Posts

TIRUVEMBAAVAAY-08

Image
  తిరువెంబావాయ్-08  ******************  కోళి శిలంబ చిలంబుం కురుగెంగు  ఎళిలియంబ ఇయంబు వెణ్ శంగం ఎంగుం  కేళిల్ పరంజోది కేళిల్ పరంకరుణై  కేళిల్  విళుప్పొరుళ్గళ్ పాడినో కేట్టిలైయో  వాళి  ఇదెన్న ఉరక్కుమో? వాయ్ తిరవాయ్!  ఆళియున్ అంబుదమై ఆమారుమివ్వారో  ఊళి ముదల్వనాయ్ నిన్ర ఒరువనై  ఏలై పంగళనయే పాడేరేలొ రెంబావాయ్. ప్రళయ సాక్షియే పోట్రి *****************  తిరు మాణిక్యవాచగరు కిందటి పాశురములో స్వామిని దేవతలకు-మానవులకు సర్వులకు రక్షకుడు తానొక్కడే అని కీర్తించినాడు.  ఈ పాశురములో స్వామిని ప్రళయ సాక్షిగా ప్రస్తుతించుచున్నాడు.  ఊళి-ప్రళయ సమయమున జలగర్భముకానిది ఒరువన్-ఒక్కరే,  అది మన స్వామి.  ఆ సమయమునందు స్వామి నిరాకార-నిర్గుణ -నిరంజన -నిస్తుల ప్రకాశము.    అయినప్పటికిని మన కోరకు స్వామి,  కేళిల్-అసమానమని/దేనితో పోల్చలేని,అధికము లేని,  పరం జోది-బృహత్ జ్యోతి.దాని కన్నా అధికమైన ప్రకాశము లేదు.ఇది నిస్సందేహము.  ప్రకాశము మాత్రమే కాదు.ప్రపన్నుల పట్ల శరణుకోరిన వారి యందు ప్రసన్నతయు కలిగి...

TIRUVEMBAVAY-07

Image
  తిరువెంబావాయ్-007  ******************  అన్నే ఇవయున్ శిలవో పల అమరర్  ఉన్నర్క అరియాన్ ఒరువన్ ఇరుంశీరాన్  శిన్నంగళ్ కేట్పా శివన్ ఎన్రె వాయ్ తిరప్పాయ్  తిన్నాయ నా మున్నం తీశేర్ మెళుగొప్పాయ్  ఎన్నాన ఎన్నరయన్ ఇన్నముదల్ ఎండ్రెన్నోం   శొన్నంగళ్ నివ్వేరాయ్ ఇన్నం తుయిలిడియో  వన్నం జపేదయిర్ పోలే కిడత్తియాల్  ఎన్నే తుయిలిల్ పరిశేలో రెంబావాయ్  శివమహదేవనే పోట్రి  *****************  అన్నే- ఓ చిట్టితల్లి, ఏమిటిది?  ఇవయున్ శిలవో-కదలక-మెదలక శిలవలె నిదురించుచున్నావు,   తెల్లవారుచున్నదమా.మేల్కాంచు.  ఇరుం శీరాన్-మహా తేజోవంతుడు-దయామయుడు-సుందరేశుని సేవించుకుందాము.  స్వామి,  ఉన్నర్కు-నీకు-నాకు మాత్రమే కాదు,  పల అమరర్-చాలామంది దేవతలకు కూడ,  రక్షించు,  ఒరువన్-ఒకే ఒక్కడు/స్వామి తక్క రక్షణకు అన్యము లేదు.  చెలి అసలు నీ స్వభావము ఎంత కోమలము.  శిన్నంగళ్ శివన్-ఎవరైన శివభక్తులు కనబడిన వారిని సాక్షాత్తు శివునిగా భావించి,పూజించు భక్తి నీది.  అంతే కాదు,  తిన్నా యన్నా మున్నం-ఎవరైన మాట్లాడుతు తి...

tiruvembavay-06

Image
     తిరువెంబావాయ్-06     ***************  మానే     ని నెన్నలై నాళివన్ దుంగళై  నాణే ఎళుప్పువన్ ఎన్రళుం నాణామే  పోనది శై పగరార్ ఇన్నం పులరిండ్రో  వాణే నిలానే పిరవే అరివరియాన్  దానే వందెమ్మై తలయెడిత్తాల్ కొండొరుళుం  వాణ్వార్ కళల్ పాడి వందోర్కుం వాయ్ తిరవాయ్  ఊనే ఉరుగాయ్ ఉనక్కే ఉరుం ఎమక్కుం  ఏనోర్కుం తంగోనై పాడేలో రెంబావాయ్  వాణే నిలనే పిరవే సర్వాంతర్యామి పోట్రి  ************************************** ఐదవ పాశురములో తిరు మాణిక్యవాచగరు స్వామి సర్వ వ్యాపలత్వమును నేల-నింగి-మధ్య ప్రదేశమును పేర్కొనినారు.  న్యాలమే-విణ్ణే అంటు   ఈ పాశురములో ,  వాణే-నిలనే అంటు సామి తిల్లై వనమునకు మనమీద అనుగ్రహముతో వేంచేసినారని అవతార అనుగ్రహమును  కీర్తించినారు.  ఈ పాశురములో మేల్కొలుప బడుచున్న బాలిక భీత హరిణేక్షణ.లేత వయసుగల బాలిక అని ఆమె మాటల ద్వారా ప్రకటింప బడుతున్నది.కనుకనే,  నిన్నెలైనాళ్-నిన్నటిరోజున ఆమె తన చెలులతో,  నాణే వందు-నేనే మీ దగ్గరకు వచ్చి,  నాణే ఎళుప్పువన్-మిమ్ములను మేల్క...

05

Image
  తిరువెంబాయ్-005   ***************  మాలరియ నాం ముగనుం కాణా మలైనాం నాం  పోలారివోం ఎన్రుళ్ళ పొక్కంగళే పేశుం  పాలూరు తేన్వాయ్ పడిరీ కడై తిరవాయ్  న్యాలామే విణ్ణె పిరవే అరివరియాన్  కోలముం నమ్మైయాట్ కొండరుళి కోడాట్టు  శీలం పాడి శివనే శివనే ఎన్రు  ఓలం ఇడినుం ఉడరాయ్ ఉడరాయ్ కాణ్  ఏలా కుళలి పరిశేలో రెంబావాయ్.  స్మరణాత్ అరుణాచలమే ముక్తి-పోట్రి  ******************************  తిరు మాణిక్యవాచగరు ఈ పాశురములో స్థలపురాణప్రాశస్త్యమును మనకు చెలుల సంభాషణము ద్వారా వివరించుచున్నారు.   అరుణాచల అంతరార్థము చెలులు నిదురలేపుచున్న చెలితో ఈ విధముగా చెప్పుచున్నారు.దీనికి నిదర్శనముగా మూడు విషయములను చెప్పుచున్నారు. మొదటిది-న్యాలమే-భూమండలము  భూమండలమునంతటిని కొలిచినను స్వామి మూలమును తెలుసుకొనలేము.విష్ణు కిందకు వెళ్ళి వెళ్ళి-వెతికి వెతికి కనుగొనలేకపోయినాడు.  రెండవది-విణ్ణే-ఆకాసమునంతటిని కొలిచినను స్వామి మూలమును కనుగొనలేము అని బ్రహ్మ హంసనెక్కి పైపైకి సాగినను స్వామి మూలమును కనుగొనలేకపోయినాడు.  మూడవది-పిరవే-భూమ్యాకాశములకు మధ్యనున్న స్థలమ...

04

Image
    తిరువెంబావాయ్-04  *****************  ఒణ్ణిత్తల నగయాం ఇన్నం పులదిండ్రో  వణ్ణక్కిళి  మొళియార్ ఎల్లోరం వందారో  ఎన్నికోం ఉళ్ళవా సొల్లుకో అవ్వళున్  కణ్నై తుయిన్ రవమేకాలత్తై పోక్కాదే  విణ్ణుక్ ఒరు మరుందై వేదవిదు పొరుళై  కణ్ణుక్ కినియానై పాడి కసిం ఉళ్ళం    ఉళ్ళెక్రు నిన్రుగ యామాట్టోం నీయే వందు  ఎన్ని కురైయిల్ తుయిలేలో రెంబావాయ్    ఓం వేదవేద్యాయ పోట్రి    ********************  వేదవేద్యాయ పోట్రి  ***************   ఈ పాశురములో తిరుమాణీక్యవాచగరు అంతర్ముఖమును వీడుటకు ఇష్టపడని పడుచు గురించి మనకు సంభాషణలను వివరిస్తు స్వామిని కీర్తిస్తున్నారు.  ఈమె మందస్మిత వదన.ఈమె  ఒళి-ప్రకాశవంతమైన,  నిత్తిల-ముత్యముల వంటి  నగయ-పలువరుస కలిగినది.మందహాసిని.  ఒణ్ణిత్తల నగయ-శుధ్ధ సత్వ శోభిని,  నీవు ఇంకా మేల్కొనలేదా?  పులందిండ్రో-తెల్లవారలేదా నీకు?  మేల్కాంచకున్నావు అనగానే వారితో ఆమె కన్నులు మూసుకినియే ఈ విధముగా సంబోధించి అడిగినది ఏమని? అంటే,  వణ్ణక్కిళి మొళియో మధురభాషణ చాతుర్...

3

Image
    తిరువెంబాయ్-003   ***************  ముత్తన వెణ్ణకయ్యుం మున్వన్ దెదిర్ ఎళుందిన్  అత్తనానందన్ అముదన్ నెన్ నెళ్ళూరి  తిత్తక్కన్ వేశువాయ్ వందు కడై తిరవాయ్  వత్తుడి ఈర్ ఈశన్ వళవడియర్ పాంగుడయీ  పుత్తడియోం ఉన్మైతీర్థు ఆట్కాండార్ పొల్లాదో  ఎత్తోనిన్ అంబుడైమై ఎల్లోం అరియోమోం  చిత్తం మళకియార్ పాడారో నం శివనే  ఇత్తనయుం వేండుం ఎమక్కేలో రెంబావాయ్.  అరుణగిరి నిలయే పోట్రి.  *************************  మూడవ పాశురములోని పడుచు బుధ్ధిశాలిని.సమయస్పూర్తిగా సరళముగా సాత్వికముగా మాట్లాడు స్వభావము కలది.కనుకనే తిరు మాణిక్య వాచగరు ఆమె సాత్విక సంభాషణాచాతుర్యమును ఆమె తెల్లని ముత్యముల పలువరుస ద్వారా సంకేతిస్తూ,పాశురమును ప్రారంభించారు.    ఓ చెలి,  వెణ్ నగయ-తెల్లని పలువరుసను కలిగినదాన/సాత్విక సంభాషణములను చేయుదానా,  ఆమె పలువరుస ఎంత తెల్లగా ఉన్నదంటే,  ముత్తన-ముత్యముల వలె స్వచ్చముగా ప్రకాశించుచున్న పలువరుస కలిగిన చెలి,  నీవు మా దగ్గరకు, మున్-నిన్ననే,ముందుగానే వచ్చి,  ఎదురెడియ-పరిహాసముగా, ( అసలు స్వామిని గు...

TIRUVEMBAAVAAY-19

Image
   తిరువెంబావాయ్-19  *****************  ఉంగయ్యర్ పిళ్ళై ఉనక్కే అడైక్కలం ఎన్రు  అంగుం అప్పళం సొల్ పుదుక్కురుం అచ్చత్తాల్  ఎంగళ్ పెరుమానునక్కొండ్రు ఉరేయ్ పొంగే  ఎంగొంగై నిం అంబల్ అళ్ళారో శేయక్క  ఎంగై ఉనకళ్ళదు ఎప్పణియు శేయార్క  కంగళ్ పగల్ ఎంగళ్ మట్రోరుం కాణర్క  ఇంగి ఇప్పరిశె యమక్కేందో నల్గుదియల్  ఎంగళి ఎన్ న్యాయయిది ఎమక్కేలో రెంబావాయ్  భాగవత సేవా సంతుష్టాయ పోట్రి.   **************************     అయ్యర్-ఆర్యా/అయ్యా,  ఉంగ-నీయొక్క,  పిళ్ళై-పిల్లలము/బిడ్డలము.  మా జీవితమంతా/భారమంతా,  అడైక్కలం-నీ అధీనము.  స్వామి-నీవు మమ్ములను,  పాల ముంచినా/నీట ముంచినా,  రక్షించిబా/పట్టించుకోక పోయినా,   అది మాకు సమ్మతమే. కాని మాకు నువ్వే   అచ్చన్/అత్తన్,  తల్లి-తండ్రి-గురువు బంధువు అన్నీ నీవే.  ఉంటావని అప్పళం సొల్-ఆదరముగా చెప్పు.   స్వామి మా-అదృష్టముగా మాకు,  ఎన్ కొంగై-నీ ఆలింగనా సౌభాగ్యమును  ప్రసాదించు.   ఎందుకంటే ,అళ్ళారో తోళ్ సేయర్క-వేరొకరి భుజమును ఆశ్...