Posts

MEEDHUSHTAMA SIVATAMA-12

     మీఢుష్టమ శివతమ-12    ********************   న రుద్రో రుద్రమేచయేత్-రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించలేడు.దర్శించలేడు.   సాధకునికిఎదురుగా వేదవిజ్ఞానము వేచియున్నది.ఇందులో జ్ఞానము ఏది?జ్ఞేత ఏది? అనగా చూడబడునది ఏది? చూసేది ఏది?అంతా చూసేదేనా/చూడబడేదేనా? లేక జ్ఞాన-జ్ఞేతములకు సంబంధములేదా? ఈ నా సందేహమును ఎవరు తీర్చగలరు? ఎవరు వీటి సమన్యమును తెలుపగలరు?    దగాకోరు రుద్రుడు ఇదిగో ఇచ్చానంటాడు.మళ్ళీవస్తానంటాడు.నమ్మబలుకుతాడు.కిమ్మనకుందా ఆలకింపచేస్తాడు.అసలువిషయ విచారనకు కొసమెరుపు తానంటాడు.   ఇంగితమును కోల్పోయిన సాధకుడు ఇవాళ అటో-ఇటో తేల్చేయాలనుకుంటున్నాడు.అసహనముతో ఎదురుచూస్తున్నాడు అసలు విషయ తీర్మానమునకై.సహకారమే తానైన సామి సాక్షాత్కరించాడు.   వేదసాక్ష్తాకరమన్నావు.మోదప్రదాయకమన్నావు.నమ్మాను నిన్ను.అన్నింటిని నాముందు ఉంచానన్నావు.అందుకో నీవు అన్నావు.అంతర్ధానమవుతావు.అంతలో అందకుండా చేస్తావు.ఆపు నీ ఆటలు.   నీకన్నా మా అమ్మ-నాన్నలే మేలుచేసారు.బువ్వపెడుతూ చందమామ రావే అంటు జాబిల్లిని పరిచయము చేసింది తొలిగురువై.అనుకరణను నేర్పుతూ అధ్యాపకుడైనాడు నాన్న మ...

MEEDUSHTAMA SIVATAMA-INTRODUCTION

    మీడుష్టమ శివతమ-01  *********************** ఇంత్రొ    శివానుగ్రహము అర్థముకానిది.శివానుగ్రహము అద్భుతమైనది.అది అట్తడుగున నున్న వారిని గట్టిగా పట్టూంటుంది.కొత్తదనమును చూపిస్తున్నది.మత్తుకళ్ళను తెరిపిస్తున్నది.అదియే రుద్రచమకము చెబుతున్నట్లు కృష్టపచ్యంచమే-అకృష్తపచయంచమే అని నినదిస్తున్నది.ఊరికే పంతభూమియందు-బీడునేలయందు ఉన్నాడా పరమాత్మ.లేక బీడుభూములను పంటచేలగా మారుస్తున్నాడా అన్న సందేహము కనుక వస్తే ,రెండింటిలో ఉన్న సత్తే-చిత్తే-ఆనందమే సంస్కరనకు కంకణము కట్టుకొనుటయే "మీఢుష్టమ శివతమ"    ఆ చిదానందమునే "గిరిశంచ-అభిచాకశీ" అని మనము అనుకుంటే,నాకరమున కలముగా మారి కరుణవర్షమును కురిపించిన ఆ వర్షముకూడ అవధిలేనిది-మీడుష్టమ-దేనిని కురిపిస్తోంది అంతే శివ -శుభములను-శివతర-ఎక్కువ శుభములను-శివతమ-సంపూర్న శుభములను వర్షించదలచుకుంది.ఆ చిత్తు నేనే అందిస్తున్నానన్న భ్రమను కాసేపు కలిగిస్తూ,కాదుకాదనే తెలివిని మరికాసేపు కలిగిస్తూ,భ్రమలను తొలగిస్తూ,దాగుడుమూతలాడుతాడు.    పెద్దలు "గిరిశంచ" అను పదమునకు మూడు అర్థములను మన అవగాహనా సౌలభ్యమునకు అందించారు. 1.గిరియందుండి శుభములను కలిగించ...

MEEDUSHATAMA SIVATAMA-11

    మీడుష్టమ శివతమ-11   **********************   న రుద్రో రుద్రమర్చయేత్-  రుద్రుడు కానివాడు రుద్రుని అర్చించలేడు.అనుసరించలేడు.అనుభవించలేడు.    సాధకునీనుగ్రహమును నేనేమని వర్ణించగలను? సాక్షాత్తు రుద్రుని గుర్తించి-సాంభాషించి-సమర్థవంతమగుచున్నాడు.సందేహములుత్పన్నమవుతున్నవి-అవి రుద్రుని దయతో సందేశములుగా రూపుదిద్దుకుంటున్నవి.   సాధకుడు సుమనస్కుడైన రుద్రుని స్మరించాడో లేదో సాక్షాత్కరించాడు సమందహాసముతో.     ఎగతాళిచేయించుకోవటము ఒక లీలేకదా.     ఏమిటయ్యా రుడ్రా నాతో ఈ దాగుడు -మూతలు? అడిగినదేతడవుగా అనుగ్రహించానంటావు.అందుకునే లోపున హరించివేస్తావు?నువ్వున్నప్పుడు అంతా అర్థమయినటే ఉంటుంది.నాతెలివి మొత్తం నీతోపాటుగా తీసుకళ్ళిపోతావు ఏమితెలియనట్లు.కనుకనే కదా! వ్యర్థము మాత్రమే నాకు గోచరిస్తూ,నన్ను పరిహసిస్తున్నది?నువ్వు పక్కా మోసగాడివిలే.     ఉలకలేదు-పలుకలేదు రుద్రుడు.ప్రసన్నతతో చూస్తున్నాడు.   ఎక్కడుందయ్యా నీ అనుగ్రహము? ఉంటే అది నన్ను పక్కదారిలోనికి నెట్టివేస్తుందా? చెట్టు చిటారికొమ్మనెక్కాననుకున్న నన్ను పట్టుకుని లోయలోకి నెట్టివేస్...

MEEDUSHTAMA SIVATAMA-10

    మీడుష్టమ శివతమ-10  న రుద్రో రుద్రమర్చయేత్.   రోజులు క్షణాల్లా గడిచిపోతున్నాయి.వంసాభివృధ్ధి వరముగా లభించిందిగా.అందమైన భార్య .గర్భాశ్చమే-వత్సాశ్చమే-పిల్లలు ఆతలు-పాటలు-ఆనందాలు.అవధులు లేని ఆనందము.తనను తాను మరిచిన వేళ తారసపడినది రుద్రుని లీల.అంతే,    తనను తాను విమర్శించుకున్నాడు.తన సాధన ఏది? ఏమైనది? ఈ విషయవాసనలు నన్ను ఇంతగా ఆకర్షిస్తున్నవి.బంధిస్తున్నవి.భగవతత్త్వను బహిష్కరించేస్తున్నవి.అమ్మో రుద్రా.నా చేత సరీరమును-క్రీడలను-వంశమును-మోదమును అడిగేటట్లు చేసి,ఇచ్చినట్లు కనికట్టు చేసి,కట్టివేసావా?కఠినాత్ముడవు నీవు కనికరము లేనివాడవు.నాకు కావలిసినదే ఇస్తున్నట్లు నటించి నా సాధనకు కాలదోషము పట్టించావు.కనపడు.నిన్ని కడిగిపదేస్తా(అభిషేకము) అంటూ కృధ్ధుదై యున్న సాధకుని ఎదుట సాక్షాత్కరించాడు రుద్రుడు.   సాంబుడిగా నన్ను చూశావు.మాఓదిలో గనపతిని-గుహుని చూసావు.మాకుటుంబము వలె నీకు కుటుంబము కావాలనుకున్నావు.తప్పులేదు. వచ్చిన చిక్కల్లా నీ చర్మహక్షువులతో చూచిన కుటుంబమే మేమని భావించదము.   అంతే! అర్థము కాలేదు సాధకునికి.   పరమార్థము చెప్పదలిచాడు రుద్రుడు.   అతిశయమైన జ...

MEEDUSHTAMA SIVATAMA-09

    మీడుష్టమ శివతమ-09  *********************    న రుద్రో రుద్రమర్చయేత్-రుద్రుడు కానివాడు ౠద్రుని అర్చించలేడు.   నచ్చాడు సాధకుడు.మెచ్చివచ్చాడు రుద్రుడు.యధాప్రకారముగా వరము కోరుకో -అనుగ్రహిస్తానన్నాడు.  సంసయించాడు సాధకుడు.ఈ రుద్రుడు టక్కరివాడు.అనుగ్రహమంటాడు.ఇచ్చానంటాడు.తీరా ఈసుకుందామనుకుంటే దక్కనీయడు.పైగా ఆనందమేనా అంటు వచ్చి పరామర్శిస్తుంటాడు.అర్థం చేసుకో అంటూ పరాచికాలాడతాడు.అడిగితేనే ఇచ్చాగా అంటు గడసరి మాటలాడుతాడు.తిమ్మిని బమ్మిని చేస్తాడు.ఇప్పుడు నేను బాగా ఆలోచించుకుని అదగాలి అని అనుకుంటున్నాడు.    గమనించిన రుద్రుడు తొందరేమిలేదులే.బాగా ఆలోచించుకుని అడుగు.అనుగ్రహిస్తాను.ఈలోగా నన్ను ఆశ్రయిస్తున్న మరొక అర్థిని కరుణించివస్తాను అంటు కదిలాడు రుద్రుడు.    స్థిమితబడ్డ మనసుతో అడుగుటకు సిధ్ధమయ్యాడు సాధకుడు తడబడకుండ.    తలచినంతనే ఎదురుబడతాడు ఆ ఈగుడుదిగుడు కన్నులవాడు ఏమి తెలియనివానిలానటిస్తూ.అది ఒకలీల.    రుద్రా విను,వర్మాచాఎ-నాకు అందమైన సమర్థవంతమైన శరీరముకావాలి.దీనికి శక్తిని ప్రసాదించు.అంతే కాదు ఇది కాంతివంతమై ఉండాలి కనుక త...

MEEDUSHTAMA SIVATAMA-08

     మీడుష్టమ శివతమ-08    *******************   న రుద్రో రుద్రమర్చతేత్-రుద్రుడు కాని వాడు రుద్రుని అర్చించలేడు.    నిలదీయడమే కావాలి ఆ నీలకంఠునికి.ఇంకెందుకు ఆలస్యమంటు అరుదెంచినిలిచాడు ఆ సాధకునికి ఎదురుగా అసలేమి జరగనట్లు.   ఉక్రోషముతో ఊగిపోతున్నాడు సాధకుడు.వచ్చావా! ఇక్కడేమిజరుగుతుందో చూసిపోదామని.నేను తెలియక నాకు ఇది కావాలి-అదికావాలి-ఇంకోటి కూడా కావాలి అంటూ ఎన్నెన్న్నో అడిగానే అనుకో,అర్థించానే అనుకో  అసలు విషయము చెప్పకుండా ఇవి నీకు నిరుపమానములు అంటు ఇచ్చావేకాని నిరుపయోగములు అని అప్పుదేనాతో చెప్పలేదు.   నిష్ఠూరాలు నిలవలోఉన్నట్లున్నాయి అన్నాడు రుద్రుడు చెక్కుచెదరనిచిరునవ్వుతో.కాకపోతే ఏమిటయ్యా అర్థించిన వెంతనే అనుగ్రహించటమా నేనుచేసిన తప్పువివరము తెలియని వానికి సర్వము అందించినట్లు అంటూ సన్న సన్నగా మందలిస్తూ,  నిన్ను నీవు పరిశీలించుకో---నీ దగ్గర ఉన్నవాటిని--అసలు అవి ఏమిటి? వాటిని ఎలా ఉపయోగించుకోవాలి?నేను ఏమి చేయాలి? ఎలా చేయాలి?ఎందుకు చేయాలి? లోహకారుని పనితనమును గమనించు.మోహజాలములు దూరమవుతావి అన్న స్పురణతో  పరమాత్మ ఆవేశము ఆలోచనగా మా...

MEEDUSHTAMA SIVATAMA-07

     మీడుష్టమ  శివతమ-07   ************************    న రుద్రోరుద్రమర్చయేత్-  రుద్రుడు కాని వాడు రుద్రుని అర్చించలేడు.అర్థము చేసుకొనలేడు.    కృత్స్న వీతాయ ధావతే సత్వానాం పతయే-అలవాటుమార్చుకోవటము అసాధ్యమేనంటూ ఇక్కడ సాధకుని వెనుక పరుగిడుతున్నాడు రుద్రుడు.పాపం వాడికి నా అవసరము వస్తుందేమో.అడుగుతాదేమో! అనుగ్రహిద్దాము అనుకుంటూ.     ఊరుకుంటాడా వానిని వెనుదిరిగి వరమును అడగనీయకుండా ఆ భద్రనిచ్చేవాడు.    ఇక్కడ మనమొక విషయమును గుర్తుచేసుకుందాము.అదియే లోహ ప్రాశస్త్యము.హితము రమణీయత ను కలిగించే బంగారము తన సింగారమును పొందే విధానము.అదేనండి అపరంజి ఆభరనముగా రూపుదిద్దుకొను విధానము.    ఈ మేలిమి బంగారమును కాసేపు మనము ఆత్మ తత్త్వముగా భావిద్దాము.అది కాసేపు తన సస్వరూపమునకు నామరూపములను ప్రకటించాలనుకుంది.అప్పుడు ఏమి చేస్తుంది? అగ్నికీలలు అనే చైతన్యము ద్వారా తన విస్తరనను ప్రారంభించి,తనతో పాటు రాగి అను మరొక లోహమును తనలో కలిపేసుకొని,తాను మరొక ఆకారమును సంతరించుకుంటుంది.ఆ రూపమునకొక మరొక అందమైన పేరుపెట్టుకుంటుంది.గాజులని-గొలుసులని.కొత్త రూపము...