Posts

GURUMANADALAM-BHAVANAMATRA SAMTUSHUTA

Image
   "శివ ఏవ గురుః సాక్షాత్ గురుః ఏవ శివః స్వయం."  బిందువు,బిందువు చుట్టు ఊహాత్రికోనములో నిత్యాశక్తులు,ఆ త్రికోనముచుట్టునున్న ఊహా వృత్తమును గురుమండలముగా భావించి శాక్త్యేలు ఆరాధిస్తారు.   కొందరి అభిప్రాయము ప్రకారము గురుమండలము దక్షిణామూర్తితో ప్రారంభింపబడి నారాయణుడు,బ్రహ్మ,సాకాదులు,శంకరాచార్యులు శిష్యులతో అలరారుతుంది.  గురుప్రియ గురుమూర్తి రెండుతానై గురుమండలరూపిణిగా విరాజిల్లుతున్న సర్వశక్తియే దక్షిణ అవ్యక్త-మూర్తిగా వ్యక్త మూర్తిగా ఆరాధింపబడుతున్నది.  ఒకవిధముగా చెప్పాలంటే గురుసంప్రదాయమే గురుమండలము.గురుమూర్తి యొక్క ఇచ్చాశక్తియే గురుప్రియగా ప్రకటింపబడుతున్నది.  గురుమండలము దివౌఘ,సిధ్ధౌఘ,మానవైఘులుగా విభజింపబడి విరాజిల్లుచున్నది.  శాక్తేయ సంప్రదాయము ప్రకారము త్రిమూర్తులను దివౌఘులుగా,  "గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః అని సన్నుతిసున్నాము.   సనకాది మునులను సదా విరాజిల్లే గురువులుగా కీర్తిస్తున్నాము  పీఠాధిపతులైన గురువులను మానవౌఘ గురువులుగా దర్శించి సన్నుతిస్తున్నాము.  పైన వివరించిన మూడు వర్గముల గురువులు మార్గదర్శకులే.సాధకుని ...

BHAVANAAMATRA SAMTUSHTA-NITYA DEVATALU

Image
    నిత్యామండలము  *************  ఉత్పత్తి-నాశనములేని లేని శక్తి నిత్య.స్థిరమైన/శాశ్వతమైన శక్తి.అటువంటి శక్తి తాను మాత్రము స్థిరముగా ఉంటూనే,తననుండి పదిహేను శక్తులను ప్రకటింపచేసి,వానిని చలింపచేస్తూ/సూర్యుని నుండి చంద్రుని దగ్గరకు,చంద్రుని నుండి సూర్యుని దగ్గరకు చేరుస్తూ,రోజులను,పక్షములను,మాసములను,సంవత్సరములను ఏర్పాటుచేస్తుంది.    ఈ పదిహేను శక్తులు బిందువు చుట్టు ఉన్న ఊహాత్రికోణములో,ఒక్కొక్క కోనమునకు ఐదు శక్తులు చొప్పున ఉంటాయి.అష్టమి శక్తి అయిన తవరితే మకుటముగా పైన ఉన్న అడ్దకోణము మధ్యలో ఉంటుంది.     కామేశ్వరి-భగమాలిని-నిత్యక్లిన్నే-భేరుండే-వహ్నివాసిని,మహావజ్రేశ్వరి,,శివదూతి,త్వరితే,కులసుందరేన్ నిత్యే,నీలపతాకే,విజయే,సర్వమంగళే,జ్వాలామాలిని,చిత్రే అను పదిహేను శక్తులు మూలశక్తి ఆజ్ఞానుసారముగా,పగటివేళ ప్రకాశముగా,రాత్రులందు విమర్శలుగా ,రాత్రులందు మధువును గ్రహిస్తూ,పగటివేళ మనందరిమీద ప్రసరిస్తూంటాయి.  మిక్కిలి వాత్సల్యముతో ఈ శక్తులు సూర్యచంద్రుల సమసప్తక స్థితికి,(పౌర్ణమి) సూర్యచంద్రుల సమాగమనమునకు (అమావాస్య)కు కారణమగుచున్నాయి.   ఈ పదహారుశక్త...

BHAAVANAAMAATRA SAMTUSHUTAA-INTRODUCTION

Image
   ప్రజ్ఞానం బ్రహ్మ-తత్త్వమసి-అయం బ్రహ్మ-అహం బ్రహ్మ అని నాలుగు వేదములలోని మహావాక్యములను విన్నప్పుడు నాలుగింటిలో బ్రహ్మం అనే మాట ఉన్నది కదా  బ్రహ్మము అంటే ఏమిటి?అన్న సందేహము ను కలిగించి,నివృత్తికై ఖడ్గమాల అను స్తుతిమాలను జ్ఞప్తికి స్పురింపచసిన అమ్మకు అనేకానేక నమస్కారములు.ఖండించేది ఖడ్గము.  మనము తలచుకొనుచున్న ఖడ్గము లోహనిర్మితముకాదు.తుప్పుపట్టదు.విరిగిపోదు.కాల్చినంతనే కరిగిపోదు.  మంత్రబీజాక్షర మహిమాన్విత శక్తి.భాగ్యప్రదానము.భావనాతీతము.బహుశుభంకరము.అంతర్యాగ సాధనము.  పాంచభౌతిక శరీరమే నేను అను మాయను ఖండించి ప్రత్యగాత్మను పరిచయము చేసేందుకు అనుసంధానముచేసి,అహంబ్రహ్మాస్మి అనిపించే ఆలంబన అమ్మవారి ఖడ్గమాల స్తోత్రము..        

BHAVANAAMAATRA SAMTUSHUTAA-PRAKATAYOGINULU

Image
 ప్రకటయోగినులుగా 28 శక్తిదేవతలు కీర్తింపబడుతారు.వీరుండు స్థానమును త్రైలోక్యమోహనచక్రము అని అంటారు.మూడు ఊహా చతురస్త్రాకారాములుగా విభజింపబడినది.ఈ మూడు విభాగములను భూపురములు అంటారు.   మూడవ భూపురములో ప్రాప్తి-సర్వకామ అను రెండు ప్రత్యేకసిధ్ధులతోపాటుగా అణిమ-గరిమ-లఘిమ మొదలగు అష్టసిద్ధులు వెరసి 10 శక్తులు పరిపాలిస్తుంటాయి.   మూలాధారమునకు సంబంధించిన శక్తులు చర్మచక్షువులు గుర్తించగలవు.     రెండవ భూపురములో మహాలక్ష్మి అను ప్రత్యేక స్థితితోపాటుగా బ్రాహ్మీ-మాహేశ్వరి-కౌమారీ-వైష్ణవీ మొదలగు మానసిక స్థితులు కొలువై ఉంటాయి.   సాధకునకు తనయొక్క మూలమును తెలుసుకోవాలనే తపనను కలిగించి అనువైన అన్వేషణ మార్గమును చూపిస్తాయి.   వీరినే అరిషడ్వర్హ సమూహముగాను,సప్తధాతు సమాహారముగాను మరొక కోణములో భావిస్తారు.     మొదటి భూపురములో సంక్షోభిణి,విద్రావిణి,ఆకర్షిణి,వశంకరి మొదలైన ముద్రాశక్తులు సహాయపడి సాధకునిలోని జడత్వమును తొలగించి,చైతన్యవంతుని చేయుటకు తనను తాను తెలుసుకోవటానికి సర్వాశాపరిపూరక చక్రమును పరిచయము చేస్తాయి.   

BHAVANAMATRA SAMTUSHTAA-ATIRAHASYA YOGINULU

Image
   భావనామాత్ర సంతుష్టా-అతిరహస్యయోగినులు  ***************************  సర్వసిద్ధిప్రద చక్రముగా కీర్తింపబడు పాపిట స్థానములో నున్న నాలుగు ఆయుధశక్తులను,అవస్థలను నియంత్రించు మూడు శక్తులను అతిరహస్య యోగినులుగా ప్రస్తుతిస్తారు.ఊహా చతుర్స్రములో దాగిన  త్రికోణములోని   మూడు బిందువులను జాగ్రత్-స్వప్న-సుషుప్తులను సమన్వయ పరచి,సాధకునకు సహాయపడు మహాకామేశ్వరి-మహావజ్రేశ్వరి-మహాభగమాలిని నామములతో స్తుతిస్తారు.త్రికోణ మూడు కోణములలో నున్న బిందువులుగా భావిస్తారు.చతురస్ర నాలుగు బిందువులను చాపిని-బాణిని-పాశిని-అంకుశిని అను నాలుగు శక్తులుగా,వాటి స్థానములను చతురస్ర నాలుగు మూలల బిందువులుగాను భావిస్తారు.  సాధకుని మనసనే ధనువు సంధించే జ్ఞానేంద్రియ బాణములను కళ్ళెములు లేని గుర్రములవలె పరుగెత్తనీయకుండా పాశమనే సక్తిదయతో,అంకుశమనే విచక్షణను కలిగించి,జడత్వమును నిర్మూలించి శుద్ధచైతన్యము దర్శించు పాత్రతను కలిగించును. వీరినే అశ్వారూఢా,సింధురవ్రజా,వారాహి రూపములుగాను భావిస్తారు.ఇవన్నీ  ఆ శక్తుల సంకేత నామములు.సర్వశుభంకరములు.

BHAVANAAMAATRA SAMTUSHTAA-RAHASYA YOGINULU

Image
   భావనామాత్ర సంతుష్టా-రహస్య యోగినులు *******************************  లలాటస్థాన నివాసినులైన వశిని మొదలగు ఎనిమిది సక్తులను రహస్య యోగినులుగా కీర్తిస్తారు.వీరినే వాగ్దేవతలని కూడా సంబోధిస్తారు.సనాతన ధర్మ ప్రకారము వీరిచే శ్రీలలితాసహస్రనామములు ప్రకటింపబడినవని విశ్వసిస్తారు.  వీరిలో వశిని-కామేశ్వరి అను రెండు శక్తులు శీతోష్ణములను సమన్వయపరుస్తు సాధకునికి సహకరిస్తుంటాయి.శబ్ద-స్పర్శలను సైతము నియంత్రిస్తుంటాయి.    మోదినీ విమల అను రెండు శక్తులను సుఖ-దుఃఖ దాయకములగాను భావిస్తారు.  జయిని కామేశ్వరి కౌళిని సత్వరజతమోగుణములను సమన్వయపరిచే శక్తులు.మనస్సును మనసులో జనించే రాగద్వేషములను సర్దుబాటు చస్తూ,మూడు అవస్థలలోను సాధకునికి చైతన్యప్రాప్తిని పొందుటకు సహాయపడుతుంటారు 

BHAVANAAMAATRA SAMTUSHTAA-GUPTATARA YOGINULU

Image
  భావనా మాత్ర సంతుష్టా-గుప్తతర యోగినులు  ********************************  సర్వాశాపరిపూరకచక్రములోని 16 గుప్తయోగినులు పంచేద్రియములను పంచభూతములతో కర్మేంద్రియములను పంచతన్మాత్రలతో అనుసంధానముచేసి ఆత్మసాక్షాత్కారమునకు సిధ్ధముచేస్తుంటే,మరికొంచము ముందుకు సాధకుని సాధనను జరుపుతూ,8 మంది గుప్తతర యోగినులు సర్వసంక్షోభచక్రములో అనంగులై మానసిక పరిపక్వతకై పాటుపడుతుంటారు.ఆకర్షణ శక్తులైన గుప్తయోగినులు ఉపాధిని సిధ్ధము చసిన తరువాత,అనంగ శక్తులు అనగా శరీరమునకు సంబంధములేని ,మనసుతో శరీరమును సైతము నియంత్రించగలిగిన మహిమాన్వితములు.  అనంగ కుసుమా  అనంగమేఖలా  అనంగ మదనా  అనంగ మదనాతురా  అనంగ రేఖా  అనగవేగినీ  అనంగాంకుశా    అను ఈ మానసికశక్తులు మంచిభావములను సాధకుని మనసులో కలుగచేస్తూ,ధర్మబధ్ధ ప్రవర్తనను పెంపొందింప చేస్తాయి.అనంగ వేగినీ కొత్త కొత్త ఆలోచనలకు ప్రవృత్తిగా,దురాలోచనలకు నివృత్తిగా అనంగాంకుసినీ శక్తి సహాయపడుతుంటే,అనంగమాలిని శక్తి తటస్థ భావమును కలిగిస్తూ,అనవసర భావనలకు దూరముగా ఉంచుతుంది.  అనంగదేవతలు సాధకుని అంతరంగములో కుసుమే ఒక సంకల్పమును పుష్పింపచేయుశక్...