస్తే దానిని ఆలోచించకుండా చేసే తొందరపాటు స్వభావము కలవాడు.కనుకనే అంధకాసురుడు-జలంధరుడు-కాలభైరవుడు-వీరభద్రుడు జన్మించారు.వారు యుక్తాయుక్తములను మరచి హింసాప్రవృత్తితో ముజ్జగములను గడగడలాడించారు.తిరిగి శాంతిని నెలకొల్పుటకు అంధకుని-జలంధరుని అంతమొందించవలసినది.మిక్కిలి కష్టముతో వీరభద్రుని-కాల భైరవుని శాంతింపచేసినారు.ఇదంతా శివుని నిర్వాకమే-నింద.  జ...