Posts

00010

Image
      ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-10   ***************************   ఎవ్వనిచే జనించు అంటూనే-ఆది-అనాది -వాటి మధ్యనున్న వానిగా (కాలముగా) చెబుతూనే,సర్వము తానెయైనవాడుగా సన్నుతిస్తూనే, శరణాగతి వేడిన సహజపాండిత్య బమ్మెర పోతనకు సవినయ నమస్కారములు.    ఈశ్వరానుగ్రహము విభూతిగా విశ్వవ్యాప్తమైన వేళ ( అది ఎప్పటినుండి ఉన్నప్పటికిని నేను గ్రహించుచున్న వేళ)   ధ్యానము-ధ్యేయము-ధ్యాత ఒకటిగా సమగ్రమగుతున్న వేళ ,ఈప్సితము ఈశ్వరునిగా ( శివుడు అని నామరూపములతో కాదు-అనుగ్రహముగా అని) సిధ్ధించుచున్న వేళ,    వేరొక కోరికలకు ప్రవేశముండదు కదా. ఉషోదయమగుచున్న వేళ చీకటి ప్రవేశించలేదు.  సత్యము-జ్ఞానము-అనంతమైన బ్రహ్మమును  సందర్శించుచున్నవేళ,(చర్మచక్షులతో కాకుండా),ఆత్మ సాక్షాత్కారము  మమేకమగుటకు ముందుకొచ్చినవేళ అంతా త్వమేవాహమే.తత్త్వదర్శనమే.  నశ్వరములను తోసివేస్తూ ఐశ్వర్యమై ప్రకాశిస్తున్నది నన్ను మరింత ఆకర్షిస్తూ..      భ్రమర కీటక న్యాయము వలె నా ఉపాధిలో నున్న నేను, నేను చూస్తున్న నేనుతో లీనమవాలనుకుంటున్నది.ఇన్నాళ్ళు నేను అని భ్రమించినది" అసలైన నే...

00009

Image
    ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-09  ********************************    ఇప్పుడు నేనేమి చేద్దామనుకుంటున్నాను?దేనిని చూద్దామనుకుంటున్నాను?   అక్కడ శిల్పాలను చెక్కుతున్నారు.అనుకోకుండా నా దృష్టి అటువైపు మరలినది.   సాధనా పంచకమును మనకందించిన శ్రీ శంకర భగవత్ పాదులకు సవినయ నమస్కారములేఓ.    గమనిస్తున్నాను.పెద్దశిలలోని కొన్ని సకలములను తీసివేస్తున్నాడు.అద్భుతముగా శిల్పము ఆవిష్కరింపబడుతున్నది.   అంటే ఆ శిల్పి .. శిలలోని కొన్నిశకలములను పరిత్యజిస్తూ,మిగినదానిని పరిగ్రహిస్తూ పనిచేస్తున్నాడు కాని సృష్టించలేదు.    అంటే..   నేనుకూడ నా చుట్టు ఉన్నవాటిలో నుండి పనికిరాని వాటిని గుర్తించి,తొలగించగలిగితే,మిగిలిన దానిని గమనించుకొనగలిగితే,అద్భుతావిష్కరణమే కదా.   బాహ్యదృష్టి శిలలో దాగియున్న శిల్పమును గుర్తించలేనట్లు,విసేషదృష్టిలో దాగిన సామాన్యమును గుర్తించుట వీలుకాదు కదా.  నేను కూడ ఇప్పటివరకు సోగ కన్నులు,నీలి కన్నులు,లేడి కన్నులు,తేనె కన్నులు,కలువరేకులు అంటు బాహ్యనేత్ర సౌందర్యమును అభివర్ణించానే గానే వాటన్నిటిలో దాగి ప్రకటితమగుతున్న అద్భుతశక...

0008

Image
    ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-08   ****************************    ఏదో అద్భుతశక్తి ఆలోచనా పరంపరలుగా నన్ను ఆశీర్వదిస్తున్నది.   ప్రతి నిమిషము-ప్రతి విషయము ప్రతిభావంతములుగా గోచరిస్తున్నాయి.   ప్రతి అవనిక (తెర) తన కదలికలతో నా సందేహములతో పాటు నన్నూ ముందుకు నడిపిస్తున్నది. సహకముగానే సామాన్యము విశేషముచే కప్పబడితుందా?     లేక తప్పనిసరియై విస్తరిస్తూ విజ్ఞానములో జ్ఞానముగా జ్వలిస్తున్నదా?    సంకోచ-వ్యాకోచములతో సర్వసాక్షిగా నుండుట దాని సహజ లక్షణమా?    అసలు ఈ పంచభూతాత్మకమైన నేను ఈ బృహత్తు లోని పరమాణువునా? సహజదృష్టి కానేకాదు అంటున్నది కదా!    అదే కనుక నిజమైతే,  నేను సర్వతంత్ర స్వతంత్ర సమర్థుడినన్నమాట.     అదే కనుక నిజమైతే మనము ఎక్కడి నుండి ఇక్కడకు వచ్చాము? ఎప్పుడు ఇక్కడి నుండి వెళ్ళిపోతాము? మనకు నచ్చిన రూపమును-తెలివితేటలను,కావలిసిన సంపదలను మనతో పాటుగా ఎందుకు తెచ్చుకోలేక పోయాము? జరుగబోయేది మనము ఎందుకు గుర్తించలేక పోతున్నాము?     ఆకలి వేస్తోంది అన్నము తిందామని లేచాను.నన్ను అనుసరించింది నాలోని అనుమానము ...

0007

Image
    ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-07   *****************************    సత్యమును అసత్యమని -అసత్యమును సత్యమని ప్రత్యర్థిని ఓడించి,సమర్థించుకునేందుకు ఇచ్చిన అవకాశము  రానే వచ్చింది.    గుండుసూది పడిన వినగలిగేనంతటి నిశ్శబ్దము.    సమాధానమును సమర్థించవలసిన వారు ప్రశాంతముగానే ఉన్నారు.     సమాధానమునకై ఎదురుచూస్తున్నవారి అభ్యంతరాలు ఆందోళనతో చిందరవందరగా ఉన్నాయి.    సంస్కార సభావందన సమర్పణమును చేసి సమాధాన సమర్థనమునకు ఉపక్రమించుచున్న సమయమున,     ప్రత్యర్థి అస్తవ్యస్త మస్తకము ఆర్యా! మాదొక చిన్న సందేహము.   మీరు ఇప్పుడు చేసిన నమస్కారము బాహ్యమా? ఆంతరంగికమా? అదోమాదిరిగా చూస్తూ అడిగారు.     బాహ్యమునకు మనము మనకు కనిపిస్తున్న రెండు అరచేతులను ముకుళిస్తున్నాము.    ఈ రెండు అరచేతులను కాసేపు విశేష-సామాన్యములుగా భావిద్దాము.     వాటిలో ఒక అరచేయి పంచభూతాత్మికమునకు అతీతము.అవి దానినేమిచేయలేవు.ఇంకొకటి పంచభూతాత్మిక అధీనము.మొదటిది బృహత్తు.రెండవది విశేషములో దాగిన చిత్తు.అత్యల్పమైన విశేషము తమను బృహత్తులో విలీనము ...

0006

Image
  ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-06 *********************** మనసంతా ఒకటే గందరగోళం.మనము చూసేదేది నిజమైనది -శాశ్వతమైనది కాదా? శాశ్వతమైనది సులభముగా మనము దర్శించలేమా? లోపల బయట తానే యున్నదంటున్నారు కొందరు "జగమెవ్వని లోపలనుండు "అంటు. అంటే ఈ దృశ్యప్రపంచము ఎవరో మనకు తెలియని వాని లోపలఉందా? లోపల కనుక ఉంటే మనలను బయటనే ఉన్నట్లు ఎలా భ్రమింపచేస్తున్నది. ఇది భ్రమ తత్త్వమా? బ్రహ్మాండ తత్త్వమా? ఒక సందేహమునకు తోడుగా మరొక సందేహమును జతకలుపుకొనుటకా అన్నట్లు, పనులన్నీ చేసుకొని కాసేపు కాలక్షేపం కోసము చర్చావేదికను చూచుటకు టి.వి ముందు కూర్చున్నాను. కార్యక్రమము ప్రారంభమైనది.చర్చకు ఇరువర్గముల వారు అభిముఖముగా అసీనులైనారు.ఆసనముపై న్యాయనిర్ణేత వారిని గమనిస్తున్నారు. సహకారపరికరములుగా కొన్ని వస్తువులను ప్రవేశపెడుతూ చర్చా కార్యక్రమమును ప్రారంభింపచేసారు. వారిద్దరి మధ్యన రంగురంగు గులాబీలతో, అలంకరింపబడిన పుష్పగుచ్చమును ఉంచారు.గులాబీలలో కొన్ని ఎర్రవి.కొన్ని పసుపుపచ్చవి.కొన్ని తెల్లనివి.మరికొన్ని గులాబీ రంగువి.ఎన్నోరంగులతో మరెన్నో హంగులతో పరిమాళాలు వెదజల్లుతు అక్కడున్న వారిని పరవశింపచేస్తున్నాయి.ఏమా ...

0005

Image
   ధ్యాయేత్  ఈప్సిత సిధ్ధయేత్-05  ******************************  పార్కులో నేను-నా స్నేహితురాలు-వాళ్ల అమ్మగారు బెంచీమీద కూర్చుని ఉన్నాము.   బయట జనించిన సందేహము లోనికి పోయి పరిష్కారమును చూపనంటుంది.లోపలనున్న చైతన్యము బయటకు వచ్చి (నన్ను )సమాధానపరచుటకు రానంటున్నది.     హెచ్చుతగ్గుల ఇంద్రియముల గారడీల గురించి పెద్దవారు-అనుభవజ్ఞులైన ఆంటీని అడిగి నన్ను నేను సమాధానపరచుకుందా మనుకుంటు,    మౌనాన్ని భంగము చేస్తు మనసు విప్పేసాను.      ఫక్కున నవ్వింది  నా స్నేగితురాలు.పురాతన భావముల నా చెలి దర్శనశక్తి-శ్రవణ సక్తి అంటు చొప్పదంటు ప్రశ్నలను చొప్పిస్తు,నువ్వు తికమకపడుతు అమ్మను తికమక పడుతున్నావు అంది పరిహాసముగా.   ముమ్మాటికి నమ్మనుగాక నమ్మను.   దర్శనశక్తి-అన్న నీ ప్రశ్నకు సమాధానమును కెమెరా అను వస్తువుతో ఎప్పుడో సృష్టించబడినది.అది దృశ్యమును చూస్తుంది తన తెరపై బంధించి ఉంచుతుంది.అదియును నీవు కోరుకొన్న విధానములో.    శబ్దశక్తి అంటావా తేప్ రికార్డర్.నువ్వు చెప్పిన శబ్దమును వింటుంది.తనలో భద్రపరచుకుంటుంది.   ఎ.సి-హీటర్ అన...

0004

Image
    ధ్యాయేత్ ఈప్సిత సిధ్ధయేత్-04 ******************************  ఆలోచనలలో మునిగియున్న నన్ను మరొక సందేహము ముందర నిలిచి,సతమతము చేస్తున్నది నా దినచర్యను ఒక సిధ్ధాంతముగా మారుస్తు.  వాటి సంగతి సరే.మరి నా సంగతి ఏమిటి? నిన్న రాళ్ళ ఉప్పు పట్టుకుని వస్తున్నప్పుడు నా ఇంద్రియములైన కళ్ళు-స్పర్శ దానిని ఉప్పుగా గుర్తించి నాకు చెప్పినవి.   మిగిలిన మూడు ఇంద్రియములు తటస్థముగా నునాయి.   అదే ఉప్పును నేను నీళ్ళగిన్నెలో వేసి  పది నిమ్షములు చిన్నపని చేసుకుని వచ్చాను.   ఈ మధ్య మతిమరుపు మరీ ఎక్కువైపోతున్నది నాకు.ఇంతకీ ఉప్పును నీళ్ళగిన్నెలోవేసానా/లేదా? ఎలా తెలుస్తుంది నాకు?      నాకు సహాయపడిన కళ్ళు-స్పర్శ నే తిరిగి సహాయమడుగుతాను అంటు......   కాని విచిత్రము.అవి నిస్సహాయములుగా మారినవి.    నా కళ్ళు ఉప్పును చూడలేమంటున్నవి.నా స్పర్శ కూడా ఆ నీళ్ళలో ఉప్పు ఉన్నదో/లేదో తాను చెప్పలేనంటున్నది.     మరొక విచిత్రము.ఇవి చేయలేని పనిని మరొక ఇంద్రియము తాను చేసిపెడతానన్నది.అదే  అదే..  గమ్మత్తుగ..     నా జిహ్వ నేను చెప్పగలను అం...