Posts

AALO REMBAAVAAY-05

Image
  ఐదవ పాశురం *************** మాయనై మన్ను వడమదురై మైందనై తుయపెరునీర్ యమునై యరైవరై ఆయర్ కులత్తినిల్ తోన్రుం మణివిళక్కై తాయై క్కుడల్ విళక్కం శెయద దామోదరనై తూయోమాయ్ వందు నాం తుమలర్ తూవి త్తుళుదు వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క పోయ పిళైయుం పుగుదరువా నిన్రనవుం తీయనిల్ తూశాగుం శెప్పు ఏలోరెంబావాయ్. ఓం నమో భగవతే వాసుదేవాయ.  పరమాత్మ తత్త్వమను వేదవృక్షమునకు విత్తనము వంటి తిరుప్పావై లోని ప్రథమభాగమైన మొదటి ఐదు పాశురములు స్వామి మనలనుద్ధరించుతకు తనకు తాను పర-వ్యూహ-విభ-సర్వాంతర్యామి తత్త్వములనుగ్రహించుతయే కాక అంతర్యామియై తన భక్త వాత్సల్యమును ఏ విధముగా తనకు తాను యశోదమ్మకు ఒక చిన్ని తాటితో కట్టబడినాడో సంకేతముగా వివరించుచున్నది గోదమ్మ.  ఇక్కడ మనము ఒక చిన్న విషయమును గమనించవలెను .గోదమ్మ విత్తు అనినది.గింజ అనలేదు.ఈ రెండు పదములలో భావప్రకటనలో వ్యస్త్యాసమున్నట్లుంది.  గింజలు మనకు ఆహారముగా అంతరించిపోవునవి.విత్తు తిరిగి తానొక మహావృక్షముగా రూపుదిద్దుకొని అనేక విత్తనములను సృష్టిస్తుంది.అదేవిధముగా తిరుప్పావై ఎందరెందరి మదిలో జీవనపరమార్థ భావములకు జీవము పోస్తుంది.  ఇంకొక ముఖ్యవిషయము తూయోమాయ్ ...

AALO REMBAVAY-04

Image
  నాల్గవ పాశురము ************* ఆళిమళై కణ్ణా! ఒన్రు నీ కై కరవేల్ ఆళియుల్ పుక్కు ముగందు కొడార్ త్తేరి ఊళి ముదల్వన్ ఉరువం పోల్ మెయికరుత్తు పాళియన్ తోళుడై ప్పర్బనాబన్ కైయిల్ ఆళిపోల్ మిన్ని వలంబురి పోల్ నిన్రదిందు తాళాదే శార్ఙ్ ముదైత్త శరమళై పోల్ వాళ ఉలగనిల్ పెయిదిడాయ్ నాంగళుం మార్గళి నీరాడ మగిళిందు ఏలోరెంబావై. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః  ఓంగి ఉలగళంద్ పాశురములో స్వమి తానే త్రివిక్రమ వేషధారియై అవతారలీలావిశేషములౌ ప్రస్తుతించిన గోదమ్మ ప్రస్తుత పాశురములో స్వామి తాను సూత్రధారియై,వరుణదేవుని పాత్రధారునిగా మలచి,పద్మనాభస్వామి స్వరూప-స్వభావ-విభవములతో పోలుస్తు,వరుణదేవుని లోక సంరక్షణాకార్యనిర్వాకునిగా అదియును పాపపుణ్యములను లెక్కించని సర్వత్ర వానగా స్వామి ఆనగా వర్షించు అని ప్రార్థిస్తున్నది.వారి నోము లోక సంక్షేమమునకు గాన జలకములాడుటకు తగిన వనరులను అర్థించుచున్నది.     ఆళ్వారులు (ఆచార్యులు) వరుణదేవుని వంటివారు.వారు భగవత్ గుణములనెడి జ్ఞాన సముద్రములో పూర్తిగా మునిగి,భగవత్తత్త్వను నీటిని నిశ్శేషముగా త్రాగి,నిరంతరము నీలమేఘశ్యామునితో రమించుట వలన నల్లగా స్వామి మేనిఛాయను పొందుతారట.ఎంతటి భాగ్యశ...

AALO REMBAVAY-03

Image
 మూడవ పాశురం *************** ఓంగి ఉలగళంద  ఉత్తమన్ పేర్పాడి నాంగళ్ నంబావైక్కుచ్చాత్తి నీరాడినాల్ తీంగిన్రి నాడెల్లాం తింగళ్ ముమ్మారి పెయిదు ఓంగు పెరుం శెన్నల్ ఊడు కయల్ ఉగళ్ పూంగువళై ప్పోదిల్ పొరివండు కణ్పడుప్ప తేంగాదే పుక్కిరుందు శీర్తములై పత్తి వాంగక్కుడం నిరైక్కుం వళ్ళల్ పెరుం పశుక్కళ్ నీంగాద శెల్వం నిరైందు ఏలో రెంబావాయ్.  పూర్వ పాశురములలో స్వామి వ్యూహ వైభవమును ప్రస్తావించిన గోదమ్మ ప్రస్తుత పాశురములో అవతార  వైశిష్ట్యాన్ని వివరిస్తున్నది.   మనము నిత్యవిభూతి-కృత్యవిభూతి అనేఆంసమును పరిశీలిస్తే,అవతారవిభూతిని  ప్రస్తుత పాశురములో అర్శింపచేస్తున్నదిగోదమ్మ.    స్వామి అవతార విశేషములు అనంతమైఅనప్పటికిని మత్స్య-కూఎర్మ-వరాహ-నారసిమ్హములను కాక అమ్మ వామనావతార వైభవమును ,భక్త సౌలభ్యత్వమును బాలుడిగా నున్న కృష్ణుని అజ్ఞానము ఎక్కడ పరమాత్మునిగా గుర్తించనీయదో అంటూ అష్టసిద్ధుల ప్రకటన విశేషముగా స్వామి అవతారమును దర్శింపచేస్తుంది.   ఉపేంద్రుడైన స్వామి వటువుగా తన పరిణామమును తగ్గించుకొనుట,సకలప్రదాత యైన తన విభవమును మరుగునదాచి,యాచకునిగా స్వభావమును సైతము మార్చుకొని,ప్రహ్లా...

AALOREMBAVAY-02

Image
 రెండవ పాశురము-02 *************** వైయత్తువాళ్వీర్గాళ్ నాముం నం పావైక్కు చ్చెయ్యుం కిరిశైగళ్ కేళీరో పార్కడలుళ్ పైయత్తు ఇన్ర పరమన్ అడిపాడి నెయ్యిణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి మై ఇట్టు ఎళుదోం మలరిట్టు నాం ముడియోం శెయ్యాదన  శెయ్యోం తీక్కురళై శ్శెన్రు ఓదోం ఐయముం  పిచ్చైయుం ఆందనైయుం  కైకాట్టి ఉయ్యుమారు ఎణ్ణి ఉగందు ఏలోరెంబావాయ్.    ఓం నమో భగవతే వాసుదేవాయ నమః    ***********************************  ప్రథమ పాశురములో నారాయణుని దయార్ద్రహృదయమును సంకీర్తిస్తూ,స్వామి మనమీది వాత్సల్యముతో రేపల్లెలో శ్రీకృష్ణునిగా అవతరించినాడని, ,నోము నిర్వాహకునిగా తానుండి , మనలతో కలిసి ఆడి-పాడి ,అనుగ్రహిస్తాడని , వారుచేయవలసిన వ్రతవిధానమును వివరించుచున్న ఆండాళ్ అమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు,రెండవ పాశురమును అనుసంధానముచేసుకునే ప్రయత్నమును చేద్దాము.   ప్రస్తుత పాశురములో అమ్మ నిశ్చయ -జ్ఞానము గోపికలను" వైయత్తు వాళ్వీర్గాళ్ అంటు గోపికల భూసురత్వమును గుర్తుచేసినది.మొదటి పాశురములో చిరుమీర్గాళ్ పసివారు అన్నది.అయినప్పటికిని శెల్వ చిరు మీర్గాళ్-అంటు వారి సంపదను ప్రస్తావ...

AALO REMBAAVAAY-PASURAMU-01

Image
   పాశురం-01  **********  మార్గళి తింగళ్ మదినిరైంద నన్నాళాల్  నీరాడప్పోదువీర్ పోదుమినో నేరిళైఈర్  శీర్మల్గుం అయిప్పాడి చ్చెల్వ చ్చిరుమీర్గాళ్  కూర్వేల్ కొడున్ తొళిలన్ నందగోపంకుమరన్  ఏరారందకణ్ణి యశోదై ఇళంసింగం  కార్మేని చెంకణ్ కదిర్మదియుంపోల్ ముగత్తాన్    నారాయణనే నమక్కే పరై దరువాన్  పారోర్ పుగళ్ పడిందు ఏలో రెంబావాయ్.  ఓం నమో నారాయణాయ  సంగత్తమిళమాలై మొదటిపాశురమును అనుసంధానముచేసుకొనుటకు పూర్వము ముఖ్యముగా నా చేయిపట్టుకుని నడిపిస్తున్న అమ్మకు అనేకానేక దాసోహములను సమర్పించుకుంటు.నా అపరాధములను మన్నించమని వేడుకుంటు,పరమాత్మ యొక్క పర-వ్యూహ-అర్చ-విభవయ కటాక్షములను అనుగ్రహించగలవాడు, " నారాయణనే"  నారాయణుడొక్కడే అన్న ఆర్యోక్తిని గౌరవస్తూ, పాశుర ప్రాభవములోనికి ప్రవేశిద్దాము.  ప్రస్తుత పాశురము స్వామి యొక్క-స్వామి మాతాపితలైన నందయశోదల స్వరూప-స్వభావములను సంకీర్తిస్తున్నది.స్వామి ప్రసన్నతానుభవమునకై ,పర అనుగ్రహమునకై మన ఉపాధిని అనుసరించి,చేతనులుగా మనము చేయవలసినవి,  నీరాడ ప్పోదువీర్,నన్నానాళ్ నీరాడపోదువీర్,  పారోర్-నీరాడప...

AALO REMBAAVAAY-INTRODUCTION

Image
  ఏలో రెంబావై-         వ్రతమునకు రండు.   *************************  శ్రీగోదాం అనన్య శరణం శరణం ప్రపద్యే ****************************** *** " శ్రీ విష్ణుచిత్త కులనందన కల్పవల్లీం శ్రీ రంగనాథ హరిచందన యోగ దృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామివాన్యాం గోదామనన్య శరణం - శరణం ప్రపద్యే". శ్రీవైష్ణవ సాంప్రదాయానుసారము "ఆళ్వారులు" అనగా దైవభక్తిలో అనవరతము మునిగియున్న జ్ఞానగనులు/ఘనులు.              రిపాదపద్మములకు.బధ్ధజీవులను తమతో పాటు తిప్పుకొనుచు,భగవత్తత్త్వము అను సముద్రములో అనవరతము మునకలను వేయిస్తు,ప్రకృతిలోని ప్రతివస్తువులోను-ప్రతిచర్య లోను పరమాత్మను దర్శింపచేస్తూ,బ్రహ్మానందమును చేర్చువారు.మార్గదర్శకులుగా సామాన్యుల వలె కనిపిస్తూ సర్వమును అర్థముచేయించగల దైవాంశ సంభూతులు.దివ్య నమస్కారములు . " భూతం నరస్య మహదహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగివాహాన్ భకాంఘ్రిరేణు పరకాల యతీంద్ర మిశ్రాన్ శ్రీమత్ పరాంకుశ మునిం ప్రణతోస్మి నిత్యం."   గోదమ్మ మనకు అందించిన "తిరు" పావనమైన,"పావై" తిరుప్పావై.దీనిని "శ్రీవ్రతము" అని కూడా ప్రస్తుతిస్తారు.వ...

NA RUDRO RUDRAMARCHAYET-30(SIVANAMDALAHARI)

 శ్లో : వస్త్రోద్-ధూత విధౌ సహస్ర-కరతా పుష్పార్చనే విష్ణుతా గంధే గంధ-వహాత్మతా(అ)న్న-పచనే బర్హిర్ -ముఖాధ్య క్షతా పాత్రే కాన్చన-గర్భతాస్తి మయి చేద్ బాలేందు చూడా-మణే శుశ్రూషామ్ కరవాణి తే పశు-పతే స్వామిన్ త్రి-లోకీ-గురో 30