KADAA TVAAMPASYAEYAM-08
కదా త్వాం పశ్యేయం-08 ****************** " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం." "సారూప్యం తవపూజనే శివమహాదేవేతి సంకీర్తనే సామీప్యం శివభక్తిదుర్య జగతా సాంగత్య సంభావతే సాలోక్యం చ చరాచరాత్మకతను ధ్యనౌ భవానీపతే సాయుజ్యం మమసిద్ధ మత్ర భవతి స్వామిన్ కృతార్థోస్యహం." బహుముఖముల భాసించే భవానీపతిని,మనోఫలకముపై స్థిరముగా నిలుపుకుని ఈనాటి బిల్వార్చనను ప్రారంభిద్దాము. అమ్మపిల్లవాడిని కోప్పడినప్పటికిని వాడు తల్లి ఒడినే కోరుకుంటాడు.అదియే మిక్కిలి ఆశ్చర్యకరమైన విషయము.అదే విధముగాభగవంతుడు పాపకర్మక్షయమునకి ఎన్ని కడగండ్లను జీవులకు కలిగిస్తున్నప్పటికిని వారు భవత్సాన్నిధ్యముననే ఊరటను పొందగలుగుతారు అన్న విషయమును ఆదిశంకరులు అర్థమయ్యేలా అనుగ్రహించారు. ఆలోచిస్తూ మెల్లగా పాదాలను కదుపుతున్నాడు శంకరయ్య. ఆక్షేపిస్తూ తాను పావులను కదుపుతున్నాడు శివయ్య. శంకరయ్యా! నీవు ఈమధ్యన అదోలా ప్రవర్తిస్తున్నావు. ఎప్ప...