Posts

TIRUVEMBAAVAAY-17

Image
     తిరువెంబావాయ్-17  **************  శంగనవన్ పాల్ తిశై మగన్ పాల్  ఎంగుం ఇలాదరోర్ ఇంబం నం పాలదన్  కొంగుం కరుణ్ కుళలి నందమ్మాఇ కోదాట్టి  ఇంగనం ఇల్లంగళ్ ఓరుం ఎళుంది అరుళి  శంగమల పొట్పాదం తందరళుం సేవగనై  అంగణ్ అరసై అడియోగళ్ కారమాదై  నంగళ్ పెరుమానై పాడి నలంతి కళల్  పంగయపూం పునల్ పాయిందాడేలోరెంబావాయ్.  అరుణగిరిస్వామియే పోట్రి  **********************   ఓ చెలి,  ఆడేలో రెంబావాయ్-నీవు మేల్కొని వస్తే కేరింతలు కొడుతు ఆడుకుందాము.  ఎక్కడ ఆడుకుందాము అంటే,  పంగయు పూం పునల్-పద్మములు వికసించి ప్రకాశించుచున్న మడుగులో,  పునల్ పాయింద్-మడులోనికి ప్రవేశించి,   కేరింతలతో ఆడుకుందాము.  ఆ వికసిత పద్మములు దేనికి సంకేతము?   జ్ఞాన తపోధములు. అంతే కాదు అవి మనందరిని పాలించుచున్న స్వామి నేత్రములు. మన స్వామి శెన్ కణ్-చెన్ను కన్నులు-అందమైన కన్నులు కల స్వామి.పుండరీకాక్షుడు.  అంతే కాదు-స్వామి పాదములు కూడ  శంగమలై పొట్పాదము-శెణ్ కమలై-అందమైన కమలముల వంటి పాదపద్మములు. రా చెలి స్వామిని కీర్తిద్దాము.ఏ విధముగా అ...

TIRUVEMBAVAY-16

Image
  తిరువెంబావాయ్-16  **************  మున్ని కడలై చురుక్కి ఎళుందియాల్  ఎన్నతిగళ్ దెమ్మై ఆరుదైయాళ్ ఇత్తడియన్  మిన్ని పొళిందెం పిరాట్టి తిరువడిమేర్  పొన్న చిలంబిర్ చిలంబిత్ తిరుప్పురవం  ఎన్నచ్ శిలైకులవి నాందమ్మై ఆళుడియాళ్  తన్నీర్ పిరవిళా ఎణ్కోమణ్ అంబర్కు  మున్ని అవళ్ నమక్కు మున్ శురుక్కుం ఇన్నరుళే  ఎన్న పొళియాయ్ మళయేలో రెంబావాయ్.  శ్యామలా తాయియే పోట్రి  ****************   చెలి ఆకాశము వైపు చూడు.నీకు ఏమి కనిపిస్తున్నది అని అడిగినది ఒక బాలిక తన చెలిని.చెలి నల్లని మేఘమునా నన్ను చూదమటున్నావు అని తిరిగి ప్రశ్నించినది.  చెలి అది సామాన్యమైన నల్లని మేఘము కాదు.ఎందుకంటే సామాన్య మేఘము,  మున్ని-ముందర,  కడలై-సముద్రములోనికి ప్రవేశించి,నీటిని పూర్తిగా తాగి,దానిని ఆవిరిగా,  చురుక్కి-సంక్షిప్త పరచి,దాని పరిణామమును తగ్గించి,ఒక చిన్న నల్లని మేఘముగా ఆకాశములో ఉంటుంది.కాని నా స్పురణకు ఇది,  ఎన్నతిగళందు-నా భావనకు  ఉడయార్-సాక్షాత్తు జగద్రక్షకి యైన మీనాక్షి అమ్మ.చూడు    అదిగో చూడు-మిన్నిపొళంది-మెరుపు తీగలు ఎలా ప...

TIRUVEMBAAVAAY-15

Image
     తిరువెంబావాయ్-15      ***************  ఓరు రకాల్ ఎం పెరుమాన్ ఎన్రెన్రే నం పెరుమాన్  శీరోరుకాల్ వాయోవల్ శిత్తం కళికూర  నీరొర్కాల్ ఓవా నెడందరై కన్ పణిప్పన్  పారోర్కాల్ వందనయాల్ ఎణ్ణోరై తాం పణియాన్   పేరరయన్ ఇంగణ్ణే పిత్తోర్వార్ ఆమారు   ఆరోరువర్ ఇవ్వణ్నం ఆట్కోళం  విత్తకర్తాళ్   వారురువ పూణ్మలైయార్ వాయార్  ఆనాంపాడి   ఎరురువం పూం పునల్ పెయిరేలోరెంబావాయ్  పార్వతీపతయే పోట్రి  ************************  చెలులారా!రండి.  వచ్చి,  పూన్ పునల్ పాంగే-జ్ఞాన పుష్పములతో నున్న ముక్తి మడుగులో మునిగి,  వాయారాం-నోరారా,  ఆనాపాడి-ఆనందసంకీర్తనము చేస్తూ.  ఆడేలో-క్రీడిద్దాము.    ఏమని పాడుదామంటే,  పేరరయన్-పెద్ద దేవుడు-మహాదేవుడు.  ఆ స్వామిని గురించి తపము చేయుచున్న తల్లి,  ఓరురుకాల్-కొంచము బహిర్ముఖమగుతు,  మెల్లగ పలవరిస్తుంది.ఏమని అంటే, ఎం పెరుమాన్-(మనందరి) స్వామి , నం పెరుమాన్-మన స్వామి-సర్వ జగద్రక్షకుడు.  అని ఎన్రెన్రె-పలవరిస్తుంది.  తల్లి పలవరిస్తున్న స...

TIRUVEMBAAVAAY-14

Image
   తిరువెంబావాయ్-14  *************  కాదార్ కుడైయాడ పైపూంకలానాడ  కోదై కురళాడ వండిన్ కుళామాడ  సీద పునలాడి చిట్రం బలం పాడి  వేద పొరుల్పాడి అప్పొరుళ మాపాడి  శోది తిరం పాడి శూల్కొండ్రై తార్పాడి  ఆది తిరంపాడి అందం ఆమా పాడి  పేదిత్తు నమ్మై వళతెడుత్త పెయ్వలైదన్  పాదతిరం పాడి పాడేలొ రెంబావాయ్  వైద్యనాథ తాయియే పోట్రి  *************************  తిరు మాణిక్యవాచగర్ ఈ పాశురములో స్వామి దయాంతరంగమును తనను శరను కోరిన్ వారికి సాక్షాత్తు తల్లిగా మారి ఏవిధముగా ప్రసవము చేసాడో చెప్పకనే చెప్పుచున్నాడు.  స్వామి వేదమయుడు.తేజోవంతుడు.ఒకటేమిటి అన్నియును తానైన స్వామిని తాయిని చన్నీటి జలములో మునిగి పునీతులమై మన కర్ణాభరణములు-ఇతర అభరనములు కదులు కుండగా-ఆ ఆభరములు సామాన్యమైనవికావు.సద్గుణరాశులు-సవినయ సమర్పితములు.సద్గుణభూషితులైన పడుచులు సవినయముగా స్వామిని కీర్తించుచున్నారు.దానికి తోడుగా వారు కేశములలో ముడుచుకున్న పూవులును స్వామిని కీర్తించుచున్నవట.పంచేంద్రియ సంస్కారములే వారు ముడుచుకున్న పూవులు.అవి పరవశించి స్వామిని పరిపరివిధములుగా కీర్తించుచున్నవి ప్...

TIRUVEMBAVAY-13

Image
       తిరువెంబావాయ్-13  *****************  పైంగుమళై కార్మలరార్ శెంగమల పైంపోదాల్  అంగం కురు గినత్తార్ పిన్నుం అరవత్తార్  తంగళ్ మనంకళవు వార్వందు సార్దనినాల్  ఎంగళ్ పిరాట్టియుం ఎంకోన్రుం పోర్నిశెయింగ  పొంగుమడువీర్ పుగప్పాందు పాయిందు  శంగం శిలంబ శిలంబు కలందార్ప  కొంగకళ్ పొంగ కుడైయుం పునల్పొంగాన్  పంగయుంపూం పునల్పాయిందాలే రెంబావాయ్.  అర్థనారీశ్వమే పోట్రి  ************************  మాణిక్యవాచగర్ అవర్గళ్ మనకు బాలికలు స్నానముచేయుటకు వెళ్ళిన మడుగు/కొలను గురించి ఈ పాశురములో అద్భుతముగా/మహిమోపేతముగా ఉన్నదని వివరించుచున్నారు.  ఆ కొలను ఎలా ఉన్నదంటే,  పైంగుమళై-అతి సుకుమారమైన/మృదువైన,  కార్-నల్లని వర్ణముగల,  మలరార్-పువ్వులతో/నల్లని కలువతో నిండి యున్నది.  అంతే కాదు వాటితో పాటుగా,  శెం-ఎర్రని,అందమైన.చెన్నుగా నున్న,  కమల్-కమలముతో నిండి యున్నది.  ఆ కమలములు -నల్ల కలువలు చూచుటకు స్వామి సేవకు అలంకరింపబడుటకు కట్టిన మాలవలె తోచుచున్నది.  ఆ కొలనులో నీరు ఎలా సాగుతున్నదంటే,  స్వామికి ఎం...

TIRUVEMBAVAY-12

Image
   తిరువెంబావాయ్-12  *****************  ఆర్తా పిరవి తుయర్కెడ నామార్తాడుం  తీర్థన్ నట్రిల్లై చిట్రంబలతె తీయుదుం  కూత్తం ఇవ్వానుం కువలయముం ఎల్లోముం  కాత్తు పదైత్తుం కరందుం విళయాడి  వార్తయుం పేశి వలై శిలంబ వార్కలైగళ్  ఆర్పరవం శెయ్య అణికుణల్ మేల్ వండార్ప  పూత్తికణుం పొయిగై కుడై దుడైయాన్ పోర్పాదం  ఏత్తి ఇరుంచులైనీరాడేలో రెంబావాయ్.   అయ్యా! సృష్టి-స్థితి-లయ క్రీడాయ పోట్రి   **********************************  ఈ పాశురములో తిరుజ్ఞానసంభదార్ మనకు స్వామి మనకు అనుగ్రహించిన "పొయిగై" ను సరస్సును మనకు అందిస్తు-అనుగ్రహిస్తున్నారు.ఆ అనుగ్రహ సరస్సు తెల్లని జలముతో సత్వగుణ ప్రకాశముతో   తేజరిల్లుతుంటుంది.మనము ఉన్ పొయిగై పుక్కు-ఆ అద్భుత-అనుగ్రహ సరస్సులోనికి ప్రవేశించి,వెణ్ణీర్ ఆడై స్నానము చేసామంటే-మన జన్మజ్ఞమల సంతాపములు సమసిపోతాయి.  చెలి! నీకు ఈ విషయము తెలియనిది కాదు.మన స్వామి తిల్లై లో ఎడమచేతిలో అగ్నిని అలంకారముగా ధరించి,ధాచి,నాట్యమాడుతుంతాడు.   అదేకదు.స్వామి సృష్టి-స్థితి-లయ క్రీడాసక్తుడని మన కరకంకణములు మనతో ముచ్చటిస్...

TIRUVEMBAVAY-11

Image
తిరువెంబావాయ్-11  *****************  ముయ్యార్ తడం పొయిగై పుక్కు ముగేరెన్న  కయ్యార్ కుడైందు కుడైందు ఉన్ కళల్పాడి  అయ్యా వళియడియోం వాల్దోంకణ్ ఆరళల్పోర్  శయ్యా వెణ్ణిరాడి శెల్వ శిరుమరుంగుల్  మయ్యార్ తడంకన్ మడందై మణవాలా  మయ్యా నీలాడ్ కుండేర్ అరులం విడయాట్రిన్ ఉయ్యార్కల్ ఉయ్యాం వగయెల్లాం ఉయందోళిందోం ఎయ్యామల్ కాప్పై ఎమై ఏలోరెంబావాయ్.         అవ్యాజ కరుణ హృదయాయ పోట్రి   **********************  అయ్య-ఓ స్వామి!  నీ అట్కోడేర్-నీ అవ్యాజమైన కరుణ,  అరుళం-ఆశీర్వాదబలము మాచే,  నీ దయ యను,