Posts

KADAA TVAAM PASYAEYAM-22

Image
    కదా   త్వాం   పశ్యేయం-22    *************************  " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం    నమామి భగవత్పాదం శంకరం  లోకశంకరం."  " కదా వా  త్వాం గిరిశ తవ భవ్యాంఘ్రి యుగలం   గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్   సమాశ్లిష్టాఘ్రాయ బ్రహ్మాద్యై ముదమనుభవిష్యామి హృదయే."  ఓ గిరిశ! వాక్కులకు అధిపతి,   నేను ఎప్పుడు నీ దివ్య పాదపద్మములను గ్రహించి,నా శిరముతో,కన్నులతో,వక్షముతో తాకి,నీ దివ్య పదాంబుజముల సుగంధములను ఆఘ్రాణింపగలను స్వామి.నాకు ఆ భాగ్యమును ప్రసాదింపుము అని పరమేశ్వరుని ప్రార్థిస్తూ,ఈ నాటి బిల్వార్చనమును  ప్రారంభిద్దాము.   " చిదానంద రూపా-శివోహం శివోహం     చిదానంద రూపా-శివోహం శివోహం     మనో బుద్ధ్యహంకార చిత్తానినాదం      చిదానందరూపా-శివోహం శివోహం         "శివోహం " అంటూ శివ స్వరూపమై,    శోభాయమానముగా .......అడుగులను కదుపుతున్నది మల్లికార్జున దర్శనమునకై మహోత్సాహము.   మంగళవాయిద్యములు,సావధాన ఘోషలతో సహవాసమ...

KADAA TVAAM PASYAEYAM-21

Image
కదా త్వాంపశ్యేయం-21 ****************** "పాపోత్పాత విమోచనాయ రుచిరైశ్వర్యాయ స్తోత్ర ధ్యాన నతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనౌ జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైరహం ప్రార్థితో మామా జ్ఞాపయ తన్నిరూపాయ ముహుర్మామేవ మామేవచః." ఓ! మృత్యుంజయా ! ఓ మహేశా! ఎంతటిచమత్కారి నీఅనుగ్రహము.ఆనవాలు లేనట్టు మా పాపములు తొలగించివేసినది.ఎంతటి చతుర నీ కరుణ.వాటిని తిరిగి మా దరిచేరనీయనని,మా మనస్సును నిన్ను ధ్యానింపుమని,శిరమును నీకు నమస్కరించమని,చెవులకు నీ దివ్యకథలను ఆలకింపమని,పాదములను నీకు ప్రదక్షిణములను చేయమని,కన్నులకు నీ దివ్య విగ్రహమును దర్శించమని,అని కొత్త ఆటలను పరిచయము చేస్తూ,వాటి నన్నింటిని సమన్వయపరుస్తున్నది సహృదయతతో. స్వామి నీకు నీ కరుణకు లేశమంతయును భేదములేదు కదా ఖేదహరణములో. అట్టి నీ అవ్యాజకరుణను మామీద అనవరతము వర్షించనిమ్మని ఆ ఆదిదేవుని ప్రార్థిస్తూ,ఈ నాటి బిల్వార్చనమును ప్రారంభిద్దాము. గురువుగారు శంకరయ్యను చూస్తూ,ప్రారంభించు అన్నట్లుగా సైగచేసారు. ముచ్చెమటలు పోస్తున్నాయి శంకరయ్యకు.తనకు ఏమి తెలుసనిచెబుతానన్నాను నిన్న.అని మహేశా ఎందులకీ పరీక్ష .అంతలోనే,...

KADAA TVAAMPASYAEYAM-20

Image
       కదా   త్వాం పశ్యేయం-20  **********************  " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయనశ్రోతైః అహం  ప్రార్థితం    నమామి భగవత్ పాదం  శంకరం  లోకశంకరం".    " ధర్మోమే చతురంఘ్రికః సుచరితః పాపం  వినాశం  గతం    కామ క్రోథ మదాదయో విగళితా  కాలాః సుఖావిష్కృతః    జ్ఞానానంద మహౌషధః సుఫలితా కైవల్యనాథే సదా    మాన్యం మానస పుండరీక నగరవ్ రాజా వసంత స్థితే."   ఓ కైవల్యప్రదాతా!   నా చిత్తమను సు క్షేత్రమునందు (పంటభూమి)  నీవు క్షేత్రజ్ఞుడవై/కాపువై-భక్తి అనే విత్తులను నాటు తూ,అవి నేనే నాటుతున్నానన్న భ్రమలో నేనున్నప్పటికిని,విత్తులతో పాటుగా పెరుగుటకు ప్రయత్నించు,పాపములను కలుపుమొక్కలను పెకలించివేస్తూ,సస్యకేదారుడవై,-పంట గా  "జ్ఞానసాధనమనే ఔషధమును/ఆహారమును 'ప్రతినిత్యము(మూడు నెలలకు/ఆరు నెలలకు,ఏదాదికి ఒకసారి కాకుండా) అందచేయమనై ప్రార్థిస్తూ,నాలుగుపాదముల ధర్మము నడుచు చిత్తముతో,ఈ నాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము.   దిశానిర్దేశము చేయాలనుకున్న నిటలాక్షుని కరుణ శంకరయ్య ను బహ...

KADAA TVAAM PASYAEYAM-19

Image
     కదా   త్వాంపశ్యేయం-19    ********************  "జిహ్వ చిత్త శిరోంఘ్రి నయనశ్రోతైః అహం  ప్రార్థితం   నమామి భగవత్పాదం  శంకరం  లోక శంకరం"     "  ఏకో వారిజబాంధవో క్షితి-నభోవ్యాప్తం తమోమండలం    భిత్వా లోచక గోచరోపి భవతి త్వం కోటిసూర్య ప్రభోః    వేద్యః కిం న భవస్యహో ఘవతరం కీ దృక్ భవేత్నత్నమః    తత్ సర్వం వ్యపనీయమే పశుపతే సాక్షాత్ ప్రసన్నో భవ."   మహాదేవ నీవు మా ప్రభువువు,నీ అనంతకోటి సూర్యకాంతులతో సమస్త చీకటులను తరిమివేయుచున్నావు.నా అంతరంగమును నందలి చీకటిని/అజ్ఞానమును పారద్రోలి నన్ను అనుగ్రహింపుము అని మనసారా ప్రార్థిస్తూ,  ఈనాటి  బిల్వార్చనమును ప్రారంభించుకుందాము.  "హర హర మహాదేవ శంభో"  " జయ జయ శంకర-హరహర శంకర    జయజయ శంకర-హరహర శంకర    జయజయ శంకర-హరహర శంకర    హరహర శంకర-జయజయ శంకర"   నాదం తనుమనిశం శంకరం_ఎటుచూసినా ఈశ్వరనామస్మరణమే,      ఆ కోలాహలములో కోర్కెలు కోరుకునేవారు,తీరినకోరికలు కలవారు,నిత్యానుష్ఠానపరులు,నిమిత్త...

KADAA TVAAM PASYAEYAM-18

Image
    కదా   త్వాం  పశ్యేయం_18   *************************  "జిహ్వ చిత్త శిరోంఘ్రి నయనశ్రోతైః అహం ప్రార్థితం   నమామి భగవత్ పాదం  శంకరం లోకశంకరం."  ",ప్రభు!  త్వం దీనానాం ఖలు పరమ బంధుః పశుపతే    ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వ మనయోః   త్వయైవ క్షంతవ్య "శివ"' మత్ అపరాధశ్చ సకలాః    ప్రయత్నాత్  కర్తవ్యం మదవనయం బంధుసరణిః"  నేను పశువును.నువ్వు పశుపతివి.మనిద్దరికి మధ్యన జగత్పిత-జగత్ పుత్ర బంధమున్నది అన్న విషయము లోకవిదితమే.  కాని ఆ బంధము సమ్యక్ బంధము.సంపూర్ణ బంధము.  అందులో నన్ను వీక్షించుట-నా తప్పులను క్షమించుట-నన్ను రక్షించుట అన్న మూడు విషయములు దాగిఉన్నవికదా .వానిని లోకవిదితముచేయుటకు మనది కేవల బంధముకాదని-సంబంధమని ,సదాశివుని కీర్తిస్తూ ,ఈ నాటి బిల్వార్చనమును ప్రారంభించుకుందాము.  " ఓం నమః శివాయ."   త్వరగా నడవవయ్యా శంకరయ్యా.నేను ఈ దొంగను అక్కడనున్న కార్యకర్తకు అప్పగించాలి.అసలే రద్దీగా ఉంటుంది.పైగా ఇతని అవలక్షణముల జాబితాను వల్లించాలి.ఆయనకునచ్చితేనే స్వామి దగ్గరకు అనుమతిస్తాడు.లేకపోతే మళ్ళీ స...

KADAA TVAAM PASYAEYAM-17

Image
      కదా    త్వాం పస్యేయం-17   *************************  " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం  ప్రార్థితం    నమామి  భగవత్పాదం  శంకరం  లోకశంకరం."  "రోదస్తోయహృతః శ్రమేణ పథికశ్చాయాం తరోర్వృష్టితో   భీతః స్వస్థగృహం గృహస్థమతిథిం దీనః  ప్రభుం   దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతస్థం తథౌ   చేతః సర్వపాపహం వ్రజసుఖం శంభోపదాంభోరుహం."        ఏవిధముగా నీటి ప్రవాహములో మునిగిపోతున్న వానికి దుంగ ఆధారమవుతుందో,అలిసిపోయినబాటసారికి వృక్షము ఆశ్రయమవుతుందో,జడివానలో తడుస్తున్న వానికి స్వగృహం సంరక్షణమును ఇస్తుందో,చీకటులను తొలగించి,దీపము ప్రకాశమును ఇస్తుందో,అదే సాపేక్షతానుసారముగా ,నా మనసు చుట్టుముట్టిన భయములను మహేశ పాదపద్మములు తొలగించునుగాక అన్న గట్టినమ్మకముతో త్రికరణ శుద్ధిగా పాదనమస్కారమును చేస్తూ,ఈనాటి బిల్వార్చనమును ప్రారంభిద్దాము.   ఈనాటి శంకరయ్య గమ్యము కొరకు పయనిస్తున్న పథికుడు/బాటసారి.స్వామి  కరుణ ఆయనకు దేనిని  ఆశ్రయముగా అందిస్తుందో,ఏ సంఘటనము ద్వారా భక్తిని పెంపొందింపచేస్తుంద...

KADAA TVAAM PASYAEYAM-16

Image
          కదా త్వాంపశ్యేయం-16 ******************* " జిహ్వ చిత్త శిరోంఘ్రి నయన శ్రోతైః అహం ప్రార్థితం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం" " ఆద్యావిద్యా హృద్గతా నిర్గత ఆసీత్ విద్యాహృద్వా హృద్గతా త్వత్ ప్రసాదాత్ సేవే నిత్యం శ్రీకరం త్వత్ పదాబ్జాం భావే ముక్తే భాజనం రాజమౌళి" ఆదినుండి నాలో నిలిచిన అవిద్య తొలగిపోయినది నీ కరుణతో.సుజ్ఞానము కలిగే శుభసూచకములు గోచరించుచున్నవి.నష్టో మోహః సద్గతి కదా లబ్ధ్వా? ఆ అశుతోషుని, శంకరయ్యతోపాటు,మన మనోఫలకముపై స్థిరముగా నిలుపుకుని, ఈ నాటిబిల్వార్చనమును ప్రారంభిద్దాము. అద్భుతమైన శివుని కరుణ కొంచము కొంచము అర్థమవుతోంది పరమార్థము వైపునకు పయనమును సూచిస్తూ. " ఓం నమః శివాయ" సద్దుమణుగుతున్న శంకరయ్య ఆలోచనలు పూర్వభావములను రద్దుచేస్తున్నాయి.పెద్దవవుతున్న కొత్త ఆలోచనలు వాస్తవమును తెలుపుటకు సిద్ధమవుతున్నాయి. అది పద చలనమో-ప్రదక్షిణమో తెలియని స్థితిలో నున్న శంకరయ్యను ఒక విచిత్రదృశ్యము కట్టిపదవేసినది. శివయ్య లేడు.గిరిజలేదు.గురువుగారు లేరు.తాతగారు లేరు.బాలుడు లేడు.తుమ్మెదలు లేవు.పక్షులు లేవు...