Posts

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM-NITYAM YAKSHA SEVITAM

Image
   ఋషులు-గంధర్వులు-నాగులు-అపసరసలు-యక్షులు-రాక్షసులు-దేవతలు అను సప్తగణములతో స్వామి సేవింపబడుతున్నాడు.యక్షుల గురించి తెలుసుకునే ప్రయత్నమును చేద్దాము.  వీరిని ఉపదేవతలు అని కూడా అంటారు.దివ్యశరీరులు.దయార్ద్రహృదయులు.  వీరు ఒక్కొక్క మాసములో ఒక్కొక్కరు సుర్య రథ గమనమునకు ముందు అశ్వములను అనుసంధానము చేస్తారని ఐతిహాసికము చెబుతున్నది.  వైజ్ఞానిక పరముగా ఆలోచిస్తే వీరు భూగర్భ సంపదలను-వృక్షమూల సంపదలను పరిరక్షించుతకు అనుకూలముగా సూర్యకిరణ సముదాయమును నిర్దేశిస్తారట.  యక్షుల తెగకు అధిపతిగా కుబేరుని ప్రస్తుతిస్తారు.   సనాతనము సూర్యభగవానుని  1.జన్మదాత  2.అన్నదాత  3.స్థితిదాత  4.జ్ఞానదాత  5.భయత్రాత గా కీర్తిస్తుంది.దీనికి ఉదాహరణముగా,  పరమాత్మ,  1.మధుమాసములో-రథకృత్ అను యక్షుడు  2.మాధవ మాసములో-అతౌజుడు అను యక్షుడు  3.శుక్ర మాసములో-రథస్వనుడు అను యక్షుడు  4.శుచి మాసములో-చిత్రస్వనుడు అను యక్షుడు  5.నభః మాసములో-శ్రోతస్వామి అను యక్షుడు  6.నభస్య మాసములో-అశరణుడు అను యక్షుడు  7.ఇష మాసములో-శతాజిత్ అను యక్షుడు  8.ఊర్జ్...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM-NITYA GAMDHARVA SEVITAM.

Image
   చాంద్రమాన ప్రకారము చైత్రము నుండి ఫాల్గుణము వరకు ప్రస్తావింపబడిన పన్నెండు తెలుగు నెలలు,సౌరమాన ప్రకారముగా,  1.మధుమాసము,  2.మాధవ మాసము, 3.శుక్ర మాసము,  4.శుచి మాసము,  5.నభస్ మాసము,  6.నభస్య మాసము,  7.ఈశ మాసము,  8.ఊర్జ్య మాసము,  9.సహస్ మాసము, 10.సహస్య మాసము, 11.తపస్ మాసము 12.తపస్య మాసముగా  కీర్తింపబడుతున్నవి.  గానధరులు కావున వీరిని గంధర్వులు అని పిలుస్తారు.వీరు సౌందర్యమతులు.సౌగంధభరితులు.చాలా వరకు వీరి శరీరములో సగభాగము మానవాకృతి-మిగిలిన సగము గుర్రమో-పక్షియో-జంతువో కలగలిసియుంటుందట.వీరి సంఖ్యను 6333 కంటె ఎక్కువగా ఉంటారని చెబుతారు.వీరు సూర్యభగవానునికి అతి సమీపములో గానము చేస్తూ రథగమనమునకు సహాయపడుతుంటారు.ఇది ఐతుహాసికము.వైజ్ఞానిక పరముగా ఆలోచిస్తే వీరు కిరణములతో పాటుగా తామును కిందికి దిగుతూ,భూమికి పోషకత్వమునకు హాని కలిగించు కణములను నిర్మూలిస్తూ ఓజోను పొరను దృఢపరుస్తారట.  వాతావరణమునకు అనుకూలమగు నాదమును సృజిస్తూ ఒక్కొక్క నెల ఒక్కొక్క గంధర్వుడు సూర్యనారాయణుని సేవిస్తాడని సూర్యపురాణము చెబుతున్నది.  సనాతన సంప్రదాయ ప్రకారము  ...

ANIVERCHANEEYAM-ADITYAHRDAYAM-VAALAKHILYA PRASTUTAM ANIsAM.

Image
  మండలాంతర్గత పరమాత్మ రధగమనమునకు శుభారంభముగా వాలిఖ్యాది మహా మునులు వేదపఠనమును చేస్తుంటారట.  అసలు సూర్యునికి వీరికి కల అవినాబావ సంబంధమేమిటి? అన్న సందేహము కలుగవచ్చును.   సనాతన సంప్రదాయ ప్రకారము వీరు అంగుష్టమాత్ర పరిమాణములో కనిపించు మహా తపసంపన్నులని నిర్ధారించినప్పటికిని వారి ఆవిర్భావ కథనములు అనేకానేకములుగా చెప్పుకుంటారు.  వీరు అసంఖ్యాకులనియు,60,000 మించి యున్నారనియు నమ్ముతారు.  ప్రకృతి అవిచ్ఛిన స్వరూపమే వాలిఖ్యాదిములని (వాలహిల్యమని)కొందరు,ఋగ్వేద మంత్రములను  వాలిఖ్యములంటారని కొందరు భావిస్తారు.ప్రజా పతి రేతశ్సు సీఘ్ర స్కలనము నొంది అనేకానేక మహాసక్తులని సృష్టించిందని నమ్ముతారు.  శివ పురాణ కథనము ప్రకారము శివ-పార్వతుల కళ్యాన మహోత్సవ సమయమున పార్వతిని చూసిన బ్రహ్మకు మనసు చెదిరి జారిపడిన వీర్యమును కాలితో కప్పచూడగా పరమేశ్వరుడు దానిని అగ్నికి హవిస్సుగా సమర్పించమనెనట.అప్పుడు అగ్నిలో నుండి సూర్యతేజముతో-తపోనిధులైన అంగుష్టమాత్ర పరిమాణముతో అనేకానేక దివ్య పురుషులు ఆవిర్భవించారట.వారు అనునిత్యము సూర్యోదయము నుండి-సూర్యాస్తమయము వరకు స్వామిని ప్రస్తుతిస్తూనే ఉంటారట.సూర్య రథగమ...

ANIVARCHANEEYAM-ADITYAHRDAYAM(RAUDRAAYA VAPUSHAENAMAHA)

Image
   "రుజం ద్రావయతీ రుద్రః"  ఆర్యోక్తి.జన్మ జర మృత్యు దుఃఖములను నశింపచేసేవాడు రుద్రుడు.పంచకృత్యములలో మూడవదైన సంహార కార్యమును జరిపే రుద్రుడు పరమాత్మ యొక్క శక్తియే తక్క అన్యము కాదు.  వపుషో-అని పరమాత్మను ప్రస్తుతిస్తున్నది ఆదిత్యహృదయ స్తోత్రము.మన భాషలో చెప్పలంటే నిరాకార-నిర్గుణ-నిరంజన పరమాత్మ మనము పరమాత్మ శక్తిని అర్థము చేసుకొనుటకు తనకు తానుగా సాకారమును ధరించి తన స్వరూప-స్వభావములను మరింత స్పష్టము చేయుట.  నాల్గవ కృత్యమైన తిరోధానము గురించి ఒక్క సారి పరిశీలిస్తే ఇదే విషయమును మనము గ్రహించనీయకుండే మాయచే మనలను కప్పుచున్నది పరమాత్మయే-తిరిగి దానిని తొలగించి అనుగ్రహిస్తున్నదీ పరమాత్మయే.  వపు శబ్దమును విష్ణుసహస్రనామ స్తోత్రము మరింత స్పష్టపరుస్తున్నది.  విశ్వం-విష్ణుః అంటూ మనము కనులారా చూచుచున్న విశ్వములో ఉన్న విశ్వాత్మకుడే పరమాత్మ.తాను విశ్వ వపునిగా మనకు కనబడుతున్నాడు.  శ్రీ లలితా రహస్య సహస్రనామము సైతము పరాశక్తిని,  సంహారిణీ రుద్ర రూపా గా ప్రస్తుతించినది.    సంహారము తమోగుణ ప్రధాన కృత్యము.దానిని జరుపువాడు రుద్రుడు.ఇంకను తల్లి,  విధాత్రీ-విశ్వజ...

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(CHIMTASOKAM -MUDAAVAHAM)

ANIRVACHANEEYAM-ADITYAHRDAYAM(TIMIRO UNMATHANAHA)

Image
  ఆదిత్యహృదయ స్తోత్ర పరమార్థమే "నిశిచరపరపతి సంక్షయం" నిశి చీకటి యందు సంచరించువారికి మూలమైన వానిని సంపూర్తిగా నాశనము చేయుట.  ఐతిహాసిక కథనము ప్రకారము రావణాసుని ఇంద్రియ వ్యామోహమనెడి అజ్ఞానమును నిర్మూలించుట.  రాత్రులందు సంచరించువారిని నిశాచరులుగా భావిస్తే నిశి అంటే చీకటి.కనుకనే అహర్నిశి అనే వాడుక పదమును మనము వింటూంటాము.  స్వామి నిర్మూలించదలచిన చీకటి కేవలము ప్రతి దినము మనము అనుభవించుచున్న సూర్యోదయమేనా లేక మరేదైన నిగూఢార్థము దాగి యున్నదా అన్న సందేహము రావచ్చును.   చీకటులు అనేకానేకములు కావచ్చును.అవి బాహ్యములుగా భావించే భౌగోళిగములు కావచ్చును.అంతరంగికములు లైన అరిధడ్వర్గములు కావచ్చును.దానికి కారణమైన ఇంద్రియ ప్రవృత్తులు కావచ్చును.  క్రమశిక్షణారాహిత్యముతో కలుగు అనారోగ్యమే కావచ్చును.అహంకారమే కావచ్చును.అజ్ఞానమే కావచ్చును.ఆత్మ తత్త్వమును కనుగొనలేని ద్వైత భావమే కావచ్చును.వాటన్నింటిని తెలియచేసేది విమర్శ ద్వారా ప్రకాశమునందించు స్వామి తేజము.అదియే,  సప్తసప్తి మరీచిమాన్-అంటూ ఏడు విధములైన కిరణములతో వ్యాపించే పరమాత్మ ప్రసన్నతా గుణము.  రశ్మిమంతము-సముద్యంతం గా ఆవిష్కరింపబడ...

ANIRVACHANEEYAM-ADITYAHRADAYAM(RGYAJUSAMAPARAGA)

Image
  అగస్త్యమహాముని ఆదిత్యహృదయ స్తోత్రము ద్వారా సూర్యభగవానుని వేదమూర్తిగా ప్రస్తుతిస్తున్నాడు.   పరము-పారము అనగా -ఒడ్డు లేక తీరము.  సూర్యనారాయణమూర్తి ఋఇగ్-యజ్-సామ వేదములను సాధనములద్వార పరమును అందించువాడు అని చెప్పబడుతున్నది.  అసలు వేదములు అంటే ఏమిటి? అనే ప్రశ్నను సమాధానమును పొందాలంటే  " విద్" అను ధాతువు నుండి పుట్టినది వేదము.అనగా తెలియచేయునది/తెలుసుకొనుటకు ఆధారమైనది.పరబ్రహ్మమును తెలుసుకొనుటకు జీవునికి ఆధారమైనది వేదము.దీనినే ఋతము అనగా మార్పులు చెందనిది అని కూడా చెబుతారు.  పరమాత్మ నాదముగా ఋషులకు వినబడినది కావున శృతము అని కూడా అంటారు.  పరమాత్మ అనుగ్రహరూపము కనుక అపౌరుషేయములు అని కూడా పిలుస్తారు.  "అనంతావై వేదాః" అన్నది ఆర్యోక్తి.  పరమాత్మ నిశ్వాసములుగా భావించబడే/భాసిస్తున్న వేదములు మొదట మూడుగాను-కాలక్రమమున నాలుగు గాను ప్రసిద్ధిచెందినాయి.అవే, 1.ఋఇగ్వేదము-దీనిలోని ఛందోబద్ధ స్తోత్రములను ఋక్కులు అని వ్యవహరిస్తారు.కొమదరు ధన్యాత్ములు శబ్దముతో పాటుగా ఆవిర్భవించిన రూపమును (సంకేతములను)సైతము దర్శించి వేదపురుషునిగా ప్రస్తుతించారంటోంది సనాతనము. 2.యజుర్వేదము- ...