Posts

ANIVARCHANEEYAM-ADITYAHRDAYAM(RAUDRAAYA VAPUSHAENAMAHA)

Image
   "రుజం ద్రావయతీ రుద్రః"  ఆర్యోక్తి.జన్మ జర మృత్యు దుఃఖములను నశింపచేసేవాడు రుద్రుడు.పంచకృత్యములలో మూడవదైన సంహార కార్యమును జరిపే రుద్రుడు పరమాత్మ యొక్క శక్తియే తక్క అన్యము కాదు.  వపుషో-అని పరమాత్మను ప్రస్తుతిస్తున్నది ఆదిత్యహృదయ స్తోత్రము.మన భాషలో చెప్పలంటే నిరాకార-నిర్గుణ-నిరంజన పరమాత్మ మనము పరమాత్మ శక్తిని అర్థము చేసుకొనుటకు తనకు తానుగా సాకారమును ధరించి తన స్వరూప-స్వభావములను మరింత స్పష్టము చేయుట.  నాల్గవ కృత్యమైన తిరోధానము గురించి ఒక్క సారి పరిశీలిస్తే ఇదే విషయమును మనము గ్రహించనీయకుండే మాయచే మనలను కప్పుచున్నది పరమాత్మయే-తిరిగి దానిని తొలగించి అనుగ్రహిస్తున్నదీ పరమాత్మయే.  వపు శబ్దమును విష్ణుసహస్రనామ స్తోత్రము మరింత స్పష్టపరుస్తున్నది.  విశ్వం-విష్ణుః అంటూ మనము కనులారా చూచుచున్న విశ్వములో ఉన్న విశ్వాత్మకుడే పరమాత్మ.తాను విశ్వ వపునిగా మనకు కనబడుతున్నాడు.  శ్రీ లలితా రహస్య సహస్రనామము సైతము పరాశక్తిని,  సంహారిణీ రుద్ర రూపా గా ప్రస్తుతించినది.    సంహారము తమోగుణ ప్రధాన కృత్యము.దానిని జరుపువాడు రుద్రుడు.ఇంకను తల్లి,  విధాత్రీ-విశ్వజ...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(CHIMTASOKAM -MUDAAVAHAM)

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(TIMIRO UNMATHANAHA)

Image
  ఆదిత్యహృదయ స్తోత్ర పరమార్థమే "నిశిచరపరపతి సంక్షయం" నిశి చీకటి యందు సంచరించువారికి మూలమైన వానిని సంపూర్తిగా నాశనము చేయుట.  ఐతిహాసిక కథనము ప్రకారము రావణాసుని ఇంద్రియ వ్యామోహమనెడి అజ్ఞానమును నిర్మూలించుట.  రాత్రులందు సంచరించువారిని నిశాచరులుగా భావిస్తే నిశి అంటే చీకటి.కనుకనే అహర్నిశి అనే వాడుక పదమును మనము వింటూంటాము.  స్వామి నిర్మూలించదలచిన చీకటి కేవలము ప్రతి దినము మనము అనుభవించుచున్న సూర్యోదయమేనా లేక మరేదైన నిగూఢార్థము దాగి యున్నదా అన్న సందేహము రావచ్చును.   చీకటులు అనేకానేకములు కావచ్చును.అవి బాహ్యములుగా భావించే భౌగోళిగములు కావచ్చును.అంతరంగికములు లైన అరిధడ్వర్గములు కావచ్చును.దానికి కారణమైన ఇంద్రియ ప్రవృత్తులు కావచ్చును.  క్రమశిక్షణారాహిత్యముతో కలుగు అనారోగ్యమే కావచ్చును.అహంకారమే కావచ్చును.అజ్ఞానమే కావచ్చును.ఆత్మ తత్త్వమును కనుగొనలేని ద్వైత భావమే కావచ్చును.వాటన్నింటిని తెలియచేసేది విమర్శ ద్వారా ప్రకాశమునందించు స్వామి తేజము.అదియే,  సప్తసప్తి మరీచిమాన్-అంటూ ఏడు విధములైన కిరణములతో వ్యాపించే పరమాత్మ ప్రసన్నతా గుణము.  రశ్మిమంతము-సముద్యంతం గా ఆవిష్కరింపబడ...

ANIRVACHANEEYAM-ADITYAHRADAYAM(RGYAJUSAMAPARAGA)

Image
  అగస్త్యమహాముని ఆదిత్యహృదయ స్తోత్రము ద్వారా సూర్యభగవానుని వేదమూర్తిగా ప్రస్తుతిస్తున్నాడు.   పరము-పారము అనగా -ఒడ్డు లేక తీరము.  సూర్యనారాయణమూర్తి ఋఇగ్-యజ్-సామ వేదములను సాధనములద్వార పరమును అందించువాడు అని చెప్పబడుతున్నది.  అసలు వేదములు అంటే ఏమిటి? అనే ప్రశ్నను సమాధానమును పొందాలంటే  " విద్" అను ధాతువు నుండి పుట్టినది వేదము.అనగా తెలియచేయునది/తెలుసుకొనుటకు ఆధారమైనది.పరబ్రహ్మమును తెలుసుకొనుటకు జీవునికి ఆధారమైనది వేదము.దీనినే ఋతము అనగా మార్పులు చెందనిది అని కూడా చెబుతారు.  పరమాత్మ నాదముగా ఋషులకు వినబడినది కావున శృతము అని కూడా అంటారు.  పరమాత్మ అనుగ్రహరూపము కనుక అపౌరుషేయములు అని కూడా పిలుస్తారు.  "అనంతావై వేదాః" అన్నది ఆర్యోక్తి.  పరమాత్మ నిశ్వాసములుగా భావించబడే/భాసిస్తున్న వేదములు మొదట మూడుగాను-కాలక్రమమున నాలుగు గాను ప్రసిద్ధిచెందినాయి.అవే, 1.ఋఇగ్వేదము-దీనిలోని ఛందోబద్ధ స్తోత్రములను ఋక్కులు అని వ్యవహరిస్తారు.కొమదరు ధన్యాత్ములు శబ్దముతో పాటుగా ఆవిర్భవించిన రూపమును (సంకేతములను)సైతము దర్శించి వేదపురుషునిగా ప్రస్తుతించారంటోంది సనాతనము. 2.యజుర్వేదము- ...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(SRUNU GUHYAM-SANATANAM-MEANING)

Image
  అగస్త్యమహాముని శ్రీరామచంద్రునికి "ఆదిత్యస్తోత్ర ప్రాభవమును" వివరిస్తూ మహాబాహో-శృణు -ఇతి గుహ్యం.ఇతి సనాతనం అని అంటారు.ఆ శబ్దములలో దాగిన విశేషములను తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.  "యద్భాసా భాస్యతే సూర్యో-యద్భాసా భాస్యతే జగత్".  దేని కాంటి వలన సూర్యుడు ప్రకాశిస్తున్నాడో-జగములు ప్రకాశిస్తున్నాయో దానికి మూలమే గుహ్యము అయిన పరమాత్మ.  అదే విషయమును శ్రీ లలితా రహస్య సహస్రనామము  1." భక్తహార్ద్ర తమోభేద భానుమత్ భాను సంతతిః" అని, 2. హృదయస్థా-రవిప్రఖ్యా త్రికోణాంతర దీపికా" అని మరొక్కసారి పరమాత్మను ప్రస్తుతిస్తున్నది. 3.పరమేశ్వరి యొక్క సూక్ష్మరూపము "గుహ్యముగా" భావింపబడుచున్నది.భజింపబడుచున్నది. 4. స్థూలమునకు వస్తే  " పరేన నాకం నిహితం గుహాయాం" అని హృదయగుహ యందలి చైతన్య రూపముగాను ప్రణతులనందుకుంటున్నది. 5."పంచకోశానాం గుహా సబ్దేన గీయతే" అంటూ రహస్యోపనిషత్తులచే ఉద్ఘటింపబడుచున్నది.  గుహ్యము అంటే రహస్యము గా అనిపించే రహస్యము కానిది.అందుకే అది సనాతనమైనది.  ఎప్పటినుంచో ఉన్నప్పటికిని నిత్యనూతనముగా భావింపచేయునది.అది అప్రమేయమైనది.  ప్రమేయము అను శబ్ద...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM( RASMIMAMTAM-SAMUDYAMTAM-MEANING)G)

Image
 రశ్మిమంతం-సముద్యంతం  ************************  అగస్త్యమహామునిచే శ్రీరాముని యుద్ధోన్ముఖునిగా  మలచుటకు మనకు అనుగ్రహించిన "ఆదిత్యహృదయ స్తోత్రము" లోని కొన్ని పదముల వివరణను తెలుసుకునే ప్రయత్నము చేద్దాము.   అంతర్యామిగా నున్న పరమాత్మ సూర్యనారాయణునిగా  ప్రత్యక్షమగువేళ 'రశ్మిమంతం-సముద్యంతం" అన్న శబ్దములు ప్రయోగింపబడినవి.  మయమగుటయే మంతం-రశ్ములమయమైనాడు పరమాత్మ.ఉదయించుటకు సిద్ధమగుచున్నాడు తన కిరణములను కరములతో.అందుకే భాస్కరునిగాను.దివాకరునిగాను,అహస్కరునిగాను-దినకరునిగాను కిరణములనే కరములతో ప్రకాశించుతకు సంపూర్తిగా సిద్ధపడుచున్నాడట.సమ్యక్ ఉదయతీతి-సంపూర్ణముగా తేజస్సును ప్రసరించుటకు సిద్ధపడుచున్నాడు కర్తగా పరమాత్మ.  కర్త-కార్యము-కారణము మూడును తానే యైన పరమాత్మ స్థూల-సూక్ష్మ-కారణ దేహములతో ప్రస్తుతింపబడుతున్నాడు.  రశ్ములు అన్న శబ్దమునకు మనము కాంతులు-కిరణములు-వేదములు-ఇంద్రియములు-భూతములు అని అన్వయించుకుంటే వాటిని  జాగృతపరచదలచిన అనుగ్రహము పరమాత్మది  .కాదనలేనిది.  కనుకనే శ్రీలలితా రహస్య సహస్ర నామ స్తోత్రములో   ...

ANIRVACHANEETAM-ADITYAHRDAYAM(SARVA ESHA RAVI PRABHU-24)

Image
  వేదాశ్చ క్రతవశ్చైవ క్రతూనాం ఫలమేవ చ । యాని కృత్యాని లోకేషు సర్వ ఏష రవిః ప్రభుః ॥ 24 ॥   అగ్నిస్వరూపముగా నున్నవాడు-అగ్నికార్య ఫలముగా లభించువాడు అంతర్యామి యైన సూర్యభగవానుడ అని తెలియచేసిన తరువాత అగ్నికార్యమైన క్రతువు-కృతకము-చేయబడుదానీ-చేయువానిని-ఫలితమును తెలియచేయుచున్నాడు.  సర్వజ్ఞ సర్వమును తెలిసినవాడు.యజ్ఞ యజ్ పరమాత్మ జ్ఞ తెలిసికొనినవాడు.యజ్ఞుడు.తెలిసికొనుటకు అవలంబించు సనాతన సంప్రదాయము యజ్ఞము.నిర్వహించువాడు యజమాని.దానికి సహాయపడు ఇంద్రుయములు తేజస్సులు.సమర్పణము నేను-నాది అన్న స్వార్థభావము.తెలిసికొనినది న మమ నేను అనుకునే ఉపాధి నేనుకాదు.నాలో దాగున నీ చైతన్యమే.దానిని తెలిసికొనుటయే వేదము.వేదముచే తెలుసుకొనువాడు విజ్ఞుడు.ప్రాభవమును తెలిసికొనిన వాడు ప్రాజ్ఞుడు.  "   "అహం క్రతుః అహం యజ్ఞః" ఆర్యోక్తి.పరమాత్మ స్వయముగా తానే యజ్ఞమునని-యజ్ఞఫలితమునని చెప్పుకొనిన మాట.ఇంద్రియములద్వారా అనుభవించు గంధాదులచే వానిని అనుగ్రహించిన స్వామికి త్రికరణముల సాక్షిగా సమర్పించుటయే "యజ్ఞము." సమర్పించువాడు యజమాని.గ్రహించువాడు ప్రభువు.ప్రాభవమును అనుగ్రహించినవాడు.జ్ఞాత-జ్ఞేయము-జ్ఞానము ఒక్కటిగా ...