Posts

ADITYAHRDAYAM-SLOKAMU-07

Image
       ఆదిత్యహృదయం-శ్లోకం-07     ********************  ప్రార్థన  ******  " జయతు జయతు సూర్యంసప్తలోకైకదీపం    హిరణసమిత పాప ద్వేషదుఃఖస్య నాశం    అరుణకిరణ  గమ్యం  ఆదిం ఆదిత్యమూర్తిం    సకలభువన వంద్యం   భాస్కరం  తం నమామి."   పూర్వరంగము   ************  అద్వితీయమైనపరమాత్మ "రశ్మిభావన"తో సముద్యంతుడై పునః సృష్టిని కావించి,పాలించుటకై,తన నుండి కొన్ని అద్భుతశక్తులను కిరణములగా  భూమిపైప్రసరింపచేయుచు వాటికి బ్రహ్మ-మహేశ్వర-విష్ణు-స్కంద ఇత్యాది నామములను ప్రసాదించినాడు.   ప్రస్తుత శ్లోకములో ఉద్భవించిన ఆ శక్తులకు సహాయకారులుగా మరికొన్ని శక్తిబృందములను విస్తరించినాడు.  వానికి వివిధ సార్థకనామములను-స్వభావములను ప్రకటించినారు.   ఐతిహాసికపరముగా సమన్వయ కథనమున్నప్పటికిని మనకు వాటిని కార్యనిర్వహణశక్తులుగా/ప్రాణశక్తులుగా వైజ్ఞానిక శాస్త్రము వివిధశాఖలను అప్పగిస్తుంది.   శ్లోకము   *****  " పితరో వసవ సాధ్యా యశ్వినో మరుతో మనుః    వాయుర్వహ్ని" ప్రజాప్రాణ  ఋతుక...

ADITYAHRDAYAM,-SLOKAM-07

Image
      ఆదిత్యహృదయం-శ్లోకం-07     ******************   ప్రార్థన   ****  " జయతు జయతు సూర్యం  సప్తలోకైకదీపం    హిరణ సమిత పాప ద్వేష దుఃఖస్యనాశం    అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం    సకలభువన వంద్యం భాస్కరం  తం నమామి."   పూర్వరంగము   ***********  స్వామి తన రశ్ములనే కరములతో తిరోధాన స్థితి నుండి పునఃసృషిని అనుగ్రహించినవేళ ఉత్పన్నమైన దేవాసురగణములచే నమస్కరింపబడుతున్నాడు.స్వామి రశ్మిభావనయే చైతన్యమును అనేకానేక విధములుగా ప్రకటింపచేస్తున్నది.  ప్రస్తుతశ్లోకములో విస్తృతింపబడిన శక్తులు వివిధ  నామరూపములతో పరమాత్మ అనుగ్రహమును మరింత వివరిస్తున్నది.  శ్లోకము   *****  " ఏష బ్రహ్మాశ్చ విష్ణుశ్చ శివ స్కంద ప్రజాపతిః    మహేంద్రో ధనదః కాలో  యమః సోమో హ్యపాంపతిః."   ఏష అను సంబోధనము పరమాత్మ ఏకత్వమును-మహత్వమును -పోషణత్వమును సూచిస్తున్నది.   శబ్దము,  1.ధ్వని అర్థము  2.శబ్ద  అర్థము  3.గూఢ అర్థమును కలిగి ఉంటుంది.    ఏష-ఇతడే    ధ్వనినిబట...

ADITYAHRDAYAM-SLOKAM-06

Image
   ఆదిత్యహృదయము-శ్లోకము06   ************************  ప్రార్థన  *****  " జయతు జయతు సూర్యం సప్తలోకైక దీపం     హిరణసమిత పాప ద్వేష దుఃఖస్యనాశం    అరుణకిరణగమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం    సకలభువనవంద్యంభాస్కరం తం నమామి."          స్వామి రశ్ములు సర్వలోకములపై  సంపూర్ణముగా విస్తరించి, చైతన్యపరుస్తున్నాయన్న మహర్షి,ప్రస్తుత శ్లోకములోరశ్మిభావనను  విశదీకరిస్తున్నారు.  నిద్రయనుస్వల్పకాలికలయము,ప్రళయము అను దీర్ఘకాలిక లయములను తదుపరిజాగృతమును తేజస్విగా (మూలబీజముగా)నిర్వహించు స్వామిని ప్రస్తుతిస్తున్నాడు.    శ్లోకము   *******   " సర్వదేవాత్మకోహ్యేష  తేజస్వి రశ్మిభావనః     ఏష దేవాం సురగణాంలోకాన్ పాతిగభస్తిభిః"   స్వామి సర్వదేవతా అసురశక్తుల సమన్వితమైన లోకములను చైతన్యపరచుటకు మూలకారణమే "రశ్మి భావనము"  రశ్మిభావనము అనగా,  "లోకంబులు లోకేశుడు లోకస్థులు   తెగినతుది నలోకంబగు పెంచీకటి   అవ్వలనెవ్వండేకాకృతి ' పరమాత్మను సేవిస్తానన్నాడు బమ్మెర పోతనామాత్యుడు.   ...

ADITYAHRDAYAM-SLOKAM-05

Image
     ఆదిత్య హృదయం-శ్లోకము-05   ***********************  ప్రార్థన  ******  " జయతు జయతు సూర్యం సప్త లోకైక దీపం    హిరణ సమిత పాపద్వేష దుఃఖస్య నాశం    అరుణకిరణ గమ్యం ఆదిం ఆదిత్యమూర్తిం    సకల భువన వంద్యం భాస్కరం తం నమామి."     పూర్వరంగము   ***********  స్తోత్ర పరిచయము-ఆత్మ స్వరూపము-అర్చనావిధానము-ఫలసిద్ధి మొదలగు విషయములను అగస్త్యమహర్షి  రామ చంద్రునకు/మనకు వివరించినారు.    ఒక సిద్ధాంతము ప్రకారము ప్రస్తుత శ్లోకమును,  "ఆదిత్యహృదయ స్తోత్ర" ప్రారంభశ్లోకముగా పరిగణిస్తారు.   నిజమునకు ప్రస్తుత శ్లోకము,"పరమాత్మకు-ప్రపంచమునకు వారథి వంటిది.దీనిని ఆలంబన శ్లోకముగా కూడా భావిస్తారు.   ఖగోళ సౌరశక్తిని భూగోళమునకు చేర్చు సహాయకారులు "కిరణములు" వాటి ప్రసక్తి ఈ శ్లోకమునుండి ప్రారంభమవుతుంది.  శ్లోకము  ******  "రశ్మిమంతం-సముద్యంతం దేవాసుర నమస్కృతం   పూజయస్య -వివశ్వంతం భాస్కరం-భువనేశ్వరం"    తన కిరణములను పూర్తిగా విస్తరింపచేసి అంతకు ముందున్న చీకట్లను దాచివేసి దేవతలచే-అసురు...

ADITYAHRDAYAM-SLOKAM04

Image
     ఆదిత్యహృదయం-శ్లోకము-04    *******************  "జయతు జయతు సూర్యం  సప్తలోకైక దీపం   హిరన సమిత పాప ద్వేష దుఃఖస్యనాశం   అరుణకిరన గమ్యం ఆదిమాదిత్య మూర్తిం   సకల భువన వంద్యం భాస్కరంతమ్నమామి."   పూర్వరంగము   ***********   పరిశ్రాంతుడై-చింతాక్రాంతుడైయున్న రామచంద్రునికి తక్షణ కర్తవ్యమును సూచించుతకై అభ్యాగతిగా వచ్చిన అగస్త్యమహాముని,  రామా ద్రష్టుం/చూడు  రామా-శృణుం-విను  రామా -జపేత్-జపించు అంటూ కార్యోన్ముఖుని చేస్తున్నాడు.   స్తోత్ర శీర్షికా సార్థకతను తెలియచేయునది ప్రస్తుత శ్లోకము.  శ్లోకము  *****  " ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాసనం    జయావహం జపేత్ నిత్యం అక్షయం -పరమం-శివం."    అదిత్యుడు అంటే ఎవరు? 1. "వేదాహమేతం పురుషం మహాంతం   ఆదిత్య వర్ణం తమపస్తు పారే"     అని స్తుతిస్తున్నది పురుషసూక్తము.   క్రియాశీలుడైన పరమాత్మ సమస్త శమస్త నామరూపములను ప్రకటింపచేసి తాను ప్రకాశిస్తూ వానియందు ప్రవేశించి,అరుణవర్ణముతో చీకట్లనుండి (పారే) దాటించివేస్తాడో వాడే ఆదిత్యుడు...

ADITYAHRDAYAM-SLOKA03

Image
      ఆదిత్యహృదయం-శ్లోకము-03   *********************   ప్రార్థన   *****  "జయతు జయతు సూర్యం సప్తలోకైకదీపం   హిరణ సమిత పాప ద్వేష దుఖస్య నాశం   అరుణకిరణ గమ్యం ఆసిం ఆదిత్యమూర్తిం   సకల భువన వంద్యం భాస్కరం తం నమామి."   శ్లోకము.   ********  "రామ రామ "  మహాబాహో శృణు గుహ్యం-సనాతనం"   యేన సర్వాన్ అరీన్ వత్స! సమరే విజయిష్యతి."  పూర్వ రంగము.  ************  సంఘర్షణతో నిండియున్న రామచంద్రునికి ధైర్యమును కలిగించుటకై/ఉపాయమును సూచించుటకై,  "అభ్యాగతో స్వయం విష్ణుః" గా అగస్త్య మహాముని దేవతలతో కూడి వచ్చి,తానొక్కడే రామునికి దగ్గరగా వెళ్ళి,ఏదో  సూచించబోతున్నాడు.    స్తోత్రమును ఉపదేశించుటకు  ముందే స్తోత్ర ఫలసిద్ధిని అందించారు మహర్షి.స్తోత్ర లక్షణమును-రక్షణమును తెలియచేశారు.  కురుక్షేత్ర  యుద్ధములో గీతోపదేశము వలె ఈ సూర్యోపాసన స్తోత్రము సైతము అన్యులకు గోచరము కానిదని పెద్దలు చెబుతారు.ఇదియేకగా క్షిప్రప్రసాద లక్షణము.  మహర్షి రామం ఉపాగమ్య అన్న పదములను గమనిస్తే, రామునికి మరింత దగ్గరగావచ్చి...

ADITYAHRDAYAM-SLOKA-02

Image
     ఆదిత్యహృదయము-శ్లోకము02   ******************* " దైవతైశ్చ సమాగమ్యాద్రష్టుమభ్యాగతో" రణం"   ఉపగమ్యాత్ బ్రవీత్ రామం అగస్త్యో భగవాన్ ఋషిః."    వివేక రాహిత్యము -విచక్షణాజ్ఞానముతో తలపడుటకు సిద్ధముగా నున్న సందర్భము.    " జ్ఞాత్వా గృహీణ కర్మాని" అన్నది ఆర్యోక్తి.  మనముచేసే పనుల యొక్క స్వభావము-ప్రయోజనము తెలిసికొని ఆచరించుట విధానము.సర్వోత్కృష్టము.   ప్రస్తుత శ్లోకములో "రణమును" గమనించిన అగస్త్యుడు,విజయ ప్రేరేపణమును గావించుటకు,దేవతా శక్తులతో కూడి వచ్చెను.   యుద్ధము-సమరము అన్న పదములను ప్రయోగించిన మహర్షి వాల్మికి,"రణము  అన్న శబ్ద ప్రయోగమును చేశారు.  ఘర్షణాపూరితమైనది "రణము" మనసునకు బలమైన తాకిడిని/రాపిడిని కలిగించు చిత్తవృత్తులు/చింతనములే "రణము.   రామచంద్రుని మనసు సంఘర్షణముగానే యున్నది.రావణాసురుని చిత్తము సంఘర్షణముతోనే యున్నది.   దానిని ద్రష్టుం-గమనించిన వ్యక్తి అగస్త్యుడు.   దానిని తొలగించవలసిన బాధ్యత తనది గా భావించాడు.  " సీతమ్మ సైతము" సరమతో సంభాషించు సమయమున ఆదిత్య ప్రేరేపితయై విజయమునకు ఆదిత్యస్తోత్ర పారాయణము...