Posts

TIRUPPAAVAI-PAASURAMU-26

Image
  ఇరువది ఆరవ పాశురంతిరుప్పావై-పాశురము-26 ***************** " నీళాతుంగస్తన గిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ స్వశృతిశత స్సిద్ధముద్యాపయంతే స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యాం బలాత్ కృత్యభుంగ్తే గోదా తస్యై నమ ఇద మివం భూయ యే వాస్తు భూయః" పూర్వ పాశుర ప్రస్తావనము *********************** గోపికలావతార జ్ఞానమును స్వామి గుణానుభవమునకు మార్గముగా చూపించినగోదమ్మ, ప్రస్తుత పాశుర ప్రాభవము *********************** స్వామికి గోపికలై-గోపికలకు స్వామిపై నున్న వాత్సల్యమును మణిమయ స్వరూపకాంతిగాకీర్తించుచున్నాడీ. ప్రళయసమయములో బ్రహ్మాండములను తనౌదరములో దాచుకొని,వటపత్ర సాయిగా మార్కండేయునిచే కీర్తించబడిన స్వామి సామర్థ్యమును సంస్తుతించినది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయము గోపికలు నోనకు కావలిసిన వస్తువులను అడుగుతున్నట్లుగా అనిపిస్తున్నప్పటికిని స్వామి వైకుంఠముతో తరలి విచ్చేయమని విన్నవించుకొనుట. గోదమ్మ ఈ పాశురములో అంతః-బహిః యాగములను గోపికలు స్వామిని అర్థించుఆరు విశేషములలో నిక్షిప్తపరచినది. 1 శంఖ ప్రణవనాదము-మంత్రాసనము (స్వామికి) 2,పఱ వాయిద్య ఘోష-తిరుమంజనము 3.పల్లాండు-అలంకరణము-మంత్ర...

TURUPPAAVAI-PAASURAM-25

Image
  1.పరమాత్మతన విభూతిగా తాను సృజించిన సంసారమనే సాగర్ములో తిరుగాడుచున్న మత్స్యము.దానికికారణము సోమకుడు అను తమో-రజో గుణములు,వేదములు అనే జ్ఞానమును/సత్వగుణమును దాచివేసి,రజో-తమో ప్రవృత్తులను అధికముచేయుటయే.  2.తాను సృజించిన/తన విభూతి యైన సంసారమను పెద్ద కొండను మునగకుండా చేయుటకై,తమో-రజో గుణముల నుండి సత్వమును సంరక్షించుటకై సిద్ధపడిన సత్యస్వరూపమే కూర్మము.కల్పవృక్షము-కామధేనువు,ఐరావతము,తెల్లగుర్రము ఇలా ఎన్నో ప్రలోభములు పక్కదారిపట్టిస్తున్నప్పటికిని అమృతమే గమ్యము కనుక దానిమర్మమును చెప్పునదియే కూర్మము.  3.భూసంరక్షణమే/ఉపాధి సంరక్షణమే,"శరీరమాద్యంఖలు ధర్మసాధనం"కనుక పరమపద పథమును సూచించు ఉపాధి సంరక్షణమే వరాహావతారము.  4.నరత్వము-సింహత్వము సగముసగముగా నున్నది నారసింహము.ఇప్పటివరకు ఉపాధికి దూరముగానున్న తమో-రజో గుణములు ఉపాధిలోనే ,సత్వము సగము తరలి వచ్చినను,కదలక-మెదలకనున్నవికనుక,  ఐహికమును/ఉపాధిని/తమో-రజో గ్య్ణములను హింసించి,నరత్వమును హింసించి,చైతన్యమును గమనించుటయే నారసింహము.  5.మనకు ఉన్నదనుకున్న జ్ఞానము వామనము/అసంపూర్ణము.దానిని త్రివిక్రమము చేసుకోవాలి.త్రిగుణములను జయించాలి అనిచెప్పేది ...

TIRUPPAVAI-PASURAM-24

Image
  తిరుప్పావై-పాశురము-24 ***************** "నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ స్వసృతి సతసిరస్సిద్ధమధ్యాపయంతీ స్వోచ్చిష్టాయాం స్రజనిగళీతం యా బలాత్ కృత్యభుంగ్తే గోదా తస్యైనమైదమివం భూయ ఏ వాస్తు భూయః. పూర్వ పాశుర ప్రస్తావనము ****************** ' గుహలో వర్షాకాలములోనిదురిస్తున్న సింహముగా స్వామిని దర్శిస్తూ,మేల్కొలుపుతూ,స్వామిపంచకృత్య విశేషములను సింహపు కదలికలతో సంకేతిస్తూ,స్వామినిగుహను విడిచి సింహగతితో నడచివచ్చి,సింహాసనమును అధిష్ఠించి,వారిసేవలను/అభ్యర్థనలనుస్వీకరించమని వేడుకొనిన జ్ఞాన సంపన్నులైన గోపికలు,జ్ఞానదశను సైతము అధిగమించి,ప్రస్తుత పాశురములో దానికన్నౌత్తమోత్తమమైన "ప్రేమ దశ"లోనికి ప్రవేశిస్తున్నారు.మనకు భగవత్ తత్త్వమును వివరిస్తున్నారు. ప్రస్తుత పాశుర ప్రాశస్త్యము. ****************** 1 పోట్రి పాశురము విశేష పాశురము. పరమాత్మను భగవంతునిగా ప్రదర్శించిన పాశురము. "నిర్వికార-నిర్గుణ-నిరంజన మూల తత్త్వము పరమాత్మ.స్థూలముగా పరమాత్మ థూలములో సూక్ష్మముగా దాగినప్రత్యగాత్మ." శ్రీకృష్ణ భగవానుడు మనకథానాయకుడు. భగవానువాచ అని ,భగవద్గీత అని మనం ...

TIRUPPAAVAI-PAASURAM-23.

Image
   తిరుప్పావై-పాశురము-23   *****************  "నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం   పారార్థ స్వసృతి సతసిరస్సిద్ధమధ్యాపయంతీ   స్వోచ్చిష్టాయాం స్రజనిగళీతం యా బలాత్ కృత్యభుంగ్తే   గోదా తస్యైనమైదమివం భూయ ఏ వాస్తు భూయః.  పూర్వ పాశుర ప్రస్తావనము  ******************  'అకించిన్యం" -నాఉపాధి సమర్థవంతము కానిది  " అనన్య గతిత్వం" అది కదులుట నీ చైతన్యము వలననే అన్న యదార్థమును గ్రహించిన గోపికలు,అన్-కణ్-మాన్యాలు-అందమైన-విశాలమైన-రాజ్యాలు తృనప్రాయముగాగుర్తించి,స్వామిని సర్వవాహన సేవాసౌభాగ్యమును కీర్తిస్తున్నారు.  ప్రస్తుత పాశుర  ప్రాశస్త్యము.  **************************  సింవాహనునిగా-సింహముగా స్వామినికీర్తించిన ప్రస్తుత పాశురము స్వామిపంచకృట్యములను,సింహపు కదలికలతో సంకేతించి,సింహాసనారూఢునిగా దర్శింపచేసినది.  1.అది వర్షాకాలమట.స్వామి సివంగినికూడి సిమ్హములా గుహలోనిదురించినాడట.   అంటే అది ప్రలయసమయము.అనేకము ఏకమయిన సృష్టికి పూర్వ స్థితిలో నున్నాడు.  2.అరివిత్తు-తెలివితెచ్చుకుని స్ర్ష్టి సంకల్పముచేయుట కళ్ళు తెరచుట. ...

TIRUPPAAVAI-PAASURAM-22

Image
  పాశురము-22 తిరుప్పావై-పాశురము-22 **************** నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్నం పారార్థం స్వసృతిశతసిర స్సిధ్యమధ్యాపయంతీ స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యాబలాత్ కృత్యభుంగ్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయయే వాస్తుభూయః పూర్వపాశుర ప్రాభవము **************** నందగోపుని ఔదార్యము,స్వామి అవతార ధర్మమును గుర్తు చేస్తూనే పెరియాయ్ అని బృహత్స్వరూపమును కీర్తించటము,శత్రువులు శరనాగతికై ద్వారము దగ్గర నున్నారనిచెబుతూ గోపికలు తాము సైతముపరమాత్మ గుణవైభవమునకు ఓడి,వశులై సేవించుటకు,స్వామినికి దిష్టి తగులకుండా,మంఘళ ఆశాసవమునలతో సేవించుకొనుటకు వచ్చామని,తేజోవతమైన స్వామిచీకటికి నిదురించుట విరోధ స్వభావమని చెప్పిన గోదమ్మ, ప్రస్తుత పాశుర ప్రాభవము ************************** 1 స్వామినేత్రవిసనసౌందర్యమును వారికి అనుగ్రహించమనియును, 2 వారు స్వామి యున్న మందిరమునలోనికి ప్రవేశించినామనియును, 3.స్వామి మీ గొప్పతనమా అని అడిగినట్లు భావించి,జవాబుగా, నీలమ్మ పురుషకారత్వము,తామున్న అభిమాన రాహిత్యముకృష్ణా నీ సన్నిధికి మమ్ము చేర్చినవి అని బదులిచ్చిరి. గోపికలు, శరీరమే ఆత్మ, నేను/మేము సర్వస్వతంత్రులము పరమాత్మకు దాస...

TIRUPPAAVAI-PAASURAM-21

Image
    తిరుప్పావై-పాశురం-21   ****************  నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం  పారార్థం స్వసృతిశతసిరస్సిద్ధమధ్యాపయంతీ  స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యా బలాత్ కృత్యభుంగ్తే  గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏ వాస్తుభూయః.  పూర్వ పాశుర ప్రాభవము  ********************  నీళాదేవి పురుషకారమును కీర్తించిన గోదమ్మ/గోపికలు స్వామి సర్వజ్ఞత్వమును-సర్వాత్మకత్వమును సంస్తుతించి,స్వస్వరూప దర్శనమునకై అద్దమును,స్వామి వ్యాపకత్వ సంకేతమైన విసనకర్రను,స్వామిని అనుగ్రహించమని,వారికి మేలుకొలుపులు పాడిరి.  ప్రస్తుత పాశుర ప్రాశస్త్యము  *************************  అమ్మను/గోపికలను నీళాదేవి అనుగ్రహించినదా/ఉపాయమును సూచించినదా యన్నట్లుగా,వారు స్వామి ప్రస్తుత అవతార విశేషములను కీర్తిస్తూ,అవతార ధర్మముగా గోకులము లోని గొల్లెతలను అనుగ్రహించమని స్వామిని ప్రార్థిస్తున్నారు.   నందగోపుని ఔదార్యమును మాత్రమే కాకుండా,నందవ్రజము లోని గోవుల ఔదార్యమును సైతము కీర్తిస్తున్నారు.  అంతే కాకుండా బాణజితులు-గుణజితులు అను అంశమును మనకు చెబుతూ,స్వామి భుజపరాక్రమమును-అవ్యాజ కరుణన...

TIRUPPAAVAI-PASURAM-20

Image
      తిరుప్పావై-పాశురం-20    *********************    " నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం      పారార్థం స్వశృతిశతశిరస్సిద్ధమధ్యాపయంతీ      స్వోచ్చిష్టాయాం స్రజనిగళితం యా బలాత్ కృత్యభుంగ్తే      గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏ వాస్తుభూయః."    పూర్వ పాశుర ప్రాభవము    ******************       అమ్మనీళాదేవిపురుషకార/ఉపకార స్వభావమును ,వారి శయ్యగా అలరారు అర్థపంచకమును,వారి మంచపుకొళ్ళగా నున్నచర్తుర్విధ పురుషార్థములను,కీర్తించి,తనతో పాటుగా మమ్ములను స్వామి,గుణవైభవమనే మడుగులో పంచేంద్రియ పరిశుద్ధతత్లో మునకలు వేయుటకు స్వామిని తోడ్కొని,నోముస్థలికి రమ్మని,ప్రార్థించిన,గోదమ్మ,  ప్రస్తుత పాశుర ప్రాభవము  ******************   స్వామి, !.ఋజుత్వమును 2.అమ్మ పోషకత్వమును 3.ముప్పదిమూడుకోట్ల అమరులను  ముప్పదిమూడుకోట్లు-అనగా  అష్టవసువులు-8  ఏకాదశ రుద్రులు-11  ద్వాదశాదిత్యులు-12  అశ్వనీదేవతలు-2   ఇక్కడ కోట్ల అను పదము సమూహమునకు సంకేతముగా చెప్పబడినది.వార...